Education

మహారాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ రిజైన్ -అభిజీత్ దిప్కే
Education· 20 Aug 2026

మహారాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ రిజైన్ -అభిజీత్ దిప్కే

మహారాష్ట్రలోని ప్రభుత్వ స్కూళ్ల అధ్వాన పరిస్థితిపై CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే ఫైర్ అయ్యారు. స్కూళ్లలో కనీస ఫెసిలిటీస్, టాయిలెట్స్ లేవని, లీక్ అయ్యే రూఫ్‌ల కిందే స్టూడెంట్స్ చదువుకుంటున్నారని ఆరోపించారు. మంత్రుల కుక్కలకు ఉన్న సౌకర్యాలు కూడా విద్యార్థులకు దక్కడం లేదని, ఎడ్యుకేషన్ మినిస్టర్ దాదా భూసే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నేతలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తేనే అసలు ప్రాబ్లమ్స్ అర్థమవుతాయని, లేకపోతే రాబోయే 2029 ఎలక్షన్స్‌లో Gen Z యువత తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.

బడుల్లో డ్రగ్స్‌కు చెక్.. మూడేళ్ల యాక్షన్‌ ప్లాన్‌ రెడీ!
Education· 20 Aug 2026

బడుల్లో డ్రగ్స్‌కు చెక్.. మూడేళ్ల యాక్షన్‌ ప్లాన్‌ రెడీ!

TG: రాష్ట్రంలో స్టూడెంట్స్‌కు డ్రగ్స్‌, పొగాకు వంటి మత్తు ప్రొడక్ట్స్‌ను దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం మూడేళ్ల యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయనుంది. స్కూల్స్ చుట్టూ 500 మీ. పరిధిని Drug Free Zoneగా ప్రకటించనున్నారు. డ్రగ్స్‌ అమ్మినా, వాడినా హెడ్‌మాస్టర్, నోడల్‌ టీచర్లు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. స్టూడెంట్స్‌కు అవేర్‌నెస్‌తో పాటు టీచర్లుకు ట్రైనింగ్, కౌన్సెలింగ్‌ ఇవ్వనున్నారు. స్టేట్‌లో 42వేల గవర్నమెంట్, ఎయిడెడ్, ప్రైవేట్ వంటి స్కూళ్లు <a href="https://tofei.education.gov.in/">NMV</a> పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.