Latest

Claude AI చేసిన పని చూసి కంపెనీ షాక్!
Politics· 31 Jul 2026

Claude AI చేసిన పని చూసి కంపెనీ షాక్!

AIని టెస్ట్ చేస్తే.. అది నిజంగానే హ్యాక్ చేస్తే? అలాంటి షాకింగ్ ఘటనే జరిగింది. Anthropicకు చెందిన కొన్ని Claude AI మోడళ్లు టెస్టింగ్‌లో భాగంగా పొరపాటున మూడు కంపెనీల సిస్టమ్‌ల్లోకి చొరబడ్డాయి. టెక్నికల్ తప్పిదం వల్ల AIకి ఓపెన్ ఇంటర్నెట్ యాక్సెస్ లభించడంతో, బలహీనమైన పాస్‌వర్డ్లు, రక్షణ లేని ఎండ్‌పాయింట్లను ఉపయోగించి సిస్టమ్‌లను యాక్సెస్ చేశాయి. ఈ ఘటన తర్వాత Anthropic టెస్టింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసి, ప్రభావిత కంపెనీలకు సమాచారం ఇచ్చింది.

పార్లమెంట్ వద్ద రాహుల్ సీన్.. డొనేషన్ బాక్స్‌లో డబ్బులు!
Politics· 31 Jul 2026

పార్లమెంట్ వద్ద రాహుల్ సీన్.. డొనేషన్ బాక్స్‌లో డబ్బులు!

పార్లమెంట్ మాన్‌సూన్ సెషన్‌లో పొలిటికల్ హీట్ మామూలుగా లేదు. అయోధ్య రామ్ మందిర్ డొనేషన్స్ విషయంలో ఫ్రాడ్ జరిగిందని ఆరోపిస్తూ ఆపోజిషన్ MPలు భారీగా ప్రొటెస్ట్ చేశారు. రాహుల్ గాంధీ డైరెక్ట్‌గా వచ్చి అక్కడున్న డొనేషన్ బాక్స్‌లో మనీ వేసి నిరసన తెలపడం వీడియోలో చూడవచ్చు. ఈ చందాల ఇష్యూపై పార్లమెంట్‌లో కేంద్రం స్పందించాలని డిమాండ్ చేశారు.

నడుములోతు నీటిలో ప్రాణాలతో ప్రయాణం
TG· 31 Jul 2026

నడుములోతు నీటిలో ప్రాణాలతో ప్రయాణం

TG: కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని లక్ష్మిపూర్, అనార్పల్లి శివారులోని పెద్దవాగు <a href="https://www.theclearcutnews.com/n/knoZPWS">ఉప్పొంగి</a> ప్రవహిస్తుండటంతో సుమారు 12 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర వస్తువుల కోసం కెరమెరికి వెళ్లాలంటే నడుములోతు నీటిలో ప్రాణాలను పణంగా పెట్టి వాగు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకరి చేయి ఒకరు పట్టుకుని వాగు దాటుతున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఎదురవుతోందని, శాశ్వత వంతెన నిర్మించి తమ కష్టాలను తీర్చాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

రాహుల్ గాంధీ భాషపై విజయసాయిరెడ్డి కామెంట్స్
Politics· 31 Jul 2026

రాహుల్ గాంధీ భాషపై విజయసాయిరెడ్డి కామెంట్స్

రాహుల్ గాంధీ భాషపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ‘ఎక్స్’ వేదికగా కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ సహజంగా ఇంగ్లీష్ మాట్లాడేవారని, కానీ మన దేశంలో రాజకీయాలు ప్రజలు రోజువారీ మాట్లాడే భాషలోనే గెలుస్తాయని అన్నారు. ఆయన హిందీ ఇంగ్లీష్ పదాలతో అనువదించినట్టు ఉంటుందని, యాసతో, సాధారణ మాండలిక పదాలు లేకుండా ఉంటుందని చెప్పారు. రాహుల్ ఇంగ్లీష్‌లో ఆలోచించి హిందీలో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందన్నారు.

క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అజింక్యా రహానే
Sports· 31 Jul 2026

క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అజింక్యా రహానే

భారత సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానె అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు IPLకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 13 ఏళ్లుగా క్రికెట్ ఆడిన అతను, ఆట నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అని సోషల్ మీడియాలో చెప్పాడు. 2023 తర్వాత అతను ఇండియా తరఫున ఆడలేదు. ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన BCCI, MCA, కోచ్‌లు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అతడు కృతజ్ఞతలు తెలిపాడు. క్రికెట్‌కు దూరం అయినా ఈ ఆటతో తన ప్రయాణం ఎప్పుడూ కొనసాగుతుందని చెప్పాడు.

అక్కడికి వెళ్లే టూరిస్టులకు అధికారుల సూచన
Infotainment· 31 Jul 2026

అక్కడికి వెళ్లే టూరిస్టులకు అధికారుల సూచన

AP: భారీ వర్షాలతో గోదావరి నదిలో వరద వేగంగా పెరగడంతో పాపికొండల టూర్లను అధికారులు ప్రస్తుతం రద్దు చేశారు. దేవీపట్నం గండిపోశమ్మ ఘాట్, పోచవరం బోట్ పాయింట్ల నుంచి నడిచే ఏపీ టూరిజం బోటుతో పాటు 15 ప్రైవేట్ బోట్ల ప్రయాణాన్ని పూర్తిగా ఆపేసారు. అధికారులు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు టూరిస్టులు పాపికొండల యాత్రకు రావద్దని సూచించారు. టూరిస్టుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని జలవనరుల శాఖ, పర్యాటక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

'ఐదు రూపాయల డాక్టర్' బయోపిక్ లో కయాదు లోహర్!
Cinema· 31 Jul 2026

'ఐదు రూపాయల డాక్టర్' బయోపిక్ లో కయాదు లోహర్!

స్టార్ హీరో సూర్య 48వ చిత్రంలో నటి కయాదు లోహర్‌ కీలక పాత్ర దక్కించుకుంది. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. పేద రోగుల నుంచి రూ. 5 మాత్రమే ఫీజు తీసుకుని సేవలందించిన చెన్నైకి చెందిన ‘ఐదు రూపాయల డాక్టర్’ కృష్ణ వరదాచారి తిరువేంగడం జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కయాదు లోహర్ ప్రాధాన్యమున్న టీచర్ పాత్రలో కనిపించనుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

ఒత్తిడిని చిత్తు చేసేద్దాం
Health· 31 Jul 2026

ఒత్తిడిని చిత్తు చేసేద్దాం

జీవితంలో పెండ్లి, పిల్లలు, ఆర్థిక సమస్యలు, కెరీర్ వంటి వివిధ విషయాలలో ప్రతిఒక్కరికీ ఆందోళన సహజం.నిజానికి ఆందోళన అనేది ఒత్తిడికి మన శరీరము, మనస్సు ఇచ్చే రియాక్షన్ అంతే! కొన్నిసార్లు ఇది మనం అలర్ట్‌గా ఉండటానికి, బాధ్యతగా పనిచేయడానికి హెల్ప్ అవుతుంది. కానీ పరిమితి దాటితే మాత్రం ప్రశాంతత పోతుంది. సరిగ్గా ప్లాన్ చేసుకోవడం, వర్కౌట్స్ చేయడం, మైండ్‌ఫుల్‌నెస్‌తో ఉండటం, అలానే పెద్ద సమస్యలను చిన్న చిన్నగా విభజించి సాల్వ్ చేసుకోవడం చేస్తే ఒత్తిడిని ఈజీగా జయించవచ్చు.

ప్రధాని మోదీ మార్ఫింగ్ పోస్టులపై కేసు
Crime· 31 Jul 2026

ప్రధాని మోదీ మార్ఫింగ్ పోస్టులపై కేసు

TG: NEET పేపర్ లీక్ గొడవల టైమ్‌లో PM నరేంద్ర మోదీకి సంబంధించి మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై BJP మద్దతుదారులు ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు నడుపుతున్న వారితో పాటు మెటా ఇండియా హెడ్‌పై కూడా ఈ కేసులు పెట్టారు. ఆ వీడియోల లింకులు వెంటనే తీసేయాలని మెటా సంస్థకు పోలీసులు నోటీసులు పంపారు. ఆ పోస్టులు పెట్టిన వాళ్ల వివరాలు ఇవ్వాలని అడిగారు. నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని అధికారులు చెప్పారు.

మాజీ BRS ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల కేసు
Crime· 31 Jul 2026

మాజీ BRS ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల కేసు

TG: మాజీ BRS ఎమ్మెల్యే రేగా కాంతారావుపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లైంగికంగా వేధించాడని ఓ యువతి పోలీసులకు కంప్లైంట్ చేసింది. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో తన నుంచి డబ్బు తీసుకున్నాడని, తనకు తెలియకుండా వీడియోలు తీసాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కాల్వలోకి దూసుకెళ్లిన RTC బస్సు
TG· 31 Jul 2026

కాల్వలోకి దూసుకెళ్లిన RTC బస్సు

AP: పల్నాడు జిల్లాలో RTC బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లింది. విజయవాడ నుంచి వినుకొండకు వెళ్తున్న బస్సు ఫిరంగిపురం మండలం మేరికపూడి వద్ద ఈ ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా జరిగిన ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురైనా, అదృష్టవశాత్తూ బస్సు బోల్తా పడకపోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, RTC అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో వినుకొండకు తరలించారు.

'మగధీర'కి 17 ఏళ్లు..
Cinema· 31 Jul 2026

'మగధీర'కి 17 ఏళ్లు..

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, రామ్ చరణ్,కాజల్ కాంబినేషన్‌లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ ‘మగధీర’ విడుదలైన నేటితో 17 ఏళ్లు పూర్తయ్యాయి. 2009 జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి, తెలుగు సినిమాలో ఒక మైలురాయిగా నిలిచింది.మళ్ళీ జన్మల కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన ఈ విజువల్ మైండ్‌ బ్లోయింగ్ మూవీ చరణ్ రేంజ్‌ను పెంచడమే కాదు, రాజమౌళి విజన్ ఏంటో ప్రపంచానికి చూపించింది.ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు `#17YearsForMagadheera` ట్రెండ్ చేస్తూ హంగామా చేస్తున్నారు.

అనాథ బాలికను చంపిన ఆటో డ్రైవర్
Crime· 31 Jul 2026

అనాథ బాలికను చంపిన ఆటో డ్రైవర్

AP: విశాఖ కంచరపాలెంకి చెందిన ఆటో డ్రైవర్ సురేష్, ఓ అనాథ బాలికను గర్భిణీగా ఉన్న తన భార్యకు సాయంగా ఉంటుందని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. సురేష్ భార్యకు పాప పుట్టాక, బాలిక తనను పెళ్లి చేసుకోవాలని అడిగింది. ఇద్దరి మధ్య గొడవ జరిగి కోపంతో ఆమెను కొట్టి చంపి శవాన్ని ట్రాలీ బ్యాగులో దాచి, రైలెక్కి ఒడిశా రాష్ట్రం రాయగడ దగ్గర ఎవరూ లేని చోట పడేశాడు. 3రోజుల తర్వాత వాసన రావడంతో స్థానికులు పోలీసులకు చెప్పారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఒడిశా పోలీసులు సురేష్‌ను పట్టుకున్నారు.

16 గ్రామాలు బాహ్య ప్రపంచానికి దూరం
TG· 31 Jul 2026

16 గ్రామాలు బాహ్య ప్రపంచానికి దూరం

TG: ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో చెరువులు, వాగులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం ఆనంద్‌పూర్ వద్ద పెన్‌గంగా నది ఉద్ధృతంగా ప్రవహించడంతో బ్రిడ్జిపై వరద నీరు చేరింది. దీంతో తెలంగాణ–మహారాష్ట్ర మధ్య వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఉట్నూర్, నార్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లోని దాదాపు 16 గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

ఆ జిల్లాల్లో 2 రోజులు సెలవులు ప్రకటించిన అధికారులు
Education· 31 Jul 2026

ఆ జిల్లాల్లో 2 రోజులు సెలవులు ప్రకటించిన అధికారులు

AP: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ప్రైవేటు స్కూళ్లకు అధికారులు ఈరోజు, రేపు సెలవులు ప్రకటించారు. రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారు. ఆ సభకు ప్రజలను తరలించేందుకు ప్రైవేటు స్కూల్ బస్సులను వాడనున్నారు. దీంతో రెండు రోజుల పాటు ఆ స్కూళ్లకు సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం యథావిధిగా కొనసాగనున్నాయని స్పష్టం చేశారు.

నెట్‌ఫ్లిక్స్‌లోకి సత్యదేవ్ డార్క్ కామెడీ థ్రిల్లర్
Cinema· 31 Jul 2026

నెట్‌ఫ్లిక్స్‌లోకి సత్యదేవ్ డార్క్ కామెడీ థ్రిల్లర్

సత్యదేవ్ హీరోగా, వెంకటేశ్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రావు బహదూర్’. జులై 3న థియేటర్లలో విడుదలై సైకాలజికల్ డార్క్ కామెడీతో మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పరిమిత వసూళ్లను మాత్రమే సాధించింది.ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ లో ఈరోజు (జులై 31) నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ప్రసారం కానుంది. డిఫరెంట్ కంటెంట్, మిస్టరీ కథలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు మాత్రం ఇది కచ్చితంగా నచ్చే చిత్రమవుతుంది.

లంక గ్రామాలకు రాకపోకలు బంద్
AP· 31 Jul 2026

లంక గ్రామాలకు రాకపోకలు బంద్

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడి లంక వద్ద వరద ఉధృతికి తాత్కాలిక మట్టి గట్టు కొట్టుకుపోయింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ఊడిమూడిలంక, బూరుగులంక, అరిగెలవారిపాలెం, గంటిపెదపూడి లంక గ్రామాల ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. విద్యార్థులు, రైతులు, అత్యవసర అవసరాల కోసం వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదలు తగ్గే వరకు నాటు పడవలే ఏకైక రవాణా మార్గంగా మారాయి.

ప్రధాని స్కాలర్షిప్ పేరుతో సైబర్ మోసం
Crime· 31 Jul 2026

ప్రధాని స్కాలర్షిప్ పేరుతో సైబర్ మోసం

ప్రధాని స్కాలర్షిప్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలు చేస్తున్నారు. మీ అకౌంట్లో రూ.38,500 వేశామని, ఆ డబ్బులు మీకు రావాలంటే ముందు ఫోన్ పే ద్వారా రూ.5 వేలు పంపాలని అడుగుతున్నారు. ఇలాంటి కాల్స్ అస్సలు నమ్మకండి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. స్కాలర్షిప్ డబ్బులు నేరుగా బ్యాంకు అకౌంట్లో పడతాయి కానీ, అధికారులు ఎప్పుడూ ఫోన్ చేసి డబ్బులు అడగరు. మీ ఫోన్ పే లేదా బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పకండి అని పోలీసులు సూచిస్తున్నారు.

గణేష్ విగ్రహాల తయారీపై సజ్జనర్ కీలక ఆదేశాలు
News· 31 Jul 2026

గణేష్ విగ్రహాల తయారీపై సజ్జనర్ కీలక ఆదేశాలు

TG: గణేష్ ఉత్సవాలను సురక్షితంగా నిర్వహించేందుకు నగర పోలీసు కమిషనర్ సజ్జనర్ విగ్రహ తయారీదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉత్సవాల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై వారితో చర్చించారు. గత ఏడాది గణేష్ విగ్రహాల రవాణా సమయంలో నాలుగు ప్రమాదాలు జరిగినట్లు గుర్తు చేశారు. ఈసారి అలంటి ప్రమాదాలు జరగకుండా గణేష్ విగ్రహాల ఎత్తును 16 అడుగులకు మించరాదని తయారుదారులకు సజ్జనర్ సూచించారు.

డేటింగ్ యాప్స్ తో HIV ముప్పు
News· 31 Jul 2026

డేటింగ్ యాప్స్ తో HIV ముప్పు

ఒక ఉమెన్ గైనకాలజిస్ట్ యువతకు షాకింగ్ నిజం చెప్పారు. డేటింగ్ యాప్స్ ద్వారా ఏర్పడే పరిచయాలతో చాలామంది యువత HIV, STD (సెక్సువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్) లాంటి ప్రాణాంతక రోగాలు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా 19, 20 ఏళ్ల అమ్మాయిలు తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లతో హాస్పిటల్ కు వస్తున్నారట. కాసేపు ఆనందం కోసం భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆమె చెప్పారు.

భార్య సమాధి దగ్గర భర్త ఆత్మహత్య
Crime· 31 Jul 2026

భార్య సమాధి దగ్గర భర్త ఆత్మహత్య

TG: ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న మంచాల మండలం నోముల గ్రామంలో బాబు అనే వ్యక్తి ఫిబ్రవరి 24, 2026న తన భార్యను దారుణంగా చంపేశాడు. ఆ రోజు నుంచి అతడు ఊరికి దూరంగా ఉంటున్నాడు. అయితే, గురువారం రాత్రి తన భార్య సమాధి పక్కనే ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయాడు. భార్యను చంపిన అతడే ఆమె సమాధి దగ్గర ఆత్మహత్య చేసుకోవడం స్థానికులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.