Latest

ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎంతంటే!
Business· 10 Aug 2026

ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎంతంటే!

గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు సోమవారం నాటికి కాస్త తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటుపై ₹380 తగ్గడంతో ప్రస్తుతం ₹1,51,970 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారంపై ₹350 తగ్గి ₹1,39,300కి చేరగా, 18 క్యారెట్ల గోల్డ్ రేటు ₹280 తగ్గి ₹1,13,980 వద్ద ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్ ట్రెండ్స్ బట్టి ఈ ప్రైసెస్ మారుతుంటాయి కాబట్టి, నగల షాపింగ్ చేసేముందు ఒకసారి లేటెస్ట్ రేట్స్ రీ-చెక్ చేసుకోవడం మంచిది.

శాంతియుత సమావేశాన్ని అడ్డుకోవడం హక్కుల ఉల్లంఘన
AP· 10 Aug 2026

శాంతియుత సమావేశాన్ని అడ్డుకోవడం హక్కుల ఉల్లంఘన

AP: విశాఖపట్నంలో డేటా సెంటర్ల వ్యతిరేక శాంతియుత సమావేశాన్ని పోలీసులు అడ్డుకోవడం హక్కుల ఉల్లంఘన అని HRF(Human Rights Forum) తెలిపింది. గ్రీన్ విశాఖ సభ్యులు భగత్ సింగ్ విగ్రహం వద్ద డేటా సెంటర్ల పర్యావరణ ప్రభావాలపై శాంతియుతంగా సమావేశమైనప్పుడు పోలీసులు వారిని చెదరగొట్టడం దారుణమని ఓ ప్రకటనలో వివరించారు. తర్లువాడలో భూములు కోల్పోయినవారిని కలవకుండా కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడం, ఆన్‌లైన్ విమర్శలు తొలగించడాన్ని హెచ్‌ఆర్‌ఎఫ్ ఖండిస్తున్నట్టు తెలిపింది.

‘హుషారు పిట్టలు’ ట్రైలర్‌ విడుదల
Cinema· 10 Aug 2026

‘హుషారు పిట్టలు’ ట్రైలర్‌ విడుదల

యూత్‌ఫుల్ కథాంశంతో వస్తోన్న కొత్త చిత్రం ‘హుషారు పిట్టలు’ ట్రైలర్‌ ఇవాళ విడుదలైంది. అన్షు, వాసవి గణేషన్‌ జోడీగా నటిస్తున్న ఈ సినిమాకు బిక్షు డైరెక్టర్. రుద్ర క్రాంతి పిక్చర్స్‌ బ్యానర్‌పై వెంకట్‌ యాదవ్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజవుతోంది. ట్రైలర్‌లో యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలతో పాటు ప్రేమ, స్నేహం, భావోద్వేగాలు, వినోదం వంటి అంశాలకు ప్రిఫరెన్స్ ఇచ్చారు.

హీరో దర్శన్ కేసులో సంచలన నిజాలు
Cinema· 10 Aug 2026

హీరో దర్శన్ కేసులో సంచలన నిజాలు

2024 జూన్‌లో అభిమానిని హత్య చేసిన హీరో దర్శన్ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. రేణుకాస్వామిని బట్టలు విప్పి, కారుకు వేలాడదీసి దారుణంగా కొట్టినట్టు అప్రూవర్‌గా మారిన A-14 (దర్శన్ అనుచరుడు) ప్రదోష్ తెలిపాడు. పవిత్ర గౌడకు మెసేజ్‌లు పంపిన రేణుకాస్వామిని దర్శన్ బూతులు తిడుతూ, తల నుంచి రక్తం వచ్చేలా కొట్టినట్టు వివరించాడు. పవిత్ర గౌడను రప్పించి, ఆమె చేత రేణుకాస్వామిని చెప్పుతో కొట్టించినట్టు చెప్పాడు. స్పృహతప్పి పడిపోయిన రేణుకాస్వామి ఛాతీపై నిలబడి అతణ్ని తొక్కేందుకు ప్రయత్నించినట్టు తెలిపాడు.

‘మహిళలు రేప్‌ని ఇష్టపడతారు’..RSS లీడర్ అరెస్ట్
India· 10 Aug 2026

‘మహిళలు రేప్‌ని ఇష్టపడతారు’..RSS లీడర్ అరెస్ట్

‘మహిళలు రేప్‌ని ఇష్టపడతారు’ అంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన RSS లీడర్ టీజీ మోహన్‌దాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలకు రేప్ అంటే ఇష్టమని, దాన్ని ఎంజాయ్ చేసే అమ్మాయిలూ ఉన్నారంటూ ఆయన కామెంట్ చేశారు. తనకు అధికారం ఉండుంటే ఢిల్లీలోని నిరసనకారులపై కర్ఫ్యూ విధించేవాడినని, మాట వినకపోతే కాల్పులు జరపాలని ఆదేశాలు ఇచ్చేవాడినని ఆయన అన్నారు. ఈ కామెంట్స్ ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా ఉన్నాయని కేరళలో ఆయనపై కేసు నమోదైంది. మట్టంచేరి సమీపంలోని కూవప్పాడమ్‌లో ఇంట్లో నుంచి ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.

PNBలో 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు
Jobs· 10 Aug 2026

PNBలో 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు

పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB)లో 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు <a href="https://ibpsreg.ibps.in/pnbjul26/">ఆన్‌లైన్‌</a>లో అప్లై చేసుకోండి. చివరి తేదీ ఆగస్టు 16. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 4, తెలంగాణలో 41 ఉన్నాయి. డిగ్రీ పూర్తయి, 20-30 సంవత్సరాల వయసున్నవారు అర్హులు. రాష్ట్ర స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్థానిక భాష టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. సాలరీ నెలకు ₹48,480 నుంచి మొదలవుతుంది.

గూగుల్ అసిస్టెంట్‌కి ఫైనల్ గుడ్‌బై? 👋
Technology· 10 Aug 2026

గూగుల్ అసిస్టెంట్‌కి ఫైనల్ గుడ్‌బై? 👋

మన ఫోన్లలో ఇన్నేళ్లుగా ఉన్న గూగుల్ అసిస్టెంట్‌కి ఇక గుడ్‌బై చెప్పాల్సిందేనా? 👀 గూగుల్ తన పాత గూగుల్ అసిస్టెంట్‌ను సెప్టెంబర్ 4, 2026 నుంచి పూర్తిగా తొలగించేందుకు సిద్ధమవుతోంది. దాని స్థానంలో జెమినీని ప్రధాన AI అసిస్టెంట్‌గా తీసుకురానుంది. అంటే వాయిస్ కమాండ్స్, ప్రశ్నలు లాంటి పనుల్లో మనం ఇన్నాళ్లు వాడిన అసిస్టెంట్ స్థానాన్ని ఇప్పుడు మరింత అడ్వాన్స్‌డ్ AI తీసుకోనుంది. గూగుల్ అసిస్టెంట్ నుంచి జెమినీకి ఈ మార్పుతో ఫోన్ అసిస్టెంట్స్ కూడా పూర్తిగా ఏఐ యుగంలోకి వెళ్తున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఫ్యామిలీ హెల్త్ టెస్ట్‌లతో ముందస్తు గుండె జబ్బుల నుంచి రక్షణ
Health· 10 Aug 2026

ఫ్యామిలీ హెల్త్ టెస్ట్‌లతో ముందస్తు గుండె జబ్బుల నుంచి రక్షణ

కుటుంబంలో ఒకరికి ఫ్యామిలియల్ హైపర్‌కొలెస్టరోలెమియా(FH) అనే వ్యాధి ఉన్నట్లు తేలితే, ఆ కుటుంబ సభ్యులందరినీ స్క్రీనింగ్ చేయడం వల్ల ముందస్తు గుండె జబ్బులను నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. FH అనేది జన్యుపరమైన జబ్బు. పుట్టుకతోనే ప్రమాదకర స్థాయిలో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం దీని లక్షణం. దీని గురించి తెలుసుకున్న తర్వాత వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లలను పరీక్షించడం ద్వారా ముందస్తు గుండె జబ్బులను నివారించొచ్చని అంటున్నారు.

66 రోజులైనా దొరకని జ్ఞానేశ్వరి ఆచూకీ
AP· 10 Aug 2026

66 రోజులైనా దొరకని జ్ఞానేశ్వరి ఆచూకీ

AP: కాకినాడ జిల్లా తుని గ్రామీణ మండలం సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి (జానూ) జూన్ 6న మిస్సయ్యింది. తన వెంట వెళ్లిన పెంపుడు కుక్క తిరిగి వచ్చి చనిపోయింది. జ్ఞానేశ్వరి ఆచూకీ మాత్రం దొరకలేదు. మరో కుక్క పిల్లను తెచ్చుకున్న జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు దానికి ‘జాను’ అని పేరుపెట్టారు. తమ కుమార్తెను ఎవరో వెంట తీసుకు వెళ్ళిపోయారని భావిస్తున్న తల్లి భవాని కుమార్తె ఆచూకీ చెప్పాలని వేడుకుంటోంది.

ఏడు గంటల్లో 130 మందిని కరిచిన కుక్క
India· 10 Aug 2026

ఏడు గంటల్లో 130 మందిని కరిచిన కుక్క

మహారాష్ట్రలోని కల్యాణ్‌లో ఓ వీధి కుక్క భయంకరంగా ప్రవర్తించింది. సందీప్ హోటల్ నుంచి ఖడక్‌పాడా వరకు ఏడు గంటల్లో సుమారు 125 నుంచి 130 మందిని కరిచింది. వీళ్లంతా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. రోగుల్లో ఎక్కువ మంది చికన్‌ఘర్, గోద్రేజ్ హిల్, ఆధర్వాడి, రేతి బందర్ ప్రాంతాలకు చెందినవారు. స్థానిక పోలీసులు, కల్యాణ్-డొంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వీధి కుక్కను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.

కీళ్ల ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే!
Health· 10 Aug 2026

కీళ్ల ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే!

కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లు ఒమేగా-3 ఉండే సాల్మన్ చేపలు, పసుపు, బాదం లాంటి గింజలు, పాలకూర, మెంతి వంటి ఆకుకూరలు, అలాగే బెర్రీ పండ్లు తింటే కీళ్ల వాపులు, నొప్పులు తగ్గుతాయని డాక్టర్లు చెబుతున్నారు. వీటితో పాటు రోజూ సరిపడా నీళ్లు తాగడం, వెయిట్ కంట్రోల్‌లో ఉంచుకోవడం, డైలీ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల బోన్స్‌ని స్ట్రాంగ్‌గా ఉంచి, నొప్పుల నుంచి తొందరగా రిలీఫ్ దొరుకుతుందని అంటున్నారు.

రోజూ వాల్‌నట్స్.. ఆరోగ్యానికి మేలు!
Health· 10 Aug 2026

రోజూ వాల్‌నట్స్.. ఆరోగ్యానికి మేలు!

రోజూ వాల్‌నట్స్ తింటే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. వీటిలో గుడ్ ఫ్యాట్స్, ప్రొటీన్స్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తాయి. ఆకలిని కంట్రోల్ చేయడానికి, ఇమ్యూనిటీ పెంచడానికి, ఎముకలను బలంగా ఉంచడానికి రోజుకి 4-5 వాల్‌నట్ ముక్కలను ఓట్స్, పెరుగు లేదా సలాడ్‌లో వేసుకుని తినాలని అంటున్నారు.

నేషనల్ హైవేపై యాక్సిడెంట్
Crime· 9 Aug 2026

నేషనల్ హైవేపై యాక్సిడెంట్

TG: నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలం తుర్కలపల్లి సమీపంలో కోదాడ-జడ్చర్ల నేషనల్ హైవేపై కారు, ట్రాలీ ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇద్దరికి తలకు తీవ్ర గాయాలు కాగా, మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. కల్వకుర్తి వైపు నుంచి తెనాలికి వెళ్తున్న కారు, నిడమనూరు నుంచి పెబ్బేరు వైపు పెళ్లిచూపులకు వెళ్తున్న ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

టోల్‌గేట్ వద్ద తనిఖీలు.. షాకింగ్ ట్విస్ట్
Crime· 9 Aug 2026

టోల్‌గేట్ వద్ద తనిఖీలు.. షాకింగ్ ట్విస్ట్

AP: విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలంలోని దాకమర్రి జొన్నాడ టోల్‌గేట్ వద్ద గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి వస్తున్న ఓ కారులో లిక్విడ్ గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈగల్ టీమ్, భీమిలి పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కారులో లిక్విడ్ గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకులు, ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి కారును సీజ్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఆదివాసీల రక్షణకు ముందుంటాం: కవిత
Politics· 9 Aug 2026

ఆదివాసీల రక్షణకు ముందుంటాం: కవిత

TG ఆదివాసీల కోసం ఏర్పాటు చేసిన ITDAల్లో అటెండర్ నుంచి ఉన్నతాధికారి వరకు ప్రతి ఉద్యోగంలో ఆదివాసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని TRS చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీస్‌లో ఆదివాసీ వీరులకు నివాళులర్పించారు. వారి ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. జనాభా లెక్కల్లో ఆదివాసీల అసలైన కులం పేరుకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల హక్కులు, రక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని కవిత హామీ ఇచ్చారు.

ప్రియాంక కుటుంబానికి చంద్రబాబు భరోసా
AP· 9 Aug 2026

ప్రియాంక కుటుంబానికి చంద్రబాబు భరోసా

AP: రాజమహేంద్రవరం ఘటనలో మెడికో ప్రియాంక<a href="https://www.theclearcutnews.com/n/Bs69Rid"> మృతి</a> చెందడం తీవ్రంగా కలిచివేసిందని CM చంద్రబాబు తెలిపారు. ఆమె మృతికి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రాణం తీసిన వారిపై కఠిన సెక్షన్లతో కేసు నమోదు చేసి శిక్షపడేలా చూడాలని CM సూచించారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు. కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రియాంక సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.

నకిలీ ఐడీలతో 25 పెళ్లిళ్లు
India· 9 Aug 2026

నకిలీ ఐడీలతో 25 పెళ్లిళ్లు

UPలోని BJP MLA అల్లుడు నకిలీ గుర్తింపు కార్డులతో 25మంది మహిళలను వివాహం చేసుకున్న ఘటన కలకలం రేపింది. సేవతా నియోజకవర్గ MLA జ్ఞాన్ తివారీ కుమార్తె ప్రజ్ఞను 2024లో ప్రకార్ త్రివేదితో వివాహం చేశారు. అయితే అతడి అసలు వ్యవహారం సోషల్ మీడియా ద్వారా బయటపడింది. పలు రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లు, నకిలీ IDలతో యువతులను పెళ్లి చేసుకుని, వారి కుటుంబాల నుంచి డబ్బు, నగలతో పరారయ్యేవాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో MLA తన కుమార్తెను ఇంటికి తీసుకువచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకార్‌తోపాటు అతడి తండ్రిని అరెస్ట్ చేశారు.

SIపై అనుచిత ప్రవర్తన.. YCP నేతకు రిమాండ్
Politics· 9 Aug 2026

SIపై అనుచిత ప్రవర్తన.. YCP నేతకు రిమాండ్

AP: మహిళా SIపై అనుచితంగా ప్రవర్తించిన కేసులో YCP నేత చింతాడ రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో అంపోలులోని జిల్లా జైలుకు తరలించారు. శ్రీకాకుళం జిల్లాలో YS జగన్ పర్యటన సందర్భంగా బందోబస్తులో ఉన్న మహిళా SIను చింతాడ రవికుమార్‌తో పాటు పలువురు YCP నేతలు చుట్టుముట్టి విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు తెలిపారు. ఎస్సై ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు.

వింత ఘటన.. మొసలికి పూజలు చేసిన భక్తులు
TG· 9 Aug 2026

వింత ఘటన.. మొసలికి పూజలు చేసిన భక్తులు

TG : జోగులాంబగద్వాల జిల్లాలోని బీచుపల్లి వద్ద కృష్ణా నదిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎగువన జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో వరదనీటిలో ఓ భారీ మొసలి కొట్టుకొచ్చింది. మొసలిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని మొసలిని సురక్షితంగా పట్టుకున్నారు. అయితే అక్కడ ఉన్న భక్తులు మొసలిని వరుణ దేవుని వాహనంగా భావించి పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అధికారులు మొసలిని తిరిగి నదిలో విడిచిపెట్టారు.

వైజాగ్‌లో బన్నీ AAA.. గ్రాండ్ ఓపెనింగ్
Cinema· 9 Aug 2026

వైజాగ్‌లో బన్నీ AAA.. గ్రాండ్ ఓపెనింగ్

AP: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో నిర్మించిన అత్యాధునిక AAA సినిమాస్ విశాఖ ఇనార్బిట్ మాల్‌లో ఘనంగా ప్రారంభమైంది. అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. వైజాగ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న బన్నీ.. తన తొలి సినిమా గంగోత్రి షూటింగ్ సమయంలో ఇక్కడ గడిపిన రోజులను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. నటుడిగా ప్రయాణం ప్రారంభించిన నగరంలో సొంత మల్టీప్లెక్స్‌ను ప్రారంభించడంతో తన కల నిజమైనట్లుగా ఉందన్నారు.

ప్రియాంక ఘటనపై హైటెన్షన్.. విద్యాసంస్థలు బంద్
AP· 9 Aug 2026

ప్రియాంక ఘటనపై హైటెన్షన్.. విద్యాసంస్థలు బంద్

AP: రాజమహేంద్రవరం మెడికో ప్రియాంక ఘటనలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపు రాజమండ్రిలో విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు మాజీ MP మార్గాని భరత్ తెలిపారు. ప్రియాంకను కారు ఢీకొట్టిన ఘటన తర్వాత నిందితులపై కేసు నమోదు విషయంలో పోలీసులు ఆలస్యం చేశారని ఆరోపించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్‌కల్యాణ్, ఇతరులెవరూ పరామర్శించలేదని విమర్శించారు. నిందితులను కాపాడేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు చేశారు. ఆమె కాసేపటి క్రితమే చికిత్స పొందుతూ <a href="https://www.theclearcutnews.com/n/Bs69Rid">మృతి</a> చెందిన విషయం తెలిసిందే.