Latest

ఏడేళ్ల బాలుడి మృతి.. పోషకాహారం లేకే అంటున్న కుటుంబం
Current Affairs· 3d ago

ఏడేళ్ల బాలుడి మృతి.. పోషకాహారం లేకే అంటున్న కుటుంబం

మధ్యప్రదేశ్‌లోని ఉమరియా జిల్లా కార్కేలి బ్లాక్‌లోని నర్వార్-25 గ్రామానికి చెందిన సనమ్ బైకా(7) పోషకాహార లోపంతో మరణించాడు. అంగన్‌వాడీ, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని బాలుడి కుటుంబం ఆరోపించింది సనమ్ చాలా బలహీనంగా ఉండేవాడని, నడవడం కూడా కష్టమని తండ్రి అమృత్‌లాల్ చెప్పారు. ‘అంగన్‌వాడీ నుంచి గానీ, ఆరోగ్య శాఖ నుంచి గానీ ఎవరూ రాలేదు. మంచి తిండి కూడా దొరకలేదు’ అని బాలుడి తల్లి వివరించారు. దీనిపై జిల్లా అధికారులు విచారణ చేస్తున్నారు.

నిర్మల్ జిల్లాలో పోలీస్ యాక్ట్
Local· 3d ago

నిర్మల్ జిల్లాలో పోలీస్ యాక్ట్

TG: నిర్మల్ జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ జానకీ షర్మిళ తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించరాదని, ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. లౌడ్‌స్పీకర్లు, డీజేల వినియోగంపైనా ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం, విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు, సందేశాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఉపేక్షించబోమన్నారు.

అదనపు కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య
Local· 3d ago

అదనపు కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య

TG: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో అదనపు కట్నం వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరికి చెందిన అఖిల(24)కు ప్రవీణ్‌రెడ్డితో 2022లో వివాహమైంది. రూ.50 వేల అదనపు కట్నం కోసం భర్త, అత్తింటివారు వేధించేవారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయమై తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. రాత్రి కూడా దంపతుల మధ్య వివాదం జరగగా, అఖిల ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సచిన్ టెండూల్కర్ మెచ్చిన  Netflix సీరీస్
Entertainment· 3d ago

సచిన్ టెండూల్కర్ మెచ్చిన Netflix సీరీస్

1999 కార్గిల్ యుద్ధంలో భారత వైమానిక దళం(IAF) ఆపరేషన్ సఫేద్ సాగర్‌ ఆధారంగా తెరకెక్కిన Netflix ఆరు ఎపిసోడ్ల సీరీస్ ‘Operation Safed Sagar: The Untold Story of the Kargil War’ ఆగస్టు 7న విడుదలైంది. Jimmy Shergill, Siddharth, Abhay Verma ఇందులో నటించారు. ఈ సిరీస్ చూసి సచిన్ టెండూల్కర్ ఎయిర్ ఫోర్స్ సైనికుల ధైర్యం, క్రమశిక్షణ, మానసిక బలాన్ని ప్రశంసిస్తూ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ పెట్టారు. ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవాతో తన పాత పరిచయాన్ని గుర్తు చేసుకుని, సైనికుల త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు.

నర్సంపేటలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల నిరసన
Local· 3d ago

నర్సంపేటలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల నిరసన

TG: వరంగల్ జిల్లా నర్సంపేటలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ రోడ్డు జంక్షన్‌లోని అమరవీరుల స్తూపం వద్ద చేపట్టిన ఈ ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని విమర్శించారు.

ఐటీడీఏ ఎదుట గ్రామస్తుల ధర్నా
Local· 3d ago

ఐటీడీఏ ఎదుట గ్రామస్తుల ధర్నా

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఏఆర్ పురం మండలం వడ్డిగూడెం గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. పోలవరం పునరావాసంలో భాగంగా తమ గ్రామానికి తూర్పుగోదావరి జిల్లా గోకవరం సమీపంలోని కొత్తపల్లిని కేటాయించారని గ్రామస్తులు తెలిపారు. అయితే కొత్తపల్లి తమకు అనుకూలంగా లేదని, అక్కడికి తరలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. సమీప గ్రామాల బంధువులకు ఏలూరు జిల్లా తాడువాయి, కొయ్యలగూడెం ప్రాంతాల్లో పునరావాసం కల్పించారని, తమను కూడా అదే ప్రాంతాల్లో పునరావాసం కల్పించాలని కోరారు.

రామ మందిర్‌కు ఫస్ట్ CEO ఎవరు? నేడు ఫైనల్ డెసిషన్!
National· 3d ago

రామ మందిర్‌కు ఫస్ట్ CEO ఎవరు? నేడు ఫైనల్ డెసిషన్!

అయోధ్య రామ మందిర్‌ ట్రస్ట్‌కు ఫస్ట్ CEO సెలెక్షన్‌పై ఈరోజు క్లారిటీ రానుంది. 5,500కుపైగా అప్లికేషన్లు రావడంతో చివరకు ముగ్గురు పేర్లు ఫైనల్ రేసులో నిలిచాయి. ఉత్తరప్రదేశ్ మాజీ IPS ఆఫీసర్, ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్’గా పేరున్న రాజేశ్ పాండే, మాజీ అయోధ్య DM యోగేశ్వర్ రామ్ మిశ్రా, మాజీ బిహార్ DGP పరేష్ సక్సేనా ఈ రేసులో ఉన్నారు. వీరిలో ఒకరిని ట్రస్ట్ CEOగా సెలెక్ట్ చేయనుంది. CEOగా ఆలయ అడ్మినిస్ట్రేషన్, భక్తుల రద్దీ, సెక్యూరిటీ, ప్రభుత్వ శాఖలతో కోఆర్డినేషన్ వంటి మేజర్ రెస్పాన్సిబిలిటీస్ చూడాల్సి ఉంటుంది.

గురజాలలో జనసేన భారీ ర్యాలీ
Local· 3d ago

గురజాలలో జనసేన భారీ ర్యాలీ

AP: పల్నాడు జిల్లా గురజాలలో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన శ్రేణులు ఘనంగా నిర్వహించారు. దాచేపల్లి జనసేన పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా బయలుదేరి గురజాలకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎల్‌ఈడీ స్క్రీన్‌పై పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన వీడియోలు, ఆయన కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.

Air Marshal వివేక్ హాండేకు కీలక బాధ్యతలు
National· 3d ago

Air Marshal వివేక్ హాండేకు కీలక బాధ్యతలు

Air Marshal వివేక్ హాండే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు పర్మనెంట్ సెకండ్‌మెంట్‌పై డైరెక్టర్ జనరల్ మెడికల్ సర్వీసెస్(ఎయిర్)గా బాధ్యతలు తీసుకున్నారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్(AFMC) పూణే, టాటా మెమోరియల్ హాస్పిటల్ ముంబై, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ న్యూఢిల్లీలో చదువుకున్న ఆయన 1988 డిసెంబర్‌లో ఆర్మీలో చేరారు. జాతీయ స్థాయి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌గా గుర్తింపు పొంది, తన కెరీర్‌లో అనేక స్పెషలిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ పదవులు చేపట్టారు.

ధోనీ ₹100 కోట్ల కేసులో బిగ్ ట్విస్ట్!
Sports· 3d ago

ధోనీ ₹100 కోట్ల కేసులో బిగ్ ట్విస్ట్!

MS ధోనీ కేసులో న్యూ అప్‌డేట్. 2013 IPL బెట్టింగ్ స్కామ్‌లో తన పేరు లింక్ చేశారని ధోనీ 2014లో మాజీ IPS ఆఫీసర్ సంపత్ కుమార్, జీ మీడియా మరియు సుధీర్ చౌదరిలపై ₹100 కోట్ల డిఫమేషన్ సూట్ వేశారు. అయితే ధోనీ స్టేట్‌మెంట్‌ను ప్రైవేట్ హోటల్‌లో కాకుండా కోర్టు లేదా గవర్నమెంట్ బిల్డింగ్‌లోనే వీడియో రికార్డ్ చేయాలని సంపత్ కుమార్ మద్రాస్ హైకోర్టును కోరారు. మంగళవారం జస్టిస్ గోవిందరాజన్ తిలకవతి ఈ అప్లికేషన్‌ను విచారణకు స్వీకరించారు.

బైక్‌పై వెళ్తుండగా ఊహించని ప్రమాదం
Local· 3d ago

బైక్‌పై వెళ్తుండగా ఊహించని ప్రమాదం

TG: వరంగల్ జిల్లా నెక్కొండలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మహిళ చీరకొంగు వెనుక టైర్‌లో ఇరుక్కోవడంతో ప్రమాదం జరిగింది. దంపతులు టీవీఎస్ పై వెళ్తుండగా మహిళ చీరకొంగు టైర్‌కు చుట్టుకుంది. దీంతో వాహనదారుడు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వాహనం అదుపుతప్పి కింద పడింది. ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే మహిళలు చీరకొంగు టైర్‌కు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

బీఎస్పీ మహిళా మండల అధ్యక్షురాలిగా శారద రాథోడ్
Local· 3d ago

బీఎస్పీ మహిళా మండల అధ్యక్షురాలిగా శారద రాథోడ్

TG: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో బహుజన సమాజ్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలిగా శారద రాథోడ్ నియమితులయ్యారు. బీఎస్పీ నారాయణఖేడ్ అధ్యక్షుడు అనుముల తుకారాం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు బోర్గి భీమన్న శారద రాథోడ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తుకారాం మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానం, మాన్యవర్ కాన్షీరాం చూపిన మార్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఆగస్టులో రికార్డు స్థాయి UPI Transcastions
Current Affairs· 3d ago

ఆగస్టులో రికార్డు స్థాయి UPI Transcastions

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసిన లెక్కల ప్రకారం, ఆగస్టులో మొత్తం 24.51 బిలియన్(2,451 కోట్ల) UPI Transcastions జరిగాయి. ఇదే ఇప్పటివరకు అతి పెద్ద సంఖ్య. వీటి విలువ ₹29,82,000 కోట్లు. గత నెలతో పోలిస్తే Transcastions 3.6 శాతం పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 22 శాతం పెరిగాయి. రోజుకు సగటున 79 కోట్ల 10 లక్షల లావాదేవీలు జరిగాయి.

దాచేపల్లిలో డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకలు
Local· 3d ago

దాచేపల్లిలో డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకలు

AP: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. తొలుత స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన మ్యాజిక్ డ్రైనేజీని ప్రారంభించారు. ఆ తర్వాత స్థానిక జనసేన పార్టీ కార్యాలయం ఎదుట కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. నేటి తరం యువతకు పవన్ కళ్యాణ్ ఆదర్శంగా నిలిచారని అన్నారు. ప్రజల కోసం ఆయన చేస్తున్న మంచి పనులను వివరించారు.

మమతా బెనర్జీ మేనకోడలు ఆత్మహత్య!
Current Affairs· 3d ago

మమతా బెనర్జీ మేనకోడలు ఆత్మహత్య!

Ex CM మమతా బెనర్జీ మేనకోడలు (కజిన్ బ్రదర్ నిహార్ ముఖర్జీ కూతురు) బృష్టి ముఖర్జీ(28) ఆత్మహత్య చేసుకున్నారు. రాంపూర్ హాట్‌లోని నివాసంలో మంగళవారం మధ్యాహ్నం ఆమె ఉరి వేసుకోగా, హాస్పిటల్‌కి తీసుకెళ్ళేసరికే చనిపోయినట్లు డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. మమతా హయాంలో జరిగిన టీచర్ నియామకాలను కోర్టు రద్దు చేయడంతో ఉద్యోగం పోవడం, మరోవైపు భర్తతో డివోర్స్ కేసు నడుస్తుండటంతో ఆమె డిప్రెషన్‌లో ఉన్నట్లు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపిన పోలీసులు కేస్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.

రేవంత్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జిషీట్
TG· 3d ago

రేవంత్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జిషీట్

TG: రేవంత్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జిషీట్ విడుదల చేసింది. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ పాలనలో ఏ వర్గమూ సుఖంగా లేదని అన్నారు. ఇది వెయ్యి రోజుల పాలన కాదని, ప్రజాపీడన అని విమర్శించారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలు అరాచకాలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలు దందాలకు పాల్పడుతూ రాజధానిని ఏటీఎంగా మార్చుకున్నారని ఆరోపించారు. నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరదల్లోనూ కూలని ఇల్లు..కారణం ఏంటి?
Current Affairs· 3d ago

వరదల్లోనూ కూలని ఇల్లు..కారణం ఏంటి?

నేపాల్‌లోని నువాకోట్ జిల్లా వరదల్లో చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి. 40 ఏళ్ల నాటి మింట్-గ్రీన్ రంగు ఇల్లు చెక్కుచెదకుండా ఉంది. ఇంటి లోపల ఆరుగురు పైఅంతస్తులోకి ప్రాణాలు దక్కించుకున్నారు. వారిలో ఒకరైన లక్ష్మీపాండే మీడియాతో మాట్లాడుతూ తను రోజూ హనుమాన్ చాలీసా చదువుతానని, వరద సమయంలో “ఓం నమః శివాయ” జపం చేస్తూ ఉన్నానని చెప్పారు. అదే తమను కాపాడిందని భావిస్తున్నామన్నారు. అయితే బలమైన పునాది ఉండటం, ఫౌండేషన్‌ను బలపరిచారని నిపుణులు అంటున్నారు. Reinforced కాంక్రీట్ ఫ్రేమ్ వల్లే ఇల్లు సురక్షితంగా ఉందని అంటున్నారు.

డీజే సౌండ్‌కి 16 ఏళ్ల బాలుడు బలి
Current Affairs· 3d ago

డీజే సౌండ్‌కి 16 ఏళ్ల బాలుడు బలి

నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లిలో తీవ్ర విషాదం జరిగింది. ఆదివారం రోజు గొల్ల మల్లప్ప కూతురి వివాహం జరగ్గా, సోమవారం రాత్రి డీజే బ్యాండ్ నిర్వహించారు. ఈ వేడుకలో డ్యాన్స్ చేస్తూ రవితేజ (16) అనే బాలుడు డీజే సౌండ్ తట్టుకోలేక గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని కోస్గి హాస్పిటల్‌కి తరలించగా, అప్పటికే బాలుడు చనిపోయాడని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. ఈ ఇన్సిడెంట్ పై ఇప్పటివరకు ఎలాంటి కంప్లైంట్ అందలేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.

సాంస్కృతిక సారథి AOగా విజయలక్ష్మి
Local· 3d ago

సాంస్కృతిక సారథి AOగా విజయలక్ష్మి

TG: తెలంగాణ సాంస్కృతిక సారథి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన విజయ్ కుమార్ గత కొంతకాలంగా తెలంగాణ సాంస్కృతిక సారథిలో విధులు నిర్వహించగా, ఆయన భాషా సాంస్కృతిక శాఖకు బదిలీ అయ్యారు. దీంతో ఆయన స్థానంలో విజయలక్ష్మిని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా నియమించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ జీ.వీ. వెన్నెల గద్దర్ పూల బొకేతో విజయలక్ష్మికి స్వాగతం పలికారు.

రాజాంలో పవన్ కళ్యాణ్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్
Local· 3d ago

రాజాంలో పవన్ కళ్యాణ్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్

AP: విజయనగరం జిల్లా రాజాంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా GMR కేర్ సెంటర్ నుంచి చీపురుపల్లి రోడ్డు వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఓ కళ్యాణ మండపంలో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం LED స్క్రీన్‌పై పవన్ కళ్యాణ్ సందేశాన్ని వీక్షించారు. అభిమానులు, జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

నేపాల్ వరద బాధితులకు సోనూసూద్ సాయం
National· 3d ago

నేపాల్ వరద బాధితులకు సోనూసూద్ సాయం

నేపాల్ వరద బాధితులకు సాయం చేసేందుకు నటుడు సోనూసూద్ తన టీంతో కలిసి కాఠ్మాండుకు చేరుకున్నారు. బాధితులకు నిత్యావసర వస్తువులు అందించేందుకు వచ్చినట్లు తెలిపారు. భారత్ నుంచి నేపాల్‌కు సహాయం పంపడం రిస్క్‌తో కూడుకున్నప్పటికీ, బాధితుల అవసరాలను తెలుసుకుని సాయం అందిస్తామని చెప్పారు. వారి జీవితాలను తిరిగి నిర్మించుకునేందుకు హెల్ప్ చేయడం మనందరి బాధ్యత అని వివరించారు.