National· 28 Aug 2026
బంగారం, వెండి ధరలకు బ్రేక్.. దిగొస్తున్న రేట్లు
దేశంలో గోల్డ్, సిల్వర్ రేట్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు ఉదయం 6:30 గం. సమయానికి దిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం రూ.1,63,120, 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,49,540గా నమోదైంది. కిలో వెండి రూ.2,59,900కి పడిపోయింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,62,970, 22 క్యారెట్ల ధర రూ.1,49,390గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలోనూ ఇదే బంగారం ధరలు కొనసాగగా.. కిలో వెండి రూ.2,64,900గా నమోదైంది. గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి కొనే ముందు మార్కెట్లో ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్.