Latest

ప్రజాకవి అందెశ్రీ జయంతి
Infotainment· 18 Jul 2026

ప్రజాకవి అందెశ్రీ జయంతి

తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ రచయిత, ప్రజాకవి అందెశ్రీ జయంతి నేడు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఆత్మగౌరవాన్ని తన పాటలు, కవితల ద్వారా ప్రజలకు చేరువ చేసిన గొప్ప కవి ఆయన. ప్రకృతి, మానవత్వం, సామాజిక విలువలను తన రచనల్లో ప్రతిబింబించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన రచనలు ప్రజల్లో చైతన్యాన్ని నింపాయి. అందెశ్రీ సాహిత్యం నేటికీ అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

శ్రీశైలం వెళ్లే దారిలో పులి కలకలం
News· 18 Jul 2026

శ్రీశైలం వెళ్లే దారిలో పులి కలకలం

TG: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి ప్రత్యక్షమైంది. మున్ననూర్ నుంచి శ్రీశైలం, హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనదారులకు రోడ్డుపై తిరుగుతూ పులి కనిపించింది. నేషనల్ హైవేపై దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్న పెద్దపులిని చూసి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.

ప్రతి భారతీయుడు గర్వపడే విషయం: చిరంజీవి
Infotainment· 18 Jul 2026

ప్రతి భారతీయుడు గర్వపడే విషయం: చిరంజీవి

భారత్ అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన విక్రమ్-1 ప్రయోగంపై మెగాస్టార్ చిరంజీవి X వేదికగా స్పందించారు. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం కావడం ప్రతి భారతీయుడు గర్వపడే విషయమన్నారు. ఈ విజయానికి కృషి చేసిన స్కైరూట్ ఏరోస్పేస్ బృందం, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు అభినందనలు తెలిపారు. భారత యువత ప్రతిభకు ఇది నిదర్శనమని, దేశం అంతరిక్ష రంగంలో మరిన్ని విజయాలను అందుకోవాలని కోరారు.

రూ.500 కోసం విద్యార్థినులపై టీచర్ దారుణం
Viral· 18 Jul 2026

రూ.500 కోసం విద్యార్థినులపై టీచర్ దారుణం

రాజస్థాన్‌లోని ఓ ప్రభుత్వ స్కూల్‌లో టీచర్ దారుణంగా ప్రవర్తించింది. రూ.500 మిస్సయ్యాయనే అనుమానంతో 9, 11వ తరగతి విద్యార్థినుల బట్టలు విప్పించి చెక్ చేయించింది. ఈ విషయం ఇంట్లో చెప్పడంతో తల్లిదండ్రులు స్కూల్‌కు వచ్చి నిరసన తెలిపారు. అధికారులు విద్యార్థినుల వాంగ్మూలాలు రికార్డు చేసి సంబంధిత టీచర్‌ను సస్పెండ్ చేశారు. మరో ఇన్‌స్ట్రక్టర్‌ను కూడా విధుల నుంచి తొలగించారు.

బుల్లెట్ రైలుకు భూములివ్వం అంటూ రైతుల ఆందోళన
News· 18 Jul 2026

బుల్లెట్ రైలుకు భూములివ్వం అంటూ రైతుల ఆందోళన

TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహుద్దుర్‌గూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు టెర్మినల్ కోసం భూములను సేకరించేందుకు హైడ్రా అధికారులు అక్కడికి వచ్చారు. రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు, సరైన పరిహారం ప్రకటించిన తర్వాతే భూములు ఇస్తామంటూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

వాంగ్‌చుక్ దీక్ష భగ్నం! మోదీ ప్రభుత్వంపై 'AAP' MP ఫైర్!
Politics· 18 Jul 2026

వాంగ్‌చుక్ దీక్ష భగ్నం! మోదీ ప్రభుత్వంపై 'AAP' MP ఫైర్!

21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు బలవంతంగా హాస్పిటల్‌కు తీసుకెళ్లారని AAP MP సంజయ్ సింగ్ ఆరోపించారు. దేశంలో జరిగిన 93 పేపర్ లీకేజీల వల్ల నష్టపోయిన యువత తరపున పోరాడుతున్న వాంగ్‌చుక్‌కు సపోర్ట్‌గా, జూలై 20న 'పార్లమెంట్ మార్చ్' నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రొటెస్ట్‌కు భయపడే కేంద్ర ప్రభుత్వం పోలీస్ లతో స్టూడెంట్స్‌పై లాఠీఛార్జ్ చేయించిందని విమర్శించారు. కేంద్ర ఈ రకమైన అణచివేత చర్యలను ఆపాలని, దేశ యువత అంతా వాంగ్‌చుక్‌కు మద్దతుగా నిలవాలని కోరారు.

ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
Politics· 18 Jul 2026

ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

TG: హైదరాబాద్ నగరం సరూర్‌నగర్‌లో జరుగుతున్న బీఆర్ఎస్ యువసంగ్రామ సదస్సుకు వెళ్తున్న ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. షాద్‌నగర్ నుండి దాదాపు 400 వాహనాలతో బయలుదేరిన ఆయన బృందాన్ని ఔటర్ గోల్కొండ సమీపంలో పోలీసులు ఆపేశారు. హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ తమను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులపై ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.

నకిలీ DAP గుట్టు రట్టు
Crime· 18 Jul 2026

నకిలీ DAP గుట్టు రట్టు

TG: సూర్యాపేట జిల్లా మఠంపల్లి, మేళచెరువు మండలాల్లో రైతులకి కొందరు నకిలీ ఎరువులు DAP అమ్మారు. అనుమానం వచ్చిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అసలు విషయం బయటపడింది. రాత్రి వేళల్లో DCM ద్వారా సరఫరా చేస్తున్న డ్రైవర్‌ను విచారణ చెయ్యగా రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేట్‌లో తయారీ కేంద్రాన్ని చూపించడంతో ఇక్కడకి చేరుకున్న అధికారులకి నివ్వెరపోయే విషయాలు బయటపడ్డాయి. సొంతంగా గ్రోమోర్ పేరుతో బ్యాగ్‌లు ప్రింట్ చేసి ఉప్పు, పౌడర్, కలర్‌తో తయారు చేసిన మందుని బ్యాగుల్లో నింపి సరఫరా చేస్తున్నారు. సుమారు 1000 బ్యాగులను అధికారులు సీజ్ చేశారు.

PM మోదీ, అమిత్ షా దొరికిపోతారు- సుప్రీంకోర్టు లాయర్ సంచలన కామెంట్స్!
Politics· 18 Jul 2026

PM మోదీ, అమిత్ షా దొరికిపోతారు- సుప్రీంకోర్టు లాయర్ సంచలన కామెంట్స్!

సుప్రీంకోర్టు లాయర్ బాల్‌రాజ్ సింగ్ PM మోదీపై సీరియస్ అయ్యారు. మోదీ వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్‌ను తీసేయకపోతే పబ్లిక్ ఊరుకోరని వార్నింగ్ ఇచ్చారు. స్పీకర్ సపోర్ట్‌తో వేరే పార్టీలను ఇల్లీగల్‌గా కలిపేస్తూ పార్లమెంట్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారని ఆరోపించారు. సోనమ్ వాంగ్‌చుక్‌పై ఫేక్ కేసు పెట్టి సుప్రీంకోర్టు టైమ్ వేస్ట్ చేసిందని మండిపడ్డారు. ఈ కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరిగితే మోదీ, అమిత్ షా దొరికిపోతారని, కాన్స్టిట్యూషన్‌ను సేవ్ చేయడానికి లాయర్స్ అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.

అలా చేసినవాళ్లకు ఇక గ్రీన్‌కార్డ్ ఉండదు
World· 18 Jul 2026

అలా చేసినవాళ్లకు ఇక గ్రీన్‌కార్డ్ ఉండదు

విదేశాల నుంచి అమెరికాకు వచ్చి ప్రభుత్వ ప్రయోజనాలు పొందేవారికి గ్రీన్‌కార్డు రిజెక్ట్ చేసే రూల్‌ని ట్రంప్ ప్రభుత్వం పునరుద్ధరించింది. 'పబ్లిక్ ఛార్జ్' అనే ఈ నియమం ఫెడరల్ రిజిస్టర్లో పబ్లిష్ కాగా, జూలై 20న ఇది అధికారికంగా పబ్లిష్ అవుతుంది. దీని ప్రకారం..ప్రభుత్వ సాయం పొందిన విదేశీయులకు గ్రీన్ కార్డు నిరాకరిస్తారు. ఈ రూల్ తిరిగి అమల్లోకి రావడంతో లక్షలాది మంది విదేశీయులు ఇబ్బంది పడే అవకాశం ఉంది.

ఇది జబ్బు కాదు: సోనమ్ వాంగ్‌చుక్‌
Politics· 18 Jul 2026

ఇది జబ్బు కాదు: సోనమ్ వాంగ్‌చుక్‌

గవర్నమెంట్ డాక్టర్లు సోనమ్ వాంగ్‌చుక్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లాడానికి ట్రై చేసినప్పటి వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. దానిపై ఆయన స్పందిస్తూ.. "నాకు ఎలాంటి జబ్బు లేదు, ఇది నేను సొంతంగా ఎంచుకున్న ఉపవాసం. నార్మల్ పర్సన్‌కి, ఉపవాసం ఉండే వ్యక్తికి తేడా ఉంటుంది" అని డాక్టర్లతో అన్నారు. కాగా, సోనమ్ వాంగ్‌చుక్ లేదా ఆయన ఫ్యామిలీ పర్మిషన్ లేకుండానే గవర్నమెంట్ ఆయన్ని బలవంతంగా హాస్పిటల్‌కు తరలించిందని ఆయన భార్య ఆరోపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

రాష్ట్రానికి గర్వకారణం: డిప్యూటీ సీఎం
Politics· 18 Jul 2026

రాష్ట్రానికి గర్వకారణం: డిప్యూటీ సీఎం

AP: ఆంధ్రప్రదేశ్‌లోని 23 గ్రామ పంచాయతీలు ప్రతిష్ఠాత్మక ISO 9001:2015 సర్టిఫికేషన్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ ఘనత సాధించిన గ్రామ పంచాయతీలను, అంకితభావంతో కృషి చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని అభినందించారు. సిబ్బందికి నిరంతర శిక్షణ, సమీక్షలు వంటి ఉత్తమ పాలనా ప్రమాణాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.

మెడికో, యువకుడు అనుమానాస్పద మృతి
Crime· 18 Jul 2026

మెడికో, యువకుడు అనుమానాస్పద మృతి

TG: నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం మునుకుంట్ల గ్రామంలో ఓ వైద్య విద్యార్థిని, ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. అదే గ్రామానికి చెందిన చరణ్ అనే యువకుడు గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందాడు. కాలేజ్ హాస్టల్ నుంచి యువతి ఇంటికి వెళ్లిన అనంతరమే ఈ రెండు ఘటనలు జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమ వేధింపులా లేదా ఇతర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మార్చ్ ఆపలేరు.. నేను లీడ్ చేస్తా- సోనమ్ వాంగ్‌చుక్ భార్య
Politics· 18 Jul 2026

మార్చ్ ఆపలేరు.. నేను లీడ్ చేస్తా- సోనమ్ వాంగ్‌చుక్ భార్య

తన భర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను జంతర్ మంతర్ నుండి తమకు చెప్పకుండానే సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌కు తరలించారని గీతాంజలి ఆరోపించారు. నిన్న సాయంత్రం వరకు ఆయన హెల్త్ రేపోర్ట్స్ అన్నీ నార్మల్‌గా ఉన్నాయని, ఇప్పుడు సడన్‌గా పొటాషియం తగ్గిపోయి ప్రాణానికే ప్రమాదం అని అంటున్నారని మండిపడ్డారు. తీరా రిపోర్ట్స్ అడిగితే చూపించడం లేదన్నారు. సోనమ్ రాకపోయినా, సోమవారం జరగబోయే నిరసన మార్చ్‌ను తానే ముందుండి నడిపిస్తానని, ఆయనను ఇలా బలవంతంగా హాస్పిటల్‌కు తెచ్చి మార్చ్‌ను ఆపలేరని ఆమె స్పష్టం చేశారు.

కాలం చెల్లిన పదార్థాలతో బేకరీ ఐటమ్స్
Crime· 18 Jul 2026

కాలం చెల్లిన పదార్థాలతో బేకరీ ఐటమ్స్

TG: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు బేకరీలు, స్వీట్లు, కేకులు, బిస్కెట్ల తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. తనిఖీల్లో తీవ్ర అపరిశుభ్రత, ఈగలు, పురుగులు పట్టిన ఆహార పదార్థాలతో తయారీ జరుగుతున్నట్లు గుర్తించారు. కొన్ని యూనిట్లలో కాలం చెల్లిన రంగులు, ఫ్లేవర్లు వినియోగించడంతో పాటు తయారీ తేదీ, ఎక్స్‌పైరీ వివరాలు లేకుండానే ఉత్పత్తులను విక్రయానికి సిద్ధం చేసినట్లు తేలింది. మరికొన్ని కేంద్రాలు FSSAI లైసెన్స్‌ గడువు ముగిసినా, పాతవాటితోనే గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారాలు సాగిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది.

ఐదుగురు మత్స్యకారులు మృతి
AP· 18 Jul 2026

ఐదుగురు మత్స్యకారులు మృతి

AP: పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన ఐదుగురు మత్స్యకారులు నీటిలో మునిగి మృతి చెందారు. మృతులు ఊకె సుశీల (37), లక్ష్మి (37), తుర్రం భారతి (40), భాసుబోయిన బాలరాజు (38), ఊకె రమేష్ (38)లుగా గుర్తించారు. గోదావరిలో లోతైన ప్రాంతంలో చేపల వేటకు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు మృతితో గొమ్ముకొత్తగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అభిజిత్ దీప్కేపై సిరా (ఇంక్) దాడి!
Politics· 18 Jul 2026

అభిజిత్ దీప్కేపై సిరా (ఇంక్) దాడి!

ఢిల్లీలో నిరసనల మధ్య మాట్లాడుతుండగా 'కాక్‌రోచ్ జనతా పార్టీ' ఫౌండర్ అభిజిత్ దీప్కేపై ఒక వ్యక్తి సడన్‌గా నల్ల సిరా (ఇంక్) చల్లింది. ఈ దాడితో అక్కడ ఒక్కసారిగా తీవ్ర టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనిపై 'Cockroach is Back' అఫిషియల్ హ్యాండిల్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. "ఈ గవర్నమెంట్ మాపై ఎన్ని దాడులు చేయించినా మేము భయపడబోము. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలం, దేనికీ వెనకడుగు వేసేదే లేదు.. జై భీమ్!" అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈ ఇంక్ ఎటాక్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది.

నమ్మకం పోయింది, హాస్పిటల్ మారుస్తాం.. సోనమ్ భార్య లెటర్!
Politics· 18 Jul 2026

నమ్మకం పోయింది, హాస్పిటల్ మారుస్తాం.. సోనమ్ భార్య లెటర్!

సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌కు ఒక సీరియస్ లెటర్ రాశారు. నిన్నటివరకు ఆయన పొటాషియం లెవెల్స్ బాగున్నాయని, ఈరోజు సడన్‌గా తగ్గిపోయాయని ఓరల్‌గా చెబుతున్నారే తప్ప మెడికల్ రిపోర్ట్స్ చూపించడం లేదని ఆమె ఆరోపించారు. హాస్పిటల్‌లో అస్సలు ట్రాన్స్‌పరెన్సీ (పారదర్శకత) లేదని, అందుకే తమకు నమ్మకం పోయిందని, వెంటనే డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే.. తమకు నచ్చిన వేరే హాస్పిటల్‌కు మారుస్తామని ఆమె లెటర్ లో స్పష్టం చేశారు.

HYDRAAకు మద్దతుగా భారీ ర్యాలీ
TG· 18 Jul 2026

HYDRAAకు మద్దతుగా భారీ ర్యాలీ

TG: హైదరాబాద్‌లో హైడ్రాకు మద్దతుగా పలు కాలనీలు, బస్తీ వాసులు భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. NTR గార్డెన్స్ నుంచి అమరవీరుల స్మారక చిహ్నం వరకు జరిగిన ర్యాలీలో కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొని హైడ్రాకు మద్దతుగా నినాదాలు చేశారు. HYDRAAను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని, ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి రక్షించడంలో సంస్థ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. చెరువుల పునరుద్ధరణ, పర్యావరణ పరిరక్షణలో హైడ్రా సేవలను ప్రశంసిస్తూ, సంస్థను మరింత బలోపేతం చేసి శాశ్వతంగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు.

బస్టాండ్‌లో యువతిని నరికి చంపిన ప్రేమోన్మాది
Crime· 18 Jul 2026

బస్టాండ్‌లో యువతిని నరికి చంపిన ప్రేమోన్మాది

కర్ణాటక రాష్ట్రం మంగళూరు దగ్గర్లోని బంట్వాల్ బస్టాండ్‌లో లావణ్య(21) అనే యువతిని ఆమెకు దూరపు బంధువైన చేతన్ దారుణంగా నరికి చంపాడు. బస్టాండ్‌లో ఉన్న లావణ్యను కత్తితో పొడిచి అక్కడి నుండి పారిపోయాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని, ప్రేమను కాదన్నందుకే నిందితుడు లావణ్యను చంపేసుంటాడని అనుమానిస్తున్నారు.

రైల్వే టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్
Jobs· 18 Jul 2026

రైల్వే టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్

రైల్వేశాఖలో 6,557 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అభ్యర్థులు ఈనెల 29 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. వీటిలో టెక్నీషియన్ గ్రేడ్-1(సిగ్నల్)లో 323 పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్-3లో 6,234 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెన్త్ , ఐటీఐ, యాక్ట్ అప్రెంటిస్‌షిప్, బీఎస్సీ, డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయసున్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్‌లైన్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ చెకప్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in/