Latest

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట ఏబీవీపీ ధర్నా
TG: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు బుధవారం ధర్నా నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బకాయిలను తక్షణమే చెల్లించాలని ఏబీవీపీ నాయకులు కోరారు. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సీనియర్ జర్నలిస్టు సురేందర్‌రెడ్డికి ఘన నివాళి
TG: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన సీనియర్ జర్నలిస్టు తాళ్లపల్లి సురేందర్‌రెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో నర్సంపేట ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నివాళులర్పించారు. నర్సంపేటలోని అమరవీరుల స్తూపం వద్ద సురేందర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జర్నలిజం రంగానికి ఆయన అందించిన సేవలను జర్నలిస్టులు స్మరించుకున్నారు. వృత్తిపట్ల ఆయనకున్న నిబద్ధతను గుర్తుచేసుకున్నారు.

భర్త మరణించాక అత్తను చూడటం కోడలి పని కాదు: హైకోర్టు
భర్త మరణం తర్వాత అత్తను చూసుకోవాల్సిన బాధ్యత కోడలికి లేదని కర్ణాటక హైకోర్టు చెప్పింది. కుటుంబ ఆస్తిని గిఫ్ట్ డీడ్ ద్వారా పొందినా, ఆ పత్రంలో స్పష్టంగా అత్తను పోషించాలని షరతు లేకపోతే, కోడలు అలా చేయాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి సురజ్ గోవిందరాజ్ తీర్పు ఇచ్చారు. హాసన్ జిల్లాకు చెందిన శీలా, ఆమె అత్త నంజమ్మ కేసులో ఈ తీర్పు వచ్చింది. “గిఫ్ట్ డీడ్‌లో స్పష్టమైన షరతు లేకపోతే, ట్రైబ్యునల్ తర్వాతి పరిస్థితుల ఆధారంగా కొత్త బాధ్యతలు సృష్టించలేము” అని జడ్జి తెలిపారు.

‘మర్చిపోలేని గుణపాఠం చెబుతాం’.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్!
నిన్న అమెరికా చేసిన దాడులకు ఇరాన్ రిటర్న్ ఎటాక్‌కు దిగింది. ఇరాక్, జోర్డాన్‌పై ఇరాన్ ఆర్మీ ఫోర్స్ IRGC ఎటాక్స్ చేసినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. కువైట్, బహ్రెయిన్‌లోనూ బ్లాస్ట్స్ జరిగినట్లు పేర్కొంది. సిరిక్ ప్రాంతంలో అమెరికా దాడితో ఓ పెళ్లింట ట్రాజెడీగా మారింది. ఓ చిన్నారి సహా నలుగురు చనిపోగా, 50 మంది గాయపడ్డారు. USకు మర్చిపోలేని గుణపాఠం చెబుతామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. హోర్ముజ్‌లో కమర్షియల్ షిప్స్‌పై ఇరాన్ ఎటాక్‌కు ట్రై చేయడంతోనే తాము ఎటాక్ చేసినట్లు అమెరికా తెలిపింది.
పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
TG: వరంగల్ జిల్లా నర్సంపేటలో పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్‌పర్సన్ పెండి శ్రీలక్ష్మి రామానంద్ హాజరై నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం నూతన కార్యవర్గం సమష్టిగా కృషి చేయాలని ఆమె సూచించారు. పద్మశాలి సంఘ సభ్యుల మధ్య ఐక్యతను బలోపేతం చేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

గురజాలలో ఎల్‌ఐసీ వారోత్సవాలు
AP: పల్నాడు జిల్లా గురజాలలో ఎల్‌ఐసీ 70 ఏళ్లు పూర్తి చేసుకుని 71వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి గురజాల నగర పంచాయతీ కమిషనర్ వై.వి.ఎల్. శివన్నారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రగతిలో ఎల్‌ఐసీ అందిస్తున్న ఆర్థిక సహకారం, పాలసీదారులకు సిబ్బంది, ఏజెంట్లు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అనంతరం కమిషనర్‌ను ఎల్‌ఐసీ సిబ్బంది శాలువాతో సత్కరించారు.

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ ధర్నా
TG: నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో హామీల అమలుపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేటీఆర్ ఆదేశాల మేరకు ఖానాపూర్ ఇన్‌చార్జ్ బుక్య జాన్షన్ నాయక్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌక్ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జాన్షన్ నాయక్ మాట్లాడుతూ.. మహిళలకు నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, వృద్ధులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలు వంటి హామీలు అమలు కాలేదని ఆరోపించారు.

శ్రీకృష్ణదేవరాయగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ గ్లింప్స్!
టాలీవుడ్‌లో మరో భారీ పాన్ ఇండియా పీరియాడిక్ అడ్వెంచర్ మూవీ ‘దేవరాయ’ రెడీ అవుతోంది. 500 ఏళ్ల క్రితం దక్షిణాదిని ఏలిన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల స్టోరీతో ఈ సినిమా వస్తోంది. టైటిల్ రోల్‌లో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కనిపించనున్నాడు. సుదీప్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన <a href="https://www.youtube.com/watch?v=R4Xej28XR5M&list=RDR4Xej28XR5M&start_radio=1">గ్లింప్స్</a> సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ 2027 డిసెంబర్‌లో థియేటర్లలోకి రానుంది.

ప్లాస్టిక్ తో కోట్లు సంపాదిస్తున్నారు!
భారత్‌లో రీసైక్లింగ్ బిజినెస్ రూపురేఖలు వేగంగా మారుతున్నాయి. ముంబైలో జరిగిన రీసైక్లింగ్ షోలో ఎక్స్‌పర్ట్స్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో క్వాలిటీ, మోడ్రన్ టెక్నాలజీయే ఈ రంగానికి కీలకం కానున్నాయని చెప్పారు. గవర్నమెంట్ రూల్స్, మెటీరియల్ రికవరీ పెరుగుతుండటంతో కంపెనీలు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ప్యాకేజింగ్, కార్ల తయారీ వల్ల ప్లాస్టిక్ రీసైక్లింగ్‌కు డిమాండ్ పెరిగింది. అలాగే మెటల్ స్క్రాప్, ఈ-వేస్ట్, బ్యాటరీ రీసైక్లింగ్ రంగాలు పక్కా ప్లానింగ్‌తో ఆర్గనైజ్డ్ సెక్టార్‌గా మారుతున్నాయని తెలిపారు.

ఏడేళ్ల బాలుడి మృతి.. పోషకాహారం లేకే అంటున్న కుటుంబం
మధ్యప్రదేశ్‌లోని ఉమరియా జిల్లా కార్కేలి బ్లాక్‌లోని నర్వార్-25 గ్రామానికి చెందిన సనమ్ బైకా(7) పోషకాహార లోపంతో మరణించాడు. అంగన్‌వాడీ, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని బాలుడి కుటుంబం ఆరోపించింది సనమ్ చాలా బలహీనంగా ఉండేవాడని, నడవడం కూడా కష్టమని తండ్రి అమృత్‌లాల్ చెప్పారు. ‘అంగన్‌వాడీ నుంచి గానీ, ఆరోగ్య శాఖ నుంచి గానీ ఎవరూ రాలేదు. మంచి తిండి కూడా దొరకలేదు’ అని బాలుడి తల్లి వివరించారు. దీనిపై జిల్లా అధికారులు విచారణ చేస్తున్నారు.

నిర్మల్ జిల్లాలో పోలీస్ యాక్ట్
TG: నిర్మల్ జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ జానకీ షర్మిళ తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించరాదని, ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. లౌడ్‌స్పీకర్లు, డీజేల వినియోగంపైనా ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం, విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు, సందేశాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఉపేక్షించబోమన్నారు.

అదనపు కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య
TG: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో అదనపు కట్నం వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరికి చెందిన అఖిల(24)కు ప్రవీణ్‌రెడ్డితో 2022లో వివాహమైంది. రూ.50 వేల అదనపు కట్నం కోసం భర్త, అత్తింటివారు వేధించేవారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయమై తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. రాత్రి కూడా దంపతుల మధ్య వివాదం జరగగా, అఖిల ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సచిన్ టెండూల్కర్ మెచ్చిన Netflix సీరీస్
1999 కార్గిల్ యుద్ధంలో భారత వైమానిక దళం(IAF) ఆపరేషన్ సఫేద్ సాగర్ ఆధారంగా తెరకెక్కిన Netflix ఆరు ఎపిసోడ్ల సీరీస్ ‘Operation Safed Sagar: The Untold Story of the Kargil War’ ఆగస్టు 7న విడుదలైంది. Jimmy Shergill, Siddharth, Abhay Verma ఇందులో నటించారు. ఈ సిరీస్ చూసి సచిన్ టెండూల్కర్ ఎయిర్ ఫోర్స్ సైనికుల ధైర్యం, క్రమశిక్షణ, మానసిక బలాన్ని ప్రశంసిస్తూ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ పెట్టారు. ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవాతో తన పాత పరిచయాన్ని గుర్తు చేసుకుని, సైనికుల త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు.
నర్సంపేటలో బీఆర్‌ఎస్ శ్రేణుల నిరసన
TG: వరంగల్ జిల్లా నర్సంపేటలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ రోడ్డు జంక్షన్‌లోని అమరవీరుల స్తూపం వద్ద చేపట్టిన ఈ ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని విమర్శించారు.

ఐటీడీఏ ఎదుట గ్రామస్తుల ధర్నా
AP: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఏఆర్ పురం మండలం వడ్డిగూడెం గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. పోలవరం పునరావాసంలో భాగంగా తమ గ్రామానికి తూర్పుగోదావరి జిల్లా గోకవరం సమీపంలోని కొత్తపల్లిని కేటాయించారని గ్రామస్తులు తెలిపారు. అయితే కొత్తపల్లి తమకు అనుకూలంగా లేదని, అక్కడికి తరలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. సమీప గ్రామాల బంధువులకు ఏలూరు జిల్లా తాడువాయి, కొయ్యలగూడెం ప్రాంతాల్లో పునరావాసం కల్పించారని, తమను కూడా అదే ప్రాంతాల్లో పునరావాసం కల్పించాలని కోరారు.

రామ మందిర్‌కు ఫస్ట్ CEO ఎవరు? నేడు ఫైనల్ డెసిషన్!
అయోధ్య రామ మందిర్ ట్రస్ట్‌కు ఫస్ట్ CEO సెలెక్షన్‌పై ఈరోజు క్లారిటీ రానుంది. 5,500కుపైగా అప్లికేషన్లు రావడంతో చివరకు ముగ్గురు పేర్లు ఫైనల్ రేసులో నిలిచాయి. ఉత్తరప్రదేశ్ మాజీ IPS ఆఫీసర్, ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్’గా పేరున్న రాజేశ్ పాండే, మాజీ అయోధ్య DM యోగేశ్వర్ రామ్ మిశ్రా, మాజీ బిహార్ DGP పరేష్ సక్సేనా ఈ రేసులో ఉన్నారు. వీరిలో ఒకరిని ట్రస్ట్ CEOగా సెలెక్ట్ చేయనుంది. CEOగా ఆలయ అడ్మినిస్ట్రేషన్, భక్తుల రద్దీ, సెక్యూరిటీ, ప్రభుత్వ శాఖలతో కోఆర్డినేషన్ వంటి మేజర్ రెస్పాన్సిబిలిటీస్ చూడాల్సి ఉంటుంది.
గురజాలలో జనసేన భారీ ర్యాలీ
AP: పల్నాడు జిల్లా గురజాలలో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన శ్రేణులు ఘనంగా నిర్వహించారు. దాచేపల్లి జనసేన పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా బయలుదేరి గురజాలకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎల్‌ఈడీ స్క్రీన్‌పై పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన వీడియోలు, ఆయన కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.

Air Marshal వివేక్ హాండేకు కీలక బాధ్యతలు
Air Marshal వివేక్ హాండే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు పర్మనెంట్ సెకండ్‌మెంట్‌పై డైరెక్టర్ జనరల్ మెడికల్ సర్వీసెస్(ఎయిర్)గా బాధ్యతలు తీసుకున్నారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్(AFMC) పూణే, టాటా మెమోరియల్ హాస్పిటల్ ముంబై, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ న్యూఢిల్లీలో చదువుకున్న ఆయన 1988 డిసెంబర్‌లో ఆర్మీలో చేరారు. జాతీయ స్థాయి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌గా గుర్తింపు పొంది, తన కెరీర్‌లో అనేక స్పెషలిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ పదవులు చేపట్టారు.

ధోనీ ₹100 కోట్ల కేసులో బిగ్ ట్విస్ట్!
MS ధోనీ కేసులో న్యూ అప్‌డేట్. 2013 IPL బెట్టింగ్ స్కామ్‌లో తన పేరు లింక్ చేశారని ధోనీ 2014లో మాజీ IPS ఆఫీసర్ సంపత్ కుమార్, జీ మీడియా మరియు సుధీర్ చౌదరిలపై ₹100 కోట్ల డిఫమేషన్ సూట్ వేశారు. అయితే ధోనీ స్టేట్‌మెంట్‌ను ప్రైవేట్ హోటల్‌లో కాకుండా కోర్టు లేదా గవర్నమెంట్ బిల్డింగ్‌లోనే వీడియో రికార్డ్ చేయాలని సంపత్ కుమార్ మద్రాస్ హైకోర్టును కోరారు. మంగళవారం జస్టిస్ గోవిందరాజన్ తిలకవతి ఈ అప్లికేషన్‌ను విచారణకు స్వీకరించారు.

బైక్‌పై వెళ్తుండగా ఊహించని ప్రమాదం
TG: వరంగల్ జిల్లా నెక్కొండలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మహిళ చీరకొంగు వెనుక టైర్‌లో ఇరుక్కోవడంతో ప్రమాదం జరిగింది. దంపతులు టీవీఎస్ పై వెళ్తుండగా మహిళ చీరకొంగు టైర్‌కు చుట్టుకుంది. దీంతో వాహనదారుడు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వాహనం అదుపుతప్పి కింద పడింది. ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే మహిళలు చీరకొంగు టైర్‌కు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

బీఎస్పీ మహిళా మండల అధ్యక్షురాలిగా శారద రాథోడ్
TG: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో బహుజన సమాజ్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలిగా శారద రాథోడ్ నియమితులయ్యారు. బీఎస్పీ నారాయణఖేడ్ అధ్యక్షుడు అనుముల తుకారాం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు బోర్గి భీమన్న శారద రాథోడ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తుకారాం మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానం, మాన్యవర్ కాన్షీరాం చూపిన మార్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.