Latest

సౌత్ ఆఫ్రికా స్టార్ 'చాడ్ లె క్లోస్' రికార్డు
Sports· 25 Jul 2026

సౌత్ ఆఫ్రికా స్టార్ 'చాడ్ లె క్లోస్' రికార్డు

సౌత్ ఆఫ్రికా స్టార్ ఈతగాడు 'చాడ్ లె క్లోస్' కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. పురుషుల 4x100 మీటర్ల ఫ్రీస్టైల్ రిలేలో బ్రోన్జ్ మెడల్ సాధించాడు. ఈ గేమ్స్‌లో అత్యధిక మెడల్స్ గెలిచిన మెన్ అథ్లెట్‌గా నిలిచాడు. ఆయన ఖాతాలో మొత్తం 19 కామన్వెల్త్ మెడల్స్ చేరాయి. ఇప్పటివరకు 18 పతకాలతో మొదటి స్థానంలో ఉన్న ఫిల్‌ ఆడమ్స్, మిక్ గాల్ట్‌ల రికార్డును దాటేశాడు. లె క్లోస్ ఇప్పటివరకు తన కెరీర్‌లో ఏడు గోల్డ్, నాలుగు సిల్వర్, ఎనిమిది బ్రోన్జ్ సాధించాడ

మాజీ మంత్రి జోగి రమేష్‌పై కేసు
News· 25 Jul 2026

మాజీ మంత్రి జోగి రమేష్‌పై కేసు

AP: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుటుంబసభ్యులపై ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్టేషన్‌లో హత్యాయత్నం, గృహహింస, వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఆయన పెద్ద కోడలు మేఘన ఇచ్చిన ఫిర్యాదులో జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్‌ సహా 11 మంది పేర్లను చేర్చారు. ఏడాదిగా కుటుంబసభ్యులంతా తనను గదిలో బంధించి కొడుతున్నారని, చంపేందుకు కూడా ప్రయత్నించారని మేఘన ఫిర్యాదులో తెలిపారు.

నీట్ నిరసనపై నటుడు నవదీప్ స్పందన
News· 25 Jul 2026

నీట్ నిరసనపై నటుడు నవదీప్ స్పందన

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనకు నటుడు నవదీప్ స్పందించారు. 'మన అభిప్రాయాలతో ఏం మార్చగలం?' అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నించారు. నీట్ అంశంపై విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడుతున్న టాలీవుడ్ నుంచి స్పందన రావడం లేదంటూ సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శల గురించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

చైనా, రష్యాలకు ట్రంప్ వార్నింగ్
World· 25 Jul 2026

చైనా, రష్యాలకు ట్రంప్ వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా, రష్యాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌కు ఆయుధాలు అందించినా, సైనిక సాయం చేసినా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరూ ఇరాన్‌కు ఆయుధాలు ఇవ్వం అని తనకు మాటిచ్చారని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు దేశాలు ఇరాన్‌కు మద్దతుగా లేవని తాను నమ్ముతున్నానని, ఒకవేళ సాయం చేస్తున్నట్లు తేలితే, అది వారి ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధమవుతుందని హెచ్చరించారు.

పొరండ్ల గ్రామంలో ఆరోగ్యశాఖ హైఅలర్ట్
Health· 25 Jul 2026

పొరండ్ల గ్రామంలో ఆరోగ్యశాఖ హైఅలర్ట్

TG: జగిత్యాల జిల్లా పొరండ్ల గ్రామంలో విషజ్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వైరల్ ఫీవర్ బారిన పడి వరుణ్‌తేజ్‌ (6), హార్‌స్మిత్‌ (6) అనే ఇద్దరు చిన్నారులు రెండు రోజుల వ్యవధిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇద్దరూ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమై ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇంటింటికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్-కర్ణాటకలో ఆ రైల్వే లైన్లకు మహర్దశ
News· 25 Jul 2026

ఆంధ్రప్రదేశ్-కర్ణాటకలో ఆ రైల్వే లైన్లకు మహర్దశ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. కర్ణాటక–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని బళ్లారి–గుంతకల్ రైల్వే సెక్షన్‌లో మూడో, నాలుగో లైన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ రూ.1,264 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఆధారంగా రూపొందించిన ఈ ప్రాజెక్టు ద్వారా రవాణా అనుసంధానం, లాజిస్టిక్ సామర్థ్యం మెరుగుపడటంతోపాటు రవాణా వేగవంతం కానుంది.

బాలికపై మేనమామ, సోదరుల లైంగిక దాడి
Crime· 25 Jul 2026

బాలికపై మేనమామ, సోదరుల లైంగిక దాడి

TG: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో ఉన్న మేనమామ, వరసకు సోదరులయ్యే ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్రకు చెందిన బాలిక(13)పై అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రులు మరణించడంతో అమ్మమ్మ వద్ద ఉంటూ హాస్టల్‌లో చదువుకుంటుంది. సెలవుల్లో ఇంటికి వచ్చిన ఆమె ఒంటరిగా ఉండటం చూసి లైంగిక దాడి చేశారు. పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

నీట్ ఆందోళనల్లో దేశ వ్యతిరేక శక్తులు: బండి సంజయ్
Politics· 25 Jul 2026

నీట్ ఆందోళనల్లో దేశ వ్యతిరేక శక్తులు: బండి సంజయ్

TG: దిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనల ముసుగులో దేశ వ్యతిరేక శక్తులున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. పరిస్థితులను నీట్ సమస్యకు సంబంధం లేని ఆర్టికల్ 370, కాశ్మీర్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు సంబంధించిన నినాదాలు వినిపించడం ఆందోళనకరమన్నారు. శాంతియుత నిరసనలను హింసాత్మకంగా మార్చే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. అమాయక విద్యార్థులను అడ్డుపెట్టుకుని విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాల పట్ల ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

ఫస్ట్ Gen Z రూలర్ ఈమె
World· 25 Jul 2026

ఫస్ట్ Gen Z రూలర్ ఈమె

150 ఏళ్ల తర్వాత స్పెయిన్‌ మళ్లీ క్వీన్ పాలనలోకి వెళ్లబోతోంది. 2005 అక్టోబర్లో పుట్టిన 2౦ ఏళ్ల GenZ అమ్మాయి స్పెయిన్ దేశానికి త్వరలో కాబోయే క్వీన్. ఆమె పేరు ప్రిన్సెస్ లియోనోర్. ఫిలిప్ VI కూతురు. క్వీన్ ఇసాబెల్లా II తర్వాత ఆ దేశానికి క్వీన్ (ఉమెన్ రూలర్) అవుతున్నారు. లియోనోర్ రాయల్ రూల్స్ ప్రకారం మూడేళ్ల మిలిటరీ ట్రైనింగ్‌ను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేశారు. సోలోగా మిలిటరీ విమానాన్ని నడిపారు. ఆరుకి పైగా భాషల్ని అనర్గళంగా మాట్లాడగలరు. త్వరలో సైన్యానికి తొలి ఉమెన్ సుప్రీం బాధ్యతలు తీసుకుంటారు.

గన్‌తో బెదిరించి.. ATMను ఎత్తుకెళ్లిన ముఠా
Crime· 25 Jul 2026

గన్‌తో బెదిరించి.. ATMను ఎత్తుకెళ్లిన ముఠా

AP: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అర్ధరాత్రి దొంగలు SBI ATMను ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ఏటీఎంను బొలెరో వాహనంలో తీసుకెళ్లిన దుండగులు, అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులను తుపాకీతో బెదిరించి పరారయ్యారు. దాంట్లో రూ.10 నుంచి రూ.13 లక్షల వరకు నగదు ఉన్నట్లు సమాచారం. అనంతరం మిషన్‌ను మరో కంటైనర్‌లోకి మార్చినట్లు పోలీసులు గుర్తించారు. స్థానికులు సెల్‌ఫోన్లలో చిత్రీకరించిన వీడియోలు, CC ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.

పేపర్ లీక్ కేసులో సంచలనం.. గుప్తా అరెస్ట్
Crime· 25 Jul 2026

పేపర్ లీక్ కేసులో సంచలనం.. గుప్తా అరెస్ట్

మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బిరేంద్ర కుమార్ గుప్తాను బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను పుణె విమానాశ్రయానికి తీసుకువచ్చి భివాండి పోలీసులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. టెట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలపై ఈ కేసు నమోదు కాగా, గుప్తా పాత్రపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టనున్నారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

టైఫాయిడ్ బారిన పడిన CJP చీఫ్
India· 25 Jul 2026

టైఫాయిడ్ బారిన పడిన CJP చీఫ్

నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలో అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్ నిర్ధారణ అయింది. తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతున్న ఆయనకు వైద్య పరీక్షల్లో టైఫాయిడ్ ఉన్నట్లు తేలింది. అనారోగ్యం కారణంగా కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నప్పటికీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఆరోగ్య పరిస్థితి మధ్య కూడా ఉద్యమాన్ని కొనసాగించనున్నట్లు ప్రకటించారు.

పేదరికాన్ని జయించి స్పేస్ మిషన్‌లో చోటు
AP· 25 Jul 2026

పేదరికాన్ని జయించి స్పేస్ మిషన్‌లో చోటు

AP: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని కందుల జెస్సీ పేదరికాన్ని జయించి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు పొందింది. సైన్స్‌పై ఆసక్తితో పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో పలు వినూత్న ప్రాజెక్టులు రూపొందించిన ఆమె, 'శక్తిశాట్-ఇంటర్నేషనల్ స్పేస్ మిషన్' కోసం జరిగిన ఎంపికల్లో 108 దేశాల నుంచి నమోదైన 12 వేల మందిలో భారత్ తరఫున ఎంపికైన 21 మందిలో చోటు దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థినిగా ఆమె నిలిచింది.

పోలీసుల చర్యలపై సుప్రీంకోర్టు సీరియస్
India· 25 Jul 2026

పోలీసుల చర్యలపై సుప్రీంకోర్టు సీరియస్

నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనల సందర్భంగా పోలీసుల బలప్రయోగంపై సుప్రీంకోర్టు స్పందించింది. పోలీసుల అణచివేత చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లను జూలై 27న విచారించేందుకు అంగీకరించింది. CJI జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. విద్యార్థులపై విచక్షణారహితంగా బలప్రయోగం జరుగుతోందని, న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరారు. దీనిపై విచారణకు స్వీకరిస్తూ సోమవారం విచారణ చేపడతామని తెలిపారు.

దేశాన్ని కుదిపేస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు
Crime· 25 Jul 2026

దేశాన్ని కుదిపేస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు

NCRB నివేదిక ప్రకారం 2014 నుంచి 2024 వరకు దేశవ్యాప్తంగా 1,23,918 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు 80 శాతం పెరిగి, 2014లో 8,068 నుంచి 2024లో 14,488కు చేరాయి. కుటుంబ సమస్యలు ప్రధాన కారణంగా నిలవగా, పరీక్షల్లో వైఫల్యం కారణంగా 25 వేలకుపైగా మంది ప్రాణాలు తీసుకున్నట్లు నివేదిక వెల్లడించింది. విద్యా సంస్థల్లో పెరుగుతున్న అకాడమిక్ ఒత్తిడి కూడా కీలక కారణంగా పేర్కొంది. మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవగా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తదుపరి స్థానాల్లో ఉన్నాయి.

రాజీనామాపై తేలని చర్చలు.. ఉత్కంఠ
India· 25 Jul 2026

రాజీనామాపై తేలని చర్చలు.. ఉత్కంఠ

నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, CJP మధ్య జరిగిన చర్చలు ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిశాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఇరువర్గాలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ప్రభుత్వం మరో 24 గంటల సమయం కోరింది. లీకేజీల నియంత్రణకు కొత్త బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పరీక్షల నిర్వహణ సంస్థలో పలువురు సిబ్బందిని తొలగించగా, ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దీంతో ఇవాళ ఉత్కంఠ నెలకుంది.

హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు వార్నింగ్
TG· 25 Jul 2026

హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు వార్నింగ్

TG: హైడ్రా కమిషనర్ AV.రంగనాథ్ వ్యవహారశైలిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో సమర్పించిన అఫిడవిట్‌లో పశ్చాత్తాపం కనిపించలేదని తెలిపింది. హైడ్రాకు అసాధారణ అధికారాలు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తూ, రాష్ట్రంలోని అన్ని శాఖలు హైడ్రాకు మోకరిల్లాయా అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. హైడ్రా ఎక్కడికి వెళ్లినా భారీ పోలీసు బలగాలు, వనరులు ఎలా సమకూరుతున్నాయో ప్రభుత్వం వివరించాలని సూచించింది. పూర్తి అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత తదుపరి చర్యలపై ఈ నెల 27న విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

పని దొరికే చోటే ఇల్లు
TG· 25 Jul 2026

పని దొరికే చోటే ఇల్లు

TG: నిరుపేదలకు కేటాయించే ఇందిరమ్మ ఇళ్లు జనావాసాలకు దూరంగా కాకుండా, ఉపాధి అవకాశాలకు దగ్గరగా ఉండేలా నిర్మించాలని CM రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. CURE (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ORR పరిధిలో ప్రభుత్వ నిరుపయోగ స్థలాలను గుర్తించి అక్కడే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు.

వివేకా హత్య కేసులో సునీతకు  ఎదురు దెబ్బ
AP· 25 Jul 2026

వివేకా హత్య కేసులో సునీతకు ఎదురు దెబ్బ

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతకు గట్టి ఎదురు దెబ్బ తగిలింద. సీబీఐ చార్జి షీటును తిరస్కరించాలని సునీత వేసిన పిటిషన్ ను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టేసింది. కేసు దర్యాప్తు సమగ్రంగా లేదని మరికొందరిని విచారించాలని సునీత వాదించారు. అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు పూర్తి చేశామని సీబీఐ కోర్టుకు తెలిపింది.

వీడియో రిలీజ్ చేయడం కాదు,  పార్లమెంట్‌లో మాట్లాడాలి
Politics· 25 Jul 2026

వీడియో రిలీజ్ చేయడం కాదు, పార్లమెంట్‌లో మాట్లాడాలి

ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులను బెదిరించడం సరికాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఇందుకు ప్రభుత్వం జవాబుదారీగా నిలవాల్సి ఉంటుందని అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు కేవలం కంటితుడుపు చర్యేనని, దానితో సమస్య పరిష్కారం కాదన్నారు. ఇది ఏకపక్ష మన్‌కీబాత్‌ కాదని, ప్రధాని పార్లమెంటులో మాట్లాడాలన్నారు. వెంటనే మోదీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించడం అమానుషమని ఫైరయ్యారు.

నీట్ లీకేజీలపై చర్యలు-NTA లో 47 మంది పై వేటు !
News· 25 Jul 2026

నీట్ లీకేజీలపై చర్యలు-NTA లో 47 మంది పై వేటు !

నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ నిరసనలపై రెస్పాండ్ అయిన కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లోని 47 మంది అధికారులను తొలగించింది. నెల రోజుల్లో NTA వ్యవస్థను రిఫామ్ చేసేందుకు యాక్షన్ మొదలు పెట్టింది. ఔట్‌సోర్సింగ్ విధానాల్లో మార్పులతో పాటు, లీకేజీలను అరికట్టేందుకు నిందితులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹10 కోట్ల వరకు ఫైన్ విధించే కఠినమైన చట్ట సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.