Latest

హైదరాబాద్‌లో ఇవాళ 4 నిరసనలు, ఒకే డిమాండ్!
AP· 21 Jul 2026

హైదరాబాద్‌లో ఇవాళ 4 నిరసనలు, ఒకే డిమాండ్!

ఢిల్లీ "కాక్రోచ్ జనతా పార్టీ ఛలో పార్లమెంటు" నేపథ్యంలో విద్యార్థుల పట్ల కేంద్రం తీరుకు నిరసనగా నేడు జూలై 21న హైదరాబాద్‌లో 4 సివిల్ సొసైటీ ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, 4 గంటలకు గచ్చిబౌలి, 5 గంటలకు సచివాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మార్చ్, 5:30కు నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో భారీ నిరసన ర్యాలీ. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు, మేధావులు, యాక్టివిస్టులు, సాధారణ ప్రజలు, నీట్ బాధితులు పాల్గొంటారు.

వేలాది మంది స్టూడెంట్స్ గోడు వినరా- ప్రియాంక గాంధీ
Politics· 21 Jul 2026

వేలాది మంది స్టూడెంట్స్ గోడు వినరా- ప్రియాంక గాంధీ

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న యువత ఎదుర్కొంటున్నది చాలా జెన్యూన్ ప్రాబ్లమ్ అని ప్రియాంక గాంధీ స్పందించారు. ఇది ఒక్కరిది కాదు, వేలాది మంది పేద విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయమని, వెంటనే ప్రధానమంత్రి విద్యార్థులను పిలిపించి మాట్లాడి, వారి బాధలను అర్థం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పేపర్ లీకేజీలు, సమస్యలకు బాధ్యత వహిస్తూ సంబంధిత మినిస్టర్ వెంటనే రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు.

మోదీ ప్రభుత్వాన్ని నిలదీసిన రాహుల్ గాంధీ!
Politics· 21 Jul 2026

మోదీ ప్రభుత్వాన్ని నిలదీసిన రాహుల్ గాంధీ!

స్టూడెంట్స్ సమస్యలు, ఎగ్జామ్ పేపర్ లీకేజీలు, ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో లోపాలపై పార్లమెంట్‌లో డిస్కషన్ జరగకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ప్రొటెస్ట్ ప్రదేశాల్లో పోలీసులు దాడులు చేయడం దారుణమని, ఇది దేశ భవిష్యత్తుకు ముప్పు అని మండిపడ్డారు. దేశంలో విద్యార్థులకు ఆపర్చునిటీస్ లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.

స్టూడెంట్స్ కోసం రంగంలోకి MP చంద్రశేఖర్ ఆజాద్!
Politics· 21 Jul 2026

స్టూడెంట్స్ కోసం రంగంలోకి MP చంద్రశేఖర్ ఆజాద్!

విద్యార్థుల నిరసనలకు మద్దతుగా MP చంద్రశేఖర్ ఆజాద్ పార్లమెంట్ ఆవరణలోని బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వద్ద రాత్రంతా ధర్నా చేశారు. శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే విని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు విద్యార్థులకు తోడుగా తన పోరాటం కొనసాగుతుందని క్లియర్ గా చెప్పారు.

ప్రొటెస్ట్‌లో సోనమ్ వాంగ్చుక్ వైఫ్‌పై దాడి!
Politics· 21 Jul 2026

ప్రొటెస్ట్‌లో సోనమ్ వాంగ్చుక్ వైఫ్‌పై దాడి!

ఢిల్లీలో జరిగిన స్టూడెంట్స్ ప్రొటెస్ట్‌పై పోలీసులు అటాక్ చేయడం పట్ల CJP ఫౌండర్ అభిజీత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటెస్టర్స్ పట్ల పోలీసులు చాలా హార్ష్‌గా ప్రవర్తించారని, లేడీస్ అని కూడా చూడకుండా మేల్ పోలీస్ ఆఫీసర్స్ ఫిజికల్ అటాక్ చేశారని ఆరోపించారు. సోనమ్ వాంగ్చుక్ వైఫ్‌పై కూడా దాడి చేశారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని, ఆల్రెడీ 20 మంది స్టూడెంట్స్ చనిపోయినా ఇంకా దాడులు చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. తమ డిమాండ్స్ నెరవేరే వరకు ఈ ప్రొటెస్ట్ ఆపేదే లేదని అభిజీత్ స్పష్టం చేశారు.

భారత్-యూఎస్ ట్రేడ్ డీల్‌పై రైతుల ఫైట్
News· 21 Jul 2026

భారత్-యూఎస్ ట్రేడ్ డీల్‌పై రైతుల ఫైట్

భారత్-అమెరికా ట్రేడ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ దిల్లీలోని కిసాన్ ఘాట్‌ వైపు కాలినడకన వెళ్తున్న పంజాబ్ రైతులను శంభు బోర్డర్ వద్ద పోలీసులు బారికేడ్లతో బ్లాక్ చేశారు. దీంతో రైతులు అక్కడే నిరసన చేపట్టారు. అమెరికా నుంచి సబ్సిడీ పొందిన అగ్రికల్చర్, డెయిరీ ప్రొడక్ట్స్ ఇండియాలోకి వస్తే 8 కోట్ల రైతుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని అన్నారు. ట్రేడ్ ఒప్పంద పత్రాలను వెంటనే పబ్లిక్ చేయాలని, తమతో మాట్లాడకుండా ఏ డీల్ కూడా సైన్ చేయొద్దని డిమాండ్ చేశారు.

'శ్రీనివాస మంగాపురం'తో ఘట్టమనేని వారసుడి సినిమా ఎంట్రీ
Cinema· 21 Jul 2026

'శ్రీనివాస మంగాపురం'తో ఘట్టమనేని వారసుడి సినిమా ఎంట్రీ

సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ లవ్ డ్రామాలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మోహన్‌బాబు విలన్‌గా పవర్‌ఫుల్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై పి.కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 30న విడుదల కానుంది.

హీరో బాలకృష్ణకు గాయాలు
Cinema· 21 Jul 2026

హీరో బాలకృష్ణకు గాయాలు

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో హీరో నందమూరి నటిస్తున్న కొత్త సినిమా 'NBK111' షూటింగ్ సమయంలో బాలకృష్ణ ప్రమాదానికి గురయ్యారు. కాకినాడలో జరుగుతున్న యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయనకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. చికిత్స అనంతరం బాలకృష్ణ కోలుకుంటున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సినిమా టీం చెప్పారు.

డాక్యుమెంట్ రైటర్లకు ఆందోళన అక్కర్లేదు: చంద్రబాబు
AP· 21 Jul 2026

డాక్యుమెంట్ రైటర్లకు ఆందోళన అక్కర్లేదు: చంద్రబాబు

AP: డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ఇబ్బంది లేకుండా చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రభుత్వం ప్రైవేటీకరిస్తున్నదని కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అందులో వాస్తవం లేదని సీఎం స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ సేవలు సులభతరం చేసేలా RSKలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పని చేస్తాయన్నారు.

పుష్కరాల పనులు త్వరగా పూర్తిచేయండి: పవన్ కళ్యాణ్
AP· 21 Jul 2026

పుష్కరాల పనులు త్వరగా పూర్తిచేయండి: పవన్ కళ్యాణ్

AP: ‘స్వచ్ఛ గోదావరి–పవిత్ర పుష్కరాలు’ అనే థీమ్‌తో గోదావరి పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని మునికూడలిని మోడల్ పుష్కర్ పంచాయతీగా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం రూ.7 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో ఈ పనులు కొనసాగుతున్నాయి. మునికూడలి మోడల్ నమూనాతో మిగిలిన పుష్కర పంచాయతీల పనులను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశించారు.

ఉదయ్ కృష్ణారెడ్డి హెల్త్ అప్డేట్
News· 21 Jul 2026

ఉదయ్ కృష్ణారెడ్డి హెల్త్ అప్డేట్

TG: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ సూసైడ్‌కి పాల్పడిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు హైదరాబాద్‌లోని జయంతి హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. ఆయన బ్లడ్ సాంపిల్స్‌లో ఎలాంటి విషపదార్థాలు లేవని డాక్టర్ రవిశంకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆహారం తీసుకోకపోవడం, మోతాదుకు మించి మద్యం తాగడం వల్లే స్పృహ కోల్పోయారని తెలిపారు.

మీరు మమ్మల్ని ఆపలేరు: ప్రకాష్ రాజ్
News· 21 Jul 2026

మీరు మమ్మల్ని ఆపలేరు: ప్రకాష్ రాజ్

దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువత చేపట్టిన నిరసనలకు మద్దతుగా నటుడు ప్రకాష్‌రాజ్ 'X' అకౌంట్‌లో పోస్ట్ చేశారు. పోలీసుల ఆంక్షలు, అణచివేతలను నిరసిస్తూ ‘మీరు మమ్మల్ని ఆపలేరు. ఈ పోరాటం కొనసాగుతుంది’ అని రాశారు. పరీక్షల లీకేజీలు, యువత భవిష్యత్తుపై ప్రశ్నిస్తూ #justasking హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన ఈ నిరసనలో భాగమయ్యారు. ఎంత అణచివేస్తే అంతగా తిరగబడతామని, ప్రజాస్వామ్యంలో యువత హక్కుల కోసం చేసే పోరాటం ఆగదని చెప్పారు.

ప్రొటెస్ట్‌లో నా  పిల్లలు కూడా ఉన్నారు': కేజ్రీవాల్
Politics· 21 Jul 2026

ప్రొటెస్ట్‌లో నా పిల్లలు కూడా ఉన్నారు': కేజ్రీవాల్

నిన్న పార్లమెంట్ దగ్గర జరిగిన ప్రొటెస్ట్‌లో తన ఇద్దరు పిల్లలు కూడా పాల్గొన్నారని AAP లీడర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. పోలీసులు టియర్ గ్యాస్ యూజ్ చేసిన టైమ్‌లో తన పిల్లలు స్టూడెంట్స్‌తో పాటే 4-5 గంటలు అక్కడే ఉన్నారని తెలిపారు. తాను పంజాబ్ పర్యటన వల్ల అటెండ్ అవ్వలేకపోయినా, పార్టీ లీడర్స్, తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రొటెస్టర్స్‌కి సపోర్ట్‌గా నిలిచారని స్పష్టం చేశారు. దేశంలో ఉన్న 140 కోట్ల మంది ఒకే ఫ్యామిలీ అని, ఎవరూ దేనికీ భయపడాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ చెప్పారు.

దైవ దర్శనానికి వెళ్లిన కుటుంబంలో విషాదం
AP· 21 Jul 2026

దైవ దర్శనానికి వెళ్లిన కుటుంబంలో విషాదం

AP: కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాఘవేంద్రస్వామి దర్శనానికి కుటుంబ సభ్యులతో వెళ్తున్న రవి శెట్టి (43) ప్రయాణిస్తున్న కారు నేషనల్ హైవేపై అదుపుతప్పి కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో రవి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

షాకింగ్.. బైక్ ఇంజిన్‌లో నాగుపాము
TG· 21 Jul 2026

షాకింగ్.. బైక్ ఇంజిన్‌లో నాగుపాము

TG: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బస్టాండ్‌లో పార్క్ చేసి ఉన్న ఓ బైక్ ఇంజిన్‌లో భారీ నాగుపాము కనిపించడంతో కలకలం రేపింది. పామును గమనించిన ప్రయాణికులు భయాందోళనకు గురై వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్ క్యాచర్ చాకచక్యంగా బైక్ ఇంజిన్‌లో నుంచి నాగుపామును సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం దానిని పట్టణ శివారులోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటనతో బస్టాండ్‌లో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. వర్షాకాలంలో పాములు వాహనాల్లోకి చేరే అవకాశం ఉన్నందున, పార్క్ చేసిన వాహనాలను స్టార్ట్ చేసే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని స్నేక్ క్యాచర్ సూచించారు.

దిల్లీలో నిరసనకారులపై ఉక్కుపాదం
News· 21 Jul 2026

దిల్లీలో నిరసనకారులపై ఉక్కుపాదం

నిన్న పార్లమెంట్ ముట్టడి కోసం జంతర్ మంతర్ వద్ద వేలాది మంది నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలు ఉపయోగించి, టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో వందమంది వరకూ గాయపడ్డారు. అయినా నిరసన ఆపకుండా కొనసాగించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్తతలు పెరగడంతో నిరసనకారులు సంయమనం పాటించాలని, హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని దిల్లీ పోలీసులు అధికారిక ప్రకటనలో కోరారు.

విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
Viral· 21 Jul 2026

విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం

అమెరికాలోని నార్తర్న్ కెంటకీ ఎయిర్‌పోర్ట్‌లో కలిట్టా ఎయిర్ విమానం ల్యాండింగ్ చేస్తున్న టైంలో వెనుక భాగం రన్‌వేను బలంగా తాకింది. దీంతో నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. పైలట్ వెంటనే విమానాన్ని మళ్లీ గాల్లోకి తీసుకెళ్లి చుట్టూ తిప్పారు. ఆ తర్వాత రన్‌వేపై సురక్షితంగా దించారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సీజేపీ ప్రొటెస్ట్‌పై మోదీ స్పందన
News· 21 Jul 2026

సీజేపీ ప్రొటెస్ట్‌పై మోదీ స్పందన

నీట్ పేపర్ లీక్ నివేదికలు వచ్చిన వెంటనే ప్రభుత్వం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ చెప్పినట్లు కేంద్ర మంత్రి రిజిజు స్పష్టం చేశారు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ 'మంగళ్ మిలన్' సమావేశం అనంతరం మంత్రి మాట్లాడుతూ సీజేపీ ప్రతినిధులు నిన్న ఉదయం కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి తమ డిమాండ్లను వివరిస్తూ లేఖను సమర్పించినట్లు చెప్పారు.

మహిళ ఆత్మహత్యాయత్నం
TG· 21 Jul 2026

మహిళ ఆత్మహత్యాయత్నం

TG: భద్రాచలం వద్ద గోదావరి వంతెనపై ఓ మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి గ్రామానికి చెందిన గొళ్లమూడి శైలజ (37) కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలతో తీవ్ర మనస్తాపానికి గురై నదిలోకి దూకేందుకు ప్రయత్నించింది. స్థానికులు, వాహనదారులు సమయస్ఫూర్తితో ఆమెను అడ్డుకుని కాపాడారు. అనంతరం బూర్గంపాడు పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తన ఇంటి స్థలాన్ని మరిది అక్రమంగా ఆక్రమించుకున్నాడని, భర్తపై తప్పుడు కేసులు పెట్టించి వేధిస్తున్నారని శైలజ ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంసద్ నిరసనల్లో డెలివరీ ఏజెంట్లు, తల్లిదండ్రులు
News· 21 Jul 2026

సంసద్ నిరసనల్లో డెలివరీ ఏజెంట్లు, తల్లిదండ్రులు

దిల్లీలో నిన్న టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీఛార్జ్‌కు ముందే చలో సంసద్ ర్యాలీలో పాల్గొనడానికి వివిధ వర్గాల ప్రజలు జంతర్ మంతర్ వద్ద గుమిగూడారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, డెలివరీ ఏజెంట్లు ఈ దేశ విద్యావ్యవస్థలో మార్పు కోసం నిరసనల్లో పాల్గొనాలని వారంతా పిలుపునిచ్చారు. ఉదయం 9 గంటలకు సీజేపీ చేపట్టిన ఈ ర్యాలీకి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు. పోలీసుల ఆంక్షలను తట్టుకొని వారు ముందుకు కదిలి పార్లమెంట్ దాకా చేరుకున్నారు.

విద్యార్థులపై విరుచుకుపడ్డ దిల్లీ పోలీసులు
News· 21 Jul 2026

విద్యార్థులపై విరుచుకుపడ్డ దిల్లీ పోలీసులు

నీట్ పరీక్ష లీకేజ్‌పై దిల్లీలో 'చలో సంసద్' ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘర్షణలో వందమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన వారిలో 90 మంది నిరసనకారులున్నారు. తలకు బలమైన గాయాలతో కొందరి పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చేర్చి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.