Latest

వీధిలో Gen Z వాయిస్ కానీ చట్టసభల్లో?
దేశ జనాభాలో Gen Z వాటా 26% ఉన్నా, చట్టసభల్లో కేవలం 26 మందే (6 MPs, 20 MLAs) ఉన్నారు. కనీస పోటీ వయసు 25 ఏళ్లు కావడం ఓ కారణమైతే, గెలిచిన వారిలో మెజారిటీ పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారే. అయితే సింగర్ మైథిలీ ఠాకూర్ సహా 12 మంది ఎలాంటి పొలిటికల్ హిస్టరీ లేకుండా అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ నుండి 7, BJP నుండి 5 మంది Gen Z లీడర్స్ ఉన్నారు. 2029 ఎలక్షన్స్ నాటికి బిగ్గెస్ట్ ఓటింగ్ పవర్ కాబోతున్న ఈ యంగ్ జనరేషన్‌కి ప్రాతినిధ్యం పెరగాలి.

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ విడుదల
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రిలీజైంది. ఇందులో సూర్య క్లాసీ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నారు. వెంకీ స్టైల్ మేకింగ్ సూపర్‌గా ఉందని వ్యూవర్స్ అంటున్నారు. అల్లరి పిల్లగా మమితా బైజు డైలాగ్స్ అలరిస్తున్నాయి. రాధిక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈనెల 14న సినిమా విడుదలవుతుంది.

ఇన్వెస్టర్లకు షాక్!
క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. సెన్సెక్స్ 455 పాయింట్లు నష్టపోయి 78,499 వద్ద, నిఫ్టీ 65 పాయింట్లు తగ్గి 24,570 వద్ద క్లోజ్ అయ్యాయి. డాలర్‌తో రూపాయి విలువ 95.20గా ఉంది. బజాజ్ ఫైనాన్స్, ICICI బ్యాంక్ షేర్లు నష్టపోగా.. TCS, SBI షేర్లు లాభపడ్డాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 83 డాలర్లు, బంగారం ఔన్స్ ధర 4300 డాలర్ల పైన ట్రేడవుతోంది.

GHMC ఎన్నికల్లో పొత్తు ఉండదు: రాంచందర్‌రావు
TG: GHMC ఎన్నికల్లో తమ పార్టీకి ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు అన్నారు. ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ పార్టీ నేతల మధ్య గొడవలున్నాయనే వార్తలు వస్తున్నాయని, అవన్నీ ఉట్టి అపోహలే అని చెప్పారు. ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి చేరేందుకు కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. అందరి కృషితో GHMC ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామన్నారు.

హత్య చేసి..శవంతో సెల్ఫీలు దిగారు
మందు తాగొద్దని, పనికి వెళ్లమని హెచ్చరించినందుకు కోయంబత్తూరు జిల్లా సిక్కలంపాళయంలో ఎస్.అశ్విన్(22) అనే కూలీని ఇద్దరు యువకులు హత్య చేశారు. 21 ఏళ్ల మథేష్, మరొక 16 ఏళ్ల యువకుడు కత్తి, కొడవలి, సుత్తితో దాడి చేసి చంపారు. హత్యను వీడియో తీసి, శవంతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నాయి.

ప్రైవేట్ స్కూళ్లకు సర్కార్ వార్నింగ్!
తెలంగాణ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీకి చెక్ పెడుతూ విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ నిర్ణయం తీసుకున్నారు. 2026–27 అకడమిక్ ఇయర్ ఫీజు వివరాలను స్కూల్ నోటీస్ బోర్డు, వెబ్‌సైట్, schooledu.telangana.gov.in పోర్టల్‌లో డిస్‌ప్లే చేయాలని ఆదేశించారు. G.O.Ms.No.1 రూల్ 16, 18 ప్రకారం గవర్నింగ్ బాడీ సైన్ చేసిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయడం తప్పనిసరి. రూల్ 11 ప్రకారం నిబంధనలు వైయోలేట్ చేసే స్కూళ్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చి కఠిన చర్యలు తీసుకుంటారు. దీని అమలును DEO, RJDలు పర్యవేక్షిస్తారు.

భారత్‌లో తొలి మహిళా ‘టాప్ గన్’
భారత వైమానిక దళంలో స్క్వాడ్రన్ లీడర్ భావన కంత్ చరిత్ర సృష్టించారు. కఠినమైన ఫైటర్ కాంబాట్ లీడర్(FCL) కోర్సు క్లియర్ చేసి, ‘టాప్ గన్’ టైటిల్ సాధించిన తొలి భారతీయ మహిళా పైలట్‌గా నిలిచారు. IAF పైలట్లలో కేవలం 1% మంది మాత్రమే దీనికి ఎంపికవుతారు. 2016లో అవని చతుర్వేది, మోహనా సింగ్‌లతో కలిసి భావన మొదటి మహిళా ఫైటర్ పైలట్లుగా మారారు. గ్వాలియర్‌లోని టాక్టిక్స్ అండ్ ఎయిర్ కాంబాట్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో ఎలైట్ కోర్సు పూర్తి చేశారు.
ఫ్లైట్‌లో లాస్ట్ మినిట్‌లో ఎంత పని చేశాడో చూడండి!
కౌలాలంపూర్ నుంచి కొచ్చి వస్తున్న బాటిక్ ఎయిర్ ఫ్లైట్‌లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఫ్లైట్ ల్యాండ్ అయ్యే కొన్ని మినిట్స్ ముందు కేరళకు చెందిన జంషీర్(34) సడెన్‌గా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. అడ్డుకున్న కేబిన్ క్రూని, ప్యాసింజర్స్‌ని బెదిరించాడు. వెంటనే అందరూ కలిసి అతన్ని పట్టుకోవడంతో పెద్ద యాక్సిడెంట్ మిస్ అయింది. ఫ్లైట్ సేఫ్‌గా ల్యాండ్ అయ్యాక CISF టీమ్ అతన్ని అరెస్ట్ చేసి పోలీసులకి అప్పగించారు. అసలు ఎందుకిలా చేశాడో ఇంకా క్లారిటీ లేదని పోలీసులు చెప్పారు.

స్కూటర్ టైర్లలో గోల్డ్.. ఎయిర్ పోర్టులో పట్టివేత!
దిల్లీ IGI ఎయిర్ పోర్టులో కస్టమ్స్ ఆఫీసర్స్ భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి ముంబయి మీదుగా దిల్లీకి వచ్చిన ఓ ప్యాసెంజర్‌ను డౌట్‌తో చెక్ చేశారు. అతడి చెక్‌డ్ బ్యాగేజ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిశీలించగా టైర్లలోని సాలిడ్ కోర్‌లో దాచిన 24 క్యారెట్ల బంగారం బయటపడింది. మొత్తం 19 ముక్కలుగా ఉన్న 869.5 గ్రా. గోల్డ్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇల్లీగల్‌గా బంగారం తీసుకొచ్చినట్లు కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విడాకుల కేసు వెనక్కి తీసుకున్న సీఎం విజయ్ భార్య
తమిళ హీరో, సీఎం జోసెఫ్ విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో వేసిన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. 26 ఏళ్ల తమ వివాహ బంధాన్ని రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరిలో ఆమె ఈ పిటిషన్ వేశారు. ఈ విషయం అటు రాజకీయవర్గాల్లో, ఇటు సినీరంగంలో భారీ చర్చకు దారితీసింది. వ్యక్తిగత కారణాలతో ఆమె విడాకులు కోరినా, త్రిష-విజయ్‌ల సంబంధమే దీనికి కారణమనే చర్చ నడిచింది. అనంతరం విజయ్ సీఎం అయ్యారు. ప్రస్తుతం ఆమె కేసు వెనక్కి తీసుకోవడంతో ఈ వివాదం ముగిసినట్టు తెలుస్తోంది.

రేపు కర్నూలులో అక్షరం లీటరరీ పురస్కార కార్యక్రమం
AP: రేపు(శనివారం) ఉదయం 10 గంటలకు కర్నూలు నగరంలోని సర్వేపల్లి స్కూలులో అక్షరం లీటరరీ పురస్కారం-2026 కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సభ నిర్వహణ జి.వెంకటకృష్ణ, అధ్యక్షత బాధ్యతలు కెంగార మోహన్ నిర్వహిస్తారు. పురస్కారాన్ని కవి, కథకుడు అనిల్ డ్యానీ అందుకుంటారు. కార్యక్రమంలో రచయితలు పలమనేరు బాలాజీ, శ్రీరామ్ పుప్పాల పాల్గొంటారు. రచయిత దివంగత కాశీభట్ల వేణుగోపాల్ కథల్లో మనోవైజ్ఞానిక అంశాల గురించి మారుతి పౌరోహితం మాట్లాడతారు.

అన్ని ప్రైవేట్ ఏజెన్సీలను తొలగించాలి: నేహా బోరా
జార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థులు చేస్తున్న నిరసన కార్యక్రమంలో AISA అధ్యక్షురాలు నేహా బోరా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతి పరీక్ష ప్రభుత్వ సంస్థలే జవాబుదారీతనంతో నిర్వహించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ జరిగినప్పుడు బాధ్యతను కేవలం ప్రైవేట్ ఏజెన్సీలపైనే మోపకూడదన్నారు. ప్రభుత్వ అధికారులను జవాబుదారీగా నిలబెట్టాలన్నారు. అక్రమాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్ని ప్రైవేట్ ఏజెన్సీలను తొలగించాలని డిమాండ్ చేశారు.

థియేటర్లలో 'కొరియన్ కనకరాజు'..
వరుణ్ తేజ్ కొత్త సినిమా ‘కొరియన్ కనకరాజు’ థియేటర్లలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. నిన్న ప్రారంభమైన టికెట్ సేల్స్ గంట గంటకూ పెరుగుతున్నాయి. బుక్ మై షో యాప్‌లో 9.5 పబ్లిక్ రేటింగ్‌తో పాటు ఆన్‌లైన్‌లో 100K కి పైగా టికెట్లు బుక్ అవ్వడం సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారింది. మార్నింగ్ షోల నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఈ వీకెండ్‌లో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పటికే నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రూ.26 కోట్లను రాబట్టింది.

ఎలుకలు కొడుతున్న ఇందిరమ్మ చీరలు!
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని వర్క్‌షాప్ గోదాములో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయకుండా ఎలుకల పాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ మండిపడ్డారు. 2025 నవంబర్ నాటికే రాష్ట్రవ్యాప్తంగా కోటి ఇందిరమ్మ చీరలు పంచుతామని ప్రకటించి, ఇవ్వకుండా గోదాముల్లో పడేసి ఎందుకు వృథా చేస్తున్నారని ప్రశ్నించారు. మహిళలు ఈ చీరలు వద్దంటున్నారా లేక ప్రభుత్వమే పంచడం లేదా అని, అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

హెల్త్ సెంటర్‌లో రోగులు వెయిటింగ్.. సిబ్బంది స్లీపింగ్
TG: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ప్రభుత్వ CHCలో సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొందరు ఉద్యోగులు విధులు నిర్వహించకుండా మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తుండగా, మరికొందరు కార్యాలయంలోనే నిద్రపోతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వైద్యసేవల కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశాకార్యకర్తలు కూడా గ్రామాల్లో సమయపాలన పాటించడం లేదని వాపోతున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆశ్రమ పాఠశాలలో కరెంట్ షాక్‌తో విద్యార్థిని మృతి
AP: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం శివకాశిపురం గిరిజన ఆశ్రమ పాఠశాల గర్ల్స్ హాస్టల్‌లో 8వ తరగతి విద్యార్థిని కరెంట్ షాక్‌తో మృతి చెందింది. చిట్టిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన లక్ష్మీపార్వతి హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. ఉదయం కిటికీపై ఆరేసిన బట్టలు తీస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. హాస్టల్ యాజమాన్యం, పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ బంధువులు, ఆదివాసీ సంఘాలు ఆందోళన చేపట్టారు.

గీత కార్మికుడి హైటెక్ ఐడియా
TG: యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన గీత కార్మికుడు శ్రవణ్ గౌడ్ వినూత్న ఆలోచనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తాను కష్టపడి సేకరించిన కల్లును రాత్రివేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలిస్తుండటంతో తీవ్రంగా నష్టపోయేవాడు. దీంతో దొంగతనాలను అరికట్టేందుకు ఏకంగా తాటిచెట్టుకే సోలార్ CC కెమెరాలు అమర్చాడు. కరెంట్ అవసరం లేకుండా పనిచేసే కెమెరాను కల్లు ముంతలు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేసి, దాని లైవ్ దృశ్యాలను తన మొబైల్‌లో చూసేలా సదుపాయం కల్పించుకున్నాడు. దీంతో దొంగలు అటువైపు రావడం మానేశారు.

నేటి గోల్డ్ రేట్స్ ఇవే!
శుక్రవారం మార్కెట్‌లో బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,49,890కి చేరగా, 22 క్యారెట్ల రేట్ రూ.1,37,400 వద్ద ఉంది. ఇక 18 క్యారెట్ల ధర రూ.1,12,420గా నమోదైంది. గోల్డ్ రేట్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటాయి, కాబట్టి షాపింగ్ ప్లాన్ చేసే ముందు ఈరోజు లైవ్ ప్రైసెస్ ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్!

ఏడు ప్రైవేట్ స్కూల్స్‌కు రూ.లక్ష ఫైన్.. ఎందుకంటే?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో ఫీజు రెగ్యులేషన్స్ పాటించని ఏడు స్కూల్స్‌పై గౌతమ్‌బుద్ధనగర్ జిల్లా అధికారులు యాక్షన్ తీసుకున్నారు. ఒక్కో స్కూల్స్‌కు రూ.లక్ష ఫైన్ వేశారు. ఇందులో అపీజయ్, స్పర్శ్ గ్లోబల్, రామగ్యా, విశ్వభారతి, సెయింట్ జాన్స్, బాల భారతి పబ్లిక్, శ్రీచైతన్య టెక్నో స్కూల్స్ ఉన్నాయి. 2026–27 అకాడమిక్ ఇయర్లో 6 స్కూల్స్ లిమిట్‌కు మించి ఫీజులు పెంచినట్లు అధికారులు గుర్తించారు. బాల భారతి పబ్లిక్ స్కూల్ ఫీజును వసూలు చేయడంతో పాటు, ఫీజు వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టలేదని తెలిపారు.

'జడల్' గా నాని
హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ది ప్యారడైజ్’ టీజర్ గురువారం విడుదలైంది. 'జడల్' అనే పవర్‌ఫుల్ పాత్రలో 'ఈ జాగా ఎవరిది? ఈ దేశం ఎవరిది?' అంటూ నాని గట్టిగా స్లోగన్స్ చేస్తూ, తన ప్రజల్లో చైతన్యాన్ని, ఆవేశాన్ని నింపేలా టీజర్ ఆసక్తికరంగా మొదలైంది. సెప్టెంబర్ 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

మెకేదాటు డ్యామ్ అంశంపై రాజకీయాలు వద్దు: విజయ్
మెకేదాటు డ్యామ్ వివాదంపై అన్ని పార్టీల సమావేశం అవసరం లేదని, ఈ అంశంపై రాజకీయాలు చేయవద్దని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ క్లారిటీ ఇచ్చారు. ప్రధాని మోడీకి లేఖ ద్వారా తమ వైఖరిని తెలిపినట్లు అసెంబ్లీలో చెప్పారు. నదీ జలాలు, మెకేడాటు డ్యామ్ హక్కులపై తమ ప్రభుత్వం రాజీ పడదని వివరించారు. వేరే పార్టీలలాగా గత చరిత్రను లాగి చౌకబారు రాజకీయాలు చేయనని అన్నారు.