సురవరం సుధాకర్‌రెడ్డికి నివాళులర్పించిన నేతలు
TG: CPI మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ మాజీ పార్లమెంటు సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా హిమాయత్‌నగర్ లోని రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి, CPI జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, CPI జాతీయ నాయకులు డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, డి.వి.విజయలక్ష్మి, సయ్యద్ అజీజ్ పాషా పూలమాల వేసి నివాళులర్పించారు.


