Latest

హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు సెన్సేషనల్ ఆర్డర్స్!
ఆర్మీ భూముల విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు సీరియస్ అయింది. ఆర్మీ భూముల్లోకి ప్రవేశిస్తే రంగనాథ్‌ను అరెస్ట్ చేయాలని, అధికారులకు సంకెళ్లు వేయాలని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ కొనసాగితే ఆర్మీ కస్టడీకి అప్పగిస్తామని హెచ్చరించింది. వివాదాస్పద భూమి దగ్గర 10 మంది ఆర్మీ జవాన్లు రక్షణగా ఉండాలని, హైడ్రా అధికారులు వస్తే అదుపులోకి తీసుకుని వారి వాహనాలను సీజ్ చేయాలని స్పష్టం చేసింది. అవసరమైతే కమిషనర్‌ను ఆర్మీ బ్యారక్స్‌లో ఉంచాలని కామెంట్స్ చేసింది.

టెక్ మహేంద్రా ఆఫీస్ ముందు టెకీ ధర్నా
TG: మేడ్చల్ జిల్లా దుండిగల్‌లోని టెక్ మహేంద్రా సాఫ్ట్‌వేర్ కంపెనీ ముందు భావన అనే ఉద్యోగిని నిరసనకు దిగింది. తన కుమార్తె అనారోగ్యంగా ఉండడంతో మూడు రోజుల సెలవు కోరగా, అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించింది. ముందస్తుగా యాజమాన్యానికి మెసేజ్ పంపి అనుమతి కోరినప్పటికీ, ఉద్దేశపూర్వకంగానే తనను ఉద్యోగం నుంచి తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఆమె దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కంపెనీ ముందు ధర్నా చేశారు.
స్టూడెంట్స్ కోసం రంగంలోకి దిగిన సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్!
జంతర్ మంతర్ వద్ద స్టూడెంట్స్‌కి సపోర్ట్‌గా, పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ రంగంలోకి దిగారు. కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ చదివి నిరసన తెలిపారు. సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ మాట్లాడుతూ.. "ఇది స్టూడెంట్స్ రైట్స్ కి సంబంధించిన మ్యాటర్. వారి తరఫున జస్టిస్ డిమాండ్ చేయడం లాయర్స్‌గా మా రెస్పాన్సిబిలిటీ. జస్టిస్ ఇవ్వడమే సుప్రీం కోర్ట్ మెయిన్ రోల్. అందుకే స్టూడెంట్స్ కోసం న్యాయం అడగడానికి ఇక్కడికి వచ్చాం" అని చెప్పారు.
ప్రొటెస్ట్ లో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ ఖాన్!
ఎగ్జామ్ పేపర్ లీక్స్‌పై CJP ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న స్టూడెంట్స్ ప్రొటెస్ట్‌కి బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ సపోర్ట్ ఇచ్చారు. ముంబై వీధుల్లో వర్షంలోనే స్టూడెంట్స్‌తో కలిసి మార్చ్‌లో పార్టిసిపేట్ చేశారు. “ఇది మన కంట్రీ ఫ్యూచర్ కోసం జరుగుతున్న పోరాటం. అందుకే స్టూడెంట్స్‌కి సపోర్ట్ చేయడానికి వచ్చా” అని ఆయన తెలిపారు. ప్రొటెస్ట్‌లో స్టూడెంట్స్‌తో సెల్ఫీలు దిగుతూ వారిని ఎంకరేజ్ చేశారు.

ఆదర్శ గ్రామం.. మద్యనిషేధంతో కొత్త సందేశం
TG: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గిర్మాపూర్ గ్రామం మద్యం నిషేధించింది. గ్రామసభలో మహిళలు మద్యపానంతో కుటుంబాల్లో నెలకొంటున్న సమస్యలను ప్రస్తావించగా, గ్రామస్థులంతా మద్యం విక్రయాలు, వినియోగాన్ని అరికట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఎవరైనా మద్యం అమ్మినా లేదా నిషేధాన్ని ఉల్లంఘించినా రూ.5 లక్షల జరిమానా విధించాలని తీర్మానించారు. యువతను చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచి, గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడమే తమ లక్ష్యమని గ్రామ పెద్దలు తెలిపారు.
ధర్మేంద్ర ప్రధాన్ కి పాఠాలు చెబుతున్న 9th క్లాస్ స్టూడెంట్!
తన 9th క్లాస్ టెక్స్ట్‌బుక్ పట్టుకుని ఒక స్టూడెంట్ గవర్నమెంట్‌ను ప్రశ్నించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన పొలిటికల్ సైన్స్ టెక్స్ట్‌బుక్ ఓపెన్ చేసి గవర్నమెంట్‌కి డెమోక్రసీ డెఫినిషన్ గుర్తు చేసింది. “డెమోక్రటిక్ గవర్నమెంట్ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని బుక్‌లోనే రాసుంది.. మరి ఇక్కడ ప్రశ్నించే హక్కు లేదా?” అని స్టూడెంట్ ప్రశ్నించింది. ప్రజాస్వామ్యం అంటే ఏంటో బుక్స్ చూసి నేర్చుకోవాలని ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ కు గట్టిగా క్లాస్ తీస్కుంది.

స్టూడెంట్స్ ప్రొటెస్ట్ కి సల్మాన్ ఖాన్ సపోర్ట్!
పేపర్ లీక్ ఇష్యూపై దేశంలో జరుగుతున్న స్టూడెంట్స్ ఆందోళనపై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ స్పందించారు. బెటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కలిసి పీస్‌ఫుల్‌గా ఫైట్ చేయడాన్ని ఆయన అప్రిషియేట్ చేశారు. అయితే ఈ ప్రొటెస్ట్ వైలెంట్‌గా మారడం బాధాకరమన్నారు. ఈ విషయంలో ఎలాంటి పొలిటికల్ ప్రమేయం ఉండకూడదని, గెలుపు విద్యార్థులదే అవ్వాలని విశ్ చేశారు. గవర్నమెంట్ నుంచి పాజిటివ్ డెసిషన్ వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
లీవ్ తీసుకున్నందుకు మహిళా టెకీకి కంపెనీ షాక్
TG: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలో ఓ మహిళ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తన కుమార్తె అనారోగ్యం కారణంగా సెలవు తీసుకున్నందుకు ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించారు. భావన అనే బాధితురాలు ముందస్తుగా సమాచారం ఇచ్చి, హెల్త్ రిపోర్టులు సమర్పించి మూడు రోజుల లీవ్ తీసుకున్నప్పటికీ ఎలాంటి నోటీసు లేకుండా జాబ్ నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రైనింగ్ సమయంలో అనారోగ్యంతో 13 రోజుల సిక్ లీవ్ తీసుకున్నప్పుడు కూడా బెదిరింపు మెయిల్స్ వచ్చాయని తెలిపారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మెయిన్ స్ట్రీమ్ మీడియా సైలెన్స్‌పై సోనాక్షి సిన్హా ఫైర్!
స్టూడెంట్స్‌పై లాఠీచార్జ్ జరుగుతున్నా మెయిన్‌స్ట్రీమ్ మీడియా కవర్ చేయడం లేదని నటి సోనాక్షి సిన్హా మండిపడ్డారు. ఇది రాజకీయ ప్రచారమో, పార్టీల మధ్య గొడవ కాదని.. సరైన విద్యా వ్యవస్థ కోసం పోరాడుతున్న విద్యార్థుల భవిష్యత్తు సమస్య అని స్పష్టం చేశారు. ప్రొటెస్ట్ ప్రదేశాలకు వెళ్లలేకపోయినా, సోషల్ మీడియా ద్వారా వాయిస్ వినిపించకపోవడం పిరికితనమే అవుతుందని కామెంట్ చేశారు. ఇది సమాజంలో మార్పు తెచ్చే ఒక రివాల్యూషన్ అని, ‘మేల్కొనకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది’ అని హెచ్చరించారు.

నిరసనలతో దద్దరిల్లిన ధర్నాచౌక్
TG: దిల్లీలో జరుగుతున్న సీజేపీ నిరసనలకు మద్దతుగా హైదరాబాద్ నగరంలోని ధర్నాచౌక్ దగ్గర నిరసన చేపట్టారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు కేంద్రంపై తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. ప్లకార్డులపై నినాదాలు రాసి ప్రదర్శించారు. విద్యార్థులు కవితలు, పాటలతో కేంద్రాన్ని విమర్శించారు. చిత్రాల కోసం ఫొటోను స్వైప్ చేయండి. 👆👆

సీజేపీ మద్దతుగా నిరసన..కేంద్రం ముందు 5 డిమాండ్లు
TG: దిల్లీలో జరుగుతున్న సీజేపీ నిరసనలకు మద్దతుగా హైదరాబాద్ నగరంలోని ధర్నాచౌక్ దగ్గర నిరసన చేపట్టారు. ఇందులో పాల్గొన్న అందరూ కలిసి కేంద్రం ముందు ఐదు డిమాండ్ల ఉంచారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.కోటి కాన్పన్సేషన్ ప్రకటించాలని, అవినీతితో నిండిపోయిన విద్యావ్యవస్థను మార్చాలని, విద్యార్థులపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని, భవిష్యత్తులో శాంతియుత నిరసనలపై బెదిరింపులు ఉండకూడదని డిమాండ్ చేశారు.

CJPకి గాయని చిన్మయి శ్రీపాద సపోర్ట్
TG: సీజేపీ నిరసనలకు మద్దతుగా హైదరాబాద్ నగరంలోని ధర్నాచౌక్ దగ్గర నిరసన చేపట్టారు. గాయని చిన్మయి శ్రీపాద వారికి మద్దతుగా మాట్లాడారు. సోషల్ మీడియాలో జెన్ జీ మీద నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నారని, అది బాధ కలిగించే విషయమని అన్నారు. విద్యార్థులకు ఈ ప్రభుత్వాలు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఒంటరిగా పోలీస్ వ్యాన్‌ను అడ్డుకున్న లేడీ ప్రొటెస్టర్!
ముంబైలో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ సందర్భంగా ఒక యువతి పోలీస్ వ్యాన్‌ను అడ్డుకుని చేసిన హడావుడి వైరల్ అవుతోంది. వ్యాన్ ముందు ఒంటరిగా నిలబడి, చేతులు పైకి ఎత్తుతూ నినాదాలు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. "నేను స్టూడెంట్‌ని కాదు, కానీ విద్యార్థులపై జరిగిన అణచివేత తప్పు. ప్రభుత్వం వెంటనే జవాబుదారీతనంతో వ్యవహరించాలి" అని డిమాండ్ చేసింది. ఏ పొలిటికల్ పార్టీకి చెందని సాధారణ పౌరురాలిగా విద్యార్థులకు జస్టిస్ జరిగే వరకు తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేసింది.

విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు
TG: BJP ప్రభుత్వం నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కాంగ్రెస్ నిర్వహించిన రాస్తారోకోలో ఆమె పాల్గొని మాట్లాడారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు, నిరుద్యోగులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఫైరయ్యారు.

కాక్రోచెస్ కి మద్దతుగా కమల్ హాసన్..
దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్యూర్ పై నటుడు కమల్ హాసన్ ఫైర్ అయ్యారు స్టూడెంట్స్ కి మద్దతుగా నిలిచారు. లెర్నింగ్ స్థానంలో కోచింగ్, క్యూరియాసిటీ బదులు యాంగ్జైటీ పెరిగిపోవడం సిస్టమ్ లోపానికి నిదర్శనమన్నారు. న్యాయం అడిగే స్టూడెంట్స్‌పై లాఠీఛార్జ్ చేయడం దేశ వైఫల్యమేనని, విద్యార్థుల కలలు నెరవేర్చే రెస్పాన్సిబిలిటీ దేశానిదేనని స్పష్టం చేశారు. ఇదే సమయంలో నిరసన తెలుపుతున్న సోనమ్ వాంగ్‌చుక్‌ని తన హంగర్ స్ట్రైక్ విరమించాలని కమల్ విజ్ఞప్తి చేశారు.

ఈ ఉద్యమాన్ని నీరుకార్చే ప్రయత్నం చేస్తారు: విరించి
TG: సీజేపీ నిరసనలకు మద్దతుగా హైదరాబాద్ నగరంలోని ధర్నాచౌక్ దగ్గర నిరసన చేపట్టారు. Dr. విరించి మాట్లాడుతూ Genz విద్యార్థుల పోరాటం తనకు ఎంతో ఉత్సాహాన్నిచ్చిందన్నారు. జెన్‌జీ చాలా అప్రమత్తంగా ఉండాలని, మనలోనే కొంతమంది ఈ ఉద్యమాన్ని నీరుకార్చే ప్రయత్నం చేస్తారని హెచ్చరించారు. గోడీ మీడియా కనిపిస్తే వారిని పట్టుకొని మరీ మన వాయిస్ వినిపించాలని యువతకు సూచించారు.

సీజేపీ నిరసనలకు మద్దతుగా ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిరసన
TG: దిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలకు మద్దతుగా హైదరాబాద్ నగరం ఇందిరాపార్క్ సమీపంలోని ధర్నాచౌక్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందులో ఒక విద్యార్థిని తన బాధను వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకున్నారు. తాను దళిత వర్గం నుంచి వచ్చానని, డాక్టర్ కావాలనే తన కల నీట్ పేపర్ లీక్ వల్ల ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి అందరం కలిసి బుద్ధి చెప్పాలని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

సాగుపై ఫోన్‌లో ఆరా తీసిన మంత్రి సీతక్క
TG: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ములుగు రైతులతో ఫోన్‌లో మాట్లాడి వర్షాభావ పరిస్థితులు, సాగు విధానాలపై ఆరా తీశారు. అమెరికా తెలంగాణ అసోసియేషన్ సమావేశాల్లో పాల్గొంటున్నప్పటికీ తెలంగాణ రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, విత్తనాల విత్తకం, పంటల ఎంపికపై రైతులకు సూచనలు చేశారు. వర్షాభావం కారణంగా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రప్రభుత్వం చేపట్టిన “జలసిరి” కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.

కోడింగ్‌తో కెరీర్‌ను నిర్మించుకోవాలి
TG: నేటి సాఫ్ట్‌వేర్ రంగంలో కోడింగ్‌కు భారీ డిమాండ్ ఉందని, విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు అనుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని శాతవాహన యూనివర్సిటీ VC ఉమేష్ కుమార్ సూచించారు. కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీలో నిర్వహించిన ‘కోడ్‌క్రాఫ్ట్ పైథాన్’ వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కోడింగ్ ఆధారిత కోర్సులకు ప్రస్తుత పోటీ ప్రపంచంలో విశేషమైన అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కోడింగ్ నైపుణ్యాల ప్రాముఖ్యత, పైథాన్ ప్రోగ్రామింగ్ మెలుకువలపై అవగాహన కల్పించారు.

'ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు కాదు.. మంత్రి రాజీనామా కావాలి'.. CJP ఫైర్!
NEET పేపర్ లీక్ కేసుల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినా Cockroach Janta Party వెనక్కి తగ్గలేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. పేపర్ లీక్ వివాదంలో రాజకీయ బాధ్యత వహించాల్సిందేనని పేర్కొంది.
దేశంలో జరుగుతున్న అన్యాయాలపై స్పందించండి
నటి, నిర్మాత మంచు లక్ష్మి దేశంలో జరుగుతున్న సామాజిక, ప్రజా సమస్యలపై ప్రతి పౌరుడు బాధ్యతగా స్పందించాలని పిలుపునిచ్చారు. మనకెందుకులే అనే నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టి, అన్యాయాలపై ప్రతి ఒక్కరూ తమ స్వరం వినిపించాలని కోరారు. రాజ్యాంగ హక్కుల కోసం ఆందోళన చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా ఆమె సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. సమస్యలపై మాట్లాడటం, చర్చించడం, స్పందించడం కూడా బాధ్యతాయుతమైన పౌరుడి కర్తవ్యమని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు, రాబోయే తరాల సంక్షేమం కోసం ప్రజలంతా చొరవ చూపాలన్నారు.