మేము ఇప్పటికే CJPకి మద్దతు ఇచ్చాం: కనిమొళి

పొత్తులు, ఎన్నికల సంబంధిత అంశాలపై పార్టీ స్పష్టమైన నిలకడతో ఉందని DMK ఎంపీ, పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కనిమొళి స్పష్టం చేశారు. CJP నాయకులు, సభ్యులు తమను సంప్రదించినప్పుడు, తమ పార్టీ ఇప్పటికే వారికి పూర్తి మద్దతు ప్రకటించిందని గుర్తుచేశారు. CJP చేపడుతున్న ప్రజాపోరాటాలు, రాజ్యాంగ పరిరక్షణ ప్రయత్నాలకు DMK మొదటి నుండి మద్దతుగా నిలుస్తోందని కనిమొళి తెలిపారు. రాజ్యాంగబద్ధమైన అన్ని ప్రజాస్వామ్య పోరాటాలలో DMK ఎల్లప్పుడూ ముందుంటుందని వివరించారు.


