Local

అక్కడ ఆయాలే డాక్టర్స్.. ఎందుకంటే..?
Local· 8 Jun 2026

అక్కడ ఆయాలే డాక్టర్స్.. ఎందుకంటే..?

TG: డాక్టర్ల కొరతతో HYD నల్లకుంట ఫీవర్‌ హాస్పిటల్‌లో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.‌ సరిపడా వైద్యులు లేకపోవడంతో ఆయాలే రోగులకు సెలైన్లు పెడుతున్నారు. మందులు వేస్తున్నారు. నిరక్షరాస్యులైన ఆయాలు రోజువారీ అనుభవంతో తోచిన వైద్యసేవలు అందిస్తున్నారని, ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని రోగులు టెన్షన్ పడుతున్నారు. ఫీవర్‌ హాస్పిటల్‌లో మొత్తం 52మంది నర్సింగ్‌ సిబ్బంది ఉండగా 2024లో 22మంది స్టాఫ్‌‌నర్సులు బదిలీ అయ్యారు. వారి స్థానంలో ఇప్పటివరకు ఒక్కరు కూడా భర్తీ కాలేదు. దీంతో అన్నీపనులు ఆయాలే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 కలెక్టరేట్‌లో గవర్నమెంట్ ఎంప్లాయికి దేహశుద్ది
Local· 1 Jun 2026

కలెక్టరేట్‌లో గవర్నమెంట్ ఎంప్లాయికి దేహశుద్ది

TG: మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లోని గ్రేవెన్స్ డే ప్రొగ్రామ్‌లో ఓ గవర్నమెంట్ ఎంప్లాయికి దేహశుద్ది జరిగింది. పర్వతగిరి విలేజ్‌కు చెందిన ఓ మహిళ గ్రీన్‌ఫీల్డ్ హైవే పనుల్లో తన భూమి పోవడంతో నష్టపరిహారం కోసం కలెక్టర్ ఆఫీస్‌కు వచ్చింది. కలెక్టరేట్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న మురళి నీ పనిచేసి పెడతాను, లిఫ్ట్ ఇస్తానని నమ్మించి ఆమెను బైక్‌పై ఎక్కించుకున్నాడు. ఊరు చివరికి తీసుకెళ్లి మిస్ బిహేవ్ చేయడంతో ప్రతిఘటించిన మహిళ అక్కడి నుంచి తప్పించుకుంది. అనంతరం తన కుటుంబసభ్యులతో కలిసి కలెక్టరేట్‌కి వచ్చి మురళిని పట్టుకుని చెప్పులతో సామూహికంగా దేహశుద్ది చేశారు.

గేమ్స్‌పై ఇంట్రెస్ట్ పెంపొందించుకోవాలి: ఎమ్మెల్యే గూడెం
Local· 30 May 2026

గేమ్స్‌పై ఇంట్రెస్ట్ పెంపొందించుకోవాలి: ఎమ్మెల్యే గూడెం

TG: నేటి యూత్ గేమ్స్‌పై ఇంట్రెస్ట్ పెంపొందించుకోవాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానురు విలేజ్‌లో ఏర్పాటు చేసిన పీపీఆర్ వాలీబాల్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని తెలిపారు. నేటి యూత్ ఎక్కువ టైమ్ ఫోన్లు, సోషల్ మీడియాకే పరిమితం కాకుండా గేమ్స్‌లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. క్రీడా సదుపాయాలను సద్వినియోగం చేసుకొని నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్‌లో రాణించేలా కృషి చేయాలని కోరారు.