Latest

పీఎం మోడీ రిజైన్.. ఇది నిజమేనా!
Politics· 30 Jul 2026

పీఎం మోడీ రిజైన్.. ఇది నిజమేనా!

సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ప్రధానిమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ ఫేక్ రిజిగ్నేషన్‌ లెటర్‌ను ప్రభుత్వం గుర్తించి హెచ్చరించింది. 'ఈ లెటర్‌ ఫేక్ అని, ప్రధానమంత్రి అటువంటి లేఖను జారీ చేయలేదని, దానిపై ఆయన సంతకం చేయలేదని' స్పష్టం చేసింది. 'ఏదైనా సమాచారాన్ని నమ్మే ముందు అఫీషియల్ సోర్సులు ద్వారా సరిచూసుకోండి' అని PIB ఫ్యాక్ట్‌చెక్ 'X' లో పోస్ట్ చేసింది.

ఆరని బట్టలు వేసుకుంటున్నారా?
Health· 30 Jul 2026

ఆరని బట్టలు వేసుకుంటున్నారా?

వర్షాకాలంలో తడి బట్టలు సరిగ్గా ఆరకపోతే బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల స్కిన్ అలర్జీలు, ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ 40% ఉంటుంది. ఈ సీజన్ లో జీన్స్, కాటన్ కాకుండా త్వరగా ఆరే పాలిస్టర్, నైలాన్ వాడటం బెటర్. బ్యాడ్ స్మెల్ పోవడానికి ఉతికే ముందు బేకింగ్ సోడా లేదా వెనిగర్ యూజ్ చేయాలి. బట్టలు ఆరిపోయాక ఐరన్ చేశాకే వేసుకోవడం, బీరువాలో కర్పూరం ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్లను అరికట్టవచ్చు.

100 కోట్ల క్లబ్‌లో అఖిల్ ‘లెనిన్’..
Cinema· 30 Jul 2026

100 కోట్ల క్లబ్‌లో అఖిల్ ‘లెనిన్’..

హీరో అక్కినేని అఖిల్ తన కెరీర్‌లో సరికొత్త మైలురాయిని అందుకున్నారు. ఆయన నటించిన తాజా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూల్ సాధించి, అఖిల్ కెరీర్‌లోనే తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్-అన్నపూర్ణ స్టూడియోస్ కలసి నిర్మించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్లింది.

సాయికృష్ణ కేసులో CI నాగరాజు విచారణ
Crime· 30 Jul 2026

సాయికృష్ణ కేసులో CI నాగరాజు విచారణ

AP: గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో తన కొడుకు కోసం వేసిన పిటిషన్‌ను తన అనుమతి లేకుండానే వెనక్కి తీసుకునేందుకు తన లాయర్ ప్రయత్నించారని చెప్పడం సెన్సేషన్ అయ్యింది. ఆ లాయర్‌ను తీసేసి ఈ కేసును CBIకి అప్పగించాలని మరో లాయర్‌తో పిటిషన్ వేశారు. మరోవైపు జైలులో ఉన్న CI నాగరాజును SIT అధికారులు వారం పాటు విచారించనున్నారు. కోర్టు ఆదేశాలతో రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీసీ కెమెరాల మధ్య విచారణ జరపనున్నారు.

సినిమా చూస్తుండగానే బాలీవుడ్ నటికి బిగ్ షాక్..
Crime· 30 Jul 2026

సినిమా చూస్తుండగానే బాలీవుడ్ నటికి బిగ్ షాక్..

బాలీవుడ్ నటి, నిర్మాత కీర్తి కుల్హారీ సైబర్ మోసానికి గురయ్యారు. ముంబైలోని ఒక మల్టీప్లెక్స్‌లో సినిమా చూస్తుండగా, ఆమె క్రెడిట్ కార్డు ద్వారా ఏరోమెక్సికో ఎయిర్‌లైన్స్‌లో 2,525 డాలర్ల విదేశీ లావాదేవీ జరిగినట్లు మెసేజ్ వచ్చింది. ఓటీపీ ఎవరికీ షేర్ చేయకపోయినా, నిమిషాల వ్యవధిలోనే 4 ఇల్లీగల్ లావాదేవీల ద్వారా రూ. 2.43 లక్షలకు పైగా మాయమైపోయాయి.కీర్తి ఫిర్యాదుతో అంబోలి పోలీసులు, సైబర్ సెల్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మా తప్పు లేదంటోంది.. కానీ ₹47 వేల కోట్లు మాత్రం ఇస్తోంది!
World· 30 Jul 2026

మా తప్పు లేదంటోంది.. కానీ ₹47 వేల కోట్లు మాత్రం ఇస్తోంది!

"తప్పు చేయలేదంటోంది అయినా ₹47 వేల కోట్లు ఎందుకు చెల్లిస్తోంది?" ఇదే ఇప్పుడు Johnson & Johnsonపై చర్చ. అమెరికాలో టాల్క్ ఆధారిత బేబీ పౌడర్, ఇతర ఉత్పత్తులు అండాశయ క్యాన్సర్‌కు కారణమయ్యాయని చెబుతూ వేలాది మంది మహిళలు కేసులు వేశారు. అయితే తమ ఉత్పత్తులు సురక్షితమేనని కంపెనీ చెబుతోంది. అయినప్పటికీ, 76 వేల కేసుల పరిష్కారం కోసం 5.5 బిలియన్ డాలర్లు (సుమారు ₹47–48 వేల కోట్లు) చెల్లించే ప్రతిపాదన చేసింది. అయితే ఇది తప్పు ఒప్పుకోవడం కాదని, కోర్టు పోరాటానికి ముగింపు పలకడానికేనని స్పష్టం చేసింది.

మా ఫ్యామిలీని చంపేస్తామంటున్నారు- అభిజీత్ దీప్కే
Politics· 30 Jul 2026

మా ఫ్యామిలీని చంపేస్తామంటున్నారు- అభిజీత్ దీప్కే

CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను BJPలో చేరకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఫ్యామిలీకి కూడా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. దీనిపై ఆల్రెడీ అధికారులకు కంప్లైంట్ చేసినట్లు చెప్పారు. ఇదే క్రమంలో పెల్లెట్ గన్స్ వినియోగంపై హోంమంత్రి అమిత్ షా క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డెమోక్రసీలో ఇలాంటి థ్రెట్స్ రావడం ఆందోళనకరమని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

రాణి భారతి ఈజ్ బ్యాక్..
Cinema· 30 Jul 2026

రాణి భారతి ఈజ్ బ్యాక్..

ఓటీటీలో పొలిటికల్ థ్రిల్లర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ‘మహారాణి’ సిరీస్, బాలీవుడ్ స్టార్ నటి హుమా ఖురేషి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ పాపులర్ పొలిటికల్ డ్రామా ఐదో సీజన్‌ మొదలైంది. గత నాలుగు సీజన్లు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో, ఈసారి కథ మరింత రసవత్తరంగా ఉండబోతుంది. రాణి భారతిగా హుమా ఖురేషి చేసే మైండ్ గేమ్స్, రాజకీయంలో వేసే ఎత్తుగడలు మరోసారి ప్రేక్షకుల ముందుకి రానున్నాయి.

బెంగళూరు డాక్టర్‌పై కేసు నిలిపేసిన హైకోర్టు
Crime· 30 Jul 2026

బెంగళూరు డాక్టర్‌పై కేసు నిలిపేసిన హైకోర్టు

బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన ఒక జంటను వేధించాడని బెంగళూరుకు చెందిన 'డాక్టర్ నాగేంద్రపై' పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణను కర్ణాటక హైకోర్టు ఆపేసింది. అసలు నిజనిజాలు తెలుసుకోకుండా పోలీసులు తొందరపడి కేసు ఎలా రాశారని కోర్టు తప్పుబట్టింది. ఒక పౌరుడు అక్రమంగా ఉంటున్న వాళ్లను గుర్తిస్తుంటే, తిరిగి అతనిపైనే కేసు పెట్టడం సరికాదని జడ్జ్ చెప్పారు. నగరంలో అక్రమంగా ఉంటున్న వాళ్లను పట్టుకుని ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విచారణను ఆగస్టు 6కు వాయిదా వేశారు.

పోకిరీలుగా మారిన అమ్మాయిలు..అబ్బాయిల కంప్లైంట్!
Politics· 30 Jul 2026

పోకిరీలుగా మారిన అమ్మాయిలు..అబ్బాయిల కంప్లైంట్!

UPలోని వారణాసి కాంట్ రైల్వే స్టేషన్ దగ్గర రోడ్డుపై ఆకతాయి పనులు చేస్తూ జనాన్ని ఇబ్బంది పెడుతున్నారిద్దరు. అయితే వాళ్లు అబ్బాయిలు కాదు..అమ్మాయిలు. అటుగా వెళ్లే మగవాళ్లను ఆపి, అసభ్యంగా మాట్లాడుతూ వాళ్లకు ఇబ్బంది కలిగిస్తున్నారు. వాళ్ల కంప్లైంట్‌తో 'యాంటీ రోమియో స్క్వాడ్' స్పాట్‌కి వెళ్లి జీవిక(42), రుబియా(28)లను కస్టడీలోకి తీసుకున్నారు. పబ్లిక్ ప్లేస్‌లో బిహేవియర్ సరిగ్గా లేనందుకు BNS సెక్షన్ 296 కింద కేస్ బుక్ చేశారు.

ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.50కే కిలో బియ్యం
Infotainment· 30 Jul 2026

ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.50కే కిలో బియ్యం

AP: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నాణ్యమైన బియ్యాన్ని తక్కువ రేటుకే ప్రజలకు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని మొదలుపెట్టనుంది. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యంను కిలో రూ.52కు, గ్రేడ్-1 పచ్చి బియ్యం కేజీ రూ.50కు ఇవ్వనుంది. రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రజలు సబ్సిడీపై వీటిని కొనుగోలు చేయవచ్చు. ప్రతీఒక్కరూ దీనిని ఉపయోగించుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తెలిపింది.

దుల్కర్ అభిమానులకు గుడ్ న్యూస్..
Cinema· 30 Jul 2026

దుల్కర్ అభిమానులకు గుడ్ న్యూస్..

దుల్కర్ సల్మాన్ హీరోగా, కయడు లోహర్ హీరోయిన్‌గా, నహాస్ హిదాయత్ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా 'ఐ యామ్ గేమ్'. జూలై 28న విడుదల కావాల్సిన సినిమా ట్రైలర్ సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఆగస్టు 20, 2026న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

KKR జట్టులోకి మళ్లీ 'టెన్ డస్కటే'
Sports· 30 Jul 2026

KKR జట్టులోకి మళ్లీ 'టెన్ డస్కటే'

టీమిండియా అసిస్టెంట్ కోచ్ పదవి వదిలేసి 'టెన్ డస్కటే' మళ్లీ KKR జట్టులోకి వచ్చాడు. ఇంతకుముందు అతను ఇదే జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇప్పుడు అతనికి 'హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీ' బాధ్యతలు ఇచ్చారు. ఆట గురించి అతనికి బాగా తెలుసని ఆ అనుభవం తమ జట్టుకు పనికొస్తుందని KKR మేనేజ్‌మెంట్‌ చెప్పింది.

వాగులు, వంతెనల వద్ద భద్రత కట్టుదిట్టం
TG· 30 Jul 2026

వాగులు, వంతెనల వద్ద భద్రత కట్టుదిట్టం

TG: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం <a href="https://www.theclearcutnews.com/n/oGAcrp9">హైఅలర్ట్</a> ప్రకటించింది. జిల్లా ఎస్పీ నితికా పంత్ కాగజ్‌నగర్ పెద్దవాగు, దహెగాం, పెంచికల్‌పేట్ ప్రాంతాల్లో వరద ముంపు ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. వాగులు, వంతెనల వద్ద పోలీసులు, SDRF బృందాలు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్, తాళ్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాలకు ప్రజలు వెళ్లొద్దన్నారు.

'కంగనా రనౌత్' దిష్టిబొమ్మను ఎత్తుకెళ్లిన పోలీస్!
Politics· 30 Jul 2026

'కంగనా రనౌత్' దిష్టిబొమ్మను ఎత్తుకెళ్లిన పోలీస్!

Gen Z పై MP కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద కామెంట్స్‌పై లక్నోలో ప్రొటెస్టర్స్, ఆమె దిష్టిబొమ్మను దహనం చేసేందుకు రెడీ అవ్వగా, అక్కడే ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఊహించని షాక్ ఇచ్చారు. ఆ దిష్టిబొమ్మను లాక్కుని, వారు తగలేయకుండా విపరీతమైన స్పీడ్‌తో పరుగులు తీస్తూ ఎత్తుకెళ్లిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

వందేమాతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం
India· 30 Jul 2026

వందేమాతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం

జాతీయ గేయం ‘వందేమాతరం’ గౌరవాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ ఈనెల 24న రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బుధవారం సుదీర్ఘ చర్చ అనంతరం రాజ్యసభ ఆమోదించింది. ఇవాళ మూజువాణి ఓటుతో లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది. ఇకపై వందేమాతరాన్ని అవమానించినా, ఎవరైనా పాడుతున్న టైంలో ఆటంకం కలిగించినా చట్టప్రకారం నేరంగా పరిగణిస్తారు.

నా రాజకీయ కోరిక ఏంటో అప్పుడే చెబుతా: జగ్గారెడ్డి
Politics· 30 Jul 2026

నా రాజకీయ కోరిక ఏంటో అప్పుడే చెబుతా: జగ్గారెడ్డి

TG: కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఓ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నాకు సీఎం కావాలనే కోరిక లేదు. సీఎం పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్లో ఉన్నారు. కానీ నాకు మరో బలమైన రాజకీయ కోరిక ఉంది. నా మనసులోని మాటలన్నీ నవంబర్‌లో బయటపెడతాను. అప్పుడే నా రాజకీయ కోరిక ఏమిటో చెబుతాను' అని జగ్గారెడ్డి అన్నారు. జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయల్లో చర్చకు దారితీశాయి.

‘శ్రీనివాస మంగాపురం’ టాక్
Cinema· 30 Jul 2026

‘శ్రీనివాస మంగాపురం’ టాక్

ఘట్టమనేని జయకృష్ణ, రషా తడానీ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీనివాస మంగాపురం’ మూవీకి సోషల్ మీడియాలో మిక్స్‌డ్ టాక్ వస్తోంది. జయకృష్ణ నటన, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్, రషా స్క్రీన్ ప్రెజెన్స్, జీవీ ప్రకాశ్ మ్యూజిక్, మోహన్ బాబు నటన మెప్పించాయి. అయితే రొటీన్ కథ, ముందే ఊహించగలిగే స్క్రీన్‌ప్లే, ట్విస్టులు లేవని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వసూళ్లపై రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుంది.

ఒక్క తప్పు.. అమెరికా డ్రీమ్‌కు బ్రేక్ వేయొచ్చా..?
Politics· 30 Jul 2026

ఒక్క తప్పు.. అమెరికా డ్రీమ్‌కు బ్రేక్ వేయొచ్చా..?

"అమెరికా వెళ్లే వాళ్లకు కొత్త టెన్షన్ మొదలైందా?" ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనతో ఇదే ప్రశ్న వినిపిస్తోంది. J-1 వీసాపై అమెరికా వెళ్లే విదేశీ విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు వీసా కోసం తప్పుడు సమాచారం లేదా ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చినట్లు తేలితే.. వారి ప్రోగ్రామ్‌ను వెంటనే రద్దు చేసేలా కొత్త రూల్‌ను ప్రతిపాదించింది. అలాంటి వారికి అమెరికా విడిచిపోవాల్సి రావొచ్చు. ఈ రూల్ అమల్లోకి వస్తే భారతీయ విద్యార్థులపైనా ప్రభావం ఉండే అవకాశం ఉంది. అయితే ఇది ఇప్పటికి డ్రాఫ్ట్ రూల్ మాత్రమే.

వరద నీళ్లు వస్తున్నా.. పంప్‌లు ఆన్ చేయడం లేదు
Politics· 30 Jul 2026

వరద నీళ్లు వస్తున్నా.. పంప్‌లు ఆన్ చేయడం లేదు

తెలంగాణలో గోదావరి, కృష్ణా నదులకు భారీగా వరద నీరు వస్తున్నప్పటికీ ప్రభుత్వం ప్రాజెక్టుల పంపులను పూర్తిస్థాయిలో నడపడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. జూరాల నుంచి పవర్ జనరేషన్ పేరుతో భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని, అదే సమయంలో రిజర్వాయర్లను నింపే ప్రయత్నాలు చేయడం లేదన్నారు. రైతుల ఆందోళన తర్వాతే కొన్ని పంపులను ప్రారంభించారని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ప్రతి చుక్క నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు.

రైట్ వింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్లకు Radical Ajay పిలుపు
Infotainment· 30 Jul 2026

రైట్ వింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్లకు Radical Ajay పిలుపు

తెలుగులో ఉన్న రైట్ వింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్లకు, కంటెంట్ క్రియేటర్లకు అంబేడ్కరైట్, కంటెంట్ క్రియేటర్ ర్యాడికల్ అజయ్(Radical Ajay) పిలుపునిచ్చారు. వారితో పోడ్‌కాస్ట్ డిస్కషన్ చేసేందుకు తను సిద్ధమని, అందుకు తనే స్టూడియో ఏర్పాటు చేస్తానని అన్నారు. ఈ డిస్కషన్‌ను ఎటువంటి ఎడిటింగ్ లేకుండా అప్‌లోడ్ చేస్తానని, నిజాలు, ఆధారాలతో మాత్రమే ఈ డిస్కషన్ ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమం కోసం రూల్స్ కూడా పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు radicalajaykumar@gmail.comకి మెయిల్ చేయాలని చెప్పారు.