Latest
CJP ప్రొటెస్ట్స్‌కి దిగొచ్చిన కేంద్రం.. విద్యాశాఖలో చేంజ్!
NEET పేపర్ లీక్ గొడవపై కాకరోచ్ జనతా పార్టీ (CJP) వరుస ప్రొటెస్ట్స్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో ఆఫీసర్లను మారుస్తూ బిగ్ డెసిషన్ తీసుకుంది. ఎగ్జామ్స్ పక్కాగా జరగాలని, బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్స్ రావడంతో.. హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వినీత్ జోషిని పంచాయతీ రాజ్ శాఖకి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆయన ప్లేస్‌లో నరేష్ పాల్ గంగ్వార్‌ను కొత్త సెక్రటరీగా నియమిస్తూ కేబినెట్ కమిటీ ఓకే చెప్పేసింది

GOOGLE Vs AI
ఒకప్పుడు చిన్న సందేహం వచ్చినా గూగుల్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏఐ సెర్చ్ టూల్స్ దాన్ని మార్చేస్తున్నాయి. వందల లింకులతో టైం వేస్ట్ కాకుండా ఏఐ డైరెక్ట్ సమాధానం ఇస్తుంది. కొత్త వాటిని వెతకడానికి, కష్టమైన విషయాలను అర్థం చేసుకోవడానికి, కోడింగ్ తప్పులు దిద్దడానికి ఏఐ సహాయపడుతుంది. అధికారిక రీసెర్చ్ పేపర్లు, స్థానిక సమాచారం, షాపింగ్, ధరల పోలిక, మూవీ రివ్యూల కోసం గూగుల్ సెర్చ్ నమ్మదగినదిగా ఉన్నా, ఐడియాలు వెంటనే రావాలంటే ఏఐని వాడాల్సిందే.

పిల్లలు భారం కాదు.. భవిష్యత్తుకు ఆస్తి
AP: పిల్లలు భారం కాదని, భవిష్యత్తుకు వారే అసలైన ఆస్తి అని CM చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘తల్లికి వందనం’ పథకాన్ని డబ్బు కోసం కాదు, మనసుతో అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు త్వరలో ఉచితంగా సోలార్ ప్యానెల్స్ అందిస్తామని ప్రకటించారు. హైస్కూల్ నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బోధిస్తామని, మూడు నెలలల్లోపు ప్రతి ఇంటికీ ఫోన్, వైఫై ఉండాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

వేగంగా నిద్రపోవడానికి మిలిటరీ మెథడ్
రాత్రిపూట నిద్రపట్టక ఇబ్బంది పడేవారికి 'మిలిటరీ స్లీప్ మెథడ్'. ఈ పద్ధతి ద్వారా కేవలం రెండు నిమిషాల్లోనే ప్రశాంతంగా నిద్రపోవచ్చు. దీనికోసం కళ్లు మూసుకుని ముఖం, దవడలు, భుజాలు, చేతుల కండరాలను పూర్తిగా సడలించాలి. నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ ఛాతీని, కాళ్లను ప్రశాంతంగా వదిలెయ్యాలి. మనస్సులోని ఆలోచనలను పక్కనపెట్టి, ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలను పది సెకన్ల పాటు ఊహించుకోవాలి. మొదట్లో ఈ పద్ధతి సరైన ఫలితం ఇవ్వకపోవొచ్చు. రిజల్ట్ కోసం కనీసం ఆరు వారాలపాటు ప్రాక్టీస్ కావాలి.

డిగ్రీ పూర్తి చేసిన వారికి పీఎన్‌బీలో ఉద్యోగాలు
డిగ్రీ పూర్తి చేసిన వారికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ మంచి అవకాశం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న పీఎన్‌బీ బ్రాంచీల్లో 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలని బ్యాంక్ సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పోస్టులు ఉన్నాయి. ఆఫీసియల్ లింక్: https://pnb.bank.in/Recruitments.aspx

మోదీని కాపాడుతున్న రేవంత్: బీఆర్ఎస్
TG: నీట్ పేపర్ లీకేజీపై బీఆర్‌ఎస్‌వీ నిర్వహించిన నిరసనకు వెళ్తున్న కేటీఆర్‌ను అడ్డుకోవడానికి రేవంత్ రెడ్డి అనుచరులు ప్రయత్నించారని బీఆర్‌ఎస్ ఆరోపించింది. పాత కేసుల్లో అరెస్టు చేస్తారనే భయంతో రేవంత్ అనుక్షణం ప్రధాని మోదీకి మోకరిల్లుతున్నారని, కేటీఆర్ పోరాటాన్ని దొడ్డిదారిలో ఆపడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించింది. విద్యార్థులను అరెస్టు చేస్తూ, నీట్ అక్రమాలపై మోదీని ఒక్క మాట అనకుండా రేవంత్ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడింది.
పామును కాపాడిన నటుడు సోనూ సూద్
నటుడు సోనూసూద్ తన ముంబై హౌసింగ్ సొసైటీలో కనిపించిన పామును సురక్షితంగా కాపాడారు. చాలామంది అతని ధైర్యాన్ని ప్రశంసించగా ‘అది ఎలుక పాము అని..విషం లేనిదని’ ఆయన స్పష్టం చేశారు. అందరి భద్రత కోసం శిక్షణ పొందిన నిపుణులను పిలవాల్సిన అవసరముందని చెప్పారు. స్వయంగా ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని సూచించారు.

CJP నిరసనలకు డైరెక్టర్ శేఖర్ కమ్ముల సపోర్ట్
NEET పేపర్ లీక్ వ్యవహారంపై దర్శకుడు శేఖర్ కమ్ముల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి భరోసా కల్పించాలని కోరారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థుల డిమాండ్లలో న్యాయం ఉందని, ప్రభుత్వం వారి గొంతు వినాలని అన్నారు. చివరగా Gen Z యువత చేస్తున్న ఉద్యమానికి సెల్యూట్ చేస్తూ 'మన పిల్లలు గెలిస్తే దేశం గెలిచినట్టే' అని వ్యాఖ్యానించారు.
‘యువత తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది’
TG: హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసనలో ఓ యువకుడు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. గడిచిన 12 ఏళ్ల మోదీ పాలనలో దేశంలో అనేక విధ్వంసాలు చూశామని, యువత తిరగబడితే కేంద్ర ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని అన్నారు. ప్రభుత్వం తక్షణమే విద్యార్థి వ్యతిరేక పాలసీలలో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశాడు. దిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు మేకులు కొట్టిన లాఠీలతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

స్టూడెంట్స్ కు టీజే ఎస్ సంఘీభావం !
జంతర్ మంతర్ దగ్గర స్టూడెంట్స్ పై పోలీసులు జరిపిన లాఠీ చార్జీని ఖండిస్తూ తెలంగాణ జన సమితి హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన ప్రదర్శన జరిపింది.నీట్ లీకేజీల వల్ల సూసైడ్ చేసుకున్న స్టూడెంట్స్ కుటుంబాలకు రూ. కోటి చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని టీజేఎస్ డిమాండ్ చేసింది. NAT ని తక్షణం రద్దు చేసి పరీక్షల్లో ట్రాన్స్ పరెన్సీని పెంచాలని కోరింది. టీజేఎస్ బృందం ఢిల్లీ వెళ్లి స్టూడెంట్స్ కు మద్దతు ప్రకటిస్తామంది.

ఇన్ స్టా లో మెటా గ్లాసెస్ వీడియోల బ్యాన్
మెటా స్మార్ట్ గ్లాసెస్‌తో రహస్యంగా షూట్ చేస్తూ ప్రజలను, మహిళలను ఇబ్బంది పెట్టే అసభ్యకర POV (పాయింట్-ఆఫ్-వ్యూ), పిక్-అప్ వీడియోలపై ఇన్‌స్టాగ్రామ్ నిషేధం విధించింది. ఇలాంటి వేధింపుల కంటెంట్‌ను తొలగించడమే కాకుండా సంబంధిత ఎక్కౌంట్లను కూడా బ్యాన్ చేస్తామని అధినేత ఆడమ్ మోస్సేరి తెలిపారు. ఇప్పటికే 10 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్న రెండు పాపులర్ అకౌంట్లను తొలగించారు.

కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ రాజీనామా
కేంద్ర రైల్వే, ఫుడ్ ప్రోససింగ్ ఇండస్ట్రీస్ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న బిట్టూ, ప్రధాని మోదీకి, రాష్ట్రపతి ముర్ముకి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని అన్నారు.

నెక్లెస్ రోడ్ లో స్టూడెంట్స్ కి సంఘీభావ సభ !
జంతర్ మంతర్ దగ్గర స్టూడెంట్స్ ప్రొటెస్ట్ కి కల్చరల్ ఆర్గనైజేషన్స్, ఇతర గ్రూపుల సపోర్ట్ పెరుగుతోంది. హైదరాబాద్ నెక్లస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా దగ్గర అరుణోదయా కల్చరల్ ఫెడరేషన్, బాబా సాహెబ్ అంబేద్కర్ రీడింగ్ సర్కిల్ కలసి శనివారం సాయంత్రం 5.30కి ఒక గెట్ టుగెదర్ ను ఏర్పాటు చేస్తున్నాయి. రెసిస్ట్, స్పీక్, రిక్లైమ్ పేరుతో నీట్ లీకేజీలపై పాటలు, పద్యాలు, కవితల రూపంలో తమ నిరసనను వ్యక్తం చేయవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయండి: మంత్రులకు ప్రధాని సూచన
ఢిల్లీలో యువత, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో యంగ్ జనరేషన్ తో మంచి రిలేషన్స్ పెంచుకోవాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సూచించారు. క్యాబినెట్ మీట్ లో మాట్లా డుతూ... కోట్ల మంది యువకులు ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో మంత్రులందరూ యాక్టివ్ గా ఉండాలని, రీల్స్ చేస్తూ ఇంటరాక్టివ్ సెషన్స్ ద్వారా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను యువతకు వివరించాలని మోదీ చెప్పారు.

ధర్మేంద్ర తప్పుకోవాల్సిన అవసరం లేదు: కేంద్రం
NEET పేపర్ లీకేజీ కలకలంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఆయన రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయని ఎన్డీటీవీ మీడియా సోర్సులు తెలియచేస్తున్నాయి. "రాజీనామా చేయడం అత్యంత తేలికైన నిర్ణయం" అని, ప్రభుత్వం మంత్రికి పూర్తి అండగా నిలుస్తుందని కేంద్ర వర్గాలు అన్నాయి. NTA లోపాలను సవరించి లీకేజీ గ్యాంగ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపాయి.

కోర్టు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు: సుప్రీం కోర్టు
ఇకపై కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు షేర్ చేయడానికి వీల్లేదని సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. కోర్టు పర్మిషన్ లేకుండా వీడియోలు పోస్ట్ చేసినా, మోనెటైజ్ చేసినా యాక్షన్ తప్పదని వార్నింగ్ ఇచ్చింది. కోర్టులేమీ 24 గంటలు నడిచే ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ కావని జడ్జీలు గట్టిగా కామెంట్ చేశారు. ఈ విషయాన్నే తీవ్రంగా పరిగణించిన కోర్టు.. మెటా, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు నోటీసులు జారీ చేసింది. అయితే, నార్మల్ న్యూస్ రిపోర్టింగ్‌కి మాత్రం ఈ రూల్ వర్తించదని క్లారిటీ ఇచ్చింది.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరొకరి బలి!
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మళ్లీ ఊహించని యాక్సిడెంట్ జరిగింది. కోక్ ఓవెన్ బ్యాటరీ వద్ద రెండేళ్లుగా పనిచేయని ఎలక్ట్రికల్ బస్ బార్ మీద పడటంతో అనంత బార్వే (52) అనే కార్మికుడు సీరియస్‌గా ఇంజ్యూర్ అయ్యాడు. వెంటనే ప్రైవేట్ హాస్పిటల్‌కి షిఫ్ట్ చేసినా, ట్రీట్‌మెంట్ పొందుతూ చనిపోయాడు. రీసెంట్‌గా లాడర్ పేలి తొమ్మిది మంది చనిపోయిన ఇన్సిడెంట్ మరువకముందే ఈ ఘోరం జరిగింది. ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడమే కారణమని, కార్మికుల సేఫ్టీపై ప్లాంట్ మేనేజ్‌మెంట్ దృష్టి పెట్టాలని యూనియన్ లీడర్స్ డిమాండ్ చేస్తున్నారు.
KCRతో కలిసి KTR బర్త్‌డే సెలబ్రేషన్స్..
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తన బర్త్‌డే వేడుకలను ఎర్రవల్లిలోని అగ్రికల్చరల్ ఫీల్డ్స్‌లో ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి జరుపుకున్నారు. తండ్రి KCR, భార్య శైలిమ, పిల్లలు హిమాన్షు, అలేఖ్యలతో కలిసి మొక్క నాటి నీళ్లు పోశారు. అనంతరం కుటుంబ సభ్యులందరూ కలిసి అక్కడ ఫోటోలు దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోస్ అండ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్- వేణుస్వామి
CJP పార్టీ ఫ్యూచర్ పై వేణుస్వామి షాకింగ్ అనాలిసిస్ చేశారు. ఈ పార్టీ జాతకంలో బుధాదిత్య, కాలసర్ప రాజయోగాలు ఉండటం వల్ల ఫ్యూచర్ లో క్రేజ్, పబ్లిసిటీ విపరీతంగా పెరుగుతాయని చెప్పారు. దీని ప్రభావంతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 100% రాజీనామా చేసే చాన్స్ ఉందట. ఈ CJP వల్ల దాదాపు 90% నష్టం BJPకే జరుగుతుందని, భవిష్యత్తులో కేంద్రంలో ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా CJP కీ-రోల్ ప్లే చేస్తుందని చెప్పారు. అయితే ఈ పార్టీకి చెందిన ముగ్గురు లీడర్లు జైలుకి వెళ్లే సూచనలు కూడా ఉన్నాయని జోస్యం చెప్పారు.

రాత్రి భోజనం తర్వాత పండ్లు తింటున్నారా?
రాత్రి భోజనం చేసిన వెంటనే పండ్లు తింటే జీర్ణక్రియ మందగించి కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయని న్యూట్రిషియన్లు అంటున్నారు. కడుపులో ఆమ్లత్వం వల్ల పండ్లు పులియకపోయినా, ఆలస్యంగా జీర్ణమవ్వడం వల్ల అసౌకర్యం కలుగుతుంది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్(IBS), ఎసిడిటీ, అలసట, బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు రాత్రి భోజనం తర్వాత పండ్లకు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు. పండ్లను ఉదయం పూట ఖాళీ కడుపుతో లేదా భోజనానికి మధ్య సమయంలో తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

జంతర్ మంతర్ వద్ద ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్
జంతర్ మంతర్ వద్ద నీట్ నిరసన ప్రాంతంలో దిల్లీ పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. పాత నేరస్థులు, పరారీలో ఉన్నవారిని గుర్తించడానికి వీటిని కీలక మార్గాల్లో పెట్టారు. ఇవి నేరుగా పోలీసు డేటాబేస్‌తో అనుసంధానమై పనిచేస్తాయి. నిరసనకారులకు కాకుండా, అల్లర్లు సృష్టించే నేరస్థులను పట్టుకోవడమే దీని ముఖ్య ఉద్దేశమని అధికారులు చెప్పారు. ఈ కెమెరాలు తీసిన ముఖాలను వెంటనే డేటాబేస్‌తో పోల్చి తగిన చర్యలు తీసుకుంటారు.