అమెరికాతో శాంతి ఒప్పందం క్యాన్సిల్- ఇరాన్

అమెరికా, ఇరాన్ మధ్య గొడవలు మళ్లీ ముదిరాయి. అమెరికాతో గత నెలలో కుదిరిన శాంతి ఒప్పందాన్ని పక్కనపెట్టేస్తున్నట్లు ఇరాన్ అనౌన్స్ చేసింది. ఇకపై ఆ రూల్స్ ఏవీ పాటించబోమని క్లియర్ గా చెప్పింది. అమెరికానే ముందుగా ఒప్పందాన్ని బ్రేక్ చేసిందని ఇరాన్ అంటోంది. రీసెంట్ గా హోర్ముజ్‌లో కమర్షియల్ నౌకలపై దాడులు జరగడంతో ఇరు దేశాల మధ్య పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత వారం అమెరికా ఇరాన్ పై దాడులు చేయగా, ఇరాన్ కూడా అమెరికా మిలిటరీ స్థావరాలపై మిసైల్స్ ప్రయోగించింది.


