పోస్ట్మార్టం గదిలో మద్యం పార్టీ

మహారాష్ట్రలోని పింప్రి-చించ్వాడ్ YCM ఆసుపత్రి పోస్ట్మార్టం రూంలో మద్యం పార్టీ జరిగినట్లు చూపించే వీడియో వైరల్గా మారింది. డెత్ సర్టిఫికెట్ కోసం వచ్చిన ఓ వ్యక్తి ఈ ఘటనను గుర్తించినట్లు సమాచారం. వీడియోలో ఆహార పదార్థాలు, మద్యం బాటిల్ కనిపించాయి. దీంతో డాక్టర్ వైభవ్ అవినాష్ మాస్కేను సస్పెండ్ చేశారు. 15 రోజుల్లో ఛార్జ్షీట్ ఫైల్ చేయనున్నారు. సస్పెన్షన్లో ఉన్నంతకాలం పింప్రి ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లకూడదని ఆదేశించారు.



