Latest

టిఫిన్ బండి వ్యాపారిపై కేసు.. సోషల్ మీడియాలో చర్చ
TG: హైదరాబాద్‌లో అర్ధరాత్రి టిఫిన్ బండి నిర్వహిస్తున్న చిరు వ్యాపారిపై మల్కాజిగిరి పోలీసులు కేసు పెట్టారు. దీనికి రెండు రోజుల నార్మల్ జైలు శిక్షతో పాటు రూ.50 ఫైన్ కూడా వేశారు. ఈ వివరాలను మల్కాజిగిరి పోలీసులు తమ ఆఫీసియల్ 'X' అకౌంట్లో పోస్టు చేశారు. ఆ పోస్టుపై నెటిజన్ల నుంచి నెగటివ్ రెస్పాన్స్ రావడంతో పోస్టు డిలీట్ చేశారు. అప్పటికే ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు పోలీసుల పనిని సమర్దించగా, మరికొందరు ఆ వ్యాపారిపై ఈ శిక్ష అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.

20 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్
బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ రెండు దశాబ్దాల తర్వాత కోల్‌కతాకు వచ్చారు. రవీంద్ర సదన్‌లో మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. వివాదాస్పద పుస్తకం ‘ద్విఖండితో’పై జరిగిన నిరసనల కారణంగా 2007లో ఆమె నగరాన్ని విడిచి వెళ్లవలసి వచ్చింది. ఆమె కోల్‌కతాలో బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి. మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందనే ఆరోపణలతో 2003లో అప్పటి సీపీఎం నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం ఆమె పుస్తకాన్ని నిషేధించింది. 63 ఏళ్ల ఆమె ప్రస్తుతం దిల్లీలో ఉంటున్నారు.
చాలా రోజుల గ్యాప్ తర్వాత లడఖ్ లో సోనమ్ వాంగ్‌చుక్..
సోనమ్ వాంగ్‌చుక్ మళ్లీ తన SECMOL క్యాంపస్‌కి తిరిగొచ్చారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత క్యాంపస్‌కి వచ్చిన ఆయనకు స్టూడెంట్స్, స్టాఫ్ అందరూ కలసి లడఖ్ ట్రెడిషనల్ తెల్లని శాలువాలతో చాలా ఆత్మీయంగా, గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు. స్టూడెంట్స్ అందరూ ఆయనను హగ్ చేసుకుంటూ వెల్‌కమ్ చెప్పిన ఈ క్యూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
నా మాటలు నచ్చకపోతే మీ ఇష్టం- కంగనా రనౌత్
తనపై వస్తున్న విమర్శలపై BJP MP కంగనా రనౌత్ స్పందించారు. తనకు సక్సెస్, సమాజంలో హోదా, పేరు తెచ్చిపెట్టిన విషయాలనే అందరికీ చెబుతానని కామెంట్స్ చేశారు. సొంత ఇంట్లో పిల్లలకు ఒకలా, బయటి పిల్లలకు ఇంకోలా చెప్పే డబుల్ స్టాండర్డ్స్ తనకు ఉండవన్నారు. ఈ ప్రిన్సిపల్స్ నచ్చితే ఫాలో అవ్వొచ్చని, లేదంటే ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చంటూ ఆమె ఆన్సర్ ఇచ్చారు. రీసెంట్గా Gen Z ని మురికివారు అనడంతో CJP ప్రతినిధి సౌరవ్ దాస్, ఆమెని సొంత పార్టీనే పట్టించుకోదు అన్నాడు. దీంతో కంగనా ట్రోల్ అవుతున్నారు.

ఫ్రెండ్‌ను ఇరికించబోయి బుక్కయ్యాడు
TG: కరీంనగర్‌లో కానిస్టేబుల్ అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈగల్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ నాగరాజు తన ఫ్రెండ్‌ను అక్రమ కేసులో ఇరికించేందుకు అతడి ఇంట్లో గంజాయి ప్యాకెట్లు ఉంచి పోలీసులతో దాడులు చేయించాడు. అయితే విచారణలో అనుమానాలు తలెత్తడంతో పోలీసులు CCTV దృశ్యాలు, ఇతర ఆధారాలను పరిశీలించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. గంజాయిని స్వయంగా నాగరాజే ఇంట్లో ఉంచినట్లు నిర్ధారణ కావడంతో ఆయనను సస్పెండ్ చేశారు.
లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే వివాదం
రూ.4,200 కోట్లతో నిర్మించిన రోడ్డును లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వేను జూలై 13న ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే దెబ్బతినడం వివాదంగా మారింది. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశాయి. రోడ్డు పాడైపోలేదని, పైపొర మాత్రమే దెబ్బతిందని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) స్పష్టం చేసింది. దెబ్బతిన్న ప్రాంతాన్ని పునరుద్ధరించామని, రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయని పేర్కొంది.
సినిమా కోసం మనీషా కొయిరాలా కష్టాలు!
బాలీవుడ్ యాక్ట్రెస్ మనీషా కొయిరాలా తన ఫిట్‌నెస్ సీక్రెట్స్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. నెక్స్ట్ సినిమా కోసం ఫిట్‌గా అవ్వాలని ఎంత డైట్ చేసి వర్కౌట్స్ చేసినా వెయిట్ తగ్గకపోవడంతో చాలా ఏడ్చేశానని చెప్పారు. వెయిట్ మిషన్ తప్పు చూపిస్తుందేమో అని కొత్తది కొన్నా సేమ్ రిజల్ట్ వచ్చిందని అన్నారు. ఏజ్ పెరిగేకొద్దీ బాడీ చేంజ్ అవుతుందని రియలైజ్ అయి, డాక్టర్స్ సలహాతో తన రూట్ మార్చుకుని 4 నెలల్లో రిజల్ట్ చూశానని తన ఎక్స్‌పీరియన్స్ పోస్ట్ చేశారు.

రాపిడో డ్రైవర్‌కు డబ్బులు ఎగ్గొట్టిన మహిళ
రాపిడో బైక్ టాక్సీలో వచ్చిన ఒక మహిళ డబ్బులు ఇవ్వకుండా దిల్లీ 'సాకేత్ కోర్టు'లోకి వెళ్లిపోయింది. వెంటనే అక్కడి సెక్యూరిటీ ఆమెను ఆపారు. భరణం కేసుకు సంబంధించి ఆమె కోర్టుకు వచ్చినట్లు సమాచారం. డబ్బుల విషయంలో డ్రైవర్ తో గొడవ జరగడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆమెను పట్టుకున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె మీద ఎవరైనా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారా లేదా అనేది కూడా ఇంకా తెలియలేదు.
ఈ వైరల్ వీడియో వెనుక ఉన్న కథ తెలిస్తే బాధేస్తుంది!
అందరూ దాడినే చూశారు.. కానీ ఈ బాలుడి కథ ఎవరూ చూడలేదు. తల్లిని కోల్పోయిన బాధ ఓ బాలుడిని ఇలా మార్చేసిందా? మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 14 ఏళ్ల బాలుడు వృద్ధ మహిళలపై కర్రతో దాడి చేసిన వీడియో వైరల్ కావడంతో అధికారులు ఇంక్వైరీ మొదలుపెట్టారు. బాలుడి తల్లి తీవ్ర కాలిన గాయాలతో ఈ వృద్ధాశ్రమంలో చేరి కొద్ది రోజులకే మరణించగా, అప్పటి నుంచి అతడు అక్కడే ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి మెంటల్ కండిషన్ బాగోలేదని అధికారులు చెబుతున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత అతడిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించనున్నారు.

హైదరాబాద్ మెట్రో LOAN విషయంలో బిగ్ ట్విస్ట్
TG: హైదరాబాద్ మెట్రోకు ఊహించని షాక్ తగిలింది. మెట్రో ఫేస్-1 టేకోవర్ లోన్‌పై IRFC (Indian Railway Finance Corporation) వెనక్కి తగ్గింది. లోన్ విడుదల చేయలేమని రాష్ట్రానికి సమాచారం ఇచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సీఎస్ సంజయ్ జాజు అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించింది. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ఈ పరిణామాలతో మెట్రో నిర్మాణం ముందుకు సాగుతుందా, లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

వర్షాల్లో ఈ మిస్టేక్స్ చేయకండి!
వర్షాకాలంలో భారీ వర్షాలు, గాలుల వల్ల కరెంట్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అందుకే అందరూ కొన్ని సేఫ్టీ రూల్స్ ఫాలో అవ్వాలని విద్యుత్ అధికారులు చెప్తున్నారు. వర్షం పడేటప్పుడు తడిసిన కరెంట్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, వేలాడే వైర్లకు దూరంగా ఉండాలి. తడి చేతులతో స్విచ్‌లు, ఫోన్ ఛార్జర్లు ముట్టుకోవద్దు. ప్లాస్టిక్ వైర్లకే బట్టలు ఆరేయాలి. ఏమైనా ఎమర్జెన్సీ లేదా కరెంట్ ప్రాబ్లమ్ ఉంటే వెంటనే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కి కాల్ చేయొచ్చు.

భద్రాచలం వద్ద హై అలర్ట్
TG: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రభావంతో కల్యాణకట్ట, స్నానఘట్టాలు నీటమునిగాయి. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు ములుగు జిల్లాలో సమ్మక్క బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

బీజేపీలో 100 మంది ఎంపీలపై కేసులున్నాయి: సౌరవ్ దాస్
ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడిన యువతి రుచికా సింగ్‌పై క్రిమినల్ కేసు పెట్టడం కరెక్ట్ కాదని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ అన్నారు. అసభ్య పదాలు వాడినంత మాత్రాన క్రిమినల్ కేసు పెట్టడం సరికాదన్నారు. లోక్‌సభలో 50 శాతం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయని, బీజేపీలో 100 మంది ఎంపీలపై కేసులు ఉన్నాయని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. పోలీసులు వారిపై దృష్టి పెట్టాలన్నారు.

కామన్వెల్త్ గేమ్స్‌లో సీమా కళిరామన్ కు బ్రోన్జ్ మెడల్
గ్లాస్గోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారిణి 'సీమా కళిరామన్' బ్రోన్జ్ మెడల్ గెలిచింది. ఉమెన్ డిస్కస్ త్రో ఫైనల్లో ఆమే తన మూడో అటెంప్ట్ లో 58.65 మీటర్ల దూరం విసిరింది. ఆ తర్వాత మూడుసార్లు ఫౌల్ చేసినా ఆమెకు మూడో స్థానం దక్కింది. ఈ పోటీల్లో జమైకాకు చెందిన సమంత హాల్ 61.66 మీటర్లతో గోల్డ్ మెడల్ గెలవగా, కెనడా క్రీడాకారిణి జూలియా టంక్స్ 60.67 సిల్వర్ మెడల్ గెలుచుకుంది. మరో భారత అథ్లెట్ నిధి రాణి 57.10 మీటర్లు విసిరి నాలుగో స్థానంలో నిలిచి కొద్దిలో మెడల్ మిస్ చేసుకుంది.

'NO SPEND DAY ' సవాల్!
సోషల్ మీడియాలో 'నో స్పెండ్ డే' ట్రెండ్ వైరల్ అవుతోంది. రోజంతా రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఉండటమే ఈ సవాల్ ముఖ్య ఉద్దేశం. అనవసర షాపింగ్, బయట తిండ్లు, వినోదాలకు దూరంగా ఉంటూ ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకోవడానికి ఇది ఒక చక్కని 'ఫైనాన్షియల్ డిటాక్స్'. వారానికి ఒక రోజుతో ప్రారంభించి ఈ అలవాటును పెంచుకుంటే మనీ సేవ్ అవ్వడమే కాకుండా, పొదుపు చేయడం కూడా అలవాటవుతుంది. మీరు కూడా ఈ సవాల్‌ను ప్రయత్నించండి.

'ఫార్ములా-ఈ రేస్' కేసులో KTRకు ACB కోర్టు కీలక ఆదేశాలు
TG: ఈరోజు నాంపల్లి ACB స్పెషల్ కోర్టులో ఫార్ములా-ఈ రేస్ కేసు విచారణ జరిగింది. ACB నోటీసులలో కేటీఆర్ ఆయనతో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డి హాజరయ్యారు. కార్ రేస్ నిర్వహణ వల్ల HMDAకు రూ.54.88 కోట్ల నష్టం వాటిల్లిందని చార్జ్‌షీట్‌లో ఏసీబీ పేర్కొంది. చార్జ్‌షీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుని, విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది. కేటీఆర్ రూ.1 లక్ష పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీలను సమర్పించాలని ఆదేశించింది.

Claude AI చేసిన పని చూసి కంపెనీ షాక్!
AIని టెస్ట్ చేస్తే.. అది నిజంగానే హ్యాక్ చేస్తే? అలాంటి షాకింగ్ ఘటనే జరిగింది. Anthropicకు చెందిన కొన్ని Claude AI మోడళ్లు టెస్టింగ్‌లో భాగంగా పొరపాటున మూడు కంపెనీల సిస్టమ్‌ల్లోకి చొరబడ్డాయి. టెక్నికల్ తప్పిదం వల్ల AIకి ఓపెన్ ఇంటర్నెట్ యాక్సెస్ లభించడంతో, బలహీనమైన పాస్‌వర్డ్లు, రక్షణ లేని ఎండ్‌పాయింట్లను ఉపయోగించి సిస్టమ్‌లను యాక్సెస్ చేశాయి. ఈ ఘటన తర్వాత Anthropic టెస్టింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసి, ప్రభావిత కంపెనీలకు సమాచారం ఇచ్చింది.
పార్లమెంట్ వద్ద రాహుల్ సీన్.. డొనేషన్ బాక్స్‌లో డబ్బులు!
పార్లమెంట్ మాన్‌సూన్ సెషన్‌లో పొలిటికల్ హీట్ మామూలుగా లేదు. అయోధ్య రామ్ మందిర్ డొనేషన్స్ విషయంలో ఫ్రాడ్ జరిగిందని ఆరోపిస్తూ ఆపోజిషన్ MPలు భారీగా ప్రొటెస్ట్ చేశారు. రాహుల్ గాంధీ డైరెక్ట్‌గా వచ్చి అక్కడున్న డొనేషన్ బాక్స్‌లో మనీ వేసి నిరసన తెలపడం వీడియోలో చూడవచ్చు. ఈ చందాల ఇష్యూపై పార్లమెంట్‌లో కేంద్రం స్పందించాలని డిమాండ్ చేశారు.

నడుములోతు నీటిలో ప్రాణాలతో ప్రయాణం
TG: కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని లక్ష్మిపూర్, అనార్పల్లి శివారులోని పెద్దవాగు <a href="https://www.theclearcutnews.com/n/knoZPWS">ఉప్పొంగి</a> ప్రవహిస్తుండటంతో సుమారు 12 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర వస్తువుల కోసం కెరమెరికి వెళ్లాలంటే నడుములోతు నీటిలో ప్రాణాలను పణంగా పెట్టి వాగు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకరి చేయి ఒకరు పట్టుకుని వాగు దాటుతున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఎదురవుతోందని, శాశ్వత వంతెన నిర్మించి తమ కష్టాలను తీర్చాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

రాహుల్ గాంధీ భాషపై విజయసాయిరెడ్డి కామెంట్స్
రాహుల్ గాంధీ భాషపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ‘ఎక్స్’ వేదికగా కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ సహజంగా ఇంగ్లీష్ మాట్లాడేవారని, కానీ మన దేశంలో రాజకీయాలు ప్రజలు రోజువారీ మాట్లాడే భాషలోనే గెలుస్తాయని అన్నారు. ఆయన హిందీ ఇంగ్లీష్ పదాలతో అనువదించినట్టు ఉంటుందని, యాసతో, సాధారణ మాండలిక పదాలు లేకుండా ఉంటుందని చెప్పారు. రాహుల్ ఇంగ్లీష్‌లో ఆలోచించి హిందీలో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందన్నారు.

క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అజింక్యా రహానే
భారత సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానె అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు IPLకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 13 ఏళ్లుగా క్రికెట్ ఆడిన అతను, ఆట నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అని సోషల్ మీడియాలో చెప్పాడు. 2023 తర్వాత అతను ఇండియా తరఫున ఆడలేదు. ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన BCCI, MCA, కోచ్‌లు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అతడు కృతజ్ఞతలు తెలిపాడు. క్రికెట్‌కు దూరం అయినా ఈ ఆటతో తన ప్రయాణం ఎప్పుడూ కొనసాగుతుందని చెప్పాడు.