Latest

‘జననాయగన్’..విడుదలకు ముందే రూ.15.22 కోట్లు
తమిళనాడు సీఎం, హీరో విజయ్ నటించిన చివరి చిత్రం 'జననాయగన్' జులై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ముఖ్యమంత్రి అయ్యాక వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా భారీ అంచనాలున్నాయి. 30 దేశాల్లో 8 వేల స్క్రీన్‌లలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి' మూల కథ ఆధారంగా హెచ్.వినోద్ మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు 'ఏ' సర్టిఫికేట్ జారీ చేయగా, 183 నిమిషాల లెన్త్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే రూ.15.22 కోట్లు వసూళ్లు సాధించింది.

స్టూడెంట్స్‌పై దాడికి సమాధానం చెప్పాల్సిందే- రాహుల్ గాంధీ
పేపర్ లీక్ వివాదం, స్టూడెంట్స్ పై జరిగిన దాడి అంశంపై ప్రతిపక్ష MPలతో కలిసి రాహుల్ గాంధీ లోక్‌సభ స్పీకర్‌ను కలిశారు. తమ భవిష్యత్తుపై న్యాయమైన ప్రశ్నలు అడిగిన స్టూడెంట్స్ పై పోలీసులు దాడి చేయడం దారుణమని, దీనిపై ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై మాట్లాడని పార్లమెంట్ ఎందుకని విమర్శించారు. యువత ఆందోళనను పక్కదారి పట్టనివ్వమని, ఈ సమస్యపై వీధుల్లోనూ, పార్లమెంట్‌లోనూ ప్రతిపక్షాలు పోరాడుతాయని స్పష్టం చేశారు.

కలకలం రేపుతున్న డెంగీ కేసులు
TG: కురుస్తున్న వర్షాల కారణంగా డెంగీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో దోమల వ్యాప్తి పెరిగింది. పగటిపూట కుట్టే దోమల పట్ల ప్రజలు తీవ్ర జాగ్రత్తలు వహించాలని వైద్యారోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, వారానికి ఒకసారి నీటి పాత్రలను శుభ్రం చేయాలని సూచించారు. తీవ్రమైన జ్వరం, ఒంటినొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను కలిసి రక్తపరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేశారు.
దమ్ముంటే రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి
TG: మంత్రి పొన్నం ప్రభాకర్ BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ ఉనికిని చాటుకోవడానికి నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఆయన ఏ సభలో సభ్యుడు కాకపోవడం వల్ల సొంత పార్టీ నాయకుల నుంచే తగిన ప్రాధాన్యం లభించకపోవడంతో నిరాశలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని పొన్నం ఫైరయ్యారు. ఇళ్ల నిర్మాణ పథకంలో కేంద్ర నిధులు ఉన్నాయని చెబుతున్న BJP నాయకులు, చేతనైతే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి అదనపు నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు.
ప్రొటెస్ట్‌లో పోలీస్ ఆఫీసర్ షాకింగ్ బిహేవియర్!
జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ఒక పోలీస్ ఆఫీసర్ ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రొటెస్ట్ చేస్తున్న ఒక మహిళ పట్ల పోలీస్ ఆఫీసర్ అసభ్యంగా తాకడమే కాకుండా, లాఠీతో దాడి చేశారు. ఆ తర్వాత మరో కొలీగ్‌తో కలిసి నవ్వడం వీడియోలో కనిపించడంతో, "మహిళలకు ఇచ్చే రక్షణ ఇదేనా?" అని నెటిజన్స్ సదరు పోలీసులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.

వర్షాకాలంలో బండి ఇన్సూరెన్స్ కంపల్సరీ
వర్షాలు, వరదలు, చెట్లు పడటం వంటి ఘటనలతో ఈ వర్షాకాలంలో వాహనాలకు నష్టం కలుగుతుంది. ఈ టైంలో కాంప్రహెన్సివ్ మోటార్ బీమా ఉంటేనే కాంపన్సేషన్ వస్తుందని నిపుణులు అంటున్నారు. నీటిలో ఆగిపోయిన వాహనాన్ని మళ్లీ స్టార్ట్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఇంజిన్‌లోకి నీరు చేరిన తర్వాత స్టార్ట్ చేయడం వల్ల కలిగే నష్టానికి 'ఇంజిన్ ప్రొటెక్షన్' యాడ్-ఆన్ ఉండాలంటున్నారు. ఈ ప్రొటెక్షన్ లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేసే అవకాశముందని అంటున్నారు.

స్ట్రెస్ తగ్గించే Gen-Z సీక్రెట్
ప్రస్తుత పరుగుల జీవితంలో తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న Gen-Z యువత ఒక కొత్త ట్రెండ్ ఎంచుకున్నారు. హాస్పిటల్ చుట్టూ తిరగకుండా స్ట్రెస్‌ను తగ్గించుకోవడం కోసం యాంటీ యాంగ్జైటీ జ్యువెలరీని ఉపయోగిస్తున్నారు వేళ్లతో తిప్పే స్పిన్నర్ రింగ్స్, బ్రీథింగ్ పెండెంట్లు, ప్రత్యేక బ్రాస్‌లెట్లు ముఖ్యమైనవి. ఒత్తిడి అనిపించినప్పుడు వీటితో శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల కాన్సంట్రేషన్ పెరిగి, నర్వ్ సిస్టం శాంతిస్తుంది. నలుగురిలో ఉంటూ, సీక్రెట్‌గా స్ట్రెస్ తగ్గించుకునే ఈ స్టైలిష్ ట్రెండ్ సోషల్ మీడియాలో వైరలవుతోంది

సోనమ్ వాంగ్‌చుక్‌కు బిగ్ రిలీఫ్- ఢిల్లీ హైకోర్టు
సోనమ్ వాంగ్‌చుక్‌కు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనను వెంటనే డిశ్చార్జ్ చేసి, వారు కోరుకున్న మేదాంత హాస్పిటల్‌కు షిఫ్ట్ చేయాలని కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఈ ఫేవరబుల్ ఆర్డర్ రావడంపై సోనమ్ వైఫ్ గీతాంజలి సంతోషం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టుకు థాంక్స్ చెప్పారు. అలాగే తమ తరఫున ఫైట్ చేసిన లాయర్లు అఖిల్ సిబల్, బాహులి శర్మ టీమ్‌కు ప్రత్యేకంగా థాంక్స్ చెప్తూ, చాలా తక్కువ టైమ్‌లో ఈ విజయం సాధించడం గ్రేట్ అని ట్వీట్ చేశారు.

తెలంగాణ..Rising or Falling?
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ రాష్ట్రం 13వ స్థానానికి దిగజారడంపై BRS పార్టీ తన 'X' అకౌంట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడింది. కేసీఆర్ పాలనలో పెట్టుబడులకు దేశంలోనే నెంబర్ 1 స్థానంలో వెలిగిన తెలంగాణ రేవంత్ రెడ్డి పాలనలో నేరాలు, దోపిడీలకు అడ్డాగా మారిందని ఆరోపించింది. ప్రభుత్వం పెట్టుబడిదారులను బెదిరింపులు, వసూళ్లతో భయపెడుతోందని, అందుకే ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం పడిపోయిందని విమర్శిస్తూ "తెలంగాణ రైజ్ అవ్వడం లేదు, ఫాలింగ్ అవుతోంది" అనే పోస్టర్‌ను షేర్ చేశారు.
ఈ కస్టమర్, డెలివరీ బాయ్ చేసిన పనికి ఎవ్వరయిన ఫిదా అవుతారు!
ముంబైకి చెందిన అనుజ్ రావత్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి ఒక మంచి పని చేశారు. తాను ఆర్డర్ చేసిన ఫుడ్‌ని తను తినకుండా, జంతర్ మంతర్ దగ్గర ఆకలితో ఉన్న వారికి లేదా అవసరం ఉన్నవారికి ఇవ్వాలని జోమాటో డెలివరీ బాయ్‌ని రిక్వెస్ట్ చేశారు. ఆన్‌లైన్‌లోనే బిల్ అంతా పే చేసి, ఆకలితో ఉన్న స్టూడెంట్స్ కి హెల్ప్ చేసిన ఆ కస్టమర్ మంచి మనసుని, ఆర్డర్ సరిగ్గా అందించిన డెలివరీ బాయ్‌ని నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

హైదరాబాద్‌లో ఒకే రోజు 4 నిరసనలు, ఒకే లక్ష్యం!
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఛలో పార్లమెంటుపై కేంద్ర అణచివేత చర్యలు, విద్యార్థులపై లాఠీచార్జ్ కి నిరసనగా హైదరాబాద్ లో ఈ రోజు (జూలై 21న) 4 వేర్వేరు ఆందోళనలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, 4 గంటలకు గచ్చిబౌలి, 5 గంటలకు సచివాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మార్చ్, 5:30కు నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో భారీ ర్యాలీలు ఉంటాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ అనే ఏకైక లక్ష్యంతో ఈ నాలుగు కార్యక్రమాలను సివిల్ సొసైటీ అంటే వివిధ వర్గాల ప్రజలు చేపట్టారు. విద్యార్థులు, మేధావులు, తల్లిదండ్రులు ఈ నిరసనల్లో పాల్గొంటారు.

నీళ్లపై కనీస అవగాహన లేదు
TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్ల మీద కనీస అవగాహన లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాదుల BRS కట్టిన ప్రాజెక్టు.. ఆ విషయం కూడా కాంగ్రెస్ నాయకులకు తెలియదన్నారు. దేవాదుల ప్రాజెక్టులోని 38.16 TMCల నీటిని ఎత్తుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని తెలిపారు. 22 రిజర్వాయర్లు నింపుతామని, ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామని చెప్పారని పేర్కొన్నారు. మంత్రి మాటలు నమ్మి రైతులు నారు పోసుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడేమో ప్రాజెక్టుల నుంచి నీళ్లు విడుదల చేయడంలేదని ఫైరయ్యారు.
పార్లమెంట్ BJP ప్రాపర్టీ కాదు- AAP MP వార్నింగ్!
పార్లమెంట్ అనేది BJP సొంత ఆస్తి కాదని, దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల సభ అని ఆమ్ ఆద్మీ పార్టీ MP సంజయ్ సింగ్ ఫైర్ అయ్యారు. గవర్నమెంట్ చేస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలపై పార్లమెంట్‌లో క్వశ్చన్ చేస్తూనే ఉంటామని వార్నింగ్ ఇచ్చారు. MPలు అక్కడ నిలబడేందుకు కూడా భయపడేలా రూలింగ్ పార్టీ ప్రవర్తిస్తోందని, ప్రజల తరఫున వాయిస్ రైజ్ చేసే హక్కును ఎవరూ ఆపలేరని ఆయన మండిపడ్డారు.

హైదరాబాద్‌లో ఇవాళ 4 నిరసనలు, ఒకే డిమాండ్!
ఢిల్లీ "కాక్రోచ్ జనతా పార్టీ ఛలో పార్లమెంటు" నేపథ్యంలో విద్యార్థుల పట్ల కేంద్రం తీరుకు నిరసనగా నేడు జూలై 21న హైదరాబాద్‌లో 4 సివిల్ సొసైటీ ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, 4 గంటలకు గచ్చిబౌలి, 5 గంటలకు సచివాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మార్చ్, 5:30కు నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో భారీ నిరసన ర్యాలీ. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు, మేధావులు, యాక్టివిస్టులు, సాధారణ ప్రజలు, నీట్ బాధితులు పాల్గొంటారు.
వేలాది మంది స్టూడెంట్స్ గోడు వినరా- ప్రియాంక గాంధీ
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న యువత ఎదుర్కొంటున్నది చాలా జెన్యూన్ ప్రాబ్లమ్ అని ప్రియాంక గాంధీ స్పందించారు. ఇది ఒక్కరిది కాదు, వేలాది మంది పేద విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయమని, వెంటనే ప్రధానమంత్రి విద్యార్థులను పిలిపించి మాట్లాడి, వారి బాధలను అర్థం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పేపర్ లీకేజీలు, సమస్యలకు బాధ్యత వహిస్తూ సంబంధిత మినిస్టర్ వెంటనే రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు.
మోదీ ప్రభుత్వాన్ని నిలదీసిన రాహుల్ గాంధీ!
స్టూడెంట్స్ సమస్యలు, ఎగ్జామ్ పేపర్ లీకేజీలు, ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో లోపాలపై పార్లమెంట్‌లో డిస్కషన్ జరగకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ప్రొటెస్ట్ ప్రదేశాల్లో పోలీసులు దాడులు చేయడం దారుణమని, ఇది దేశ భవిష్యత్తుకు ముప్పు అని మండిపడ్డారు. దేశంలో విద్యార్థులకు ఆపర్చునిటీస్ లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.
స్టూడెంట్స్ కోసం రంగంలోకి MP చంద్రశేఖర్ ఆజాద్!
విద్యార్థుల నిరసనలకు మద్దతుగా MP చంద్రశేఖర్ ఆజాద్ పార్లమెంట్ ఆవరణలోని బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వద్ద రాత్రంతా ధర్నా చేశారు. శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే విని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు విద్యార్థులకు తోడుగా తన పోరాటం కొనసాగుతుందని క్లియర్ గా చెప్పారు.
ప్రొటెస్ట్‌లో సోనమ్ వాంగ్చుక్ వైఫ్‌పై దాడి!
ఢిల్లీలో జరిగిన స్టూడెంట్స్ ప్రొటెస్ట్‌పై పోలీసులు అటాక్ చేయడం పట్ల CJP ఫౌండర్ అభిజీత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటెస్టర్స్ పట్ల పోలీసులు చాలా హార్ష్‌గా ప్రవర్తించారని, లేడీస్ అని కూడా చూడకుండా మేల్ పోలీస్ ఆఫీసర్స్ ఫిజికల్ అటాక్ చేశారని ఆరోపించారు. సోనమ్ వాంగ్చుక్ వైఫ్‌పై కూడా దాడి చేశారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని, ఆల్రెడీ 20 మంది స్టూడెంట్స్ చనిపోయినా ఇంకా దాడులు చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. తమ డిమాండ్స్ నెరవేరే వరకు ఈ ప్రొటెస్ట్ ఆపేదే లేదని అభిజీత్ స్పష్టం చేశారు.
భారత్-యూఎస్ ట్రేడ్ డీల్‌పై రైతుల ఫైట్
భారత్-అమెరికా ట్రేడ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ దిల్లీలోని కిసాన్ ఘాట్ వైపు కాలినడకన వెళ్తున్న పంజాబ్ రైతులను శంభు బోర్డర్ వద్ద పోలీసులు బారికేడ్లతో బ్లాక్ చేశారు. దీంతో రైతులు అక్కడే నిరసన చేపట్టారు. అమెరికా నుంచి సబ్సిడీ పొందిన అగ్రికల్చర్, డెయిరీ ప్రొడక్ట్స్ ఇండియాలోకి వస్తే 8 కోట్ల రైతుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని అన్నారు. ట్రేడ్ ఒప్పంద పత్రాలను వెంటనే పబ్లిక్ చేయాలని, తమతో మాట్లాడకుండా ఏ డీల్ కూడా సైన్ చేయొద్దని డిమాండ్ చేశారు.

'శ్రీనివాస మంగాపురం'తో ఘట్టమనేని వారసుడి సినిమా ఎంట్రీ
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ లవ్ డ్రామాలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మోహన్‌బాబు విలన్‌గా పవర్‌ఫుల్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై పి.కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 30న విడుదల కానుంది.

హీరో బాలకృష్ణకు గాయాలు
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో హీరో నందమూరి నటిస్తున్న కొత్త సినిమా 'NBK111' షూటింగ్ సమయంలో బాలకృష్ణ ప్రమాదానికి గురయ్యారు. కాకినాడలో జరుగుతున్న యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయనకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. చికిత్స అనంతరం బాలకృష్ణ కోలుకుంటున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సినిమా టీం చెప్పారు.