Latest

తెలంగాణలో 60 లక్షల మంది అనామలీస్ ఓటర్లు
TG: తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల సంఘం SIR ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. SIR ప్రక్రియలో మొదటి భాగం పూర్తయిందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 78.30 శాతం ఎన్యూమరేషన్ పత్రాలు అందినట్లు తెలిపారు. 2.73 శాతం మంది చనిపోయినవారిగా గుర్తించినట్లు వెల్లడించారు. మరోవైపు సుమారు 60 లక్షల మంది అనామలీస్(గుర్తు తెలియని) ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అలాగే 32 లక్షల మంది ఓటర్లు మ్యాపింగ్ చేసుకోలేదని గుర్తించారు.

Compass లేకుండా దిక్కులు ఎలా గుర్తించేవారు? 🧭
Compass, GPS లాంటి సదుపాయాలు లేని రోజుల్లో సముద్రంలో వేల కిలోమీటర్లు ప్రయాణించాలంటే ప్రకృతినే గైడ్‌గా చేసుకోవాల్సి వచ్చేది. పురాతన నావికులు సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టి దిక్కును గుర్తించేవారు. అంతేకాదు, గాలుల దిశ, సముద్రపు అలలు, పక్షుల ప్రయాణం, మేఘాలు, నీటి రంగు వంటి చిన్న చిన్న మార్పులను కూడా గమనించేవారు. ముఖ్యంగా పాలినేషియన్ నావికులు నక్షత్రాల స్థానాలు, సముద్రపు అలల నమూనాలను గుర్తుపెట్టుకుని వేల కిలోమీటర్లు ప్రయాణించినట్లు ఆధారాలు ఉన్నాయి.

పులివెందులలో ఇకపై 40 వార్డులు
AP: కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీని 40 వార్డులుగా విభజించే ప్రపోజల్‌కు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ పరిధిలోని కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. 2005 వరకు మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న పులివెందుల అనంతరం గ్రేడ్-3 మున్సిపాలిటీగా మారింది. 2019లో గ్రేడ్-2 మునిసిపాలిటీ అయ్యింది. పులివెందులలో ఇకపై 40 వార్డులు ఉంటాయి.

'ఇట్లు అర్జున'.. పాట విన్నారా?
మహేష్ ఉప్పాల డైరక్షన్ లో అనీష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఇట్లు అర్జున'. అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'చిన్ని చిన్ని' అనే మెలోడీ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. కొత్త కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాపాడుకోవాలి
TG: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాపాడుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని నిరసిస్తూ హనుమకొండ జిల్లా పరకాల బస్టాండ్ సెంటర్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి నేతృత్వంలో కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కౌన్సిలర్ దుబాసి వెంకటస్వామి, బీఆర్‌ఎస్ పరకాల పట్టణ ఉపాధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఆ పథకాలను నిలిపేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.

స్ట్రీట్ లైట్స్ వెలగక ప్రజల అవస్థలు
AP: శ్రీకాకుళం జిల్లా మందస మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో స్ట్రీట్ లైట్స్ పనిచెయ్యట్లేదని, రాత్రుల్లో హైస్కూల్ నుంచి కాలేజ్ రోడ్డు జంక్షన్ దారిలో వెళ్లాలంటే విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ పండా ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ సమస్య పరిష్కరించాలంటూ మందస MPDO వెంకటరమణను కోరుతూ విజ్ఞాపనా పత్రం అందజేశారు. పన్నుల డబ్బుతో లేదా ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల్లో కచ్చితంగా వీధి దీపాలను గ్రామ పంచాయతీ ఏర్పాటు చెయ్యాలని కోరారు.

ఆర్టీవో ఆఫీస్‌లో అవస్థలు
TG: జోగులాంబ గద్వాల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఇంటర్నెట్ సర్వర్లు నిలిచిపోవడంతో సేవలు స్తంభించిపోయాయి. గంటల తరబడి టెక్నికల్ సమస్య తలెత్తడంతో కార్యాలయానికి వచ్చిన వాహనదారులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. లైసెన్స్ టెస్టులు, లెర్నింగ్ లైసెన్స్‌ల(LLR) జారీ, వాహనాల రిజిస్ట్రేషన్లు, యాజమాన్య బదిలీ వంటి కీలక ప్రక్రియలన్నీ నిలిచిపోయాయి. ముందుగానే స్లాట్లు బుక్ చేసుకుని సమయానికి వచ్చినవాళ్లు టైం, ఫీజు వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి
AP: ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి దక్కింది. రాష్ట్రంలో పచ్చదనం, అటవీ విస్తీర్ణం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రిచ్‌మెంట్(ఏపీ గ్రీన్)’ ఏర్పాటు చేసింది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా ప్రభుత్వం ఆయనను నియమించింది. నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ జీవో జారీ చేసింది. నాగబాబు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.

వరకట్న వేధింపులకు 12 ఏళ్ల జైలు శిక్ష
వరకట్న వేధింపులు ఇప్పటికీ సమాజంలో కొనసాగుతుండటంపై ఢిల్లీ కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గర్భిణి అయిన భార్యను వరకట్నం కోసం పొట్టనబెట్టుకున్న కేసులో భర్త, అత్తలకు ఎలాంటి ఉపశమనం ఇవ్వడానికి అడిషనల్ సెషన్స్ జడ్జి ప్రియ మహేంద్ర నిరాకరించారు. ఈ దారుణం వల్ల తల్లితో పాటు కడుపులోని బిడ్డ ప్రాణం కూడా పోయిందని కోర్టు చెప్పింది. ముద్దాయిలకు 12 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. నేరానికి తగిన శిక్ష పడితేనే సమాజంలో ఇతరులకు భయం ఉంటుందని స్పష్టం చేసింది.

కరువు మండలంగా ప్రకటించాలి
AP: శ్రీకాకుళం జిల్లా మందస మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని మహేంద్ర రైతు సంఘం, చైతన్య రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. తహసీల్దార్ బి.శ్రీహరికి వినతిపత్రం అందించారు. రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే 50 శాతం తక్కువ వర్షాలు కురవడంతో వరినారులు, ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. రైతులకు తక్కువ కాలంలో పండే వరి విత్తనాలతో పాటు చోడి, కంది, కొర్రలు, సామలు, అరికెలు, పొద్దుతిరుగుడు వంటి పంటల విత్తనాలను ఉచితంగా అందించాలని కోరారు.

ఏఎన్యూలో ఉచిత బ్యూటీషియన్, మెహందీ శిక్షణ ప్రారంభం
AP: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో సీఎస్‌ఆర్, ఎక్సెల్‌ఆర్ సంయుక్తంగా రూసా 2.0 నిధులతో ఐదు రోజుల ఉచిత బ్యూటీషియన్, మెహందీ డిజైనింగ్ శిక్షణ ప్రారంభమైంది. రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం మాట్లాడుతూ నైపుణ్య శిక్షణ ఉపాధి, స్వయం ఉపాధికి దోహదపడతాయని తెలిపారు. అనంతరం ఆయన్ను సత్కరించారు. కార్యక్రమంలో 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

వీఆర్ఏలకు రెగ్యులర్ పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్
AP: రాష్ట్రంలో వీఆర్ఏలుగా పని చేస్తున్న ఉద్యోగులకు రెగ్యులర్ పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళగిరిలో వీఆర్ఏలు నిరసన దీక్షకు దిగారు. రూ.10,500 జీతంతో కుటుంబాలు గడవడం కష్టంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 2018 నుండి పెరగని జీతాలతోపాటు పెరిగిన పనిభారంతో ఇబ్బందులు పడుతున్నామని వీఆర్ఏలు ఆరోపణలు చేశారు. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ వీఆర్ఏలకు రెగ్యులర్ పే స్కేల్ అమలు చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వారందరినీ ఒకేసారి సెటిల్‌మెంట్ ద్వారా వీఆర్ఏలుగా నియమించాలని డిమాండ్ చేశారు.
కొండగట్టు దగ్గర ఘోర ప్రమాదం.. 20 మందికి తీవ్ర గాయాలు!
జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి, అందులో 5 మంది పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఇక లారీ డ్రైవర్ క్యాబిన్‌లోనే చిక్కుకుపోగా, లోకల్స్ చాలా కష్టపడి బయటకు తీశారు. గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని హాస్పిటల్‌కి తరలించారు.

Gen Zకి పెళ్లిపై ఎందుకు ఇంట్రెస్ట్ తగ్గుతోంది?
“ముందు పెళ్లి.. తర్వాత మిగతావన్నీ” అనే ఆలోచన కంటే.. “ముందు కెరీర్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, మన పీస్” అంటోంది Gen Z! 😌💍 2025లో ఇండియన్ జర్నల్ ఆఫ్ పాజిటివ్ సైకాలజీలో వచ్చిన ఓ స్టడీ.. 100 మంది అవివాహిత మిలీనియల్స్, Gen Z అభిప్రాయాలను పరిశీలించింది. ఇందులో Gen Z సొసైటీ ప్రెజర్ కంటే ఎమోషనల్ రెడీనెస్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేలింది. అంటే పెళ్లిని పూర్తిగా వద్దనడం కంటే.. ముందు లైఫ్‌లో స్థిరపడాలి, తర్వాత పెళ్లి గురించి ఆలోచించాలి అనే ఆలోచన కనిపిస్తోంది.

ఫోన్‌లోనే పర్ఫెక్ట్ పెట్ ఫోటోస్
పెట్స్‌ని పర్ఫెక్ట్‌గా ఫోటోలు తీయడానికి కొన్ని ఈజీ టిప్స్ ఇక్కడ ఉన్నాయి. ఫోన్ కెమెరా సరిపోతుంది. మంచి లైటింగ్ కోసం సాఫ్ట్‌బాక్స్ వాడితే ఇండోర్ ఫోటోస్ నేచురల్‌గా వస్తాయి. మూవింగ్ పెట్స్ బ్లర్ అవ్వకుండా స్పోర్ట్స్ లేదా బర్స్ట్ మోడ్ వాడండి. బ్లర్ బ్యాక్‌గ్రౌండ్ కోసం f/4-f/5.6 అపెర్చర్ లేదా టెలిఫోటో లెన్స్ బెటర్. నిలబడి కాకుండా పెట్ ఐ లెవెల్‌కి తగ్గి తీస్తే ఫోటోలు క్యూట్‌గా వస్తాయి. టాయ్స్, ట్రీట్స్‌తో అటెన్షన్ గ్రాబ్ చేయవచ్చు. పెట్స్ హ్యాబిట్స్ బట్టి ఫోటోస్ ప్లాన్ చేసుకుంటే గ్రేట్ షాట్స్ వస్తాయి.

యాంగ్జైటీ, స్ట్రెస్‌ని ఎలా కంట్రోల్ చేయాలి?
టిబెటన్ బౌద్ధ గురువు మింగ్యూర్ రిన్‌పోచే సూచనలు: జీవితంలో తుఫాన్లు వచ్చినా ఆకాశం మారదు; కష్టాలు కూడా తాత్కాలికమే. భయపడకుండా శ్వాస, శరీర అనుభూతులపై ఫోకస్ చేయాలి. బౌద్ధంలోని మూడు స్తంభాలు—వ్యూ, మెడిటేషన్, అప్లికేషన్—ప్రాక్టీస్ చేయాలి. చిన్న విషయాలకూ కృతజ్ఞత చెప్పాలి. హ్యాపీనెస్‌ను వెంటాడితే అది మరింత దూరమవుతుంది. కోపాన్ని వెంటనే రియాక్ట్ కాకుండా గమనించాలి. ఇతరులకు సాయం చేస్తే ఐస్‌క్రీమ్ లేదా కాఫీ ఇచ్చే ఆనందం కంటే భిన్నమైన, లోతైన సంతోషం లభిస్తుందని ఆయన చెబుతున్నారు

🤖 AIకి తప్పు సమాచారం నేర్పితే? 🤔
AIకి మనుషుల్లా సొంతంగా నిజం, అబద్ధం తెలుసుకునే సామర్థ్యం ఉండదు. దానికి ఇచ్చే డేటా, మనం అందించే సమాచారం దాని సమాధానాలను ప్రభావితం చేస్తాయి. అందులో కావాలనే తప్పుడు సమాచారాన్ని కలిపితే, AI నేర్చుకునే విధానం దెబ్బతినే అవకాశం ఉంది. దీనినే AI Data Poisoning అంటారు. ఉదాహరణకు, ఒక AIకి శిక్షణ ఇచ్చే డేటాలో తప్పు సమాచారాన్ని పెద్ద మొత్తంలో కలిపితే, అది తర్వాత ఇచ్చే సమాధానాల్లో కూడా తప్పులు రావచ్చు. అందుకే AI ఎంత తెలివిగా మారినా, దానికి అందుతున్న సమాచారం నమ్మదగినదేనా అనేది చాలా ముఖ్యం.
తుంగతుర్తిలో BRS భారీ ర్యాలీ!
కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆదేశాలతో తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. నిరుపేద ఆడబిడ్డలకు భరోసానిచ్చే ఈ పథకాలను వెంటనే కొనసాగించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారాన్ని కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శ్రష్టి వర్మ!
డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ రాజకీయాలోకి అడుగుపెట్టారు. సోమవారం హైదరాబాద్‌లోని నాంపల్లి BJP రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ BJP అధ్యక్షుడు రామచందర్ రావు సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. 'ఢీ' షో, 'బిగ్ బాస్' కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రష్టి వర్మ, ఇటీవల 'పుష్ప-2'లోని 'సూసేకి' వంటి హిట్ సాంగ్స్‌కు కొరియోగ్రఫీ చేశారు. ప్రధాని మోదీ విజన్‌కు ఆకర్షితురాలై BJPలో చేరినట్లు తెలుపగా, యువత రాజకీయాలోకి రావడం శుభపరిణామమని రామచందర్ రావు ఆమెను సాదరంగా ఆహ్వానించారు.

వింత వ్యాధులను కనిపెడుతున్న AI
డాక్టర్లకు అర్థంకాని కష్టమైనా, అరుదైన రోగాలను కనిపెట్టడంలో AI ఎంతగానో సహాయపడుతోంది. డాక్టర్లు గుర్తించలేని వ్యాధుల లక్షణాలు, నివేదికలను AI చాట్‌బాట్‌లు త్వరగా విశ్లేషించి సరైన చికిత్సకు దారి చూపుతున్నాయి. మాయో క్లినిక్‌లో గుండెజబ్బుతో బాధపడుతున్న ఓ రోగికి AI సాయంతోనే అరుదైన వ్యాధిని కచ్చితంగా నిర్ధారించారు. అయితే ఏఐ సహాయకారిగా పనిచేస్తుంది కానీ డాక్టర్ల స్థానాన్ని భర్తీ చేయలేదని, కొన్నిసార్లు తప్పులు కూడా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కేరళ ఇకపై 'కేరళం'
కేరళ రాష్ట్రం పేరును 'కేరళం'గా మారుస్తూ పార్లమెంట్ ఆమోదించిన బిల్లుకు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లోక్‌సభ, రాజ్యసభలలో ప్యాస్ అయిన 'కేరళ (పేరు మార్పు) బిల్లు-2026'పై రాష్ట్రపతి సంతకం చేయడంతో ఇది చట్టంగా మారింది. మలయాళంలో పిలిచే 'కేరళం' పేరును అఫీషియల్‌గా మార్చాలని కేరళ అసెంబ్లీ కోరడంతో కేంద్రం రాజ్యాంగంలో మార్పులు చేస్తూ ఈ హిస్టారిక్ బిల్లును అమల్లోకి తెచ్చింది.