Crime

DDపై మహిళా అధికారిణి సంచలన ఆరోపణలు
Crime· 28 Jun 2026

DDపై మహిళా అధికారిణి సంచలన ఆరోపణలు

AP: గుంటూరు వైద్యారోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్(DD) శివశంకర్ తనను తీవ్ర మానసిక, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో పనిచేసే ఓ గెజిటెడ్ అధికారిణి ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు వెళ్లినా, డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నట్లు చెప్పారు. ప్రతినెలా ఏదో వంకతో మెమోలు ఇవ్వడం, సెలవులు రద్దుచేయడం, గ్రూపుల నుంచి నంబర్ తీసేయడం వంటి పనులతో వేధిస్తున్నారన్నారు. తన కుటుంబం తెలంగాణలో ఉండగా, ఉద్యోగరీత్యా ఇక్కడ పని చేస్తున్నానన్నారు. శివశంకర్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

డబ్బులు అడిగితే చేతబడి చేస్తానని బెదిరింపు.. చివరికీ!
Crime· 27 Jun 2026

డబ్బులు అడిగితే చేతబడి చేస్తానని బెదిరింపు.. చివరికీ!

TG: చామర్తి రామ లచ్చారావు అనే పూజారి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని టార్గెట్ చేశాడు. పూజల పేరుతో నమ్మించి రూ. 20 లక్షలు కాజేశాడు. డబ్బులు తిరిగి అడిగితే చేతబడి చేస్తానని బాధితుడిని బెదిరించాడు. ఆ తర్వాత పోలీసులకు దొరకకుండా అమెరికాకు పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీసులు నిందితుడిపై FIR నమోదు చేసి, లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అమెరికాలో కూడా పలువురిని చీటింగ్ చేయడంతో అతనిపై కేసులు పెట్టాడు. దీంతో ఇండియాకు తిరుగుపయనమయ్యాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వగానే అలర్ట్ అయిన ఇమిగ్రేషన్ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు.

పెళ్ళైన 40 రోజులకే అనుమానాస్పద మృతి
Crime· 27 Jun 2026

పెళ్ళైన 40 రోజులకే అనుమానాస్పద మృతి

AP: విజయనగరం జిల్లా మెంటాడ ప్రాంతానికి చెందిన కృష్ణవేణి(25)కి ఈ ఏడాది మే 13న తన దగ్గరి బంధువైన యాండ్రాపు మురళీతో మ్యారేజ్ అయింది. వివాహం అనంతరం విశాఖపట్నం జిల్లా PMపాలెం PS పరిధిలోని RH కాలనీలో నివాసం ఉంటున్నారు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మురళీ రోజూలాగే డ్యూటీకి వెళ్లి తిరిగి వచ్చేసరికి కృష్ణవేణి ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించింది. మురళీ పోలీసులకు సమాచారం అందించారు. ACP అప్పలరాజు, CI బాలకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రెండు కార్లు ఢీకొని ముగ్గురు స్పాట్ డెడ్
Crime· 27 Jun 2026

రెండు కార్లు ఢీకొని ముగ్గురు స్పాట్ డెడ్

AP: కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం పాలెంపల్లి వద్ద ఓవర్ స్పీడ్‌తో వచ్చిన రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘోర ప్రమాదంలో రెండు కార్ల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు కార్లలో చిక్కుకున్న వారిని బయటకు తీసి 108 వాహనంలో కడప రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. మృతులు తిరుపతి పట్టణం జీవకోనకు చెందిన హర్షవర్ధన్(27), కిషోర్(28), సుధీర్ కుమార్ రెడ్డి(24)గా పోలీసులు గుర్తించారు.

టూర్ పేరుతో గంజాయి స్మగ్లింగ్.. స్టూడెంట్స్ అరెస్ట్
Crime· 26 Jun 2026

టూర్ పేరుతో గంజాయి స్మగ్లింగ్.. స్టూడెంట్స్ అరెస్ట్

TG: సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఐదుగురు యువకులు గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బీటెక్ , బీ ఫార్మసీ, ఇంటర్మీడియట్ చదువుతున్న ఐదుగురు స్నేహితులు పర్యాటకం మాటున వెళుతూ గంజాయిని రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద 16కిలోల గంజాయి డ్రైపొడిని పట్టుకున్నారు. ఒడిస్సా రాష్ట్రం చిత్రకొండ ప్రాంతం నుంచి తెలంగాణలోని కోదాడకు తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితులు కోదాడ ప్రాంతానికి చెందిన షేక్ నజీర్, షేక్ అస్వక్, మహమ్మద్ హఫీజ్‌ఖాన్, తమ్మిశెట్టి దుర్గాప్రసాద్, తమ్మిశెట్టి పెద్దిరాజుగా గుర్తించారు.

CEO అంటూ నిత్య పెళ్లికొడుకు డ్రామా !
Crime· 26 Jun 2026

CEO అంటూ నిత్య పెళ్లికొడుకు డ్రామా !

AP: గుంటూరులోని పాండురంగానగర్‌కు చెందిన వక్కలగడ్డ సాంబశివరావుకు భార్య, పిల్లలున్నారు. గతంలో ఓ పత్రికలో పనిచేసిన సాంబశివరావు విలాసాలకు అలవాటుపడి మోసాల బాట పట్టాడు. పత్రికా యాజమాన్యం అతడిని ఉద్యోగం నుంచి తొలగించి కేసులు పెట్టింది. అయినా ఆయన అదే సంస్థకు CEOనని ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో తన వివరాలు పోస్టు చేసేవాడు. పలువురి మహిళల నుంచి రూ.2లక్షల నుంచి రూ.10లక్షల వరకు నగదు, బంగారు నగలు కాజేశాడు. బ్యాగులో ఎప్పుడూ పెళ్లి వస్త్రాలు, బాసికాలు సిద్ధంగా ఉంచుకునేవాడని పోలీసులు తెలిపారు. నిందితుణ్ణి అరెస్ట్ చేశారు.

గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
Crime· 26 Jun 2026

గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

TG: హైదరాబాద్ గచ్చిబౌలి AMB మాల్ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేట్ వైపు వెళ్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ (బుల్లెట్) బైక్‌ను, హఫీజ్‌పేట్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తున్న స్కూటీ ఫ్లైఓవర్‌పై రాంగ్ రూట్‌లో వచ్చి ఢీకొట్టింది. స్కూటీ నడిపిన శ్రీకాంత్, వెనుక కూర్చున్న విఠల్ ఇద్దరూ స్పాట్‌లోనే మృతి చెందారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడుపుతున్న వినోద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.