Latest

యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్-2026
Local· 22 Aug 2026

యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్-2026

తెలంగాణ FDC ఆధ్వర్యంలో 'యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్- 2026 - సీజన్ 2' పోటీలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో FDC ఛైర్మన్ దిల్ రాజు సూచనతో MD జి. ముకుంద రెడ్డి, క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రభుత్వ పథకాలపై షార్ట్ ఫిల్మ్స్ (3 నిమిషాలు), పాటలు (5 నిమిషాలు), జానపద గేయాలు, ఇన్ఫ్లుయెన్సర్ వీడియోల కేటగిరీల్లో ఈ కాంపిటీషన్ ఉంటుంది. సెప్టెంబర్ 15 లోగా ఎంట్రీలను పంపించాలి. ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న వారికి రూ. 3 లక్షల బహుమతి లభిస్తుంది.

కంపెనీ అయినా పెట్టాలే.. లేకపోతే మా భూములు మాకియ్యాలె..
Local· 22 Aug 2026

కంపెనీ అయినా పెట్టాలే.. లేకపోతే మా భూములు మాకియ్యాలె..

‘‘కంపెనీలు పెట్టడానికి భూములు కావాలంటే ఇచ్చినం. ఇప్పటి దాకా కంపెనీ రాలే. కంపెనీలు వస్తే మా లోకల్ వాళ్లకు జాబులొస్తయ్ అనుకున్నం. ఇగ అట్ల లేదనుకుంటే మా భూములు మాకియ్యాలె...‘‘ అని రైతులు చెబుతున్నారు. వికారాబాదు జిల్లా, మోమిన్ పేట మండలం, ఎన్కతల గ్రామంలో రాష్ర్ట ప్రభుత్వం ఎలక్ర్టానిక్ వాహనాల కోసం ’మొబిలిటీ వ్యాలీ’ ఏర్పాటు కోసం భూములను సేకరించింది. రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ MLA ఆనంద్ రైతులను కలిశారు. పరామర్శించారు. మద్ధతు తెలిపారు.

9వ తరగతి నుంచే ప్లానింగ్
Local· 22 Aug 2026

9వ తరగతి నుంచే ప్లానింగ్

TG : పదో తరగతి పరీక్షల్లో మంచి రిజల్ట్స్ రావాలంటే విద్యార్థులు 9వ తరగతి నుంచే ప్లాన్ ప్రకారం చదువుకోవాలని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. తిర్యాణి ZPHSలో స్టూడెంట్స్, టీచర్లతో జరిపిన రివ్యూలో ఆయన మాట్లాడారు. విద్యార్థులపై ఒత్తిడి పెంచకుండా వారిలో ఉన్న కొత్త ఆలోచనలు బయటకు తీసేందుకు 'విద్యా ప్లస్' ప్రోగ్రామ్‌ను వాడుకోవాలని చెప్పారు. ప్రతిఒక్కరూ యోగా, ఎక్సర్‌సైజ్ ద్వారా ఆరోగ్యంగా ఉండటానికి ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ క్లబ్‌ల ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

కరపలో చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్
Local· 22 Aug 2026

కరపలో చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్

AP : కాకినాడ జిల్లా కరప గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు ఆధ్వర్యంలో యూత్ నేతలు ఘనంగా జరిపారు. ఈ ప్రోగ్రామ్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన జనసేన నాయకుడు డాక్టర్ బొండా సూర్యారావు కేక్ కట్ చేశారు. పేదలకు, వికలాంగులకు నిత్యావసర సరుకులు పంచారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి రక్తం అందించి ప్రాణాలు కాపాడుతున్నారని, ఆయన సేవలు గొప్పవని సూర్యారావు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

బైకులను గాయబ్ చేస్తున్నోళ్ల అరెస్టు
Local· 22 Aug 2026

బైకులను గాయబ్ చేస్తున్నోళ్ల అరెస్టు

వరుసగా బైకులు దొంగిలిస్తూ, చైన్ స్నాచింగుకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఆరు బైకులతో పాటు, తులంన్నర బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.ఈ నెల 18న సారంగాపూర్ మండలం అర్రపెల్లిలో రాత్రి వేళ చైన్ స్నాచింగ్ జరిగింది. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు... పక్కా సమాచారంతో రేచపల్లి ఎక్స్ రోడ్ వద్ద నిందితులు రేగొండ జగదీశ్వర్, ఎలాగందుల పవన్ చందులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు దొంగిలించిన బైకులను కొనుగోలు చేసిన వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు.

BJP కౌన్సిల్ మెంబర్‌గా కుడితాడి చిరంజీవి
Local· 22 Aug 2026

BJP కౌన్సిల్ మెంబర్‌గా కుడితాడి చిరంజీవి

TG : హనుమకొండ జిల్లాలో బీజేపీ ఎల్కతుర్తి మండల మాజీ అధ్యక్షుడు కుడితాడి చిరంజీవికి కొత్త పదవి దక్కింది. ఆయనను సిద్దిపేట జిల్లా పార్టీ కార్యవర్గ (కౌన్సిల్) సభ్యుడిగా ఎంపిక చేసినట్లు జిల్లా అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్ తెలిపారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత ఇచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్, జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్, ఇతర నాయకులు, సహకరించిన ఎల్కతుర్తి మండల పార్టీ శ్రేణులకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కి తనవంతు కృషి చేస్తానని చెప్పారు.

🇺🇸🇮🇷 అమెరికా–ఇరాన్ టెన్షన్ మళ్లీ పెరుగుతోందా?
International· 22 Aug 2026

🇺🇸🇮🇷 అమెరికా–ఇరాన్ టెన్షన్ మళ్లీ పెరుగుతోందా?

అమెరికా–ఇరాన్ మధ్య కాల్పులు ఆగిపోయినా.. మాటల యుద్ధం మాత్రం మళ్లీ వేడెక్కుతోంది. అమెరికా సోమవారం కొత్త ఆంక్షలు ప్రకటించబోతోంది. ఇవి ఇరాన్‌తో పాటు దాని ప్రధాన వాణిజ్య భాగస్వాములపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇరాన్ మాత్రం కొత్త ఆంక్షలకు తమ స్పందన “తీవ్రంగా ఉంటుంది” అని హెచ్చరిస్తోంది. మరోవైపు హోర్ముజ్ జలసంధిలో చమురు నౌకల రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. దీంతో టెన్షన్ కేవలం ఇరు దేశాల మధ్యే కాదు.. ప్రపంచ చమురు ధరలపైనా ప్రభావం చూపుతోంది.

మందమర్రిలో ప్రారంభమైన కొత్త కోర్టు
Local· 22 Aug 2026

మందమర్రిలో ప్రారంభమైన కొత్త కోర్టు

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో కొత్త కోర్టు బిల్డింగు ఓపెనైంది. ఇది జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు. దీనిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, మంచిర్యాల జిల్లా పరిపాలన న్యాయమూర్తి నగేష్ భీమపాక ముఖ్య అతిథులుగా పాల్గొని దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సత్వర న్యాయం అందేలా కేసుల పరిష్కారంలో వాయిదాలు తగ్గించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తదితరులు పాల్గొన్నారు.

Messiకి ఫైన్ ఎందుకు పడింది?
Sports· 22 Aug 2026

Messiకి ఫైన్ ఎందుకు పడింది?

మ్యాచ్‌లో గోల్ కొట్టిన Messi.. అదే మ్యాచ్‌లో వివాదంలోనూ చిక్కుకున్నాడు. ⚽ ఆగస్టు 19న Philadelphia Unionతో జరిగిన 2–2 డ్రాలో, ప్రత్యర్థి ఆటగాడు Quinn Sullivanతో జరిగిన ఘర్షణలో Messi అతని మెడ వెనుక భాగంపై చేయి చేసుకున్నాడు. మ్యాచ్‌లో రిఫరీ వెంటనే కార్డు ఇవ్వకపోయినా, తర్వాత MLS డిసిప్లినరీ కమిటీ వీడియోను సమీక్షించి నిబంధనలు ఉల్లంఘించినట్లు తేల్చింది. దీంతో Messiకి వెల్లడించని మొత్తంలో జరిమానా విధించింది. అయితే ఇది మ్యాచ్ నిషేధం కాదు.. Messi తదుపరి మ్యాచ్‌లో ఆడేందుకు అందుబాటులోనే ఉన్నాడు.

కేసుల దర్యాప్తు వేగవంతం
Local· 22 Aug 2026

కేసుల దర్యాప్తు వేగవంతం

TG : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కేసుల ఇన్వెస్టిగేషన్ నుంచి తీర్పు వరకు ప్రతి పనినీ టైమ్‌కి పూర్తి చేయాలని సీపీ అంబర్ కిశోర్ అధికారులను ఆదేశించారు. కోర్టు డ్యూటీ, లైజనింగ్ అధికారులతో జరిపిన రివ్యూలో ఆయన మాట్లాడారు. సాక్షులను కోర్టులో హాజరుపరచడం, కాగితాల పరిశీలన, సీసీటీఎన్‌ఎస్ అప్‌డేట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. నిజాయితీగా, నీతిగా ఉంటూ ఆధారాలతో సమన్వయంగా పనిచేస్తేనే కోర్టుల్లో న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.

AI గ్లాసెస్ చూస్తున్నాయా… లేక మనల్నే రికార్డ్ చేస్తున్నాయా?
International· 22 Aug 2026

AI గ్లాసెస్ చూస్తున్నాయా… లేక మనల్నే రికార్డ్ చేస్తున్నాయా?

AI స్మార్ట్ గ్లాసెస్ స్మార్ట్‌గా మారుతున్న కొద్దీ, వాటిపై ప్రైవసీ డౌట్స్ కూడా పెరుగుతున్నాయి. కెమెరా, మైక్ ఉండటంతో చుట్టూ ఉన్నవారికి తెలియకుండానే ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేసే అవకాశం ఉందనే ఆందోళనలు వస్తున్నాయి. తాజాగా బ్రిటన్‌లోని కొన్ని సినిమాహాళ్లు ఫిల్మ్ పైరసీ, ప్రైవసీ కారణాలతో కెమెరా ఉన్న స్మార్ట్ గ్లాసెస్‌పై ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టాయి. మరోవైపు, పబ్లిక్‌లో వ్యక్తులను వారి అనుమతి లేకుండా రికార్డ్ చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. టెక్నాలజీ స్మార్ట్ అవుతోంది… మన Privacy సంగతేంటి? 👀

మంచిర్యాలలో BJP ఆందోళన
Local· 22 Aug 2026

మంచిర్యాలలో BJP ఆందోళన

TG : 22A నిషేధిత భూముల జాబితాలో జరిగిన అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని కోరారు. మంచిర్యాల కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు కలెక్టరేట్ గేటుకే వినతిపత్రాన్ని కట్టి తమ నిరసనను తెలియజేశారు.

మన బాడీని విద్యార్థుల చదువు కోసం ఉపయోగిద్దాం
Local· 22 Aug 2026

మన బాడీని విద్యార్థుల చదువు కోసం ఉపయోగిద్దాం

TG : మనం చనిపోయి కూడా మన బాడీని విద్యార్థుల చదువు కోసం ఉపయోగపడేలా చేద్దాం అని CPI నాయకులు పిలుపునిచ్చారు. CPI మాజీ పార్లమెంటు సభ్యులు సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా కొందుర్గు మండల కేంద్రంలో ఆయన ఫొటోకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అయన చేసిన పోరాటాల గురించి మాట్లాడుతూ, తన బాడీని గాంధీ హాస్పిటల్ కి ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఆయన మార్గంలో మనం కూడా నడవాలని CPI నాయకులు తెలిపారు.

క్రికెట్ తర్వాత ఫుట్‌బాల్‌దేనా? Zee భారీ డీల్!
Sports· 22 Aug 2026

క్రికెట్ తర్వాత ఫుట్‌బాల్‌దేనా? Zee భారీ డీల్!

ఇండియాలో క్రికెట్ తర్వాత ఫుట్‌బాల్‌కు కూడా మార్కెట్ పెరుగుతుండటంతో బ్రాడ్‌కాస్టర్ల ఫోకస్ మారుతోంది. తాజాగా Zee Entertainment ఇటలీ ఫుట్‌బాల్‌లోని టోర్నమెంట్లైన Serie A, Coppa Italia, Supercoppa Italiana ప్రసార, డిజిటల్ హక్కులను దక్కించుకుంది. దీంతో ఇటలీ టాప్ క్లబ్‌ల మ్యాచ్‌లను భారత ఫ్యాన్స్ Zee ప్లాట్‌ఫామ్‌లలో చూసే అవకాశం ఉంటుంది. విదేశీ ఫుట్‌బాల్‌కు యువతలో పెరుగుతున్న ఆసక్తి ఈ డీల్‌కు ప్రాధాన్యం ఇస్తోంది. క్రికెట్ డామినేషన్ ఉన్న ఇండియాలో ఫుట్‌బాల్ కూడా పెద్ద స్పోర్ట్స్ మార్కెట్‌గా మారుతోందా?

షుగర్ లేని స్వీట్స్!
Health· 22 Aug 2026

షుగర్ లేని స్వీట్స్!

బెల్లంతో స్వీట్స్ ప్రిపేర్ చేయడం వల్ల టేస్ట్‌తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. బెల్లం డైజెషన్‌ను ఇంప్రూవ్ చేసి మలబద్ధకం ప్రాబ్లమ్‌ను తగ్గిస్తుంది. అలాగే లివర్‌ను క్లీన్ చేసి ఇమ్యూనిటీని పెంచుతుంది. వైట్ షుగర్‌కి బదులుగా బెల్లం వాడి ఓట్స్ కుకీస్, టీ కేక్, మిల్లెట్ ఖీర్, కోకోనట్ లడ్డు లాంటివి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చని జయంతి మధుకర్ తెలిపారు. భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే డైజెషన్ ఫాస్ట్‌గా అవుతుంది. అయితే బెల్లం కూడా లిమిట్‌గానే యూజ్ చేయడం మంచిది.

'ఛాత్రో కీ గూంజ్' .. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు
National· 22 Aug 2026

'ఛాత్రో కీ గూంజ్' .. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పూణేలోని ఏఐఎస్‌ఎస్‌ఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (AISSMS) ఆవరణలో విద్యార్థినులతో మాట్లాడారు. 'ఛాత్రో కీ గూంజ్' (Chhatron Ki Goonj) పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోని విద్యావ్యవస్థ, ఉపాధి, యువత సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి ముందు ఏబీవీపీ, ఎన్ఎస్‌యూఐ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులు 50-60 మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు.

ఢిల్లీ IITలో విద్యార్థి ఆత్మహత్య
Crime· 22 Aug 2026

ఢిల్లీ IITలో విద్యార్థి ఆత్మహత్య

IIT ఢిల్లీ క్యాంపస్‌లో ఇవాళ ఉదయం ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్‌కు చెందిన ఎం.ఎస్సీ ఫిజిక్స్ విద్యార్థి రిషికేశ్ కుమార్‌(31) లెక్చర్ హాల్ కాంప్లెక్స్ ఆరో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ దొరకలేదు. ఈ ఘటనకు గల కారణాలు తెలియలేదు. క్రైమ్ టీమ్, FSL టీమ్ సాక్ష్యాలు సేకరించాయి. మార్చి నుంచి IIT ఢిల్లీలో రెండో ఆత్మహత్య ఇది.

ఏపీలో జాబ్‌ క్యాలెండర్‌ 2026 విడుదల
AP· 22 Aug 2026

ఏపీలో జాబ్‌ క్యాలెండర్‌ 2026 విడుదల

AP: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 10,060 పోస్టులతో జాబ్‌ క్యాలెండర్‌ 2026ను రిలీజ్ చేసింది. మొత్తం నాలుగు దశల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. గ్రూప్‌-1లో 149 పోస్టులు, గ్రూప్‌-2లో 673 ఉద్యోగాలు, డీఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. పోలీస్‌, ఫైర్‌, జైళ్లు, అటవీ, పశుసంవర్ధక శాఖలు, ఎక్సైజ్‌, ఇంజినీరింగ్, విద్యుత్‌ శాఖలలోనూ ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు జీవోలో పేర్కొంది.

సినిమా సెట్లో ఈ చిన్న తప్పు చేస్తే అంతే!
Entertainment· 22 Aug 2026

సినిమా సెట్లో ఈ చిన్న తప్పు చేస్తే అంతే!

సినిమా సెట్లో చిన్న మిస్టేక్ జరిగినా కంటిన్యూటీ మ్యాచ్ కాక పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. అందుకే యాక్టర్ మూవ్‌మెంట్స్, డ్రెస్సెస్, డైలాగ్స్ అన్నీ సేమ్‌గా ఉండేలా చూసే బాధ్యత స్క్రిప్ట్ సూపర్‌వైజర్లదే. 25 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న శుభా రామచంద్ర తలాష్, భాగ్ మిల్కా భాగ్ లాంటి మూవీస్ సీక్రెట్స్ షేర్ చేశారు. తలాష్‌ లో ఆమిర్ ఖాన్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో 20 టేకుల సీన్ రీషూట్ చేశారట. షూటింగ్ సమయంలో నోట్స్ రాస్తూ డైరెక్టర్, ఎడిటర్‌కి ప్రతీ షాట్ పర్ఫెక్ట్‌గా రావడానికి వీళ్లే మెయిన్ హెల్ప్ చేస్తారు.

తమ ఉద్యోగాలనే AIకి నేర్పిస్తున్న క్రియేటర్లు!
Technology· 22 Aug 2026

తమ ఉద్యోగాలనే AIకి నేర్పిస్తున్న క్రియేటర్లు!

హాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో కొంతమంది స్క్రీన్‌రైటర్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఇప్పుడు AI మోడళ్లకు తమ వర్క్ నేర్పే గిగ్ జాబ్స్ చేస్తున్నారు. స్క్రిప్ట్ రాయడం, షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేయడం, పిచ్ డెక్ తయారు చేయడం వంటి పనుల్లో AI ఇచ్చిన ఫలితాలను పరిశీలించి, వాటిని ఎలా మెరుగుపరచాలో చెబుతున్నారు. ఇందుకోసం కొందరికి గంటకు $12 నుంచి $200 వరకు చెల్లిస్తున్నారని రిపోర్ట్ చెబుతోంది. వింత ఏంటంటే AI తమ ఉద్యోగాలను తీసుకుంటుందేమో అని భయపడుతున్నవారే, ఇప్పుడు దానికి ఆ ఉద్యోగాలు ఎలా చేయాలో నేర్పిస్తున్నారు.

రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్
Entertainment· 22 Aug 2026

రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్

చాలా రోజుల తర్వాత రవితేజకు బాక్సాఫీస్ దగ్గర మంచి బూస్ట్ కనిపించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ‘ఇరుముడి’ ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా ₹24.20 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తాజా ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి. ఇండియాలో ₹14.80 కోట్ల నెట్ రావడంతో పాటు, తెలుగు రాష్ట్రాల్లోనే భారీ ఆక్యుపెన్సీ నమోదైంది. ఫ్యాన్స్‌కు నచ్చిన ఎమోషనల్ తండ్రీకూతుళ్ల కథ, ట్రైలర్‌పై ముందే వచ్చిన క్యూరియాసిటీ, రవితేజ కొత్త తరహా పాత్ర—ఈ మూడూ ఓపెనింగ్‌కు ప్లస్ అయ్యాయి. ఇది రవితేజ సోలో సినిమాల్లోనే అత్యుత్తమ ఫస్ట్ డే ఓపెనింగ్‌.