Latest

పులసకు ‘గో’దారేది?
AP: గోదావరి జిల్లాలో లభించే అరుదైన, రుచికరమైన 'పులస' చేపల సందడి ఈసారి లేదు. హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతం ద్వారా గోదావరిలోకి ఎదురీదే ఈ చేపలు ఎర్రటి మట్టి నీటిలోని పోషకాల కారణంగా ఒమేగా-3 కొవ్వుతో, అద్భుతమైన రుచితో ఉంటాయి. వర్షాలు లేకపోవడం, నదిలో ప్రవాహం తగ్గడం వల్ల చేపలు గోదావరిలోకి రాలేకపోతున్నాయి. జూలై మూడో వారమొచ్చినా ఒక్క చేప కూడా దొరకలేదని మత్స్యకారులు చెబుతున్నారు.

మోదీ నిర్ణయంపై నారా లోకేష్ పోస్ట్
AP: 'నీట్' పేపర్ లీక్ కేసుల కోసం 'ఫాస్ట్ ట్రాక్ కోర్టులు' పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి నారా లోకేష్ మెచ్చుకున్నారు. ఈ నిర్ణయం యువత భవిష్యత్తుకు ఎంతో రక్షణ ఇస్తుందని చెప్పారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే వారికి ఇది గట్టి హెచ్చరిక అన్నారు. స్టూడెంట్స్ భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని లోకేష్ తెలిపారు.

'నీట్' పేపర్ లీక్ పై రేపు BRS ప్రొటెస్ట్
TG: దిల్లీలో NEET పేపర్ లీక్ ప్రొటెస్ట్‌లో విద్యార్థులపై జరిగిన పోలీసుల అణచివేతను ఖండిస్తూ, సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ BRS పార్టీ నిరసనకు పిలుపునిచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ KTRతో కలిసి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో నిరసనకు హాజరవుతారు. వేలాది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్న NEET లీక్‌ను ఖండిస్తూ, ఈ నిరసనను చేపట్టనున్నారు

ఆగస్టులో రెండు గ్రహణాలు
2026 ఆగస్టులో రెండు గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం, ఆగస్టు 28న పాక్షిక చంద్రగ్రహణం సంభవించనున్నాయి. ఇది చాలా అరుదైన ఘటన అని, అయితే ఈ రెండు గ్రహణాలు భారత్‌లో కనిపించవని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు.
ప్రొటెస్ట్‌లో పోరాటం..సోషల్ మీడియాలో మీమ్‌ల ప్రవాహం
దిల్లీ విద్యార్థుల నిరసనకు GenZ ఫుల్ వైరల్ ట్విస్ట్ ఇచ్చింది. పోలీసుల నుంచి పరుగెత్తిన వీడియోలకు ‘Subway Surfers IRL’, ‘1.60 km Pace – Thanks for the cardio, Delhi Police!’ అంటూ మీమ్స్ పేలాయి. టీ-రెక్స్ కాస్ట్యూమ్‌లో వచ్చిన నిరసనకారుడిపై ‘Dinosaur Wild Card Entry’ ట్రెండ్ అయింది. బాలీవుడ్ పాటలు, రీల్స్, ఫన్నీ ఎడిట్స్‌తో నిరసన తెలుపుతూ సోషల్ మీడియాలో మీమ్ ఫెస్టివల్ చేస్తున్నారు.

రేపు హైదరాబాద్‌లో విద్యార్థుల వరుస నిరసనలు
TG: నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో రేపు హైదరాబాద్‌లో విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టనున్నాయి. నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నేతలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధర్నాచౌక్ వద్ద ప్రొటెస్ట్ చేయనున్నారు. ఓయూ విద్యార్థులు కూడా నిరసనల్లో పాల్గొననున్నారు.
మోదీ ప్రకటనపై కేజ్రీవాల్ విమర్శలు
పేపర్ లీక్ కేసుల కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. దీనిపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈ ప్రకటన సరిపోదని పేర్కొంటూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను గుర్తుచేశారు. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై దేశవ్యాప్త నిరసనలు, పరీక్షా విధానంలో సంస్కరణల డిమాండ్లపై 'ఎక్స్' వేదికగా కేజ్రీవాల్ ప్రశ్నించారు.
TPCC అధికార ప్రతినిధులతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ
TG: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ అధికార ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ విజయాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తీసుకెళ్లాలని అన్నారు. ప్రతిపక్షాల విమర్శలను వాస్తవాలతో తిప్పికొట్టాలన్నారు.
ఒక్క ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం లేదా?
TG: ఉస్మానియా యూనివర్సిటీలో ఓ విద్యార్థిని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తాము ఏ రాజకీయ పార్టీ కాదని, కేవలం తమ హక్కుల కోసం, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసమే పోరాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎం మోదీ ఇప్పటివరకూ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. తమిళనాడు వెళ్ళగానే రూపం, మాటలు మారుస్తూ నటనలు చేయడం తప్ప విద్యార్థుల సమస్యలపై కనీసం ఎందుకు మాట్లాడటం లేదని ఆమె ప్రశ్నించారు.

‘మిషన్ శక్తిశాట్'కు ఎంపికైన బాలిక: అభినందించిన పవన్ కళ్యాణ్
AP: ప్రపంచంలోనే తొలి బాలికల లూనార్ క్యూబ్‌శాట్ మిషన్ 'మిషన్ శక్తిశాట్' కోసం భారతదేశ టాప్-20లో ఆంధ్రప్రదేశ్ నుంచి కందుల జెస్సీ ఎంపికైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనను అభినందించారు. ప్రభుత్వ పాఠశాల నుంచి చంద్ర మిషన్ వరకు ఆమె చేసిన ప్రయాణం రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇస్రో ద్వారా దేశానికి సేవ చేయాలనే ఆమె కల సాకారం కావాలని ఆకాంక్షిస్తున్నానని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
హిస్టరీలో మొదటిసారి.. సుప్రీంకోర్టు దగ్గర ఏం జరిగిందంటే?
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న స్టూడెంట్స్ ప్రొటెస్ట్‌కి మద్దతుగా సుప్రీంకోర్టు లాయర్లు రంగంలోకి దిగారు. నిరసనకారులపై పోలీసుల చర్యలను నిరసిస్తూ సుప్రీంకోర్టు ఆవరణలో రాజ్యాంగ పీఠిక (Preamble) చదివారు. అనంతరం జాతీయ గీతం పాడి తమ నిరసన తెలిపారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసమే ఈ నిరసన అని, విద్యార్థులకు న్యాయం జరగాలంటూ లాయర్లు గళమెత్తారు.

ఒంటరిగా పోలీస్ వ్యాన్‌ను ఆపేసింది.. ఎవరీ మోడల్?
NEET పేపర్ లీక్‌పై ముంబై శివాజీ పార్క్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు వ్యాన్‌లో అరెస్ట్ చేశారు. అది చూసిన 27 ఏళ్ల మోడల్ రియా అహిర్, ఒంటరిగానే పోలీస్ వ్యాన్‌కి అడ్డంగా నిలబడి నిరసనకారులను విడుదల చేసేలా చేసింది. గతంలో ఎప్పుడూ ప్రొటెస్ట్‌లలో పాల్గొనని రియా ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన ఆమె చొరవపై తీవ్ర ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
విజయవాడలో విద్యార్థుల భారీ ఆందోళన
AP: విజయవాడలో విద్యార్థి, యువజన సంఘాల 'చలో రాజ్‌భవన్' పిలుపుతో ఉద్రిక్తత నెలకొంది. సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని నేతలు పట్టుబట్టారు. గవర్నర్‌ను కలిపిస్తామని చెప్పి పోలీసులు మోసం చేశారని నిరసనకారులు మండిపడ్డారు. విద్యార్థులపై పోలీసులు దాడి చేయడంతో కొందరికి గాయాలయ్యాయి. సివిల్ డ్రెస్‌లో ఉన్న కొంతమంది పోలీసులు తమను ఈడ్చిపారేశారని విద్యార్థులు అన్నారు.
స్టూడెంట్స్ ని తల్చుకుని అన్నా హజారే ఎమోషనల్!
దేశంలో జరుగుతున్న స్టూడెంట్స్ ప్రొటెస్ట్‌కి సపోర్ట్‌గా ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే రంగంలోకి దిగారు. మహారాష్ట్రలోని అహిల్యానగర్‌లో ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో స్టూడెంట్స్ పరిస్థితిని తలుచుకుని ఆయన ఎమోషనల్ అయ్యారు. ప్రొటెస్ట్ చేస్తోన్న స్టూడెంట్స్‌పై పోలీసుల చర్యలు బాధాకరమని, ఇదొక లా అండ్ ఆర్డర్ సమస్య కాదని ప్రైమ్ మినిస్టర్‌కి లెటర్ కూడా రాశారు.

హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు సెన్సేషనల్ ఆర్డర్స్!
ఆర్మీ భూముల విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు సీరియస్ అయింది. ఆర్మీ భూముల్లోకి ప్రవేశిస్తే రంగనాథ్‌ను అరెస్ట్ చేయాలని, అధికారులకు సంకెళ్లు వేయాలని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ కొనసాగితే ఆర్మీ కస్టడీకి అప్పగిస్తామని హెచ్చరించింది. వివాదాస్పద భూమి దగ్గర 10 మంది ఆర్మీ జవాన్లు రక్షణగా ఉండాలని, హైడ్రా అధికారులు వస్తే అదుపులోకి తీసుకుని వారి వాహనాలను సీజ్ చేయాలని స్పష్టం చేసింది. అవసరమైతే కమిషనర్‌ను ఆర్మీ బ్యారక్స్‌లో ఉంచాలని కామెంట్స్ చేసింది.

టెక్ మహేంద్రా ఆఫీస్ ముందు టెకీ ధర్నా
TG: మేడ్చల్ జిల్లా దుండిగల్‌లోని టెక్ మహేంద్రా సాఫ్ట్‌వేర్ కంపెనీ ముందు భావన అనే ఉద్యోగిని నిరసనకు దిగింది. తన కుమార్తె అనారోగ్యంగా ఉండడంతో మూడు రోజుల సెలవు కోరగా, అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించింది. ముందస్తుగా యాజమాన్యానికి మెసేజ్ పంపి అనుమతి కోరినప్పటికీ, ఉద్దేశపూర్వకంగానే తనను ఉద్యోగం నుంచి తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఆమె దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కంపెనీ ముందు ధర్నా చేశారు.
స్టూడెంట్స్ కోసం రంగంలోకి దిగిన సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్!
జంతర్ మంతర్ వద్ద స్టూడెంట్స్‌కి సపోర్ట్‌గా, పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ రంగంలోకి దిగారు. కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ చదివి నిరసన తెలిపారు. సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ మాట్లాడుతూ.. "ఇది స్టూడెంట్స్ రైట్స్ కి సంబంధించిన మ్యాటర్. వారి తరఫున జస్టిస్ డిమాండ్ చేయడం లాయర్స్‌గా మా రెస్పాన్సిబిలిటీ. జస్టిస్ ఇవ్వడమే సుప్రీం కోర్ట్ మెయిన్ రోల్. అందుకే స్టూడెంట్స్ కోసం న్యాయం అడగడానికి ఇక్కడికి వచ్చాం" అని చెప్పారు.
ప్రొటెస్ట్ లో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ ఖాన్!
ఎగ్జామ్ పేపర్ లీక్స్‌పై CJP ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న స్టూడెంట్స్ ప్రొటెస్ట్‌కి బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ సపోర్ట్ ఇచ్చారు. ముంబై వీధుల్లో వర్షంలోనే స్టూడెంట్స్‌తో కలిసి మార్చ్‌లో పార్టిసిపేట్ చేశారు. “ఇది మన కంట్రీ ఫ్యూచర్ కోసం జరుగుతున్న పోరాటం. అందుకే స్టూడెంట్స్‌కి సపోర్ట్ చేయడానికి వచ్చా” అని ఆయన తెలిపారు. ప్రొటెస్ట్‌లో స్టూడెంట్స్‌తో సెల్ఫీలు దిగుతూ వారిని ఎంకరేజ్ చేశారు.

ఆదర్శ గ్రామం.. మద్యనిషేధంతో కొత్త సందేశం
TG: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గిర్మాపూర్ గ్రామం మద్యం నిషేధించింది. గ్రామసభలో మహిళలు మద్యపానంతో కుటుంబాల్లో నెలకొంటున్న సమస్యలను ప్రస్తావించగా, గ్రామస్థులంతా మద్యం విక్రయాలు, వినియోగాన్ని అరికట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఎవరైనా మద్యం అమ్మినా లేదా నిషేధాన్ని ఉల్లంఘించినా రూ.5 లక్షల జరిమానా విధించాలని తీర్మానించారు. యువతను చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచి, గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడమే తమ లక్ష్యమని గ్రామ పెద్దలు తెలిపారు.
ధర్మేంద్ర ప్రధాన్ కి పాఠాలు చెబుతున్న 9th క్లాస్ స్టూడెంట్!
తన 9th క్లాస్ టెక్స్ట్‌బుక్ పట్టుకుని ఒక స్టూడెంట్ గవర్నమెంట్‌ను ప్రశ్నించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన పొలిటికల్ సైన్స్ టెక్స్ట్‌బుక్ ఓపెన్ చేసి గవర్నమెంట్‌కి డెమోక్రసీ డెఫినిషన్ గుర్తు చేసింది. “డెమోక్రటిక్ గవర్నమెంట్ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని బుక్‌లోనే రాసుంది.. మరి ఇక్కడ ప్రశ్నించే హక్కు లేదా?” అని స్టూడెంట్ ప్రశ్నించింది. ప్రజాస్వామ్యం అంటే ఏంటో బుక్స్ చూసి నేర్చుకోవాలని ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ కు గట్టిగా క్లాస్ తీస్కుంది.

స్టూడెంట్స్ ప్రొటెస్ట్ కి సల్మాన్ ఖాన్ సపోర్ట్!
పేపర్ లీక్ ఇష్యూపై దేశంలో జరుగుతున్న స్టూడెంట్స్ ఆందోళనపై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ స్పందించారు. బెటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కలిసి పీస్‌ఫుల్‌గా ఫైట్ చేయడాన్ని ఆయన అప్రిషియేట్ చేశారు. అయితే ఈ ప్రొటెస్ట్ వైలెంట్‌గా మారడం బాధాకరమన్నారు. ఈ విషయంలో ఎలాంటి పొలిటికల్ ప్రమేయం ఉండకూడదని, గెలుపు విద్యార్థులదే అవ్వాలని విశ్ చేశారు. గవర్నమెంట్ నుంచి పాజిటివ్ డెసిషన్ వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.