ప్రాణం తీసిన.. మైనర్ డ్రైవింగ్
క్రికెట్ ఆడేందుకు వెళ్తున్నానని తల్లికి చెప్పి ఇంటి నుంచి వెళ్లిన 15 ఏళ్ల సుజన్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకలోని దావణగెరె సమీపంలో నేషనల్ హైవే 48పై ఈ ప్రమాదం జరిగింది. స్నేహితులతో కలిసి హ్యుందాయ్ క్రెటా కారులో వెళ్తుండగా, అది CNG గ్యాస్ తరలిస్తున్న లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. సుజన్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. మూడో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి.



