కార్మికుల పోరుబాట.. 24 నుంచి నిరాహార దీక్షలు

TG: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24, 25 తేదీల్లో నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు సీఐటీయూ జిల్లా నాయకుడు నానహే సాబ్, తెలంగాణ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగం గంగాధర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా పోతగల్‌లో నిర్వహించిన గ్రామపంచాయతీ కార్మికుల సమావేశంలో వారు మాట్లాడారు. కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, వేతనాలను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.


