తెలంగాణ మోడల్ స్కూళ్లలో గ్లోబల్ లెర్నింగ్

తెలంగాణ మోడల్ స్కూళ్లలో గ్లోబల్ లెర్నింగ్ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, ఇంటర్నేషనల్ బాకలారియేట్ ఆర్గనైజేషన్(IBO)తో అవగాహన ఒప్పందం చేసుకుంది. మొదట 50 మోడల్ స్కూళ్లలో 9, 10, 11వ క్లాస్ స్టూడెంట్స్‌కి ఈ ప్రోగ్రాం అందించనున్నారు. 13–17 ఏళ్ల విద్యార్థులకు ఆన్‌లైన్ లెర్నింగ్ రిసోర్సెస్, అంతర్జాతీయ పాఠశాలల అనుభవాలు అందించనున్నారు. మరో 20 మోడల్ స్కూళ్లలో ప్రత్యేక లెర్నింగ్ పాత్‌వేను ప్రవేశపెట్టనున్నారు. టీచర్స్‌కు కూడా గ్లోబల్ లెర్నింగ్‌పై ట్రైనింగ్ ఇవ్వనున్నారు.

