Local· 4h ago
జుహూ బీచ్లో బతుకమ్మ సందడి!
మహారాష్ట్ర ముంబైలో అంధేరీ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సంఘం అధ్యక్షులు మంగిలిపెల్లి శ్రీనివాస్ ఈ ఈవెంట్కు నేతృత్వం వహించారు. ఆదివారం సాయంత్రం పశ్చిమ అంధేరీ డొంగ్రి ఏరియా నుంచి మహిళలు బతుకమ్మలను నెత్తిపై పెట్టుకొని ప్రఖ్యాత జుహూ బీచ్ వరకు ఊరేగింపుగా వెళ్లి అక్కడ బతుకమ్మ ఆడారు. ఈ ఉత్సవంలో మంగిలిపెల్లి రేణుకదేవి, అంబటి నాగమ్మ, బాలగొని ఇందిరమ్మ, కదిరి కొమురమ్మ, ఇటుకల మహేశ్వరి, మైసా అనిత, సింగర్ కలమ, దేశబోయిన సువర్ణ, బెర్గల లక్ష్మి, పూస బాలమణి పాల్గొన్నారు.