Local

ఈర్లపల్లి అమ్మ చెరువు పేరు మార్పుపై గ్రామస్థుల నిరసన..!
Local· 9h ago

ఈర్లపల్లి అమ్మ చెరువు పేరు మార్పుపై గ్రామస్థుల నిరసన..!

మక్తల్-నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈర్లపల్లి అమ్మ చెరువును అభివృద్ధి చేస్తున్నారు. ఈ చెరువును 'ఈర్లపల్లి డ్యామ్'గానే ఉంచాలని గ్రామ ప్రజలు తీర్మానించారు. యూత్ కాంగ్రెస్ కొడంగల్ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ ఈ ట్యాంక్‌ను 'గోఖపసల్వాద్ ట్యాంక్'గా మార్చాలని సోషల్ మీడియాలో ప్రతిపాదించారు. 200 ఏళ్ల నాటి ఈ చెరువు పేరు మారిస్తే అది తమ గ్రామానికి, గ్రామ గౌరవానికి అన్యాయం చేసినట్లేనని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.