Latest

వారానికి రెండుసార్లు తాగితే చాలు!
లైఫ్‌స్టైల్ మారడం, శారీరక కష్టం తగ్గడం వల్ల చాలామంది నడుము, కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి నల్ల మినప జావ (ఉద్ది కంజి) బాగా పనిచేస్తుంది. పొట్టు తీయని నల్ల మినుముల్లోని ఐరన్, క్యాల్షియం, ప్రోటీన్ ఫైబర్ ఎముకలకు బలాన్ని ఇస్తాయి. ఈ జావను వారానికి రెండుసార్లు తాగడం వల్ల శరీర నొప్పుల నుంచి రిలీఫ్ రావడమే కాకుండా, మహిళల్లో నెలసరి ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. బరువు తగ్గి, పాతకాలపు బలాన్ని పొందడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది.

రాజధానిలో 123 అడుగుల కార్తికేయ విగ్రహం.. త్వరలో ప్రారంభం
AP: రాజధాని అమరావతి దగ్గర్లోని నవులూరులో 123 అడుగుల ఎత్తైన భారీ కార్తికేయ స్వామి విగ్రహ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి గుడికి 2 కి.మీ. విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్‌కు 11 కి.మీ దూరంలో ఈ ప్రాజెక్టు కన్‌స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయి. స్థానికులు, దాతల సహకారంతో నిర్మిస్తున్న ఈ ప్రాంగణంలో నాలుగు అంతస్తుల ప్రాకారం, ఆలయ నిర్మాణం కూడా కొనసాగుతోంది. త్వరలోనే భక్తుల దర్శనానికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది.

Banana Chips vs Potato Chips
పొటాటో కంటే బనానా చిప్స్ మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి అరటికాయలతో చేసే బనానా చిప్స్‌లో పొటాషియం, విటమిన్ C, B6, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని బాగు చేయడంతో పాటు, బీపీ, షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడతాయి. పొటాటో చిప్స్ ప్రాసెస్ చేసి, ఎక్కువ వేడి మీద వేయించడం వల్ల పోషకాలన్నీ పోతాయి. వీటిలో సాచ్యురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్, ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్, బిపి, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

ఇండియన్ షిప్ పై దాడి.. 13 మంది భారతీయులు?
ఎర్ర సముద్రం (Red Sea)లో ఇండియన్ షిప్ 'MSV Faize Noore Oliya' పై మిసైల్ దాడి జరిగింది. యెమెన్ జలాల దగ్గర్లో నిన్న జరిగిన ఈ ఘటనలో షిప్ మునిగిపోయింది. షిప్‌లో 13 మంది భారతీయులు సహా మొత్తం 14 మంది స్టాఫ్‌ను యెమెన్ కోస్ట్ గార్డ్ సురక్షితంగా రక్షించి వైద్యసాయం అందించింది. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, సిబ్బంది భద్రతతో పాటు అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని DGMను ఆదేశించినట్లు వెల్లడించారు.

నటుడు ప్రదీప్ రావత్ హఠాన్మరణం
'సై' సినిమాలో భిక్షు యాదవ్, 'ఛత్రపతి' సినిమాలో రాజ్ బిహారీ పాత్రలతో తెలుగువారికి చేరువైన నటుడు ప్రదీప్ రావత్ ఇవాళ హఠాత్తుగా కన్నుమూశారు. ముంబైలోని ఆయన ఇంట్లో గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. తెలుగులో అనేక సినిమాల్లో నటించిన ఆయన 'సై' సినిమాకు ఉత్తమ విలన్‌గా నంది అవార్డు అందుకున్నారు. 'గజిని' సినిమాలో విలన్‌గా డబుల్ యాక్షన్ చేసి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.

Love Bombing అంటే ఏంటి?
పరిచయమైన కొద్ది రోజులకే రోజంతా మెసేజ్‌లు, కాల్స్, గిఫ్ట్స్.. “నువ్వే నా లైఫ్” అంటూ ఓవర్‌గా ప్రేమ చూపిస్తున్నారా..? 👀❤️ దీన్నే కొన్ని సందర్భాల్లో లవ్ బాంబింగ్ అంటారు. మొదట చాలా ప్రేమ, అటెన్షన్ ఇచ్చి త్వరగా దగ్గరవుతారు. తర్వాత ఎక్కడికి వెళ్తున్నావ్, ఎవరితో మాట్లాడుతున్నావ్ అంటూ కంట్రోల్ చేయడం, తమ మాట వినాలని ప్రెజర్ పెట్టడం మొదలవ్వొచ్చు. అయితే ఎక్కువ ప్రేమ చూపించే ప్రతి ఒక్కరూ లవ్ బాంబర్స్ కాదు. ప్రేమతో పాటు కంట్రోల్ కూడా వస్తుందా? అనేదే చూడాలి.
PS నుంచి రిలీజ్ అయిన ఉదయనిధి స్టాలిన్!
తమిళనాడు ప్రతిపక్ష నేత DMK లీడర్ ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ సస్పెన్స్‌గా ముగిసింది. రీసెంట్‌గా తంజావూరులో జరిగిన కావేరి నిరసన సభలో ఒక త్రిషపై ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ అతనిపై కేసు ఫైల్ అయింది. దాంతో పోలీసులు ఆయనను చెన్నైలోని ఇంటి వద్ద అరెస్ట్ చేసి, తంజావూరు సమీపంలోని సెంగిపట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఎంక్వైరీ పూర్తయ్యాక, హైకోర్టు ఉత్తర్వులతో స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. స్టేషన్ బయట ఉన్న క్యాడర్‌కు ఆయన అభివాదం చేస్తూ వెళ్లారు.

‘Brain Rot’ అంటే తెలుసా?
ఒక్క రీల్ చూద్దామని ఫోన్ తీస్తాం.. చూస్తే గంట గడిచిపోతుంది! 📱 ఇలాంటి లో-క్వాలిటీ, రిపీటెడ్ ఆన్‌లైన్ కంటెంట్‌ను ఎక్కువగా చూడటం వల్ల మన ఆలోచనా సామర్థ్యం లేదా మెంటల్ స్టేట్ దెబ్బతింటోందనే భావనను ‘బ్రెయిన్ రాట్’ అంటారు. ఇది మెడికల్ డయాగ్నోసిస్ కాదు.. ఇంటర్నెట్‌లో పాపులర్ అయిన పదం మాత్రమే. ఈ పదం ఎంత ట్రెండ్ అయిందంటే Oxford Word of the Year 2024గా కూడా ఎంపికైంది. కంటెంట్ చూస్తున్నామా.. లేక స్క్రోలింగ్‌కే అలవాటు పడిపోయామా అనేది అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం బెటర్!

స్కిట్‌లో డైలాగ్స్ మర్చిపోయిన బాబూ మోహన్!
‘జబర్దస్త్’ షోలో ఈ వారం ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ జంట జయకృష్ణ, రషా తడాని సందడి చేశారు. ఈ సెలబ్రిటీ స్పెషల్ ఎపిసోడ్‌లో సీనియర్ యాక్టర్ బాబూ మోహన్ ఎంట్రీ ఇచ్చి ఫుల్ ఫన్ క్రియేట్ చేశారు. రాకెట్ రాఘవ స్కిట్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆయన, డైలాగులు చెప్పడంలో కన్‌ఫ్యూజ్ అయ్యారు. స్కిట్ చేస్తూ చేస్తూ ‘నా 41 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎప్పుడూ ఇలా చేయలేదు’ అంటూ అందరినీ నవ్వించేశారు.

ల్యాప్‌టాప్‌లు, పాత బట్టలు రెంట్‌కి!
అమెరికాతో ఆరు నెలలుగా వార్ నడుస్తుండటంతో ఇరాన్‌లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువయ్యాయి. రోజూ వాడే వస్తువుల రేట్లు, మెడికల్ ఖర్చులు బాగా పెరిగిపోవడంతో జనం బతకడానికి చాలా కష్టపడుతున్నారు. ఇన్ కమ్ లేక చాలామంది తమ దగ్గర ఉన్న ల్యాప్‌టాప్‌లు, పాత బట్టలు, పర్‌ఫ్యూమ్‌లు, చెప్పులను ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు లేదా రెంట్‌కి ఇస్తున్నారు. ఉమెన్ అయితే తమ హెయిర్‌ని కూడా అమ్మేస్తున్నారు. అక్కడ ఇన్‌ఫ్లేషన్ 66% దాటడంతో జనం ఇలా సర్వైవ్ అవ్వాల్సి వస్తోంది.
నేను జీతం, పెన్షన్ తీసుకోను: మమతా బెనర్జీ
TMC అధినేత్రి మమతా బెనర్జీ BJPపై సంచలన ఆరోపణలు చేశారు. తాను ఎలాంటి జీతం లేదా పెన్షన్ తీసుకోకుండా, కేవలం తన పుస్తకాల రాయల్టీపైనే ఆధారపడి జీవిస్తున్నానని తెలిపారు. రాజకీయ కక్షతోనే తమ పార్టీ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారని ఆరోపించారు. హక్కుల కోసం ప్రొటెస్ట్ చేస్తున్న యంగ్ జనరేషన్‌ను యాంటీ నేషనల్స్‌గా ముద్రవేస్తున్నారని, రాముడి పేరు చెప్తూ గుళ్లలోని హుండీలను కూడా లూటీ చేస్తున్నారని BJPపై మండిపడ్డారు.

అయ్యో పాపం: చిన్నారి బాడీలో ఇరుక్కుపోయిన సూది!
మహారాష్ట్ర ఠాణేలోని మున్సిపల్ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం బయటపడింది. రేబీస్ వ్యాక్సిన్ కోసం వచ్చిన మూడేళ్ల బాలుడికి ఇంజెక్షన్ ఇస్తుండగా సూది విరిగి శరీరంలోనే ఉండిపోయింది. డాక్టర్లు ఆ విషయం పట్టించుకోకుండా చిన్నారిని ఇంటికి పంపేశారు. పాప తీవ్ర నొప్పితో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు ముంబైలోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఎక్స్‌రే తీసి, సర్జరీ ద్వారా సూదిని బయటకు తీశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Appleను ఇండియాలోనే కట్టిపడేయడానికి కొత్త ట్యాక్స్ ప్లాన్..
విదేశీ కంపెనీలు తమ మెషినరీని ఇండియాలోని కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరర్స్‌కు ఇచ్చి ప్రొడక్ట్స్ తయారు చేయించినప్పుడు లభించే ట్యాక్స్ మినహాయింపును 2041 వరకు పొడిగించాలని కేంద్రం ప్రతిపాదించింది. Apple కంపెనీ కూడా గతంలో ఈ ట్యాక్స్ రూల్స్‌పై ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ప్రస్తుతం ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ ఇండియాలో ఐఫోన్స్ తయారు చేస్తున్నాయి. కొత్త ట్యాక్స్ రిలీఫ్ అమల్లోకి వస్తే యాపిల్‌తో పాటు ఇతర విదేశీ కంపెనీలు కూడా ఇండియాలో తమ ప్రొడక్షన్‌ను మరింత పెంచే అవకాశం ఉంది

'దూకుడు' ఈజ్ బ్యాక్.. మహేష్ ఫ్యాన్స్ రెడీనా?
మహేష్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్..! బ్లాక్‌బస్టర్ హిట్ 'దూకుడు' మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 9న ఈ మూవీ రీ-రిలీజ్ అవుతోంది, దీనికి ట్రైలర్ కూడా వచ్చేసింది. శ్రీను వైట్ల డైరెక్షన్లో వచ్చిన ఈ యాక్షన్-కామెడీ అప్పట్లో పెద్ద ఇండస్ట్రీ హిట్ . ఈసారి బిగ్ స్క్రీన్‌పై మహేష్ ఎనర్జీ, బ్రహ్మానందం కామెడీని ఎంజాయ్ చేయాలని ఫ్యాన్స్ ఇప్పటికే కౌంట్‌డౌన్ మొదలుపెట్టారు.

LIC Share ఒక్కరోజే 9% పైగా Down.. అసలేం జరిగింది?
కేంద్ర ప్రభుత్వం LICలో తన వాటాలో 6.5% వరకు అమ్మేందుకు ఆఫర్ ఫర్ సేల్(OFS) తీసుకొచ్చింది. ఒక్కో షేర్‌కు ₹382 ఫ్లోర్ ప్రైస్ పెట్టగా, ముందు రోజు క్లోజింగ్ ప్రైస్ ₹428.50తో పోలిస్తే ఇది దాదాపు 11% తక్కువ. దీంతో LIC షేర్‌పై సెల్లింగ్ ప్రెజర్ పెరిగి, ఒక దశలో స్టాక్ 9.26% వరకు పడిపోయింది. ఈ సేల్ పూర్తిగా జరిగితే ప్రభుత్వానికి దాదాపు ₹31,400 కోట్లు రావొచ్చని అంచనా. LICలో పబ్లిక్ షేర్‌హోల్డింగ్ పెంచేందుకు కూడా ఈ సేల్ ఉపయోగపడనుంది.

రివెంజ్ విత్ మర్డర్.. టీచర్‌ను అతి కిరాతకంగా చంపిన సైకో!
హరియాణాలోని ఫరీదాబాద్ సరస్వతి స్కూల్లో పనిచేస్తున్న సంధ్య (29) అనే టీచర్‌ను అమిత్ (21) అనే యువకుడు అతి దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. పాఠశాల గేటు వద్ద కేవలం 30 సెకండ్లలోనే 27 సార్లు దారుణంగా దాడి చేశాడు. అడ్డుకోబోయిన పాఠశాల నిర్వాహకుడు తేజ్పాల్ ను కూడా బెదిరించి, అక్కడి నుండి బైక్‌పై పారిపోయాడు. గతంలో సంధ్య అతనిపై వేధింపుల కేసు పెట్టడంతో క్షమాపణ చెప్పిన నిందితుడు, మనసులో కక్ష పెంచుకుని ఈ హత్య చేశాడు. పోలీసులు అతడిని కేవలం రెండు గంటల్లోనే అరెస్ట్ చేశారు.

AP ప్రభుత్వం షాకింగ్ డెసిషన్!
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, రిటైర్డ్ DGP A.B. వెంకటేశ్వరరావు సెక్యూరిటీని AP ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆయనకు కేటాయించిన బుల్లెట్‌ప్రూఫ్ కార్, భద్రతా సిబ్బందిని తొలగిస్తూ ఆర్డర్స్ ఇచ్చింది. ఇతర మాజీ పోలీస్ అధికారులకు సెక్యూరిటీ కొనసాగుతుండగా, A.B.V కి మాత్రం సెక్యూరిటీ రద్దు చేయడం పెద్ద చర్చగా మారింది. 2014-19 మధ్య TDP ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన ఆయన, ఈమధ్యే ప్రభుత్వ నిర్ణయాలపై ఓపెన్‌గా కామెంట్స్ చేశారు. దాంతో పొలిటికల్ కారణాల వల్లే భద్రత తీసేశారనే టాక్ మొదలైంది.

🌍 ప్రపంచ వేదికపై విజయవాడ విద్యార్థి..
విజయవాడ విద్యార్థి అంతర్జాతీయ వేదికపై అదరగొట్టాడు! బ్లూమింగ్‌డేల్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన ఇంటర్ విద్యార్థి నరేన్ తుమ్మల.. యూకేలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరిగిన అంతర్జాతీయ సింపోజియంలో భారత్ నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థిగా క్వాంటమ్ కంప్యూటింగ్‌పై తన రీసెర్చ్‌ను ప్రెజెంట్ చేశాడు. భవిష్యత్ క్వాంటమ్ కంప్యూటర్లలో వచ్చే ఎరర్లను ఎలా తగ్గించొచ్చో వివరించి అందరి ప్రశంసలు అందుకున్నాడు.

🧠 పిల్లల స్ట్రెస్‌కు అసలు కారణం ఎగ్జామ్స్ కాదట!
"పిల్లలకు స్ట్రెస్ అంటే ఎగ్జామ్సే కారణం" అనుకుంటున్నారా? కొత్త స్టడీ మాత్రం వేరే విషయం చెబుతోంది. బెంగళూరులో వేలాది కౌన్సెలింగ్ సెషన్ల ఆధారంగా చేసిన ఈ స్టడీలో, పరీక్షల కంటే ఇంట్లోని గొడవల వల్లే ఎక్కువ మంది విద్యార్థులు సహాయం కోరినట్టు తేలింది. Anxiety ఇప్పటికీ టాప్‌లో ఉండగా, 16–18 ఏళ్ల విద్యార్థుల్లో సెల్ఫ్-హార్మ్ ఆలోచనలు కూడా ఎక్కువగా కనిపించాయి. సింపుల్‌గా చెప్పాలంటే... పిల్లల స్ట్రెస్‌కు ఎగ్జామ్స్ మాత్రమే కాదు, ఇంట్లో జరిగే విషయాలు కూడా కారణమవుతున్నాయి.

Alarm మోగగానే Snooze కొడుతున్నారా..?
అలారం మోగింది.. “ఇంకో 5 మినిట్స్” అంటూ స్నూజ్ కొడుతున్నారా..? 😴 ఒక్కసారి కాదు.. మళ్లీ మళ్లీ స్నూజ్ చేస్తుంటే నిద్ర పదే పదే డిస్టర్బ్ అవుతుంది. దీంతో లేచిన తర్వాత కూడా మత్తుగా, ఫ్రెష్‌గా లేనట్టు అనిపించొచ్చు. అయితే స్నూజ్ చేయడం ప్రతి ఒక్కరికీ హానికరమే అని చెప్పడానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు. రెగ్యులర్‌గా సరిపడా నిద్రపోవడం, ప్రతిరోజూ ఒకే టైమ్‌కు లేవడం బెటర్. అలారం రోజూ మీతో “ఇంకో 5 మినిట్స్” యుద్ధం చేస్తుంటే.. అసలు మీ స్లీప్ టైమ్‌నే చెక్ చేయాల్సిన టైమ్ కావచ్చు!
ఇక బ్లైండ్ పీపుల్ కూడా చూడగలరు- ఎలాన్ మస్క్
ఎలాన్ మస్క్ తన కంపెనీ 'న్యూరాలింక్' ద్వారా కంటి చూపు లేని వారి కోసం ఒక గుడ్ న్యూస్ చెప్పారు. నెక్స్ట్ 6 నుండి 12 మంత్స్‌లో బ్లైండ్ పీపుల్ కోసం కొత్త విజన్ ఇంప్లాంట్స్ టెస్ట్ చేయబోతున్నారు. బ్రెయిన్‌లోని చూపుకి సంబంధించిన పార్ట్‌కి డైరెక్ట్‌గా సిగ్నల్స్ పంపడం వల్ల, కంప్లీట్‌గా చూపు లేని వాళ్ళు కూడా మళ్ళీ చూడగలుగుతారు. ఫ్యూచర్‌లో ఈ టెక్నాలజీతో ఇన్ఫ్రారెడ్, ఆల్ట్రావయోలెట్ కిరణాలు కూడా చూడవచ్చని, ఇది ఒక 'సూపర్‌పవర్' లాగా పనిచేస్తుందని మస్క్ చెప్పారు.