Latest

హాస్టల్‌లో దారుణంగా కొట్టుకున్న అమ్మాయిలు!
AP· 23 Aug 2026

హాస్టల్‌లో దారుణంగా కొట్టుకున్న అమ్మాయిలు!

AP: కాకినాడలోని ఎస్కే నర్సింగ్ కాలేజ్ హాస్టల్‌లో ఛార్జింగ్ పెట్టిన మొబైల్ ఫోన్ మిస్ అవ్వడంతో మణిపూర్, AP స్టూడెంట్స్ మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు అనుమానంతో కర్రలు, చీపుర్లు, బకెట్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థినులను కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేసి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. సమాచారం అందుకున్న కలెక్టర్, SP, పోలీసులు వెంటనే స్పాట్‌కు వెళ్ళి సిట్యుయేషన్‌ను కంట్రోల్ చేశారు. ముందస్తు జాగ్రత్తగా మణిపూర్ విద్యార్థినులను వేరే హాస్టల్‌కు షిఫ్ట్ చేశారు.

నవాబ్‌పేట్‌లో 110 CC కెమెరాలు 🎥
Local· 23 Aug 2026

నవాబ్‌పేట్‌లో 110 CC కెమెరాలు 🎥

TG : నవాబ్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 'వికారాబాద్ రక్షణ నేత్రం' కింద కొత్తగా ఏర్పాటు చేసిన 110 CCTV కెమెరాలను జిల్లా SP స్నేహ మెహ్రా, IPS స్టార్ట్ చేశారు. ఊళ్లలో క్రైమ్స్ తగ్గడానికి, అనుమానాస్పద కదలికలపై నిఘా పెట్టడానికి ఈ కెమెరాలు హెల్ప్ అవుతాయని SP అన్నారు. దీంతో పాటు పోలీస్ స్టేషన్‌లో కొత్తగా నిర్మించిన షటిల్ కోర్ట్, ప్రహరీ గోడను కూడా ఆమె ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్‌లో DSP అంజయ్య, CI వెంకట్, SI గిరన్నతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఢిల్లీ పోలీసుల కీలక హెచ్చరిక!
Current Affairs· 23 Aug 2026

ఢిల్లీ పోలీసుల కీలక హెచ్చరిక!

రిజర్వేషన్ సంస్కరణలపై జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలిపేందుకు ఢిల్లీ పోలీసులు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ఆదివారం (ఆగస్టు 23, 2026) జంతర్ మంతర్ వద్దకు రావాలని సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు అబద్ధమని.. వాటిని నమ్మి ఎవరూ అక్కడికి రావొద్దని హెచ్చరించారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి గుమిగూడితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

గంగవరం పోర్టు కాలుష్యం..గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయాలి
Local· 23 Aug 2026

గంగవరం పోర్టు కాలుష్యం..గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయాలి

AP : విశాఖపట్నం జిల్లాలోని గంగవరం, పెదగంట్యాడ ఊళ్లలో పోర్టు కాలుష్యం వల్ల దుమ్ము పెరిగిపోతోందని, ప్రజలు హెల్త్ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నామని తెలిపారు. కాలుష్యానికి చెక్ పెట్టాలంటే పోర్టు పరిసరాలు, రోడ్లు, ఖాళీ స్థలాల్లో గ్రీన్‌బెల్ట్ పెంచాలని కోరారు. గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజుకు వినతిపత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన ఆయన, మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడటానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

రైల్వే బెడ్‌షీట్లను షాల్‌లా కప్పుకుని తిరుగుతున్నారు!
Viral· 23 Aug 2026

రైల్వే బెడ్‌షీట్లను షాల్‌లా కప్పుకుని తిరుగుతున్నారు!

ముగ్గురు వ్యక్తులు రైల్వే బెడ్‌షీట్లను షాల్‌లా చుట్టుకుని తిరుగుతున్న దృశ్యం SMలో వైరల్ అవుతోంది. ఆ బెడ్‌షీట్లపై స్పష్టంగా ‘WESTERN RAILWAY’అని ముద్రించి ఉంది. ఈ బెడ్‌షీట్లను వారు దొంగిలించినట్టు తెలుస్తోంది. జనవరి 2022 నుంచి మే 2026 వరకు రైల్వే డివిజన్ల నుంచి సేకరించిన RTI డేటా ప్రకారం, 1.27 కోట్లకు పైగా బెడ్‌రోల్ వస్తువులు చోరీకి గురయ్యాయి. దీని వల్ల రైల్వేకు ₹104.51 కోట్ల నష్టం వచ్చింది.

భూపాలపల్లి జిల్లా బంద్‌కి పిలుపునిస్తాం: Dr.విశారాదన్
Local· 23 Aug 2026

భూపాలపల్లి జిల్లా బంద్‌కి పిలుపునిస్తాం: Dr.విశారాదన్

TG: జర్నలిస్ట్ రవీందర్‌పై దాడికి నిరసనగా భూపాలపల్లి జిల్లా అంబేడ్కర్ చౌరస్తాలో భారీ ధర్నా నిర్వహించరు. BC SC ST-JAC చైర్మన్ డా.విశారదన్ మహరాజ్ ప్రజలతో కలిసి ధర్నా చేస్తున్న టైంలో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అనంతరం పోలిస్టేషన్ వద్ద ఆయన మాట్లాడుతూ నిందితుడు మధువంశీరావుని 48 గంటల్లో అరెస్ట్ చేయకపోతే భూపాలపల్లి జిల్లా బంద్‌కి పిలుపునిస్తాం అని చెప్పారు.

డాక్టర్లు వాడే కెమెరాతో క్వశ్చన్ పేపర్ లీక్!
Education· 23 Aug 2026

డాక్టర్లు వాడే కెమెరాతో క్వశ్చన్ పేపర్ లీక్!

ఛత్తీస్‌గఢ్‌లో అగ్రికల్చర్ ఎగ్జామ్ పేపర్ లీక్ కేసులో ఒక ప్రొఫెసర్‌తో సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దుర్గ్‌లోని భారతి అగ్రికల్చర్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న యోగేష్ సొంకేసరియా.. ఎండోస్కోప్ కెమెరా, నీడిల్ ఉపయోగించి క్వశ్చన్ పేపర్‌ను లీక్ చేశాడు. ఎగ్జామ్‌కి ఒక్క రోజు ముందే ఎంటమాలజీ పేపర్‌ను విద్యార్థులకు రూ. 11,000కి అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వర్సిటీ ఆ పరీక్షను క్యాన్సిల్ చేసి, మళ్లీ రీ-టెస్ట్ conduct చేస్తం అని అనౌన్స్ చేసింది.

మేమంతా ఒక్కటే..మీ దౌర్జన్యాన్ని సహించం!
TG· 23 Aug 2026

మేమంతా ఒక్కటే..మీ దౌర్జన్యాన్ని సహించం!

TG: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీమ్ తీసేయాలని సూర్యాపేట చౌరస్తాలో నిరసనకు దిగారు. నిరసన స్థలానికి పోలీసులు చేరుకుని ఓ పాలిటెక్నిక్ విద్యార్థిని అదుపులోకి తీసుకోబోయారు. వెంటనే తోటి విద్యార్థులు వాళ్లని అడ్డుకున్నారు. అతణ్ని అదుపులోకి తీసుకోవడాని వీల్లేదని డిమాండ్ చేశారు. పోలీసులకు, విద్యార్థులకు మద్య తోపులాట జరిగింది.

సాదిక్‌ను కాకినాడ తీసుకొచ్చిన పోలీసులు
Local· 23 Aug 2026

సాదిక్‌ను కాకినాడ తీసుకొచ్చిన పోలీసులు

AP: పిఠాపురం పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యపై ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు సాదిక్‌ను పోలీసులు కాకినాడ తీసుకొచ్చారు. మీరట్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం అతడిని కాకినాడకు తరలించారు. ప్రస్తుతం సర్పవరం పోలీసుల అదుపులో ఉన్న సాదిక్‌ను సోమవారం కాకినాడ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. పూర్తి విచారణ కోసం పోలీస్ కస్టడీ కోరనున్నట్లు సమాచారం.

స్తంభాన్ని ఢీ కొట్టిన లారీ: స్తంభించిన ట్రాఫిక్
Local· 23 Aug 2026

స్తంభాన్ని ఢీ కొట్టిన లారీ: స్తంభించిన ట్రాఫిక్

TG: షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలోని తిమ్మాపూర్, రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పాలమాకుల మధ్యన బ్రిడ్జి వద్ద లారీ స్తంభాన్ని ఢీకొట్టింది. గంటసేపు ట్రాఫిక్ స్తంభించింది. 44వ నెంబర్ హైవే కావడంతో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు జెసిబి ద్వారా లారీని పక్కకు జరిపి ట్రాఫిక్‌ను అదుపు చేశారు.

జీతాల్లేక 9 నెలలు..సెక్యూరిటీ గార్డుల ఆవేదన
Local· 23 Aug 2026

జీతాల్లేక 9 నెలలు..సెక్యూరిటీ గార్డుల ఆవేదన

AP: విజయవాడలోని అంబేద్కర్‌ సామాజిక శిల్ప ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులకు 9 నెలలుగా జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తేదారు జీతాల చెల్లింపును అడిగిన ప్రతిసారీ వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. ఒక ఉద్యోగికి 13 నెలలుగా జీతం రాలేదని తెలిపారు. కుటుంబ పోషణ భారంగా మారడంతో అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. జీతాలు అందక ముగ్గురు ఉద్యోగాలు మానేశారని చెప్పారు. అధికారులు తక్షణమే స్పందించి పెండింగ్ జీతాలు చెల్లించాలని కోరారు.

ఆరు నెలలుగా ఎదురుచూపులు!
Local· 23 Aug 2026

ఆరు నెలలుగా ఎదురుచూపులు!

TG: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతుభీమా సాయం కోసం బాధిత కుటుంబాలు ఆరు నెలలుగా ఎదురుచూస్తున్నాయి. ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటివరకు ఒక్కరికీ భీమా అందలేదని సమాచారం. ప్రీమియం చెల్లింపులో జాప్యమే కారణమని తెలుస్తోంది. కొందరి ధ్రువపత్రాలు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. మరికొన్ని దరఖాస్తులు నోడల్ అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అధికారులకూ స్పష్టత లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

VMRDA ఇన్‌ఛార్జి కమిషనర్‌గా కేతన్ గార్గ్ బాధ్యతలు
Local· 23 Aug 2026

VMRDA ఇన్‌ఛార్జి కమిషనర్‌గా కేతన్ గార్గ్ బాధ్యతలు

AP: విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(VMRDA) ఇన్‌ఛార్జి మెట్రోపాలిటన్ కమిషనర్‌గా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పూర్తి అదనపు బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన G.O మేరకు ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. కొత్త కమిషనర్ నియామకం జరిగే వరకు కేతన్ గార్గ్ ఈ పదవిలో కొనసాగనున్నారు.

రిజర్వేషన్ వ్యతిరేక నిరసనలో  SC, STలపై నినాదాలు
Current Affairs· 23 Aug 2026

రిజర్వేషన్ వ్యతిరేక నిరసనలో SC, STలపై నినాదాలు

రిజర్వేషన్ల రద్దు కోసం దిల్లీలోని జంతర్-మంతర్ వద్ద చేపట్టిన నిరసనలో కొందరు యువకులు SC, ST వర్గాలపై కుల వివక్ష నినాదాలు చేస్తూ వీడియోలు తీసుకున్నారు. ‘SC, STల నుంచి స్వాతంత్ర్యం’, ‘రిజర్వేషన్ నుంచి స్వాతంత్ర్యం’, ‘చంద్రశేఖర్ రావణ్‌కు స్వాతంత్ర్యం ఇస్తాం’, ‘5 వేల సంవత్సరాలుగా నీళ్లు తాగనివ్వలేదు, ఈసారి కూడా తాగనివ్వం’ అని నినాదాలు చేశారు. దీనిపై సామాజిక కార్యకర్తలు, అంబేద్కర్‌వాదులు రియాక్ట్ అయ్యారు. వాళ్లది ‘మానవత్వం లేని మనస్తత్వం’ అని అంటున్నారు.

మణిపూర్‌లో వేలాది మంది మహిళల టార్చ్ ర్యాలీ
Current Affairs· 23 Aug 2026

మణిపూర్‌లో వేలాది మంది మహిళల టార్చ్ ర్యాలీ

మణిపూర్ రాష్ట్రంలో సెన్సస్ నిర్వహణకు ముందు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(NRC)ను అప్‌డేట్ చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది మహిళలు శనివారం రాత్రి ఇంఫాల్‌లో టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఖురై అపుంబా క్లబ్ మహిళా సభ్యులు “No NRC, No Census” అనే నినాదాలతో బ్యానర్లు పట్టుకుని, చేతుల్లో మంటలు పట్టుకుని వీధుల్లో ర్యాలీ చేశారు. సెన్సస్‌పై తమకు వ్యతిరేకత లేదని, కానీ ముందుగా NRC అమలు చేసి బయటివారిని గుర్తించి తొలగించాలని డిమాండ్ చేశారు.

వరలక్ష్మీ పూజలో మహిళలపై వివక్ష: చిన్మయి
Current Affairs· 23 Aug 2026

వరలక్ష్మీ పూజలో మహిళలపై వివక్ష: చిన్మయి

వరలక్ష్మీ పూజలో కొన్ని మతపరమైన ఆచారాలు మహిళలకు భావోద్వేగ హింస, పీరియడ్స్ టైంలో వేర్పాటు లాంటి వివక్షకు దారితీస్తున్నాయని గాయని చిన్మయి శ్రీపాద అన్నారు. పూజలను అసౌకర్యకరమైన లేదా వివక్షాపూరిత అనుభవంగా మార్చేసిన ఇన్సిడెంట్స్ గురించి మహిళల నుంచి తరచుగా మెసేజెస్ వస్తున్నాయని పోస్ట్‌లో రాశారు. పసుపు, కుంకుమలు భర్త నుంచి వచ్చేవి కావని, భర్త లేకపోతే వాటిని తీసేయలేమని ఆమె చెప్పారు. మహిళలే ‘పితృస్వామ్య ద్వారపాలకులు’గా మారకూడదని హెచ్చరించారు.

గబ్బిలాలపేటలో స్కూల్ కోసం రేపు ‘చలో కలెక్టరేట్’
Current Affairs· 23 Aug 2026

గబ్బిలాలపేటలో స్కూల్ కోసం రేపు ‘చలో కలెక్టరేట్’

TG: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌లోని గబ్బిలాలపేట బస్తీలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్(ఆరుట్ల మోడల్)ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ పాఠశాల సాధన కమిటీ రేపు ఉదయం 9 గంటలకు ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమం నిర్వహించనుంది. కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, డాక్టర్ ఎం.వి.రెడ్డి, ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి, జర్నలిస్టు తులసి చందు తదితరులు హాజరుకానున్నారు.

మహిళపై కండక్టర్ దాడి!
TG· 23 Aug 2026

మహిళపై కండక్టర్ దాడి!

శంషాబాద్‌లో ఆర్‌టీసీ బస్సు ఎక్కిన ఒక మహిళకు చేదు అనుభవం ఎదురైంది. మదన్‌పల్లి తండా వద్ద దిగేందుకు ఆమె టికెట్ తీసుకుంది. డ్రైవర్ అక్కడ బస్సు ఆపకుండా నేరుగా కొత్తూర్ వరకు తీసుకెళ్లాడు. బస్సు ఎందుకు ఆపలేదని కండక్టర్‌ను నిలదీయడంతో, ఆయన తనపై దాడి చేసి చెంపదెబ్బలు కొట్టాడని బాధితురాలు ఏడుస్తూ చెప్పింది. తన మెడపై పడిన దెబ్బల గుర్తులను చూపిస్తూ మీడియా ముందు ఎమోషనల్ అయింది.

అభిజీత్ దిప్కేపై FIR!
Education· 23 Aug 2026

అభిజీత్ దిప్కేపై FIR!

మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా జవాలీలోని జిల్లా పరిషత్ ఉర్దూ స్కూల్లో పర్మిషన్ లేకుండా లోపలికి ప్రవేశించి, టీచర్లను బెదిరించారనే ఆరోపణలతో 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఫౌండర్ అభిజీత్ దిప్కేపై పోలీసులు FIR బుక్ చేశారు. 'స్కూల్ ఠీక్ కరో' క్యాంపెయిన్‌లో భాగంగా ఆయన స్కూల్‌లోకి వెళ్లి క్లాసులకు ఆటంకం కలిగించారని, రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా టీచర్లను సస్పెండ్ చేయిస్తామని బెదిరించారని టీచర్ ఇచ్చిన కంప్లైంట్‌తో ఔసా పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది.

పోలీసులను అడ్డుకున్న స్టూడెంట్స్!
TG· 23 Aug 2026

పోలీసులను అడ్డుకున్న స్టూడెంట్స్!

సూర్యాపేట చౌరస్తాలో పాలిటెక్నిక్ విద్యార్థులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీమ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన చేపట్టారు. ఈ క్రమంలో నిరసన ప్రదర్శన స్థలానికి చేరుకున్న పోలీసులు ఒక విద్యార్థిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో తోటి విద్యార్థులందరూ ఒక్కసారిగా అలర్ట్ అయి పోలీసులను తీవ్రంగా అడ్డుకున్నారు. ఈ ఘర్షణలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

యష్ 'టాక్సిక్' ఈవెంట్‌లో కుప్పకూలిన సౌండ్ సెటప్!
Local· 23 Aug 2026

యష్ 'టాక్సిక్' ఈవెంట్‌లో కుప్పకూలిన సౌండ్ సెటప్!

హైదరాబాద్‌లోని మల్లా రెడ్డి యూనివర్సిటీలో జరిగిన హీరో యష్ 'టాక్సిక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రమాదం జరిగింది. ఈవెంట్‌కు భారీగా స్టూడెంట్స్, ఫ్యాన్స్ తరలిరావడంతో క్రౌడ్ ఎక్కువైంది. స్పీకర్లు, ఈవెంట్ ఎక్విప్‌మెంట్ ఉన్న స్ట్రక్చర్‌పైకి కొందరు ఎక్కడంతో సౌండ్ సిస్టమ్, లైటింగ్ సెటప్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు స్టూడెంట్స్‌కి గాయాలవ్వగా, ఒక యువతి స్పృహ తప్పిపడిపోవడంతో వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. స్టేజ్ పై మాట్లాడేటప్పుడు ఇది గమనించిన యష్ స్పీచ్ వెంటనే ఆపేశారు.