Latest

చికెన్ తినకుండానే 150 గ్రాముల ప్రోటీన్!
జిమ్, ఫిట్‌నెస్ చేసే వాళ్లకు ప్రోటీన్ చాలా అవసరం, చికెన్ తినకుండా, ప్రోటీన్ పౌడర్లు వాడకుండానే రోజుకి 150 గ్రాముల ప్రోటీన్ నాచురల్‌గా పొందవచ్చని డాక్టర్లు అంటున్నారు. మన డైలీ ఫుడ్‌లోనే 150 గ్రాముల పనీర్, 70 గ్రాముల సోయా చంక్స్, ఒక కప్పు శనగలు, కాస్త రాజ్మా, పెసలు, మసూర్ పప్పు యాడ్ చేసుకోవాలి. దాంతో పాటు 4 గుడ్లు, 4 ఎగ్ వైట్స్, కొద్దిగా ఓట్స్, 350 ml పాలు తీసుకుంటే బాడీకి కావాల్సిన ఫుల్ ప్రోటీన్ నాచురల్‌గానే లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

హ్యామ్ రోడ్ల పనుల్లో వేగం పెంచాలి: కోమటిరెడ్డి
తెలంగాణలో హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులను 2028 ఆగస్టు నాటికి పూర్తి చేయడమే లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అనుమతుల పేరుతో కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురిచేయొద్దని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి నిర్వహించిన సమీక్షలో పలు అంశాలపై చర్చించారు. రూ.5 కోట్ల పనికి రూ.54 కోట్ల జరిమానా విధించడం సరికాదని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి పనులు చేపట్టే చిన్న కాంట్రాక్టర్లపై అధికారులు దౌర్జన్యంగా వ్యవహరించకూడదన్నారు.

వెలిగొండ ప్రాజెక్టుకు ముహూర్తం ఫిక్స్
AP: వెలిగొండ ప్రాజెక్టును ఈ నెలాఖరులో ప్రారంభించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రాజెక్టు పురోగతిపై ఆయన అధికారులతో సమీక్షించారు. కృష్ణా జలాలను విడుదల చేసి నల్లమలసాగర్ జలాశయాన్ని నింపనున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులను వేగవంతం చేశామన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 99శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను నెలాఖరులోపు పూర్తి చేస్తామన్నారు. టన్నెళ్లలో CC లైనింగ్, TBM మిషన్ తొలగింపు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

రన్నింగ్ vs సైక్లింగ్
'రన్నింగ్, సైక్లింగ్ రెండూ హెల్త్‌కి మంచి వ్యాయామాలే, మీ వయస్సు, బరువు, ఫిట్‌నెస్ గోల్స్‌ని బట్టి ఏది బెస్ట్ అనేది డిసైడ్ చేసుకోవాలని' డాక్టర్లు చెప్తున్నారు. సేమ్ టైమ్ వర్కవుట్ చేసినా, సైక్లింగ్ కంటే రన్నింగ్‌లోనే ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. ఎందుకంటే పరుగెత్తేటప్పుడు శరీరంలోని అన్ని మజిల్స్ యాక్టివ్‌గా పనిచేసి, 70 కిలోల బరువున్న వ్యక్తి అర్ధగంట సేపు రన్నింగ్ చేస్తే సుమారు 300 నుంచి 400 కేలరీలు కరుగుతాయి. అదే టైమ్‌లో సైక్లింగ్ చేస్తే కాస్త తక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయని అంటున్నారు.

తెలంగాణ ఇక్కత్ చీరకు జాతీయస్థాయి గుర్తింపు
TG: యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన చేనేత కళాకారుడు గంజి వెంకటేశ్‌కు ప్రతిష్టాత్మక జాతీయ చేనేత పురస్కారం వరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ‘సంత్ కబీర్ హస్తకళా’ పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో ఈ పురస్కారానికి ఎంపికైన ఏకైక కళాకారుడిగా వెంకటేశ్ నిలిచారు. సహజ సిద్ధమైన రంగులను ఉపయోగించి సుమారు 15 నెలలపాటు శ్రమించి రూపొందించిన ఇక్కత్ పట్టుచీర జాతీయ పోటీలో విజేతగా నిలిచింది.

AI టెక్నాలజీతో పన్ను వసూళ్లు: CM రేవంత్‌రెడ్డి
తెలంగాణలో GST ఆదాయాన్ని పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను వినియోగించాలని CM రేవంత్‌రెడ్డి సూచించారు. పన్ను వసూళ్లలో టెక్నాలజీ వినియోగం వ్యాపారులను వేధించేందుకు కాదని, రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచడంతోపాటు సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యమని స్పష్టంచేశారు. HYDలోని ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో GST, ఎక్సైజ్ శాఖల్లో సంస్కరణలపై చర్చించారు. జీఎస్టీ అధికారులకు AI ఆధారిత సమాచారంతో పనిని సులభతరం చేసే వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలిపారు.

బీసీల రుణం తీర్చుకుంటాం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో బీసీల సంక్షేమం, సంరక్షణకు త్వరలో ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు CM చంద్రబాబు ప్రకటించారు. బీసీలు 45 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచారని, కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని అన్నారు. వారి రుణం తీర్చుకుంటామని తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల సమీపంలోని కొత్తపేటలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘నేతన్నల సేవలో’ పథకాన్ని CM ప్రారంభించారు. రాష్ట్రంలోని 71,536 అర్హులైన చేనేత కుటుంబాలకు రూ.25 వేల చొప్పున మొత్తం రూ.179 కోట్లను విడుదల చేశారు.

14 ఇయర్స్ బాలుడి దారుణం.. ఫైరింగ్ తర్వాత సూసైడ్!
షాకింగ్ న్యూస్ థాయిలాండ్‌లోని ఒక స్కూల్‌లో 14 ఏళ్ల స్టూడెంట్ జరిపిన కాల్పుల్లో టీచర్లు, స్టాఫ్‌తో కలిపి ఏడుగురు చనిపోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ అటాక్‌కు ముందే ఆ బాలుడు ఇంట్లో ఉన్న తన తాతయ్య, నానమ్మలను గన్‌తో కాల్చి చంపాడు. ఆ తర్వాత స్కూల్‌కి వచ్చి క్లాస్‌రూమ్‌లో అందరిపైనా విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. చివరకు ఆ బాలుడు కూడా షూట్ చేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. స్కూల్ వల్ల వచ్చిన స్ట్రెస్ వల్లే అతడు ఇలా చేసినట్లు పోలీసులు చెప్తున్నారు.

‘100% ప్యూర్’ లేబులింగ్‌పై FSSAI బ్యాన్‌కు బ్రేక్!
హనీ, నెయ్యి, ఆయిల్స్ ప్యాకెట్లపై '100% ప్యూర్' అని లేబుల్ వేయకూడదంటూ FSSAI ఇచ్చిన ఆర్డర్‌పై డ్యాబర్‌కు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, కంపెనీ వివరణ తీసుకోకుండా FSSAI ఈ నిషేధం విధించడాన్ని కోర్టు తప్పుపట్టింది. దశాబ్దాలుగా మార్కెట్లో అమ్ముతున్న ప్రొడక్ట్స్‌పై హఠాత్తుగా ఆర్డర్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు, FSSAI ఆదేశాలపై తాత్కాలికంగా స్టే విధించి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇంత పొడవు జుట్టు ఎప్పుడైనా చూశారా?
రేణు ధరియాల్ అనే మహిళ ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు ఉన్న మహిళగా 'గిన్నీస్ వరల్డ్ రికార్డ్' సాధించారు. ఆమె జుట్టు పొడవు ఏకంగా 8 feet 10 inches ఉండడం విశేషం. ఇంత పొడవాటి జుట్టును కేర్ తీసుకుంటూ మెయింటెన్ చేసినందుకు ఆమెకు ఈ వరల్డ్ రికార్డ్ లభించింది.

స్కాన్ చేస్తే నేత కార్మికుడి డిటైల్స్!
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో చేనేత ప్రొడక్ట్స్ కోసం కొత్తగా క్యూఆర్ కోడ్ (QR Code) సిస్టమ్‌ను స్టార్ట్ చేశారు. కస్టమర్లు ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి, తాము కొంటున్న బట్టలు ఒరిజినల్ హ్యాండ్‌లూమా కాదా అనేది ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఆ ప్రొడక్ట్‌ను నేసిన చేనేత కళాకారుడి గురించి కూడా తెలుసుకోవచ్చు. చేనేత బట్టల క్వాలిటీని, వాళ్ల కష్టాన్ని అందరికీ తెలియజేయడానికి ఈ కొత్త సిస్టమ్‌ని తీసుకువచ్చారు.

Augustకి ఆ పేరు ఎలా వచ్చింది..?
జనవరి, ఫిబ్రవరి సంగతి పక్కన పెడితే “ఆగస్టు” అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? 🤔పురాతన రోమన్ క్యాలెండర్‌లో ఈ నెలను మొదట “సెక్స్టిలిస్” అని పిలిచేవారు. తర్వాత రోమన్ చక్రవర్తి అగస్టస్ సీజర్ గౌరవార్థం క్రీ.పూ. 8లో ఈ నెలకు “అగస్టస్” అని పేరు మార్చారు. కాలక్రమంలో అదే ఆగస్టుగా మారింది. అంటే మనం ప్రతిసారి ఆగస్టు అని చెప్పేటప్పుడు.. దాదాపు 2,000 ఏళ్ల క్రితం జీవించిన రోమన్ చక్రవర్తి పేరునే ఉపయోగిస్తున్నామన్నమాట! ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జూలై పేరు కూడా రోమన్ లీడర్ జూలియస్ సీజర్ పేరు నుంచే వచ్చింది!

నేషనల్ హ్యాండ్‌లూమ్ డే- మంచు లక్ష్మి పోస్ట్!
నేషనల్ హ్యాండ్‌లూమ్ డే సందర్భంగా నటి <a href="https://x.com/LakshmiManchu/status/2085686705315619115?s=20">మంచు లక్ష్మి</a> సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. భారతీయులకు చేనేత దుస్తులు కేవలం బట్టలు మాత్రమే కాదని, అవి రోజువారీ జీవితంలో, సంస్కృతిలో ఒక భాగమని ఆమె చెప్పారు. చేనేత వస్త్రాలను కలెక్ట్ చేయడం తనకు చాలా ఇష్టమని, ప్రతీ వస్త్రం వెనుక ఒక గొప్ప కళ, సాంప్రదాయం, నేసిన వాళ్ల కథలు ఉంటాయని అన్నారు. చేనేత కళాకారులను, మన సంస్కృతిని గర్వంగా సెలబ్రేట్ చేసుకుందాం అంటూ అందరికీ నేషనల్ హ్యాండ్‌లూమ్ డే విషెస్ చెప్పారు.
ఎక్స్‌ప్రెస్‌వేపై ఆక్సిడెంట్.. గాల్లో ఎగిరిన టెంపో వెహికల్!
ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ఆక్సిడెంట్ జరిగింది. మిస్సింగ్ లింక్ దగ్గర స్పీడ్‌గా వచ్చిన కారు టెంపోను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఆక్సిడెంట్‌లో ఒకరు చనిపోగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఢీకొన్న వేగానికి టెంపో గాల్లోకి ఎగిరి బోల్తా పడగా, కారు నుజ్జునుజ్జయింది. ఆక్సిడెంట్ విజువల్స్ సీసీటీవీలో రికార్డయ్యాయి. రెస్క్యూ టీమ్ గాయపడిన వారిని దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగలేదని పోలీసులు తెలిపారు.

టైర్లలో కోట్ల విలువైన బంగారం!
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో గోల్డ్ స్మగ్లింగ్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. జెద్దా నుంచి వచ్చిన ఒక ప్యాసింజర్ ఎలక్ట్రిక్ స్కూటర్ టైర్ల లోపల సీక్రెట్‌గా దాచిన 869.5 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతని మూవ్‌మెంట్స్‌పై డౌట్ వచ్చి చెక్ చేయగా ఈ షాకింగ్ స్మగ్లింగ్ ప్లాన్ బయటపడింది. ఆ గోల్డ్‌ను సీజ్ చేసిన అధికారులు, ఆ ప్యాసింజర్‌ను కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు.

సికింద్రాబాద్‌లో మ్యూజికల్ ఈవెంట్.. ఫ్రీ ఎంట్రీ!
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లో ‘మిలే సుర్ మేరా తుమ్హారా’ పేరుతో ఒక మ్యూజికల్ నైట్ జరగనుంది. మన దేశ ఐక్యతను, స్వేచ్ఛను చాటిచెప్పేలా ఆగస్టు 15 శనివారం సాయంత్రం 6 గంటలకు చౌరహా ఆడిటోరియంలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సుపర్ణ, శ్రీకర్, సంగీత సిస్టర్స్, శరణ్య బృందాలతో పాటు పలువురు ఆర్టిస్ట్‌లు ఈ ఈవెంట్‌లో పాటలు పాడనున్నారు. ఈ ప్రోగ్రామ్‌కి ఎంట్రీ ఉచితం. ఆసక్తి ఉన్నవారు ప్రొఫైల్ బయొలోని లింక్ ద్వారా ముందే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. <a href="https://events.communitie.in/events/mile-sur-mera-tumhara">link here </a>

“మీరు Batmanనా?”.. రాహుల్ గాంధీ ఫన్నీ రిప్లై వైరల్!
రాహుల్ గాంధీని “మీరు Batmanనా?” అని అడిగితే.. ఆయన ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు వైరల్! Gen Zతో నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్ AMA (Ask Me Anything) సెషన్‌లో ఓ యూజర్ ఈ ఫన్నీ ప్రశ్న అడిగారు. దానికి రాహుల్ “మమ్మల్ని ఇద్దరినీ కలిసి ఎవరూ చూడలేదు.” అంటూ రిప్లై ఇచ్చారు. అంటే “నన్ను, Batmanని ఒకేసారి ఎవరూ చూడలేదు కదా” అనే పాపులర్ జోక్‌ను తనపై వేసుకున్నారు. బ్యాట్‌మ్యాన్ తన అసలు గుర్తింపును రహస్యంగా ఉంచే క్యారెక్టర్. అందుకే “అయితే నేనే బ్యాట్‌మ్యాన్ అయ్యుండొచ్చేమో” అనే అర్థం వచ్చేలా ఆయన ఈ సరదా జోక్ చేశారు.

లీడర్‌గా మారిన స్టూడెంట్!
ప్రశ్నపత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలో అవినీతిపై ఐసా జాతీయ అధ్యక్షురాలు <a href="https://www.theclearcutnews.com/n/o4t6Bsq">నేహా బోరా</a> చేసిన పోరాటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసుల లాఠీ దెబ్బలు, అరెస్టులు ఎదురైనా "మా శరీరాలపై ఉన్న గాయాలే చరిత్రకు సాక్ష్యాలు" అంటూ ఆమె ధైర్యంగా నిలబడ్డారు. టీవీ డిబేట్లలో మీడియా దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ, జైలులో ఉన్న చివరి విద్యార్థి విడుదలయ్యే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. నవతరానికి స్ఫూర్తిగా నిలుస్తూ పాలకుల సింహాసనాలను కదిలించి, నవతరంలో ఒక పవర్‌ఫుల్ లీడర్‌గా నిలిచారు.

వేల మంది ముందరే ఇంక్ దాడి!
ఝార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థుల నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోటీ పరీక్షల అక్రమాలపై అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న AISA జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాపై ఒక వ్యక్తి నల్ల సిరా (Black Ink) చల్లాడు. సుమారు వేయి మందికి పైగా విద్యార్థులతో కలిసి ర్యాలీగా వెళ్తుండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇలాంటి దాడులకు భయపడేది లేదని నేహా స్పష్టం చేయగా, ఇంక్ చల్లిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రోడ్డు పైనే వ్యవసాయం!
మంత్రి సీతక్క నియోజకవర్గంలోని ములుగు జిల్లా, మంగపేట మండలం కొత్తమల్లూరులో రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడంతా బురదగా మారి నడవడమే కష్టంగా మారింది. రోడ్ల అధ్వాన పరిస్థితిపై విసిగిపోయిన ఊరి జనాలు డిఫరెంట్‌గా నిరసన తెలిపారు. ఆ బురద రోడ్డుపైనే వరి నాట్లు వేస్తూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు ప్రాబ్లమ్‌ని వెంటనే సాల్వ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇండియా చైనాతో మళ్లీ దగ్గరవుతోందా..? 👀
భారత్–చైనా మధ్య సంబంధాలు మెరుగవుతున్నాయి.. కానీ బోర్డర్ విషయంలో ఇంకా జాగ్రత్త తప్పదా? న్యూఢిల్లీలో రెండు దేశాల అధికారులు 36వ రౌండ్ సరిహద్దు చర్చలు నిర్వహించారు. సరిహద్దులో శాంతి, స్థిరత్వం కొనసాగితేనే రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత ముందుకు వెళ్తాయని భారత్ స్పష్టం చేసింది. ఈ సమావేశంలో బౌండరీ సమస్యలు, బోర్డర్ మేనేజ్‌మెంట్, రెండు దేశాల మధ్య కోఆర్డినేషన్ వంటి అంశాలపై చర్చించారు. భారత్–చైనా సంబంధాలు మళ్లీ మెరుగవుతున్న సమయంలో బోర్డర్‌లో పరిస్థితిని ప్రశాంతంగా ఉంచడమే ఇప్పుడు కీలకంగా మారింది.