Latest

నిరుద్యోగుల సమస్యలపై CPM ధర్నా
Local· 20 Aug 2026

నిరుద్యోగుల సమస్యలపై CPM ధర్నా

TG: నిరుద్యోగుల సమస్యలపై CPM వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సిపిఎం నాయకులు మాట్లాడుతూ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని కేంద్ర బీజేపీ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖలో 10 లక్షలకు పైగా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని అన్నారు.

డా.విశారదన్ మహారాజ్ మహా ధర్నా ఫలితం..కదిలిన యంత్రాంగం
Local· 20 Aug 2026

డా.విశారదన్ మహారాజ్ మహా ధర్నా ఫలితం..కదిలిన యంత్రాంగం

TG: జగిత్యాలలోని డబుల్ బెడ్రూం కాలనీలోని సమస్యల పరిష్కారం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ-జేఏసీ ఆధ్వర్యంలో జూలై 29న డా. విశారదన్ మహారాజ్ మహా ధర్నా చేపట్టారు. దీంతో అధికార యంత్రాంగం కదిలింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డబుల్ బెడ్రూం కాలనీని సందర్శించారు. కాలనీలోని సమస్యలను స్వయంగా పరిశీలించి, పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నారు. దీనిపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బుగ్గారంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
Local· 20 Aug 2026

బుగ్గారంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

TG: జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతి (సద్భావన దివస్) వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశాన్ని సాంకేతిక రంగానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని అన్నారు. దేశంలో కంప్యూటర్, టెలికాం విప్లవాన్ని తీసుకువచ్చి, నేటి యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా పునాది వేసిన విజేత ఆయనేనని గుర్తుచేశారు.

జర్నలిస్టుపై దాడిని ఖండిస్తూ నిరసన ర్యాలీ
Local· 20 Aug 2026

జర్నలిస్టుపై దాడిని ఖండిస్తూ నిరసన ర్యాలీ

AP: విజయనగరం జిల్లా పూసపాటిరేగ విశాలాంధ్ర రిపోర్టర్ గోవిందపై జరిగిన దాడిని ఖండిస్తూ రాజాం ప్రాంతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజాం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా వెళ్లి, అంబేద్కర్ జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే పాత్రికేయులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
AP· 20 Aug 2026

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి

AP: అక్రిడిటేషన్ కలిగిన అర్హత ఉన్న జర్నలిస్టు లకు ప్రతి జిల్లాలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల చిరకాల డిమాండ్‌ను అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యేకు వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

తాడేపల్లిలో బీసీ కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన
Local· 20 Aug 2026

తాడేపల్లిలో బీసీ కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన

AP: అమరావతిలోని తాడేపల్లి పట్టణంలోని 6వ వార్డులో నారా లోకేష్ సొంత నిధులతో సుమారు రూ.కోటితో బీసీ కమ్యూనిటీ హాల్‌ నిర్మించనున్నారు. దీనికి శంకుస్థాపన జరిగింది. కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు, దానబోయిన సుందర్రావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

చీరాలలో ఆర్టీఐ కార్యకర్త కిడ్నాప్
Local· 20 Aug 2026

చీరాలలో ఆర్టీఐ కార్యకర్త కిడ్నాప్

AP: బాపట్ల జిల్లా చీరాలలో మైనింగ్ అక్రమాలపై జాయింట్ ఇన్స్‌ఫెక్షన్‌కు హాజరైన ఆర్టీఐ కార్యకర్త నాయుడు నాగార్జునరెడ్డిని దుండగులు కిడ్నాప్ చేశారు. ఆయనను తీవ్రంగా కొట్టి చీరాల ప్రభుత్వ ఆస్పత్రిలో వదిలేసి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మైనింగ్ మాఫియా ఆగడాలు శృతిమించాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

దోమల గుంపులతో లంగర్‌హౌజ్‌ హడల్‌.. జనం ఆందోళన!
TG· 20 Aug 2026

దోమల గుంపులతో లంగర్‌హౌజ్‌ హడల్‌.. జనం ఆందోళన!

TG: హైదరాబాద్‌ లంగర్‌హౌజ్‌లో దోమలు దండు. దోమలు గుంపులుగా తిరుగుతున్న విజువల్స్‌ను స్థానికుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్‌ డిసీజెస్ వ్యాపించే అవకాశముందని స్థానికులు టెన్షన్ పడుతున్నారు. శానిటేషన్ లోపం, కాలువలు సరిగా లేకపోవడంతో దోమల బ్రీడింగ్‌ స్పాట్స్‌ పెరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. వెంటనే ఫాగింగ్‌, యాంటీ-లార్వల్ స్ప్రేయింగ్ చేయాలని శానిటేషన్ డిపార్ట్‌మెంట్‌ను కోరుతున్నారు.

పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం.. అధికారుల తీరుపై స్థానికుల ఫైర్
Local· 20 Aug 2026

పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం.. అధికారుల తీరుపై స్థానికుల ఫైర్

TG: మంచిర్యాల జిల్లా మందమర్రి స్టేషన్ రోడ్ 2వ జోన్ పరిధిలోని 10వ వార్డులో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా మారింది. నెల రోజులుగా చెత్త సేకరణ వాహనాలు రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర వార్డుల్లో చిన్న చెత్త వాహనాలు, ట్రాక్టర్లు క్రమం తప్పకుండా తిరుగుతున్నప్పటికీ తమ వార్డును మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. సమస్యపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా మ్యాన్‌పవర్ కొరత, లైన్ ఎత్తులో ఉండటం వంటి కారణాలు చెబుతున్నారని తెలిపారు.

చెవుటూరు రోడ్డుపై వాహనదారుల అవస్థలు
Local· 20 Aug 2026

చెవుటూరు రోడ్డుపై వాహనదారుల అవస్థలు

AP: NTR జిల్లా జి.కొండూరు మండలం చెవుటూరు గ్రామ ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై భారీ గుంతలు ఏర్పడి, ఇటీవల కురుస్తున్న వర్షాలకు అవి నీటితో నిండిపోయాయి. గుంతల లోతు కనిపించకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి జారిపడుతున్న ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల బస్సులు, అంబులెన్సులు సైతం ఈ మార్గంలో నెమ్మదిగా ప్రయాణించాల్సి వస్తోంది.

మాకవరపాలెంలో అవగాహన ర్యాలీ
Local· 20 Aug 2026

మాకవరపాలెంలో అవగాహన ర్యాలీ

AP: అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో ప్రపంచ దోమల దినోత్సవాన్ని ఆరోగ్యశాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలతో నిర్వహించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి సిబ్బంది ర్యాలీ చేపట్టి ప్రజలకు దోమల వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై వివరించారు. వైద్యాధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.

కొత్త మ్యూజికల్ రియాలిటీ షో స్టార్ట్ చేస్తున్న రెహమాన్
Entertainment· 20 Aug 2026

కొత్త మ్యూజికల్ రియాలిటీ షో స్టార్ట్ చేస్తున్న రెహమాన్

ఆస్కార్ అవార్డు విజేత, సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ కొత్తగా ‘తమిళ్ ఐడల్’ అనే మ్యూజికల్ రియాలిటీ షోను స్టార్ట్ చేశారు. ఈ షో ద్వారా కొత్త తమిళ గాయకులకు అవకాశం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రెహ్మాన్ సోనీ విళాతో కలిసి పని చేస్తున్నారు. తమిళ్ ఐడల్ షోకు రెహమాన్ లీడ్‌గా ఉంటారు. “లక్షల మందిని చేరుకునే సంగీతం కోసం వెతకడం కొత్తగా ఉంది. ఈ ప్రయాణం ద్వారా కొత్త ప్రతిభను, కొత్త దృక్కోణాలను, ఎన్నో తరాల నుంచి చెప్పని కథలు బయటికొస్తాయి” అని రెహమాన్ అన్నారు.

ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ
Local· 20 Aug 2026

ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ

TG: నిర్మల్ జిల్లా కౌట్లకే గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో ఎన్నో పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కార్యక్రమం

నర్సంపేటలో హైఅలర్ట్.. ప్రధాన కూడళ్లలో పోలీసులు
Local· 20 Aug 2026

నర్సంపేటలో హైఅలర్ట్.. ప్రధాన కూడళ్లలో పోలీసులు

TG: వరంగల్ జిల్లా నర్సంపేటలో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపు నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా పోలీసులు మూడోరోజూ పట్టణంలో విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు పట్టణంలోని పలు ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి: పొన్నం
Local· 20 Aug 2026

రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి: పొన్నం

TG: మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని రాజీవ్ గాంధీ బలంగా విశ్వసించారని పేర్కొన్నారు. యువత అభివృద్ధికి అనేక అవకాశాలు కల్పించేందుకు ఆయన తీసుకున్న చర్యలను గుర్తు చేశారు. దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యాన్ని పెంచేందుకు రాజీవ్ గాంధీ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.

రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే శంకర్
Local· 20 Aug 2026

రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే శంకర్

TG: రాజీవ్ గాంధీ దేశంలో సాంకేతిక రంగానికి కొత్త దిశ చూపిన నాయకుడని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొనియాడారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని రాజీవ్ కూడలిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో సాంకేతికతకు ప్రాధాన్యం పెంచి, ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని పేర్కొన్నారు.

మాజీ కాంగ్రెస్ ఎంపీ సజ్జన్‌కుమార్ కన్నుమూత
National· 20 Aug 2026

మాజీ కాంగ్రెస్ ఎంపీ సజ్జన్‌కుమార్ కన్నుమూత

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ కాంగ్రెస్ ఎంపీ సజ్జన్‌కుమార్ (80) మరణించారు. తిహార్ జైలులో ఉన్న ఆయన హెల్త్ పాడవడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత 1984 నవంబర్ 1, 2వ తేదీల్లో జరిగిన అల్లర్లలో ఐదుగురి మృతికి ఆయన కారణమైనట్లు కోర్టు తేల్చింది. దిల్లీ హైకోర్టు 2018 డిసెంబర్ 17న సజ్జన్‌కుమార్‌కు జీవిత ఖైదు విధించింది.

గేదెలను తప్పించబోయి గూడ్స్ వాహనం బోల్తా
Local· 20 Aug 2026

గేదెలను తప్పించబోయి గూడ్స్ వాహనం బోల్తా

TG: నల్గొండ జిల్లా మిర్యాలగూడ శివారులో గూడ్స్ వాహనం బోల్తాపడింది. తమిళనాడు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న వాహనం మార్గమధ్యంలో ఒక్కసారిగా గేదెలు రోడ్డుపైకి రావడంతో డ్రైవర్ వాటిని తప్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి రహదారిపై బోల్తా పడింది. డ్రైవర్‌కు ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనలో వాహనం కొంతమేర దెబ్బతింది. రహదారులపై పశువులు అకస్మాత్తుగా రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ జెండాపై నిర్లక్ష్యం.. అధికారులపై చర్యలకు డిమాండ్
Local· 20 Aug 2026

జాతీయ జెండాపై నిర్లక్ష్యం.. అధికారులపై చర్యలకు డిమాండ్

AP: నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో జాతీయ జెండా పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ భీం భారత్ సైనిక్స్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎం.పి.డి.ఓ. కార్యాలయం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు పోలవరపు ఖాజావలి మాట్లాడుతూ.. డేవిస్‌పేట గ్రామ సచివాలయం వద్ద ఆగస్టు 15న ఎగురవేసిన జాతీయ జెండాను నిబంధనల ప్రకారం అదేరోజు సాయంత్రం దించాల్సి ఉన్నప్పటికీ, రెండురోజుల పాటు చీకట్లోనే ఉంచారని ఆరోపించారు. జాతీయ జెండాను గౌరవించడంలో నిర్లక్ష్యం చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

రజినీకాంత్‌ సినిమాలో రామ్‌.. క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్‌!
Entertainment· 20 Aug 2026

రజినీకాంత్‌ సినిమాలో రామ్‌.. క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్‌!

టాలీవుడ్‌ హీరో రామ్‌ పోతినేని మరో క్రేజీ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టారు. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ నటిస్తున్న ‘ధర్మన్‌’ సినిమాలో 'కీ' రోల్‌ చేస్తున్నాడు. అశ్వత్‌ మారిముత్తు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రజినీకాంత్‌తో రామ్‌ తలపడనున్నట్లు తెలుస్తోంది. 2022లో ‘ది వారియర్‌’తో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్‌కు ఇది సెకండ్ తమిళ్ సినిమా. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంపై రామ్‌ ఉత్సాహంగా ఉన్నట్లు మూవీ టీమ్ తెలిపింది. ఈ మూవీని కమల్‌ హాసన్‌ నిర్మిస్తుండగా, సిమ్రాన్‌, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

బీఫ్‌ మాంసం ఎగుమతుల్లో భారత్ రికార్డ్!
International· 20 Aug 2026

బీఫ్‌ మాంసం ఎగుమతుల్లో భారత్ రికార్డ్!

భారత్‌ నుంచి గేదె మాంసం ఎగుమతులు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. 2025-26లో ఇవి 25.6% పెరిగి 5.1 బిలియన్‌ డాలర్లకు చేరగా, 2026-27లో 6 బిలియన్‌ డాలర్లు దాటొచ్చని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వియత్నాం, ఈజిప్ట్, మలేషియా, UAE, రష్యా, ఉజ్బెకిస్తాన్‌ మార్కెట్లకూ వ్యాపారం విస్తరించింది. భారత్‌లో బీఫ్‌ ఎగుమతికి అనుమతి లేదు. పాలివ్వని, వయసు మళ్లిన, సంతానోత్పత్తి లేని గేదెల మాంసాన్నే ఎగుమతి చేస్తారు. పాత గేదెలను అమ్మితే వచ్చే డబ్బుతో రైతులు కొత్తవాటిని కొంటూ పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకుంటున్నారు.