Latest

నాగర్ కర్నూల్ జిల్లాలో SIR డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల
Local· 17 Aug 2026

నాగర్ కర్నూల్ జిల్లాలో SIR డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల

నాగర్‌కర్నూల్ జిల్లాలో SIRలో భాగంగా నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాలకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ విడుదల చేశారు. జిల్లాలో 910 పోలింగ్ కేంద్రాల పరిధిలో 6,18,592 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. డ్రాఫ్ట్ జాబితాపై ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తామని, అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు.

మహిళా క్రికెటర్ శ్రీచరణికి Govt. Job: నారా లోకేష్
AP· 17 Aug 2026

మహిళా క్రికెటర్ శ్రీచరణికి Govt. Job: నారా లోకేష్

AP: భారత మహిళల క్రికెట్ జట్టులో అద్భుతమైన బౌలర్‌గా ఉన్న తెలుగు తేజం శ్రీచరణికి త్వరలో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఆమె డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఏపీ అసెంబ్లీ వర్షా కాల సమావేశాల్లో మెగా డీఎస్సీ, స్పోర్ట్స్ కోటాపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.

దళితుల భూములపై ఆక్రమణల చర్యలు అవసరం
Local· 17 Aug 2026

దళితుల భూములపై ఆక్రమణల చర్యలు అవసరం

AP: పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం పిచికలపాలెం గ్రామంలో దళితులకు కేటాయించిన భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని దళితులు, ప్రజాసంఘాలు పల్నాడు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సర్వే నంబర్ 246/సి పరిధిలో 73 మంది దళితులకు ఒక్కొక్కరికి మూడు సెంట్ల చొప్పున ఇంటి స్థల పట్టాలు మంజూరైనా, పొజిషన్ చూపించలేదని ఆరోపించారు. ఈ భూమిపై ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని ప్లాట్లను లబ్ధిదారులకు అప్పగించాలని కోరారు.

Voter Listలో మీ పేరుందా..ఇలా తెలుసుకోండి!
TG· 17 Aug 2026

Voter Listలో మీ పేరుందా..ఇలా తెలుసుకోండి!

తెలంగాణలో ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా 2.64 కోట్ల మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారు. మరో 57.46 లక్షల మంది ఓటర్లు అందుబాటులో లేకపోవడంతో వారి వివరాలు పెండింగ్‌లో ఉన్నాయి. మీ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో ఈ <a href="https://voters.eci.gov.in/download-eroll?stateCode=S29">లింక్‌</a>పై క్లిక్ చేసి తెలుసుకోండి. ఓటర్ల జాబితాలో మీ పేరు లేకపోతే.. సెప్టెంబర్ 16 వరకు ఫారం-6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.

‘శక్తి’ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలి
Local· 17 Aug 2026

‘శక్తి’ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలి

TG: పాలిటెక్నిక్‌ విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తూ నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోకు బీఆర్‌ఎస్‌ నందిపేట మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్‌ మద్దతు ప్రకటించారు. విద్యార్థులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. మూడు సంవత్సరాలపాటు ప్రత్యేక సాంకేతిక విద్యను చదివే పాలిటెక్నిక్‌ విద్యార్థులను ఐటీఐ విద్యార్థులతో సమానంగా చూసేలా ప్రభుత్వం తీసుకొస్తున్న నిబంధనలు సరికావని అన్నారు. ‘శక్తి’ పథకం రద్దు చేయాలన్నారు.

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వినతి
Local· 17 Aug 2026

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వినతి

AP: కాకినాడ కలెక్టరేట్‌లో నిర్వహించిన PGRS కార్యక్రమంలో SFI విద్యార్థి సంఘం నేతలు జిల్లాలోని విద్యార్థుల సమస్యలను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్‌కు దృష్టికి తీసుకెళ్లారు. శంఖవరంలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను తిరిగి ప్రారంభించాలని అన్నారు. కాకినాడ పి.ఆర్ డిగ్రీ కాలేజ్‌లో బి.బి.ఏ కోర్సును ఈ ఏడాది నుంచి నిలిపివేశారన్నారు. బీబీఏ కోర్సును తిరిగి ప్రారంభించాలన్నారు. విద్యార్థి సంఘాలను హాస్టల్స్‌లోకి వెళ్లకుండా నిషేధిస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకమైన జీవోను రద్దు చెయ్యాలని కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.

Fertilizers App‌లో యూరియా లేక రైతుల ఇబ్బందులు
Agriculture· 17 Aug 2026

Fertilizers App‌లో యూరియా లేక రైతుల ఇబ్బందులు

Fertilizers App‌లో యూరియా అందుబాటులోకి రాగానే రెప్పపాటులో అయిపోతోంది. సమయానికి యూరియా దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులను వేడుకుంటున్నారు. రైతులకు ఉపయోగపడని ఈ Online యూరియా అమ్మకాలు ఎవరి కోసం అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సులభంగా, సమయానికి యూరియా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు.

AIతో చేసిన పుస్తక అనువాదాన్ని గుర్తించడం ఎలా?
Technology· 17 Aug 2026

AIతో చేసిన పుస్తక అనువాదాన్ని గుర్తించడం ఎలా?

ఆన్‌లైన్‌లో విదేశీ పుస్తకం కొనబోతున్నారా? 📚 అయితే కాస్త చెక్ చేయండి! AIతో చేసిన తక్కువ క్వాలిటీ అనువాదాలు, ప్రొఫెషనల్ అనువాదకుల పేరుతో అమ్ముడవుతున్నాయనే హెచ్చరికలు ఉన్నాయి. మరి ఇది నిజమైన అనువాదమో కాదో ఎలా తెలుసుకోవాలి? అనువాదకుడి వివరాలు, అతని గురించి ఆన్‌లైన్‌లో సమాచారం, ప్రచురణకర్త వివరాలు ఓసారి చూడండి. పుస్తకం శాంపిల్ చదివి భాష సహజంగా ఉందో లేదో కూడా చెక్ చేయండి. ఒకే వ్యక్తి చాలా భాషల్లో వరుసగా పుస్తకాలు ఇస్తుంటే.. కాస్త డౌట్ పడాల్సిందే! 👀

మైలవరం భూనిర్వాసితుల నిరాహార దీక్ష
Local· 17 Aug 2026

మైలవరం భూనిర్వాసితుల నిరాహార దీక్ష

AP: ఎన్టీఆర్ జిల్లా మైలవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో చంద్రాల, వెల్వడం, భూ నిర్వాసితులు నిరాహార దీక్ష చేపట్టారు. 2016లో రోడ్డు వైండింగ్‌లో భాగంగా తమ ఇల్లు, స్థలాలు కోల్పోయామని, 11 ఏళ్లుగా నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నమని బాధితులు తెలిపారు. 60 కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి లోకేశ్ గ్రామానికి వచ్చి బాధితుల పరిస్థితిని గమనించాలని కోరారు. సమస్య పరిష్కరించుకుంటే దీక్షను విరమించేది లేదంటూ హెచ్చరించారు.

నర్సాపూర్-యాదగిరిగుట్ట ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభం
Local· 17 Aug 2026

నర్సాపూర్-యాదగిరిగుట్ట ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభం

TG: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల కోసం నర్సాపూర్-యాదగిరిగుట్ట ఆర్టీసీ బస్సు సర్వీసును కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ప్రారంభించారు. నర్సాపూర్-వెల్దుర్తి-తూప్రాన్-గజ్వేల్ మీదుగా యాదగిరిగుట్ట వరకు ఈ బస్సు సర్వీస్ కొనసాగనుంది. భక్తులు, మహిళలు, వృద్ధులకు ఈ బస్సు సర్వీస్ ఉపయోగకరంగా ఉంటుందని రాజిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

రేపు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి
Local· 17 Aug 2026

రేపు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

TG: బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలకు రేపు జోగులాంబ గద్వాలలో ఘనంగా నిర్వహించనున్నారు. జిల్లా గౌడ సంఘం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి. కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా ఉన్న గౌడ సోదరులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు TGSGDCFL చైర్‌పర్సన్ శ్రీమతి సరితా తిరుపతయ్య కోరుతున్నారు.

తెలంగాణలో 60 లక్షల మంది అనామలీస్ ఓటర్లు
TG· 17 Aug 2026

తెలంగాణలో 60 లక్షల మంది అనామలీస్ ఓటర్లు

TG: తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల సంఘం SIR ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. SIR ప్రక్రియలో మొదటి భాగం పూర్తయిందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 78.30 శాతం ఎన్యూమరేషన్ పత్రాలు అందినట్లు తెలిపారు. 2.73 శాతం మంది చనిపోయినవారిగా గుర్తించినట్లు వెల్లడించారు. మరోవైపు సుమారు 60 లక్షల మంది అనామలీస్(గుర్తు తెలియని) ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అలాగే 32 లక్షల మంది ఓటర్లు మ్యాపింగ్ చేసుకోలేదని గుర్తించారు.

Compass లేకుండా దిక్కులు ఎలా గుర్తించేవారు? 🧭
Infotainment· 17 Aug 2026

Compass లేకుండా దిక్కులు ఎలా గుర్తించేవారు? 🧭

Compass, GPS లాంటి సదుపాయాలు లేని రోజుల్లో సముద్రంలో వేల కిలోమీటర్లు ప్రయాణించాలంటే ప్రకృతినే గైడ్‌గా చేసుకోవాల్సి వచ్చేది. పురాతన నావికులు సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టి దిక్కును గుర్తించేవారు. అంతేకాదు, గాలుల దిశ, సముద్రపు అలలు, పక్షుల ప్రయాణం, మేఘాలు, నీటి రంగు వంటి చిన్న చిన్న మార్పులను కూడా గమనించేవారు. ముఖ్యంగా పాలినేషియన్ నావికులు నక్షత్రాల స్థానాలు, సముద్రపు అలల నమూనాలను గుర్తుపెట్టుకుని వేల కిలోమీటర్లు ప్రయాణించినట్లు ఆధారాలు ఉన్నాయి.

పులివెందులలో ఇకపై 40 వార్డులు
Local· 17 Aug 2026

పులివెందులలో ఇకపై 40 వార్డులు

AP: కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీని 40 వార్డులుగా విభజించే ప్రపోజల్‌కు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ &amp; అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ పరిధిలోని కమిషనర్ &amp; డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. 2005 వరకు మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న పులివెందుల అనంతరం గ్రేడ్-3 మున్సిపాలిటీగా మారింది. 2019లో గ్రేడ్-2 మునిసిపాలిటీ అయ్యింది. పులివెందులలో ఇకపై 40 వార్డులు ఉంటాయి.

'ఇట్లు అర్జున'.. పాట విన్నారా?
Entertainment· 17 Aug 2026

'ఇట్లు అర్జున'.. పాట విన్నారా?

మహేష్ ఉప్పాల డైరక్షన్ లో అనీష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఇట్లు అర్జున'. అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'చిన్ని చిన్ని' అనే మెలోడీ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. కొత్త కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను కాపాడుకోవాలి
Local· 17 Aug 2026

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను కాపాడుకోవాలి

TG: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను కాపాడుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని నిరసిస్తూ హనుమకొండ జిల్లా పరకాల బస్టాండ్‌ సెంటర్‌లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి నేతృత్వంలో కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కౌన్సిలర్‌ దుబాసి వెంకటస్వామి, బీఆర్‌ఎస్‌ పరకాల పట్టణ ఉపాధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ కేసీఆర్‌ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఆ పథకాలను నిలిపేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.

స్ట్రీట్ లైట్స్ వెలగక ప్రజల అవస్థలు
Local· 17 Aug 2026

స్ట్రీట్ లైట్స్ వెలగక ప్రజల అవస్థలు

AP: శ్రీకాకుళం జిల్లా మందస మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో స్ట్రీట్ లైట్స్ పనిచెయ్యట్లేదని, రాత్రుల్లో హైస్కూల్ నుంచి కాలేజ్ రోడ్డు జంక్షన్ దారిలో వెళ్లాలంటే విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ పండా ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ సమస్య పరిష్కరించాలంటూ మందస MPDO వెంకటరమణను కోరుతూ విజ్ఞాపనా పత్రం అందజేశారు. పన్నుల డబ్బుతో లేదా ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల్లో కచ్చితంగా వీధి దీపాలను గ్రామ పంచాయతీ ఏర్పాటు చెయ్యాలని కోరారు.

ఆర్టీవో ఆఫీస్‌లో అవస్థలు
Local· 17 Aug 2026

ఆర్టీవో ఆఫీస్‌లో అవస్థలు

TG: జోగులాంబ గద్వాల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఇంటర్నెట్ సర్వర్లు నిలిచిపోవడంతో సేవలు స్తంభించిపోయాయి. గంటల తరబడి టెక్నికల్ సమస్య తలెత్తడంతో కార్యాలయానికి వచ్చిన వాహనదారులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. లైసెన్స్ టెస్టులు, లెర్నింగ్ లైసెన్స్‌ల(LLR) జారీ, వాహనాల రిజిస్ట్రేషన్లు, యాజమాన్య బదిలీ వంటి కీలక ప్రక్రియలన్నీ నిలిచిపోయాయి. ముందుగానే స్లాట్లు బుక్ చేసుకుని సమయానికి వచ్చినవాళ్లు టైం, ఫీజు వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి
AP· 17 Aug 2026

ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి

AP: ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి దక్కింది. రాష్ట్రంలో పచ్చదనం, అటవీ విస్తీర్ణం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రిచ్‌మెంట్(ఏపీ గ్రీన్)’ ఏర్పాటు చేసింది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా ప్రభుత్వం ఆయనను నియమించింది. నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ జీవో జారీ చేసింది. నాగబాబు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.

వరకట్న వేధింపులకు 12 ఏళ్ల జైలు శిక్ష
Current Affairs· 17 Aug 2026

వరకట్న వేధింపులకు 12 ఏళ్ల జైలు శిక్ష

వరకట్న వేధింపులు ఇప్పటికీ సమాజంలో కొనసాగుతుండటంపై ఢిల్లీ కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గర్భిణి అయిన భార్యను వరకట్నం కోసం పొట్టనబెట్టుకున్న కేసులో భర్త, అత్తలకు ఎలాంటి ఉపశమనం ఇవ్వడానికి అడిషనల్ సెషన్స్ జడ్జి ప్రియ మహేంద్ర నిరాకరించారు. ఈ దారుణం వల్ల తల్లితో పాటు కడుపులోని బిడ్డ ప్రాణం కూడా పోయిందని కోర్టు చెప్పింది. ముద్దాయిలకు 12 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. నేరానికి తగిన శిక్ష పడితేనే సమాజంలో ఇతరులకు భయం ఉంటుందని స్పష్టం చేసింది.

కరువు మండలంగా ప్రకటించాలి
Local· 17 Aug 2026

కరువు మండలంగా ప్రకటించాలి

AP: శ్రీకాకుళం జిల్లా మందస మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని మహేంద్ర రైతు సంఘం, చైతన్య రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. తహసీల్దార్‌ బి.శ్రీహరికి వినతిపత్రం అందించారు. రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే 50 శాతం తక్కువ వర్షాలు కురవడంతో వరినారులు, ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. రైతులకు తక్కువ కాలంలో పండే వరి విత్తనాలతో పాటు చోడి, కంది, కొర్రలు, సామలు, అరికెలు, పొద్దుతిరుగుడు వంటి పంటల విత్తనాలను ఉచితంగా అందించాలని కోరారు.