50 వేల సేఫ్టీ పిన్లతో దుర్గాదేవి విగ్రహం
అసోం రాష్ట్రం ధుబ్రి జిల్లాకు చెందిన ఓ కళాకారుడు దుర్గాదేవి విగ్రహాన్ని సరికొత్తగా రూపొందించాడు. ప్రభుత్వ విపత్తు నిర్వహణ శాఖలో పనిచేస్తున్న సంజీబ్ బసక్ సుమారు 50 వేల సేఫ్టీ పిన్లను వాడి ఈ ఏడడుగుల ఎత్తైన విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఉదయం ఆఫీసుకు వెళ్లి, రాత్రి సమయాల్లో ఈ కళాఖండాన్ని ఆయన రూపొందించారు. ఇందుకోసం ఆయన 3 నెలలకు పైగా శ్రమించారు. సేఫ్టీ పిన్లతో పాటు వెదురు, థర్మోకోల్, కార్డ్బోర్డ్లను వాడినట్టు తెలిపారు.



