Current Affairs· 7 Oct 2026
మార్చి వరకు ఎల్నినో.. కరువు టెన్షన్!
ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది AP, TGతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్, పంజాబ్, రాజస్థాన్లో వర్షాలు తగ్గాయి. దీంతో పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఏడాది మార్చి వరకు ఎల్నినో ప్రభావం కొనసాగొచ్చని IMD అంచనా వేసింది. ఎల్నినో సమయంలో కరువు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్కైమెట్ తెలిపింది. అయితే రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కరువు ముప్పు ఉండే అవకాశం ఉంది.