హాస్పిటల్లో సోనమ్ వాంగ్చుక్- ఫోన్ బ్యాన్.. లాయర్లకు నో ఎంట్రీ!
ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో గవర్నమెంట్ చాలా రూల్స్ పెట్టింది. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న సోనమ్ వాంగ్‌చుక్, హాస్పిటల్ రూమ్‌లోకి ఫోన్ తీసుకెళ్లనివ్వడం లేదని అతని భార్య ఆరోపించింది. అంతేకాకుండా, ఆయన మెడికల్ రిపోర్ట్స్‌ను కూడా ఫ్యామిలీకి చూపించడం లేదని, కనీసం వారి పర్సనల్ డాక్టర్లను, లాయర్లను కూడా కలవనివ్వడం లేదని వారు బాధపడుతున్నారు. గవర్నమెంట్ కావాలనే ఇలా 'డిక్టేటర్‌షిప్' చేస్తోందంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.


