ప్రజాసమస్యల పరిష్కారానికి మంత్రి క్షేత్రస్థాయి పర్యటన
TG: ప్రజాసమస్యల పరిష్కారంలో జాప్యాన్ని సహించేది లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను హెచ్చరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో వరుసగా మూడోరోజు పర్యటించిన మంత్రి.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పెంట్లవెల్లిలో ప్రతిపాదిత స్టేడియం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం రెవెన్యూ సమస్యలపై అధికారులతో సమీక్షించారు. మ్యూటేషన్ల కోసం ప్రజలను ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు.


