Latest

90 మినిట్స్‌లో 8 బాంబ్స్.. ఉక్రెయిన్‌పై భారీ అటాక్!
World· 3 Aug 2026

90 మినిట్స్‌లో 8 బాంబ్స్.. ఉక్రెయిన్‌పై భారీ అటాక్!

90 మినిట్స్... ఏకంగా 8 గ్లైడ్ బాంబ్స్.. ఉక్రెయిన్‌పై రష్యా మరో భారీ అటాక్! 😳 జపోరిజ్జియా నగరంలోని రెసిడెన్షియల్ ఏరియాలపై రష్యా గ్లైడ్ బాంబ్స్ వేసినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో 71 ఏళ్ల మహిళ చనిపోగా, 16 ఏళ్ల బాలికతో సహా 31 మంది గాయపడ్డారు. 22 అపార్ట్‌మెంట్ బిల్డింగ్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. మరోవైపు రాత్రికి రష్యా 181 డ్రోన్స్‌తో దాడి చేయగా, వాటిలో 163ను అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. దీంతో మరిన్ని పాట్రియట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కావాలని జెలెన్‌స్కీ మరోసారి కోరారు.

బ్యాంక్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారా?
Politics· 3 Aug 2026

బ్యాంక్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారా?

బ్యాంక్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వారికి IBPS గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 11 పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో 11,403 క్లర్క్ (కస్టమర్ సర్వీస్ అసోసియేట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో APకి 186, తెలంగాణకి 191 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ క్వాలిఫికేషన్, లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉన్న 20-28 ఏళ్ల అభ్యర్థులు ఆగస్టు 21 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ ద్వారా అభ్యర్థుల సెలెక్షన్ ఉంటుంది.

కర్ణాటక vs తమిళనాడు..
Politics· 3 Aug 2026

కర్ణాటక vs తమిళనాడు..

కావేరీ వాటర్ ఇష్యూపై తమిళనాడు గవర్నమెంట్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమ వాటా నీటిని రిలీజ్ చేయడంలో కర్ణాటక ఫెయిల్ అయిందని పిటిషన్ వేసింది. రోజుకి 3,500 క్యూసెక్కుల నీటిని ఇవ్వాలని CWMA ఆదేశించినా కర్ణాటక ఇవ్వడం లేదని పేర్కొంది. మరోవైపు తమ దగ్గర కరువు ఉందంటూ కర్ణాటక రైతులు నిరసనలు తెలుపుతున్నారు. ఇదే టైమ్‌లో జూన్ 12 లోపు రావాల్సిన నీళ్లు రాకపోవడంపై MK స్టాలిన్ స్పందిస్తూ, విమర్శలు చేస్తున్నారు.

పొన్నం ప్రభాకర్ ఇంట్లో CM సందడి!
Politics· 3 Aug 2026

పొన్నం ప్రభాకర్ ఇంట్లో CM సందడి!

బోనాలు పండగ సందర్భంగా మినిస్టర్ <a href="https://x.com/Ponnam_INC/status/2083883140632957004?s=20">పొన్నం ప్రభాకర్</a> ఇంటికి CM రేవంత్ రెడ్డి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన లంచ్ ప్రోగ్రామ్‌లో పాల్గొని, పొన్నం ఫ్యామిలీ మెంబర్స్‌తో కాసేపు టైమ్ స్పెండ్ చేశారు. ముఖ్యంగా ఇంట్లోని కిడ్స్‌ని దగ్గరకు తీసుకొని ముచ్చటిస్తూ, అందరితో కలిసి ఫొటోస్ దిగారు. దీనికి సంబంధించిన స్పెషల్ వీడియోను పొన్నం ప్రభాకర్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

‘August Theory’ అంటే ఏంటి?
Viral· 3 Aug 2026

‘August Theory’ అంటే ఏంటి?

ఆగస్టు వచ్చింది.. సోషల్ మీడియాలో ఇప్పుడు ‘ఆగస్టు థియరీ’ అనే డేటింగ్ ట్రెండ్ తెగ చర్చలో ఉంది. ఈ థియరీ ప్రకారం ఆగస్టు వచ్చేసరికి కొందరు తమ పాత రిలేషన్‌షిప్స్, సిట్యుయేషన్‌షిప్స్ గురించి మళ్లీ ఆలోచించడం మొదలుపెడతారట. దూరమైన వ్యక్తి మళ్లీ మెసేజ్ చేయడం, పాత కనెక్షన్స్ తిరిగి స్టార్ట్ అవ్వడం లేదా కొన్ని రిలేషన్‌షిప్స్‌కు పూర్తిగా ఎండ్ కార్డ్ పడటం జరగొచ్చనేది ఈ వైరల్ ఐడియా. అయితే “ఆగస్టు వచ్చింది కాబట్టి Ex తిరిగొస్తాది” అని వెయిట్ చేయకండి బ్రో😂.. దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏమీ లేదు.

వదిన తల నరికి చెట్టుకు వేలాడదీసిన మరిది!
Crime· 3 Aug 2026

వదిన తల నరికి చెట్టుకు వేలాడదీసిన మరిది!

బిహార్‌లోని జెహనాబాద్ జిల్లా ఇమాద్‌పూర్‌లో ఇంటికి వచ్చిన మరిది కునాల్ కుమార్, వంట ఆలస్యమైందనే కోపంతో వదిన అన్షుదేవి (25)తో గొడవపడ్డాడు. ఆవేశానికి లోనైన కునాల్ కుమార్ తన వదినపై దాడి చేసి గొడ్డలితో నరికి చంపాడు. అంతటితో ఆగకుండా, నరికిన తలను ఇంటి సమీపంలోని మర్రిచెట్టుకు వేలాడదీశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, పోస్టుమార్టం నివేదిక అనంతరం తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

రామజన్మభూమి ట్రస్ట్‌ నుంచి RSS లీడర్ తొలగింపు
News· 3 Aug 2026

రామజన్మభూమి ట్రస్ట్‌ నుంచి RSS లీడర్ తొలగింపు

అయోధ్య రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో కీలక మార్పులు జరిగాయి. ట్రస్ట్ ప్యాట్రన్‌గా ఉన్న సీనియర్ RSS లీడర్ సురేశ్ "భయ్యాజీ" జోషి తన పదవికి రాజీనామా చేశారు. నాయకత్వ మార్పుల్లో భాగంగా ట్రస్ట్ ఆయనను ఆ పొజిషన్ నుంచి తొలగించినట్లు ప్రకటించింది. డొనేషన్ ఫండ్స్ మిస్‌యూజ్ కాంట్రవర్సీ కారణంగా రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. ట్రస్ట్‌లో మార్పులు కారణంగా అయోధ్య రామాలయ మేనేజ్‌మెంట్‌పై చర్చ మొదలైంది. ఈ కాంట్రవర్సీకి సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని అధికారులు ఇప్పటివరకు అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ చేయలేదు.

రీల్స్, ఫ్లాష్ మాబ్‌లతో అవయవ దాన ఉద్యమం
Politics· 3 Aug 2026

రీల్స్, ఫ్లాష్ మాబ్‌లతో అవయవ దాన ఉద్యమం

HYD: “అవయవ దానం చెయ్యాలన్న మీ ఒక్క నిర్ణయం.. ఎన్నో ప్రాణాలను కాపాడుతుంది” ఇదీ జాతీయ అవయవ దాన దినోత్సవం వేళ చాకలి ఐలమ్మ వర్సిటీ విద్యార్థుల ప్రతిజ్ఞ. సోషల్ మీడియా రీల్స్, ఫ్లాష్ మాబ్‌లతో ఆర్గాన్ డొనేషన్ పైన యూత్ అవైర్నెస్ తేవాలని ఈ కార్యక్రమం పిలుపునిచ్చింది. రోటరీ క్లబ్ ప్రతినిధి మోహన్ నిష్టాల తెలంగాణ తొలి ఆర్గాన్ డొనేషన్ రోటరాక్ట్ క్లబ్ ప్రకటించారు. వర్సిటీ VC సూర్య ధనంజయ్, రిజిస్ట్రార్ గడ్డం మల్లేశం, మోహన్ ఫౌండేషన్ భాను ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌కి బిగ్ షాక్.. ఇద్దరు MLAలు రిజైన్!
Politics· 3 Aug 2026

కాంగ్రెస్‌కి బిగ్ షాక్.. ఇద్దరు MLAలు రిజైన్!

కర్ణాటక కాంగ్రెస్‌లో క్యాబినెట్ విస్తరణతో ఇద్దరు MLAల రాజీనామాకు దారితీశాయి. కొత్త మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన 'ఇండి' MLA యశవంతరాయగౌడ పాటిల్, 'సాగర్' MLA బేలూర్ గోపాలకృష్ణ తమ పదవులకు రిజైన్ చేశారు. పాటిల్ తన లేఖను డిప్యూటీ స్పీకర్‌కు ఇవ్వగా, బెంగళూరులో ఆయన సపోర్టర్స్ ప్రొటెస్ట్ చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా 20 మందిని క్యాబినెట్‌లోకి తీసుకుంటున్న టైమ్‌లోనే ఈ షాకింగ్ డెవలప్‌మెంట్ జరిగింది.

జి.డి. నాయుడు: గ్రేట్ ఇండియన్ ఇన్వెంటర్!
Infotainment· 3 Aug 2026

జి.డి. నాయుడు: గ్రేట్ ఇండియన్ ఇన్వెంటర్!

భారతదేశ తొలి స్వదేశీ ఎలక్ట్రిక్ మోటార్, రేడియో, ఎలక్ట్రిక్ రేజర్ సహా 100కు పైగా ఆవిష్కరణలు చేసిన గొప్ప శాస్త్రవేత్త జి.డి. నాయుడు(1893–1974). అందుకే ఆయనను<a href="https://www.thehindu.com/news/national/tamil-nadu/gd-naidu-the-edison-of-india-who-will-be-brought-to-life-on-screen-in-madhavan-starrer-biopic/article69237060.ece"> "భారతీయ ఎడిసన్" </a>అని పిలుస్తారు. సరైన ప్రాథమిక విద్య లేకపోయినా, సాధారణ మెకానిక్‌గా కెరీర్ ప్రారంభించి కొయంబత్తూరును పారిశ్రామిక హబ్‌గా మార్చారు. ఈ మహనీయుడి జీవిత కథ ఆధారంగానే ఆర్. మాధవన్ నటించిన 'G.D.N' బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అయోధ్య రామమందిరం చోరీ కేసులో కొత్త ట్విస్ట్
India· 3 Aug 2026

అయోధ్య రామమందిరం చోరీ కేసులో కొత్త ట్విస్ట్

అయోధ్య రామమందిరంలో చోరీ కేసు మరోసారి వార్తల్లోకొచ్చింది. గతంలో ట్రస్ట్‌లో పనిచేసిన మహిపాల్ సింగ్ SITకి మెయిల్ చేశారు. దీని గురించి యూట్యూబ్ ఛానల్ ‘టాప్ సీక్రెట్’ రిపోర్ట్ చేసింది. ఆలయ నిర్మాణం అంచనా వ్యయం రూ.800 కోట్లు అయితే, రూ.2,200 కోట్లు ఖర్చు చేశారని మహిపాల్ మెయిల్‌లో వివరించారు. ట్రస్ట్ తరఫున చంపత్ రాయ్ కొన్ని ఆస్తులు కొన్నారని కూడా రాశారు. చంపత్ రాయ్ మాజీ డ్రైవర్ టిన్ను యాదవ్‌ ఆలయం నుంచి డబ్బు దొంగిలించి, ఆ ఫోటో తీసి చంపత్‌రాయ్‌కి పంపేవాడని ఆయన ఆరోపించారు.

💊 $400 బిలియన్ ఫార్మా జెయింట్ రాబోతోందా?
World· 3 Aug 2026

💊 $400 బిలియన్ ఫార్మా జెయింట్ రాబోతోందా?

రెండు పెద్ద ఫార్మా కంపెనీలు ఒక్కటైతే.. ఏకంగా $400 బిలియన్ జెయింట్! అమెరికాకు చెందిన బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్, బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా మధ్య ప్రాథమిక మెర్జర్ టాక్స్ జరిగినట్లు రిపోర్ట్స్ రావడంతో మార్కెట్‌లో హీట్ పెరిగింది. ఈ డీల్ జరిగితే ప్రపంచంలోని అతిపెద్ద డ్రగ్ కంపెనీల్లో ఒకటిగా మారే అవకాశం ఉంది. వార్త బయటకు రావడంతో బ్రిస్టల్ మైయర్స్ షేర్లు ప్రీ-మార్కెట్‌లో 8% పెరగగా, ఆస్ట్రాజెనెకా షేర్లు దాదాపు 6% పడిపోయాయి. అయితే డీల్ ఇంకా ఫైనల్ కాలేదు.

త్వరలోనే రాజకీయాల్లోకి హీరోయిన్ త్రిష?
Politics· 3 Aug 2026

త్వరలోనే రాజకీయాల్లోకి హీరోయిన్ త్రిష?

నటి త్రిష మరోసారి తమిళనాడు వైరల్ అయ్యారు. మదురైలో కొత్తగా ఏర్పడిన ‘త్రిష వెల్ఫేర్ అసోసియేషన్’ సభ్యులు త్రిష రాజకీయాల్లోకి రావాలంటూ నగరమంతా పోస్టర్లు అంటించారు. ‘మదురై అనేది ప్రతి రాజకీయ పార్టీ మొదలయ్యే మొదటి నేల’ అని అందులో రాశారు. ‘తమిళనాడు ప్రభుత్వం గుర్తించిన మొదటి అసోసియేషన్’ తమదే అని అందులో పేర్కొన్నారు. త్రిష సీఎం విజయ్‌తో తరచూ కనిపించడం, ఆయన ప్రమాణ స్వీకార వేడుకకు రావడం, ఇప్పుడు ఈ పోస్టర్లు..అన్నీ కలిసి త్రిష రాజకీయ ఎంట్రీని సూచిస్తున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు.

భారీ వర్ష సూచన.. ఎంప్లాయీస్‌ను త్వరగా ఇళ్లకు పంపండి!
Infotainment· 3 Aug 2026

భారీ వర్ష సూచన.. ఎంప్లాయీస్‌ను త్వరగా ఇళ్లకు పంపండి!

TG: హైదరాబాద్‌లోని వెస్ట్, నార్త్, సెంట్రల్ ఏరియాల్లో మరో 2 నుంచి 3 గంటల పాటు భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశముందని హెచ్చరించారు. IT కారిడార్‌లో పనిచేస్తున్న ఎంప్లాయీస్‌ను ఫేజ్‌వైజ్‌గా ఇళ్లకు పంపాలని సైబరాబాద్ పోలీసులు కంపెనీలను కోరారు. వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఇళ్లకు చేరుకోవాలని సూచించారు.

ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉండొద్దు: ప్రశాంత్ కిశోర్
India· 3 Aug 2026

ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉండొద్దు: ప్రశాంత్ కిశోర్

బంకీపూర్ బై ఎలక్షన్‌లో విజయం సాధించిన తర్వాత ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడారు. ఇది బీహార్ ప్రజల విజయం అని చెప్పారు. బీజేపీ మంచి ఇమేజ్ ఉన్న వ్యక్తిని సీఎంగా చేయాలి, నేరస్తుడిని కాదనే సంకేతాన్ని ప్రజలు పంపారని అన్నారు. ప్రజలు ఎక్కడికీ వెళ్లవవసరం లేకుండా సౌకర్యాలు కల్పించాలని, బిహార్ మెరుగుపడాలని అన్నారు. కులమతాల పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉండకూడదని చెప్పారు.

వాకింగ్‌తో బరువు తగ్గడమే కాదు... ఆరోగ్యమూ పక్కా!
Health· 3 Aug 2026

వాకింగ్‌తో బరువు తగ్గడమే కాదు... ఆరోగ్యమూ పక్కా!

రోజుకు కేవలం 30 నుంచి 60 నిమిషాల నడక మన శరీరాన్ని, మనస్సును అద్భుతంగా మార్చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ వాకింగ్ వల్ల 150 నుంచి 300 కేలరీలు కరిగి పొట్ట కొవ్వు తగ్గుతుంది. దానివల్ల మనం తిన్న తిండి కొవ్వుగా మారకుండా, వెంటనే ఎనర్జీగా మారిపోతుంది. నడక వల్ల ఇన్సులిన్ పనితీరు మెరుగై బ్లడ్ షుగర్ అదుపులో ఉండటంతో పాటు, శరీరంలో ఎండోర్ఫిన్లు విడుదలవుతాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన నిద్ర పడుతుంది.

BJPకి SHOCK..ప్రశాంత్ కిశోర్ గెలుపు
India· 3 Aug 2026

BJPకి SHOCK..ప్రశాంత్ కిశోర్ గెలుపు

మూడు దశాబ్దాలుగా బీజేపీ కంచుకోటగా ఉన్న బిహార్ రాష్ట్రంలోని బంకిపూర్ సీటు బీజేపీ చేజారింది. జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిశోర్ ఇక్కడ విజయం సాధించారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ రిజైన్ చేసిన తర్వాత జరిగిన బైఎలక్షన్స్‌లో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాను ఓడించి ఆయన గెలుపొందారు. ఎన్నికల ప్రచారం నుంచే దూకుడు పెంచిన ప్రశాంత్ కిశోర్ బిహార్ ప్రభుత్వం మార్పు కోరుతోందని, బీజేపీకి ఓటమి తప్పదని అన్నారు.

జీలకర్ర నీటితో ఆరోగ్య ప్రయోజనాలు!
Health· 3 Aug 2026

జీలకర్ర నీటితో ఆరోగ్య ప్రయోజనాలు!

రోజువారీ ఆహారంలో జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, కడుపు ఉబ్బరం నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. మెటబాలిజంను వేగవంతం చేసి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ నీరు, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

ప్రొటెస్ట్‌లో మొదలైన ట్రెండ్.. బాలీవుడ్‌కి చేరింది!
Entertainment· 3 Aug 2026

ప్రొటెస్ట్‌లో మొదలైన ట్రెండ్.. బాలీవుడ్‌కి చేరింది!

ప్రొటెస్ట్‌లో వైరల్ అయిన ట్రెండ్.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ కూడా చేసేస్తున్నారు! 😂🎬 సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘మేరే మెహబూబ్ ఖయామత్ హోగీ’ ట్రెండ్‌లో అనుపమ్ ఖేర్ కూడా జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు బొమన్ ఇరానీ, రణవీర్ షోరే, పర్విన్ దబాస్ కలిసి ఫన్నీ రీక్రియేషన్ వీడియో చేశారు. ఖోస్లా కా ఘోస్లా 2 ఆగస్టు 26 రిలీజ్‌కు ముందు వచ్చిన ఈ వీడియో అభిమానుల్లో నోస్టాల్జియా పెంచుతూ వైరల్ అవుతోంది. ప్రొటెస్ట్ నుంచి మొదలైన ట్రెండ్ ఇప్పుడు సినిమా ప్రమోషన్ వరకు వచ్చేసింది!

కర్ణాటక Vs తమిళనాడు వాటర్ వార్.. సుప్రీంకోర్టుకు కేసు
Politics· 3 Aug 2026

కర్ణాటక Vs తమిళనాడు వాటర్ వార్.. సుప్రీంకోర్టుకు కేసు

కావేరి నదిలో తమకు కేటాయించిన నీటిని విడుదల చేయాలని తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమిళనాడు సీఎం విజయ్ ఆదేశాలతో పిటిషన్ ఫైల్ చేసింది. కావేరి జలాల నిర్వహణ అథారిటీ (CWMA), కావేరి జలాల నియంత్రణ కమిటీ (CWRC) ఆర్డర్స్‌ను కర్ణాటక ఇంప్లిమెంట్ చేయడం లేదని ఆరోపించింది. దీంతో సాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, వాటర్ సప్లై ఆర్డర్స్‌ను ఇంప్లిమెంట్ చేసేలా కర్ణాటకను ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరింది.

నేను చూపిస్తా.. మోడీ చూపిస్తారా- అభిజిత్ దీప్కే
Politics· 3 Aug 2026

నేను చూపిస్తా.. మోడీ చూపిస్తారా- అభిజిత్ దీప్కే

CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే తన ఎడ్యుకేషన్ లోన్, ఫండింగ్‌పై వస్తున్న విమర్శలపై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తన ఎడ్యుకేషనల్ లోన్ డాక్యుమెంట్స్, స్కాలర్‌షిప్ లెటర్స్ చూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇదే క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఛాలెంజ్ విసిరారు. నేను నా సర్టిఫికెట్లు చూపించినట్లే, మోడీ కూడా తన డిగ్రీ సర్టిఫికెట్లు బయటపెట్టగలరా అని ప్రశ్నించారు. Credits: ANI