మేమే ధర్నాకు దిగుతాం.. సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్

ఢిల్లీ హైకోర్టు సమీపంలోని మథురా రోడ్డుపై కాలినడక ప్రయాణికుల(Pedestrians) భద్రత, క్రాసింగ్ సౌకర్యాల ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నవంబర్ 25లోగా పనులు పూర్తి చేయకపోతే తామే స్వయంగా ఢిల్లీ హైకోర్టు ప్రధాన గేటు ముందు నిరసనకు దిగుతామని కామెంట్ చేసింది. రోడ్డు దాటేవారికి సాధారణ సౌకర్యాల ఏర్పాటుకు ఉన్నత స్థాయి కమిటీలు, బ్యూరోక్రాటిక్ ఆలస్యం ఎందుకని కోర్టు ప్రశ్నించింది.


