సోనమ్ వాంగ్‌చుక్ తరలింపు ఖండిస్తున్నా- రాహుల్ గాంధీ

జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లడాన్ని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. మోదీ గవర్నమెంట్ అసత్యం, హింస అనే సిద్ధాంతాలపై నడుస్తోందని విమర్శించారు. దేశ భవిష్యత్తుకు అత్యంత కీలకమైన నీట్ పేపర్ లీక్స్, పెరిగిపోతున్న ఎడ్యుకేషన్ కాస్ట్స్, స్టూడెంట్స్ సూసైడ్స్ లాంటి సీరియస్ ఇష్యూస్ పై విద్యార్థుల గొంతును ఏ శక్తీ నొక్కలేదని ట్వీట్ చేశారు. స్టూడెంట్స్ కి, వారిని నమ్మేవాళ్లకి ఎంతటి బలప్రయోగమైనా అడ్డుపడలేదని, తాము వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.


