Latest
Justice for రూపారెడ్డి
TG : నల్గొండలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని అక్షర హైస్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ తీశారు. కొవ్వొత్తులు వెలిగించి, మానవహారంగా ఏర్పడి రూపారెడ్డికి నివాళులర్పించారు. స్కూళ్లలో టీచర్లు, విద్యార్థుల భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని కోరారు. రూపారెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

ట్రంప్ మాస్టర్ ప్లాన్: మిస్సైల్స్ కూడా ఏం చేయలేవు!
వైట్ హౌస్‌లో ప్రెసిడెంట్ ట్రంప్ నిర్మిస్తున్న $400 మిలియన్ల భారీ బాల్‌రూమ్ ప్రాజెక్ట్ వర్క్స్ కొనసాగించడానికి US సుప్రీం కోర్ట్ పర్మిషన్ ఇచ్చింది. పాత ఈస్ట్ వింగ్‌ను కూల్చేసి నిర్మిస్తున్న ఈ కాంప్లెక్స్‌లో కేవలం గ్రాండ్ బాల్‌రూమ్ మాత్రమే కాదు, గ్రౌండ్ కింద హైటెక్ సీక్రెట్ సెటప్ కూడా ఉంది. భూమి లోపల బాంబ్ షెల్టర్స్, అడ్వాన్స్డ్ మెడికల్ హాస్పిటల్స్, డ్రోన్లు, మిస్సైల్స్ దాడులను తట్టుకునే డిఫెన్స్ సిస్టమ్స్ నిర్మిస్తున్నారు. ఇది దేశ భద్రతకు చాలా కీలకమని ట్రంప్ గవర్నమెంట్ కోర్టుకు తెలిపింది.

MLA కోరం కనకయ్య అకస్మిక తనిఖీ
TG : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని బొజ్జాయిగూడెం ఆశ్రమ స్కూల్‌ను MLA కోరం కనకయ్య హఠాత్తుగా సందర్శించారు. స్కూల్లో విద్యార్థులకు అందించే భోజనం, హాస్టల్ సదుపాయాలు, మరుగుదొడ్లను ఆయన దగ్గరుండి పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ రాంబాబు, పాక్స్ ఛైర్మెన్ మెట్ల కృష్ణ, ఉప సర్పంచ్ కిరణ్ కుమార్, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పెయింటర్లకు లేబర్ కార్డులు కావాలె...
పెయింటింగ్ వృత్తిలో ఉన్న పెయింటర్లందరికీ లేబర్ కార్డులు ఇవ్వాలని పెయింటర్ల యూనియన్ నాయకులు కోరుతున్నారు. ఇప్పటికే కార్డులున్న వారివి కూడా చాలా కాలం నుంచి రెన్యువల్ కావడం లేదని, తక్షణమే రెన్యువల్ చేయాలని వారు డిమాండు చేస్తున్నారు. ఈ మేరకు వారు జిల్లా కలెక్టరేట్‌లో భవన నిర్మాణ కార్మిక అధికారిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. అలాగే కార్డులు లేని వారు తక్షణం ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, 2 ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులను యూనియన్ తరఫున సన్మానించారు.

జడ్జెస్ ఏమీ దేవుళ్లు కారు?
జడ్జెస్ ఏమీ దేవుళ్లు కారు, ప్రతీ జడ్జిమెంట్ పర్ఫెక్ట్‌గా ఇచ్చేయలేరని రిటైర్ అవుతున్న సుప్రీం కోర్ట్ జడ్జి సంజయ్ కరోల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జడ్జిగా ఉన్నప్పుడు వినయం ఉండాలని, ప్రతీ కేసు వెనుక ఉన్న మనిషిని అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలని చెప్పారు. శనివారం జరిగిన తన ఫేర్‌వెల్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన, జడ్జిమెంట్స్ ఇచ్చే ప్రాసెస్‌లో వినయం ఎంత ముఖ్యమో చెప్పారు.

పాలిటెక్నిక్ విలీనానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన
TG : పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్డ్ యూనివర్సిటీలో కలపొద్దంటూ AISF ఆధ్వర్యంలో విద్యార్థులు షాద్‌నగర్ RDO ఆఫీస్ ముందు నిరసన చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మద్దతు ఇచ్చారు. రెండు గంటల పాటు జరిగిన ఈ ఆందోళన వల్ల పాత నేషనల్ హైవేపై ట్రాఫిక్ ఆగిపోయింది. తర్వాత RDO సరిత బయటకు వచ్చి, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పడంతో విద్యార్థులు నిరసన ముగించారు. ఈ కార్యక్రమంలో AISF నాయకులు ఆకాశ్ నాయక్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

మంత్రి కొండా సురేఖ ఆత్మవిమర్శ చేసుకోవాలి
TG: ముఖ్యమంత్రిపై మంత్రి కొండ సురేఖ కూతురు చేసిన కామెంట్స్ తనకు సంబంధం లేదని మాట్లాడడం సరికాదని, ఆత్మవిమర్శ చేసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. అసెంబ్లీ సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు, ఆది శ్రీనివాస్‌లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. సురేఖ చేసే పనులకు కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల మనసు గాయపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పైన, వారి సోదరులపైన ఆమె కూతురు విమర్శలు చేస్తుంటే కొండా సురేఖ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు.

పెద్దకాకాని శివాలయంలో అమ్మవారి నగలు మాయం
AP: గుంటూరు జిల్లా పెద్దకాకాని మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారి 80 గ్రాముల నల్లపూసల మంగళసూత్రం మాయమైంది. దీని విలువ సుమారు రూ.15 లక్షలు. రెండు రోజుల క్రితం గుర్తించిన అర్చకులు ఈవోకు సమాచారం అందించారు. ఆలయ అంతర్గత విచారణలో ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గర్భగుడిలోకి వెళ్లే 17 మంది అర్చకులను పోలీసులు విచారించగా, ఐదుగురిపై అనుమానం వ్యక్తమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వృద్ధుల హక్కులు కాపాడాలి: జడ్జ్ స్వాతి రెడ్డి
TG : వృద్ధుల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని షాద్‌నగర్ జడ్జ్ స్వాతి రెడ్డి చెప్పారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా FCN వృద్ధాశ్రమంలో జరిగిన ప్రోగ్రామ్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ యాక్ట్ ద్వారా వృద్ధులకు ఉండే హక్కుల గురించి వివరించారు. అక్కడ ఉన్న వృద్ధులకు పండ్లు పంచారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహకులు, ఇతరులు పాల్గొన్నారు.

50 గజాల స్థలంలో ఏడంతస్తుల భవనం సాధ్యమేనా?
హైదరాబాదులో 50 గజాల స్థలంలో కడుతున్న ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. అంత స్థలంలో ఏడంతస్తుల బిల్డిండ్ కట్టడం సాధ్యమేనా అని జనం చర్చించుకుంటున్నారు. ఒక గజం అంటే 1 9 చదరపు అడుగులు. ఆ లెక్కన 50 గజాలంటే 450 చదరపు అడుగులు. ఇంత చిన్న విస్తీర్ణంలో ఏడంతస్తులు సాధ్యం కాదని భవన నిర్మాణరంగ నిపుణులు అంటున్నారు. పైగా Telangana Building Rules ప్రకారం 50 చ.మీ. కంటే తక్కువ ప్లాట్లకు సాధారణంగా ఏడు మీటర్ల ఎత్తు మాత్రమే ఉండాలనే రూల్ ఉందని, ఏడంతస్తుల భవనం సుమారు 21 మీటర్ల కంటే ఎక్కువే ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

గిరిజనుల కోసం CPM మహాధర్నా
AP : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో CPM నేతలు RDO ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. గిరిజనుల హక్కులు, భూముల విషయంలో అధికారులు, పోలీసులు భూస్వాములకే సపోర్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గిరిజనుల కోసం పోరాడుతున్న తమ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు, రౌడీషీట్లను వెంటనే తీసేయాలని డిమాండ్ చేశారు. 1/70 చట్టాన్ని అమలు చేయాలని, ఎల్‌టీఆర్ భూముల విషయంలో పోలీసుల జోక్యం ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో CPM ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

గచ్చిబౌలిలో కూలిన బిల్డింగ్.. స్పాట్‌కు చేరుకున్న MLA
TG: ఈరోజు హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాద ఘటన జరిగింది. అంజయ్యనగర్‌లో కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న ఏడంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఘటనతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి MLA అరెకపూడి గాంధీ స్పాట్‌కు చేరుకున్నారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్‌కు పాల్పడిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ప్రమాదానికి సంబంధిత అధికారులు, ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని అన్నారు.

విదేశాల్లో నెలకు రూ.2 లక్షల సాలరీతో జాబ్స్
తెలంగాణ యూత్‌కి ఫారెన్‌లో బ్లూ కాలర్ జాబ్స్ ఇప్పించేందుకు గవర్నమెంట్ 'టామ్‌కామ్' ద్వారా ప్లాన్ చేసింది. కనీస విద్యార్హత ఉండి, అక్కడి లోకల్ లాంగ్వేజ్ వస్తే చాలు.. నెలకు రూ.2 లక్షల వరకు శాలరీ సంపాదించవచ్చు. ప్రతీ ఇయర్ 5 వేల మందికి, 2047 కల్లా 2 లక్షల మందికి విదేశాల్లో జాబ్స్ ఇప్పించడమే టార్గెట్. గవర్నమెంట్ ఫైనాన్షియల్ హెల్ప్ కూడా ఇస్తుంది. జర్మనీ, జపాన్, యూఏఈల్లో హెల్త్‌కేర్, లాజిస్టిక్స్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్‌లో భారీగా వేకెన్సీస్ ఉన్నాయి.
దారకొండ ఆసుపత్రిలో టైమ్‌కి రాని డాక్టర్లు
AP : అల్లూరి సీతారామరాజు జిల్లాలో జీకే వీధి మండలం దారకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది టైమ్‌కి రాకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జ్వరం, చెకప్‌ల కోసం పొద్దున్నే వస్తే గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోందని ప్రజలు చెబుతున్నారు. టైమ్‌కి వైద్యం అందక అత్యవసర పరిస్థితి ఉంటే పక్క ఊళ్లకు వెళ్లాల్సి వస్తోంది. అధికారులు వెంటనే స్పందించి లేట్‌గా వచ్చే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అమెరికా 3 లక్షలు.. భారత్ 13 లక్షలు! ఎందుకు?!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రాకెట్ లాంచ్‌లు భారత్‌లోనే జరుగుతున్నాయని కేంబ్రిడ్జ్, ఇటలీ ఎకనామిస్టుల రీసెంట్ స్టడీ వెల్లడించింది. మన దేశంలో కిలో పేలోడ్‌ను స్పేస్‌లోకి పంపేందుకు $13,302 (రూ.12.7 లక్షలు) ఖర్చవుతుండగా, అమెరికాలో అది $3,225 (రూ.3.1 లక్షలు) మాత్రమే. మన కాస్ట్ US కంటే 4 రెట్లు, యూరోపియన్ యూనియన్ ($9,897) కంటే కూడా ఎక్కువ. ఇప్పటివరకు బడ్జెట్ మిషన్లకు కేరాఫ్ అయిన ఇస్రోకి ఇది షాకింగ్ అప్‌డేట్.

GO 97 రద్దు చేయాలంటూ పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన
TG : మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని సింగరేణి పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు GO 97ను రద్దు చేయాలంటూ రోడ్డుపై కూర్చొని నిరసన తెలియజేశారు. ఈ పోరాటానికి PDSU, AISB విద్యార్థి సంఘాల నాయకులు మద్దతుగా నిలిచారు. ఈ జీవో వల్ల పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయ్యాక పైచదువులైన ఇంజనీరింగ్ చదివే అవకాశాలు దెబ్బతింటాయని, అందుకే ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు కోరారు.

మంచిర్యాల ఆటో డ్రైవర్ల బంద్
TG : మంచిర్యాల జిల్లాలో ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఆటో యూనియన్ JAC నాయకులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 24న ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ బంద్‌కు అందరూ సహకరించాలని కోరుతూ శనివారం జన్నారం తహసీల్దార్ బక్కన్నను కలసి వినతిపత్రం ఇచ్చారు. సమస్యలు త్వరగా తేల్చకపోతే పోరాటం తప్పదని చెప్పారు.
జీవో 97పై విద్యార్థుల ఫైర్.. సూర్యాపేటలో నిరసన
పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ సూర్యాపేటలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు జీవో 97ను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వల్ల తమ మూడు సంవత్సరాల డిప్లొమా విద్య, తదుపరి ఇంజినీరింగ్ చదువులు, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
కుక్క భయంతో బావిలో పడిన బాలిక.. చివరికి ఇలా!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫరూఖాబాద్ జిల్లా కైమ్‌గంజ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న బాలికను ఓ కుక్క వెంబడించింది. భయంతో బాలిక బావి వైపు వెళ్లింది. 50 అడుగుల లోతైన బావిలో పడిపోయింది. స్థానికులు సమాచారంతో పోలీసులు, రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకున్నారు. అధికారులు ఆక్సిజన్ మాస్క్‌తో బావిలోకి దిగి బాలికను సేఫ్‌గా బయటకు తీసుకొచ్చారు. తరువాత హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి బాగానే ఉందని అధికారులు తెలిపారు.
సీఎస్‌ఐ ఆస్తుల రక్షణకు పోరుబాట
AP: సీఎస్‌ఐ బిషప్ పరిపాలనకు బదులుగా సినాడ్ ఆధ్వర్యంలో పాలన కొనసాగించాలని పాస్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సీఎస్‌ఐ, లండన్ మిషన్‌కు చెందిన విలువైన భూములు, స్థిరాస్తులను లీజుల పేరుతో అనధికారికంగా విక్రయిస్తున్నారంటూ అసోసియేషన్ ఆరోపణలు చేసింది. 146 ఏళ్ల చరిత్ర కలిగిన లండన్ మిషన్ స్కూల్ పరిసరాల్లోని ఆస్తులతో పాటు అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని ఆరోగ్యవరం మిషన్ ఆస్తుల పరిరక్షణపై ఆందోళన వ్యక్తం చేసింది. కోట్ల రూపాయల విలువైన మిషన్ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది.

వేధింపులు ఎదురైతే భయపడొద్దు: షీటీమ్ భరోసా
TG: విద్యార్థినుల భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో షీ టీమ్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. రామగుండం సీపీ ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో మార్కండేయ కాలనీలోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీమ్ ఇన్‌చార్జి ఎస్‌ఐ లావణ్య గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండటం, పోక్సో చట్టం, సోషల్ మీడియా ప్రభావంపై వివరించారు. మహిళల భద్రత, ఆన్‌లైన్ మోసాలు, డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.