Latest

నెల్లూరు జిల్లాల్లో కొత్త ఆఫీసర్స్
Local· 23 Aug 2026

నెల్లూరు జిల్లాల్లో కొత్త ఆఫీసర్స్

AP : నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 35 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని 8 మండలాలకు ఆఫీసర్లను కేటాయించారు. ఉదయగిరికి వెంకటరెడ్డి, సీతారాంపురానికి రమేష్ నాయక్, వరికుంటపాడుకు వెంకటేశ్వర్లు, దుత్తలూరుకు MD జహురుద్దీన్ అహ్మదాస్, వింజమూరుకు సింహాద్రి, కొండాపురానికి శ్రీనివాస్ రెడ్డి, జలదంకి మండలానికి విశాక్‌లను స్పెషల్ ఆఫీసర్లుగా అపాయింట్ చేశారు.

ఇవాళ రాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌లు బంద్
Current Affairs· 23 Aug 2026

ఇవాళ రాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌లు బంద్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల డ్రైవర్లు నిరవధిక సమ్మెకు దిగనున్నారు. కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఇచ్చిన పిలుపుమేరకు ఈ బంద్ కొనసాగుతోంది. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ రవాణా రంగ కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన రేట్లకు అనుగుణంగా మీటర్ ఛార్జీలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ కార్మికుల సమ్మె విరమించుకోవాలని, వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.

పరకాల మున్సిపాలిటీ అభివృద్ధి పై ఫోకస్
Local· 23 Aug 2026

పరకాల మున్సిపాలిటీ అభివృద్ధి పై ఫోకస్

TG : హనుమకొండ జిల్లాలోని పరకాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్ తెలిపారు. 5వ వార్డులో పర్యటించిన ఆయన, లోకల్ పీపుల్‌తో మాట్లాడి వాళ్ల ప్రొబ్లెమ్స్ అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను వీలైనంత త్వరగా సాల్వ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్‌లో కౌన్సిలర్ గొడుగు రజిత నాగరాజు, శానిటరీ ఇన్స్‌పెక్టర్ వెంకటరెడ్డి పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదం: నలుగురికి తీవ్రగాయాలు
Local· 23 Aug 2026

రోడ్డు ప్రమాదం: నలుగురికి తీవ్రగాయాలు

AP : కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం నేషనల్ హైవే 44 పై రెండు బైక్‌లు యాక్సిడెంట్ అయి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి కండిషన్ సీరియస్‌గా ఉండగా స్పాట్‌కు చేరుకున్న పోలీసులు అంబులెన్స్‌ పిలిపించి ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేస్ ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మళ్లీ ఉద్యమం: CJP
Current Affairs· 23 Aug 2026

ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మళ్లీ ఉద్యమం: CJP

కేంద్రంపై CJP మరోసారి ఫైర్ అయ్యింది జూలై 25న దేశవ్యాప్త ఉద్యమాన్ని ఆపడానికి కారణమైన హామీలను ప్రభుత్వం ఇప్పుడు నెరవేర్చకుండా వెనక్కి తగ్గుతోందని ఆరోపించింది. విద్యార్థులు, నిరసనకారులపై దేశవ్యాప్తంగా నమోదైన FIRల లిస్టు ఇవ్వాలని, అన్నింటినీ ఒకేసారి రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు సూచించినా, ప్రభుత్వం ఆ లిస్ట్ ఇవ్వడానికి ఇష్టపడటం లేదని చెప్పింది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మళ్లీ ఉద్యమం చేస్తామని స్పష్టం చేసింది. తర్వాత కార్యాచరణ నిర్ణయించేందుకు రేపు CJP జాతీయ కార్యనిర్వాహక కమిటీ సమావేశమవుతోంది.

అంబులెన్స్‌లోనే డెలివరీ 🚑
Local· 23 Aug 2026

అంబులెన్స్‌లోనే డెలివరీ 🚑

TG : మంచిర్యాల జిల్లా సుద్దాలకు చెందిన సరితకు డెలివరీ పెయిన్స్ రావడంతో ఫ్యామిలీ మెంబర్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి కాంప్లికేట్ అవ్వడంతో హనుమకొండ ఆస్పత్రికి షిఫ్ట్ చేయమని డాక్టర్లు చెప్పారు. 108 అంబులెన్స్‌లో వెళ్తుండగా దారిలోనే నొప్పులు ఎక్కువయ్యాయి. దాంతో EMT వెంకటేశ్, డాక్టర్ల సలహాలతో అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు. సరిత మగబిడ్డకు జన్మనివ్వగా, ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ సేఫ్‌గా ఉన్నారు.

ఖానాపురంలో కారు బోల్తా : ఇద్దరికి గాయాలు
Local· 23 Aug 2026

ఖానాపురంలో కారు బోల్తా : ఇద్దరికి గాయాలు

TG : వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట దగ్గర ఒక కారు యాక్సిడెంట్ అయి బోల్తా పడింది. మహబూబాబాద్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ ముగించుకుని వరంగల్ తిరిగొస్తుండగా, ఓవర్ స్పీడ్ వల్ల కారు కంట్రోల్ తప్పి పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. స్పాట్‌కు చేరుకున్న 108 సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ చేసి, బాధితులను వెంటనే నర్సంపేట గవర్నమెంట్ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు.

మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని డిమాండ్
Local· 23 Aug 2026

మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని డిమాండ్

AP : ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తూ 'మెగా జాబ్ క్యాలెండర్' రిలీజ్ చేయాలని DYFI డిమాండ్ చేసింది. నెల్లూరులో సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో జరుగుతున్న DYFI ఆంధ్రప్రదేశ్ 16వ రాష్ట్ర మహాసభలను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ఎన్టీఆర్ నగర్, గుర్రాల మడుగు, శెట్టిగుంట రోడ్ లాంటి పలు ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు చేశారు. నిరుద్యోగం, మత్తుపదార్థాల వాడకం లాంటి యూత్ ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లెమ్స్‌పై ఈ మహాసభల్లో చర్చించనున్నట్లు DYFI జిల్లా నాయకులు నరసింహ, రమణ తెలిపారు.

‘అపురూప’ - కథల పుస్తకం
Arts/Literature· 23 Aug 2026

‘అపురూప’ - కథల పుస్తకం

ఉద్యమ కుటుంబాల్లోని అన్నాచెల్లెళ్లు, భార్యాభర్తలు, బంధువుల మధ్య ఉండే అనుబంధాలను చిత్రిస్తూ పద్మకుమారి రాసిన కథల పుస్తకం ఈ ‘అపురూప’. రాజ్యహింసను ఎదుర్కొంటూ అమరులైన వారి కుటుంబాల వేదనను రచయిత్రి ఎంతో సంవేదనతో రాశారు. మానవ సంబంధాల ఆత్మీయతను, పోరాట స్ఫూర్తిని కళ్లకు కట్టేలా సహజమైన శైలిలో ఈ కథలు ఉంటాయి. ఈ పుస్తకాన్ని విరసం(విప్లవ రచయితల సంఘం) ప్రచురించింది. ధర రూ.150. వివరాలకు: 9989189250.

ధైర్యానికి ప్రతీక ఆంధ్రకేసరి.. నేడు ప్రకాశం పంతులు జయంతి
National· 23 Aug 2026

ధైర్యానికి ప్రతీక ఆంధ్రకేసరి.. నేడు ప్రకాశం పంతులు జయంతి

నేడు ఆంధ్రకేసరి <a href="https://en.wikipedia.org/wiki/Tanguturi_Prakasam">టంగుటూరి ప్రకాశం పంతులు</a> జయంతి. ఫ్రీడమ్ ఫైటర్‌గా, న్యాయవాదిగా, ప్రజా నాయకుడిగా ఆయన దేశానికి ఎన్నో సేవలు చేశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల్లో దేశభక్తిని నింపారు. 1928లో సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో తుపాకీకి ఎదురుగా ఛాతీ చూపి 'ఆంధ్రకేసరి'గా హిస్టరీలో నిలిచారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమానికి కృషి చేశారు. ఆయన ధైర్యం, నిజాయితీ, త్యాగం నేటి తరానికి ఆదర్శం.

హాస్టల్‌లో దారుణంగా కొట్టుకున్న అమ్మాయిలు!
AP· 23 Aug 2026

హాస్టల్‌లో దారుణంగా కొట్టుకున్న అమ్మాయిలు!

AP: కాకినాడలోని ఎస్కే నర్సింగ్ కాలేజ్ హాస్టల్‌లో ఛార్జింగ్ పెట్టిన మొబైల్ ఫోన్ మిస్ అవ్వడంతో మణిపూర్, AP స్టూడెంట్స్ మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు అనుమానంతో కర్రలు, చీపుర్లు, బకెట్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థినులను కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేసి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. సమాచారం అందుకున్న కలెక్టర్, SP, పోలీసులు వెంటనే స్పాట్‌కు వెళ్ళి సిట్యుయేషన్‌ను కంట్రోల్ చేశారు. ముందస్తు జాగ్రత్తగా మణిపూర్ విద్యార్థినులను వేరే హాస్టల్‌కు షిఫ్ట్ చేశారు.

నవాబ్‌పేట్‌లో 110 CC కెమెరాలు 🎥
Local· 23 Aug 2026

నవాబ్‌పేట్‌లో 110 CC కెమెరాలు 🎥

TG : నవాబ్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 'వికారాబాద్ రక్షణ నేత్రం' కింద కొత్తగా ఏర్పాటు చేసిన 110 CCTV కెమెరాలను జిల్లా SP స్నేహ మెహ్రా, IPS స్టార్ట్ చేశారు. ఊళ్లలో క్రైమ్స్ తగ్గడానికి, అనుమానాస్పద కదలికలపై నిఘా పెట్టడానికి ఈ కెమెరాలు హెల్ప్ అవుతాయని SP అన్నారు. దీంతో పాటు పోలీస్ స్టేషన్‌లో కొత్తగా నిర్మించిన షటిల్ కోర్ట్, ప్రహరీ గోడను కూడా ఆమె ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్‌లో DSP అంజయ్య, CI వెంకట్, SI గిరన్నతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఢిల్లీ పోలీసుల కీలక హెచ్చరిక!
Current Affairs· 23 Aug 2026

ఢిల్లీ పోలీసుల కీలక హెచ్చరిక!

రిజర్వేషన్ సంస్కరణలపై జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలిపేందుకు ఢిల్లీ పోలీసులు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ఆదివారం (ఆగస్టు 23, 2026) జంతర్ మంతర్ వద్దకు రావాలని సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు అబద్ధమని.. వాటిని నమ్మి ఎవరూ అక్కడికి రావొద్దని హెచ్చరించారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి గుమిగూడితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

గంగవరం పోర్టు కాలుష్యం..గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయాలి
Local· 23 Aug 2026

గంగవరం పోర్టు కాలుష్యం..గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయాలి

AP : విశాఖపట్నం జిల్లాలోని గంగవరం, పెదగంట్యాడ ఊళ్లలో పోర్టు కాలుష్యం వల్ల దుమ్ము పెరిగిపోతోందని, ప్రజలు హెల్త్ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నామని తెలిపారు. కాలుష్యానికి చెక్ పెట్టాలంటే పోర్టు పరిసరాలు, రోడ్లు, ఖాళీ స్థలాల్లో గ్రీన్‌బెల్ట్ పెంచాలని కోరారు. గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజుకు వినతిపత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన ఆయన, మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడటానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

రైల్వే బెడ్‌షీట్లను షాల్‌లా కప్పుకుని తిరుగుతున్నారు!
Viral· 23 Aug 2026

రైల్వే బెడ్‌షీట్లను షాల్‌లా కప్పుకుని తిరుగుతున్నారు!

ముగ్గురు వ్యక్తులు రైల్వే బెడ్‌షీట్లను షాల్‌లా చుట్టుకుని తిరుగుతున్న దృశ్యం SMలో వైరల్ అవుతోంది. ఆ బెడ్‌షీట్లపై స్పష్టంగా ‘WESTERN RAILWAY’అని ముద్రించి ఉంది. ఈ బెడ్‌షీట్లను వారు దొంగిలించినట్టు తెలుస్తోంది. జనవరి 2022 నుంచి మే 2026 వరకు రైల్వే డివిజన్ల నుంచి సేకరించిన RTI డేటా ప్రకారం, 1.27 కోట్లకు పైగా బెడ్‌రోల్ వస్తువులు చోరీకి గురయ్యాయి. దీని వల్ల రైల్వేకు ₹104.51 కోట్ల నష్టం వచ్చింది.

భూపాలపల్లి జిల్లా బంద్‌కి పిలుపునిస్తాం: Dr.విశారాదన్
Local· 23 Aug 2026

భూపాలపల్లి జిల్లా బంద్‌కి పిలుపునిస్తాం: Dr.విశారాదన్

TG: జర్నలిస్ట్ రవీందర్‌పై దాడికి నిరసనగా భూపాలపల్లి జిల్లా అంబేడ్కర్ చౌరస్తాలో భారీ ధర్నా నిర్వహించరు. BC SC ST-JAC చైర్మన్ డా.విశారదన్ మహరాజ్ ప్రజలతో కలిసి ధర్నా చేస్తున్న టైంలో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అనంతరం పోలిస్టేషన్ వద్ద ఆయన మాట్లాడుతూ నిందితుడు మధువంశీరావుని 48 గంటల్లో అరెస్ట్ చేయకపోతే భూపాలపల్లి జిల్లా బంద్‌కి పిలుపునిస్తాం అని చెప్పారు.

డాక్టర్లు వాడే కెమెరాతో క్వశ్చన్ పేపర్ లీక్!
Education· 23 Aug 2026

డాక్టర్లు వాడే కెమెరాతో క్వశ్చన్ పేపర్ లీక్!

ఛత్తీస్‌గఢ్‌లో అగ్రికల్చర్ ఎగ్జామ్ పేపర్ లీక్ కేసులో ఒక ప్రొఫెసర్‌తో సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దుర్గ్‌లోని భారతి అగ్రికల్చర్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న యోగేష్ సొంకేసరియా.. ఎండోస్కోప్ కెమెరా, నీడిల్ ఉపయోగించి క్వశ్చన్ పేపర్‌ను లీక్ చేశాడు. ఎగ్జామ్‌కి ఒక్క రోజు ముందే ఎంటమాలజీ పేపర్‌ను విద్యార్థులకు రూ. 11,000కి అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వర్సిటీ ఆ పరీక్షను క్యాన్సిల్ చేసి, మళ్లీ రీ-టెస్ట్ conduct చేస్తం అని అనౌన్స్ చేసింది.

మేమంతా ఒక్కటే..మీ దౌర్జన్యాన్ని సహించం!
TG· 23 Aug 2026

మేమంతా ఒక్కటే..మీ దౌర్జన్యాన్ని సహించం!

TG: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీమ్ తీసేయాలని సూర్యాపేట చౌరస్తాలో నిరసనకు దిగారు. నిరసన స్థలానికి పోలీసులు చేరుకుని ఓ పాలిటెక్నిక్ విద్యార్థిని అదుపులోకి తీసుకోబోయారు. వెంటనే తోటి విద్యార్థులు వాళ్లని అడ్డుకున్నారు. అతణ్ని అదుపులోకి తీసుకోవడాని వీల్లేదని డిమాండ్ చేశారు. పోలీసులకు, విద్యార్థులకు మద్య తోపులాట జరిగింది.

సాదిక్‌ను కాకినాడ తీసుకొచ్చిన పోలీసులు
Local· 23 Aug 2026

సాదిక్‌ను కాకినాడ తీసుకొచ్చిన పోలీసులు

AP: పిఠాపురం పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యపై ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు సాదిక్‌ను పోలీసులు కాకినాడ తీసుకొచ్చారు. మీరట్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం అతడిని కాకినాడకు తరలించారు. ప్రస్తుతం సర్పవరం పోలీసుల అదుపులో ఉన్న సాదిక్‌ను సోమవారం కాకినాడ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. పూర్తి విచారణ కోసం పోలీస్ కస్టడీ కోరనున్నట్లు సమాచారం.

స్తంభాన్ని ఢీ కొట్టిన లారీ: స్తంభించిన ట్రాఫిక్
Local· 23 Aug 2026

స్తంభాన్ని ఢీ కొట్టిన లారీ: స్తంభించిన ట్రాఫిక్

TG: షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలోని తిమ్మాపూర్, రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పాలమాకుల మధ్యన బ్రిడ్జి వద్ద లారీ స్తంభాన్ని ఢీకొట్టింది. గంటసేపు ట్రాఫిక్ స్తంభించింది. 44వ నెంబర్ హైవే కావడంతో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు జెసిబి ద్వారా లారీని పక్కకు జరిపి ట్రాఫిక్‌ను అదుపు చేశారు.

జీతాల్లేక 9 నెలలు..సెక్యూరిటీ గార్డుల ఆవేదన
Local· 23 Aug 2026

జీతాల్లేక 9 నెలలు..సెక్యూరిటీ గార్డుల ఆవేదన

AP: విజయవాడలోని అంబేద్కర్‌ సామాజిక శిల్ప ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులకు 9 నెలలుగా జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తేదారు జీతాల చెల్లింపును అడిగిన ప్రతిసారీ వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. ఒక ఉద్యోగికి 13 నెలలుగా జీతం రాలేదని తెలిపారు. కుటుంబ పోషణ భారంగా మారడంతో అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. జీతాలు అందక ముగ్గురు ఉద్యోగాలు మానేశారని చెప్పారు. అధికారులు తక్షణమే స్పందించి పెండింగ్ జీతాలు చెల్లించాలని కోరారు.