Latest

దీక్ష విరమించిన సోనమ్ వాంగ్‌చుక్
India· 24 Jul 2026

దీక్ష విరమించిన సోనమ్ వాంగ్‌చుక్

నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజుల నిరాహార దీక్షను గురువారం అర్ధరాత్రి దాటాక కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో విరమించారు. దేశ విద్యా వ్యవస్థలో సంస్కరణలు, నీట్ పేపర్ లీకేజీలపై స్పష్టత, పారదర్శకత కోసం ఆయన ఈ దీక్ష చేపట్టారు. కేంద్ర మంత్రులు జరిపిన చర్చలు, ఇచ్చిన స్పష్టమైన హామీలతో సంతృప్తి చెంది ఆయన దీక్షను ముగించారు.

గ్లోబరీనా KTR బినామీ కంపెనీ: CM
Politics· 24 Jul 2026

గ్లోబరీనా KTR బినామీ కంపెనీ: CM

TG: వివాదాస్పద గ్లోబరీనా కంపెనీ KTR బినామీ సంస్థ అని CM రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కంపెనీతో కేటీఆర్‌కు సంబంధం లేకుంటే సీసీఎస్‌లో ఫిర్యాదు చేసి విచారణ కోరాలని సవాల్‌ విసిరారు. BRS హయాంలో గ్లోబరీనా సంస్థకు ఇంటర్‌ పరీక్షా పత్రాల మూల్యాంకన కాంట్రాక్టు అక్రమంగా అప్పగించారని, ఆ సంస్థ తప్పిదాల వల్ల 2019లో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. విజిలెన్స్‌ విచారణ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఈ వ్యవహారంపై KTR క్షమాపణలు చెప్పాలన్నారు.

ఎల్‌నినో ముప్పు.. అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలి
AP· 24 Jul 2026

ఎల్‌నినో ముప్పు.. అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలి

AP: దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో ఈసారి క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని CM చంద్రబాబు హెచ్చరించారు. తాగునీటి కొరతతో పాటు పశుగ్రాస సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎల్‌నినో పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ఆయన, తాగునీటి సరఫరాకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పశుగ్రాస కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సంక్షోభాన్ని ఎదుర్కోవాలని సూచించారు.

ఉచిత కంటి పరీక్షలతో దేశానికి రూ.3.6 లక్షల కోట్ల లాభం!
Health· 23 Jul 2026

ఉచిత కంటి పరీక్షలతో దేశానికి రూ.3.6 లక్షల కోట్ల లాభం!

పాఠశాలల్లో ఉచిత కంటి పరీక్షలు, తక్షణ రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేస్తే భారత ఆర్థిక వ్యవస్థకు ఏటా రూ.3.6 లక్షల కోట్ల లబ్ధి చేకూరుతుందని 'IAPB', 'సేవా', 'ఫ్రెడ్ హాల్లోస్' సంస్థల ఉమ్మడి 'వాల్యూ ఆఫ్ విజన్' నివేదిక పేర్కొంది. అందరికీ ప్రాథమిక నేత్ర వైద్యం అందించడం ద్వారా ఉత్పాదకత, ఉద్యోగావకాశాలు పెరిగి దేశ ప్రగతి వేగవంతమవుతుందని అంతర్జాతీయ విశ్లేషకుల ఒపీనియన్ ను బిజినెస్ స్టాండర్ట్ పబ్లిష్ చేసింది.

కజకస్తాన్ లో హీట్ వేవ్- ఆపై హెవీ రెయిన్ !
News· 23 Jul 2026

కజకస్తాన్ లో హీట్ వేవ్- ఆపై హెవీ రెయిన్ !

కజకిస్తాన్ రాజధాని అస్తానా వాతావరణం మైండ్ బ్లాక్ చేస్తోంది! కొద్దిరోజుల కిందటే 39.5°C రికార్డు స్థాయి ఎండలతో అల్లాడిపోయిన ఈ నగరంలో, హఠాత్తుగా కుండపోత వర్షం, వడగళ్ళు పడ్డాయి. ఆకాశానికి తూట్లు పడినట్లు కురిసిన ఈ వానకి రోడ్లన్నీ నదులుగా మారిపోయి, కార్లు నీళ్లలో చిక్కుకుపోయాయి. దెబ్బకి హీట్‌వేవ్ నుంచి ఉపశమనం దేవుడెరుగు... ఈ హఠాత్ వరదల బీభత్సానికి జనాలు అవాక్కయ్యారు!

గుజరాత్ ను కుదిపేస్తున్న  భారీ వర్షాలు !
News· 23 Jul 2026

గుజరాత్ ను కుదిపేస్తున్న భారీ వర్షాలు !

గ్యాప్ లేకుండా పడుతున్న కుండపోత వర్షాలకు గుజరాత్ అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా సూరత్, వల్సాడ్, నవసారి జిల్లాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ఇళ్లు, రోడ్లు పూర్తిగా మునిగిపోయాయి. అహ్మదాబాద్-ముంబై రైల్వే ట్రాక్ వరద నీటిలో చిక్కుకోవడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అహ్మదాబాద్, వడోదర సిటీల్లో డ్రైనేజీలు పొంగి జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని సమీక్షించిన సీఎం భూపేంద్ర పటేల్ రెస్క్యూ టీమ్స్‌ను రంగంలోకి దించారు. వల్సద్ లో 16 గంటల్లో వెయ్యి మి.మీటర్ల వర్షం పడింది.

మొహమాటానికి పోతే మిగిలేది టెన్షన్, ఆవేదనే !
General· 23 Jul 2026

మొహమాటానికి పోతే మిగిలేది టెన్షన్, ఆవేదనే !

అందరినీ మెప్పించడానికి "అవును" అనడం ప్రశాంతతను ఇవ్వకపోగా మనశ్శాంతిని దూరం చేస్తుంది. మనసులో అసంతృప్తిని దాచుకుని బయటకు నవ్వడం నిజమైన శాంతి కాదు. "ఎవరినీ బాధ పెట్టకూడదు" అనే ఆలోచనతో స్వంత ఒపీనియన్ ను అణచి వేసుకోవడం వల్ల టెన్షన్, ఆవేదన పెరుగుతాయి. కోపం లేకుండా, స్పష్టంగా "లేదు" అని చెప్పడం నేర్చుకున్నప్పుడే అసలైన ఆనందం, ఆత్మగౌరవం లభిస్తాయని ‘ద మోస్ట్ ట్రూత్‌ఫుల్ బుక్ ఆఫ్ లైస్: ఎ గైడ్ టు ఓవర్‌కమింగ్ యువర్ లిమిటింగ్ సెల్ఫ్’ అనే సైకాలజీ గైడ్ చెబుతోంది. దీని రచయిత అంకిత్ భంజ్.

చర్చలకు న్యూట్రల్ స్టేజ్ అయితే ఓకే అంటున్న  స్టూడెంట్స్
News· 23 Jul 2026

చర్చలకు న్యూట్రల్ స్టేజ్ అయితే ఓకే అంటున్న స్టూడెంట్స్

పేపర్ లీక్ లపై నిరసన తెలుపుతున్న CJP, విద్యార్థి సంఘాలతో చర్చలకు రెడీ అని కేంద్రం మళ్లీ ప్రకటించింది. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డా చర్చల్లో పాల్గొంటారని, కేంద్రం ఇప్పటి వరకూ నాలుగు ప్రతిపాదనలు పంపిందన్నారు. కానీ మంత్రుల ఇళ్లు లేదా ఆఫీసులలో కాకుండా జంతర్ మంతర్ లేదా తటస్థ ప్రదేశంలోనే చర్చలు జరగాలని CJP స్పష్టం చేసింది. శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం హామీ ఇవ్వాలని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు.

పెల్లెట్ గన్స్ వాడింది నిజమేనంటున్న మెడికల్ రిపోర్టులు
News· 23 Jul 2026

పెల్లెట్ గన్స్ వాడింది నిజమేనంటున్న మెడికల్ రిపోర్టులు

పేపర్ లీకేజీకి నిరసనగా ఢిల్లీలో జరిగిన "చలో సంసద్" ప్రదర్శనలో ఆందోళనకారులపై భద్రతా బలగాలు పెల్లెట్ తుపాకులు ప్రయోగించారని ఒక స్టూడెంట్ మెడికో-లీగల్ రిపోర్ట్ నిర్ధారించిందని, మరొకరు చూపు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని బాధితులు చెబుతున్నారు. అయితే, ప్రదర్శనకారులపై పెల్లెట్ గన్లు లేదా షాట్‌గన్లు అసలు వాడలేదని ఢిల్లీ పోలీసులు ఈ వార్తలను పూర్తిగా ఖండించారు.

స్టూడెంట్స్ కి సచిన్  మెసేజ్ !
News· 23 Jul 2026

స్టూడెంట్స్ కి సచిన్ మెసేజ్ !

పేపర్ లీకేజీలపై పోరాడుతున్న విద్యార్థులకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మద్దతుగా నిలిచారు. విద్యావ్యవస్థ పారదర్శకంగా, మెరిట్ కి పట్టం కట్టాలని అన్నారు. ఓడినా పరవాలేదు కానీ మోసం కూడదు- షార్ట్‌కట్‌లు వద్దన్న తన తండ్రి మాటలను గుర్తుచేస్తూ.. కష్టపడి చదివే యువతకు అన్యాయం జరగకుండా, నిజాయితీకి పట్టం కట్టే వాతావరణాన్ని సమాజం కల్పించాలని పిలుపునిచ్చారు.

విద్యార్థులకు మద్దతుగా రాహుల్ గాంధీ, ప్రతిపక్ష ఎంపీల ర్యాలీ
News· 23 Jul 2026

విద్యార్థులకు మద్దతుగా రాహుల్ గాంధీ, ప్రతిపక్ష ఎంపీల ర్యాలీ

విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తో పాటు పలువురు ప్రతిపక్ష ఎంపీలు ఢిల్లీలోని గాంధీ స్మృతికి బయలుదేరారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన విద్యార్థుల డిమాండ్లకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. శాంతియుత మార్గంలో నిరసన తెలుపుతున్న వారి స్వరానికి బలాన్ని ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తు, వారి హక్కుల పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఇండియా మేల్కొంది- GenZ
Politics· 23 Jul 2026

ఇండియా మేల్కొంది- GenZ

దేశంలో నీట్, నెట్ వంటి పోటీ పరీక్షల పేపర్ లీకేజీలపై విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్, చెన్నై, కలకత్తా, జైపూర్, బెంగళూరు వరకు దాదాపు 30కి పైగా ప్రముఖ నగరాల్లో యువత భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ‘ఇండియా మేల్కొంది’ అంటూ పేపర్ లీక్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి.

మమ్మల్ని కాదు.. రేపిస్టులను పట్టుకోండి!
Politics· 23 Jul 2026

మమ్మల్ని కాదు.. రేపిస్టులను పట్టుకోండి!

ఉత్తరప్రదేశ్ ఆజంఘడ్‌లో నిరసన తెలుపుతున్న ప్రొటెస్టర్లపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై ఒక యువతి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమను అడ్డుకోవడం ఆపి, అసలైన రేపిస్టులను పట్టుకుంటే అత్యాచారాలు ఆగుతాయని పోలీసుల ముందే దైర్యంగా చెప్పింది. తమ హక్కులను అడగడం తప్పా అని ప్రశ్నిస్తూ, న్యాయం కావాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

జంతర్ మంతర్ వద్ద మోదీ గొంతు!
Education· 23 Jul 2026

జంతర్ మంతర్ వద్ద మోదీ గొంతు!

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత నెలరోజుల నుండి నిరుద్యోగ యువత ప్రొటెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే, ఈ నిరసనలో ఒక ప్రొటెస్టర్ ప్రధాని మోదీ వాయిస్‌ను మిమిక్స్ చేస్తూ.. ఆయన ఇచ్చిన హామీలను, రీసెంట్ పేపర్ లీకేజ్ అంశాలను ప్రస్తావిస్తూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఎగ్జామ్స్ రద్దుతో నష్టపోయిన తమకు న్యాయం జరిగే వరకు మరియు ఈ పోరాటంలో విజయం సాధించే వరకు ఐక్యతతో, పీస్‌ఫుల్‌గా ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఓటు లేకపోతే స్కీమ్స్ బంద్: CM రేవంత్
Politics· 23 Jul 2026

ఓటు లేకపోతే స్కీమ్స్ బంద్: CM రేవంత్

ఓటు పోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అందరూ ఓటర్ లిస్ట్‌లో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలని కోరారు. BLOల రోల్ క్రూషియల్ కాబట్టి గ్రౌండ్ లెవెల్‌లో సూపర్ వైజ్ చేయాలని తమ పార్టీ లీడర్స్ ని సూచించారు. తనకు రెండు ఓట్లు లేవని, ఓటును కొడంగల్‌కు మార్చుకున్నాని క్లారిటీ ఇచ్చారు. కావాలని ఫేక్ కంప్లైంట్ ఇస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

ముందు మీ స్కామ్స్‌పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టండి: కపిల్
News· 23 Jul 2026

ముందు మీ స్కామ్స్‌పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టండి: కపిల్

నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసే ముందు అధికార పార్టీలో స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ కేసుల్లో సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించారు. జూన్ 28 నుంచి విద్యార్థుల నిరసనలు 25 రోజులుగా కొనసాగుతున్నా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించలేదని, నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థుల ఆరోగ్యంపైనా నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు.

స్టూడెంట్స్‌కు స్పోర్ట్స్ స్టార్స్ సపోర్ట్!
Education· 23 Jul 2026

స్టూడెంట్స్‌కు స్పోర్ట్స్ స్టార్స్ సపోర్ట్!

స్టూడెంట్స్ ప్రొటెస్ట్ కు స్పోర్ట్స్ ప్రపంచం నుంచి మద్దతు పెరుగుతోంది. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, క్రికెటర్లు యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్, షూటర్ మనూ భాకర్, బాక్సర్ నిఖత్ జరీన్ విద్యార్థుల భవిష్యత్తు కోసం పారదర్శక విద్యా వ్యవస్థ, శాంతియుత సంభాషణ, బాధ్యులపై చర్యలు అవసరమని కోరారు. రాజకీయాలకు అతీతంగా యువత గొంతు వినాలని పిలుపునిచ్చారు

మహబూబ్‌నగర్‌లో భారీ ర్యాలీ..
Politics· 23 Jul 2026

మహబూబ్‌నగర్‌లో భారీ ర్యాలీ..

ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా మహబూబ్‌నగర్‌లో విద్యార్థి, యువజన సంఘాల వేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీఛార్జీని నేతలు తీవ్రంగా ఖండించారు. నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, ప్లకార్డులతో భారీస్థాయిలో నిరసన తెలిపారు.

పులసకు ‘గో’దారేది?
Infotainment· 23 Jul 2026

పులసకు ‘గో’దారేది?

AP: గోదావరి జిల్లాలో లభించే అరుదైన, రుచికరమైన 'పులస' చేపల సందడి ఈసారి లేదు. హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతం ద్వారా గోదావరిలోకి ఎదురీదే ఈ చేపలు ఎర్రటి మట్టి నీటిలోని పోషకాల కారణంగా ఒమేగా-3 కొవ్వుతో, అద్భుతమైన రుచితో ఉంటాయి. వర్షాలు లేకపోవడం, నదిలో ప్రవాహం తగ్గడం వల్ల చేపలు గోదావరిలోకి రాలేకపోతున్నాయి. జూలై మూడో వారమొచ్చినా ఒక్క చేప కూడా దొరకలేదని మత్స్యకారులు చెబుతున్నారు.

మోదీ నిర్ణయంపై నారా లోకేష్ పోస్ట్
AP· 23 Jul 2026

మోదీ నిర్ణయంపై నారా లోకేష్ పోస్ట్

AP: 'నీట్' పేపర్ లీక్ కేసుల కోసం 'ఫాస్ట్ ట్రాక్ కోర్టులు' పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి నారా లోకేష్ మెచ్చుకున్నారు. ఈ నిర్ణయం యువత భవిష్యత్తుకు ఎంతో రక్షణ ఇస్తుందని చెప్పారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే వారికి ఇది గట్టి హెచ్చరిక అన్నారు. స్టూడెంట్స్ భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని లోకేష్ తెలిపారు.

'నీట్' పేపర్ లీక్ పై రేపు BRS ప్రొటెస్ట్
TG· 23 Jul 2026

'నీట్' పేపర్ లీక్ పై రేపు BRS ప్రొటెస్ట్

TG: దిల్లీలో NEET పేపర్ లీక్‌ ప్రొటెస్ట్‌లో విద్యార్థులపై జరిగిన పోలీసుల అణచివేతను ఖండిస్తూ, సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ BRS పార్టీ నిరసనకు పిలుపునిచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ KTRతో కలిసి డాక్టర్ ఆర్‌.ఎస్.ప్రవీణ్ కుమార్ రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో నిరసనకు హాజరవుతారు. వేలాది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్న NEET లీక్‌ను ఖండిస్తూ, ఈ నిరసనను చేపట్టనున్నారు