← Back to news

"ఇక దేశవ్యాప్త పోరాటం": ప్రకాష్ రాజ్

By Krishna· 1h ago· X
"ఇక దేశవ్యాప్త పోరాటం": ప్రకాష్ రాజ్

"దేశవ్యాప్తంగా పోరాడతాం. ఈ డిక్టేటర్‌షిప్ తప్పు అని నిరూపిస్తాం" అని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. కేరళలో జరిగిన సమావేశం తర్వాత ఆయన కేంద్రంపై ఫైర్ అయ్యారు. CEC జ్ఞానేష్, SIRకి వ్యతిరేకంగా జరిగే శాంతియుత ప్రొటెస్టులను ఎంతలా అణచివేసినా, వాటిని జరిపి తీరతామని ఆయన అన్నారు. “మాలో గాంధీ, అంబేద్కర్, భగత్‌సింగ్ రక్తం ఉంది. దేశవ్యాప్తంగా శాంతియుతంగా పోరాడుతాం” అని ఆయన తెలిపారు. SIR పేరుతో భారీగా ఓటర్ల పేర్లను తొలగించారని ప్రకాష్ రాజ్ ప్రజలకు వివరిస్తున్నారు

More in National