Latest

పెద్ద చదువులు చదివినా తల్లిదండ్రులే పోషించాలా?
"తెలంగాణలో ఉన్నత చదువులు చదివిన విద్యార్థులను ఇంకా తల్లిదండ్రులే పోషించాలా? ఇదేం విద్యా విధానం?!" అని డెమోక్రాటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ (DATA) ప్రశ్నించింది. ఏటా లక్షకు పైగా ఇంజనీరింగ్ పట్టభద్రులవుతున్నా, కేవలం 25% మందికే ఉద్యోగాలొస్తున్నాయని మండిపడింది. విద్యా సంక్షోభం, ప్రైవేట్ కాలేజీల అక్రమాలపై జూలై 19న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో DATA రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది. ముఫ్ఫఖం జా కాలేజీలో ప్రొఫెసర్ల అక్రమ తొలగింపులను ఖండిస్తూ, ప్రైవేట్ కాలేజీల విద్యా వ్యాపారాన్ని ప్రభుత్వం నియంత్రించాలని డిమాండ్ చేసింది.
నాయకులు దేశాన్ని అమ్మేశారు- ఆర్మీ సోల్జర్
‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) కి మాజీ సైనికుడు అను రాజ్ తన పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ నాయకులు దేశం గురించి పట్టించుకోకుండా స్వార్థ ప్రయోజనాల కోసం చూస్తున్నారని ఆయన విమర్శించారు. విదేశాల్లో ఉంటూనే అభిజీత్ దీప్కే కేవలం ఐదు రోజుల్లోనే ఈ పార్టీని క్రియేట్ చేసి పెద్ద విజయం సాధించారని అభినందించారు. దేశాన్ని కాపాడుకోవడానికి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనే తేడా లేకుండా అందరూ ఈ పార్టీలో చేరాలని పిలుపునిస్తూ, యూత్ కి సెల్యూట్ చేశాడు. ప్రెజెంట్ ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
జంతర్ మంతర్ వద్ద గర్జించిన అభిజీత్ దీప్కే!
జంతర్ మంతర్ ప్రొటెస్ట్ సైట్ నుండి సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు బలవంతంగా తరలించిన తర్వాత యాక్టివిస్ట్ అభిజీత్ దీప్కే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. "మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గం, తలవంచం" అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. నీట్ పేపర్ లీక్, విద్యార్థుల ఆత్మహత్యల కంటే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానే మోదీ ప్రభుత్వానికి ఎక్కువ అనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. సోనమ్ సార్‌ను పోలీసులు నేరస్థుల్లా కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ, తమ గొంతు నొక్కలేరని స్పష్టం చేశారు.
తాగునీటిని వృథా చేస్తే చర్యలుంటాయి: జలమండలి
TG: తాగునీటిని వృథా చేస్తే చర్యలు తీసుకుంటామని జలమండలి హెచ్చరించింది. హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 33లోని ఒక భవనం దగ్గర తాగునీటితో ఇంటిముందు నీటితో కడుగుతూ వృథా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ ఇంటి ఓనర్‌కు రూ.5 వేల జరిమానా విధిస్తూ నోటీసు జారీ చేశారు. మరోసారి నీటిని వృథా చేస్తే డ్రైనేజీ కనెక్షన్లను నిలిపివేయడంతోపాటు మరిన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సోనమ్ వాంగ్‌చుక్ తరలింపు ఖండిస్తున్నా- రాహుల్ గాంధీ
జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లడాన్ని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. మోదీ గవర్నమెంట్ అసత్యం, హింస అనే సిద్ధాంతాలపై నడుస్తోందని విమర్శించారు. దేశ భవిష్యత్తుకు అత్యంత కీలకమైన నీట్ పేపర్ లీక్స్, పెరిగిపోతున్న ఎడ్యుకేషన్ కాస్ట్స్, స్టూడెంట్స్ సూసైడ్స్ లాంటి సీరియస్ ఇష్యూస్ పై విద్యార్థుల గొంతును ఏ శక్తీ నొక్కలేదని ట్వీట్ చేశారు. స్టూడెంట్స్ కి, వారిని నమ్మేవాళ్లకి ఎంతటి బలప్రయోగమైనా అడ్డుపడలేదని, తాము వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.

ఒకే కుటుంబంలో ముగ్గురు నీట్ ఎగ్జామ్ పాస్
బిహార్‌లోని సహర్సా జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు సిబ్లింగ్స్ నీట్-యూజీ 2026 ఎగ్జామ్‌లో ప్రతిభ చాటారు. రజనీశ్(3,122), ప్రహ్లాద్(26,751), సాక్షి(9,672) ర్యాంకులు సాధించారు. వీరి తండ్రి రోహిత్ ఆనంద్ చిన్న కిరాణా కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఖరీదైన కోచింగ్‌కు వెళ్లలేక, చిన్న సెంటర్‌లోనే వాళ్లు చదివారు. రోజూ క్రమశిక్షణతో చదువుకుంటూ ఈ విజయం అందుకున్నట్లు తెలిపారు.
మామ మర్మాంగం కోసిన కోడలు
చాలాకాలంగా తనను వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తున్న మామపై ఓ కోడలు తన ప్రతాపం చూపించింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో 23 ఏళ్ల మహిళ మామ మర్మాంగాన్ని కోసేసింది. గాయపడ్డ వ్యక్తిని పోలీసులు జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం మహిళను అదుపులోకి తీసుకున్నారు. వేధింపులు విషయం తన భర్తకు చెప్పినా పట్టించుకోలేదని, అందుకే ఈ పని చేశానని చెప్పింది.
గవర్నమెంట్ డాక్టర్లకు వాంగ్‌చుక్ కౌంటర్!
గవర్నమెంట్ డాక్టర్లు సోనమ్ వాంగ్‌చుక్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లాడానికి ట్రై చేసినప్పటి వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. దానిపై ఆయన స్పందిస్తూ.. "నాకు ఎలాంటి జబ్బు లేదు, ఇది నేను సొంతంగా ఎంచుకున్న ఉపవాసం. నార్మల్ పర్సన్‌కి, ఉపవాసం ఉండే వ్యక్తికి తేడా ఉంటుంది" అని డాక్టర్లతో అన్నారు. కాగా, సోనమ్ వాంగ్‌చుక్ లేదా ఆయన ఫ్యామిలీ పర్మిషన్ లేకుండానే గవర్నమెంట్ ఆయన్ని బలవంతంగా హాస్పిటల్‌కు తరలించిందని ఆయన భార్య ఆరోపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
వాంగ్‌చుక్ అరెస్ట్‌పై అన్నా హజారే సీరియస్ వార్నింగ్!
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో స్టూడెంట్స్ చేస్తున్న పోరాటంపై అన్నా హజారే రియాక్ట్ అయ్యారు. నిరాహార దీక్ష చేస్తున్న యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు బలవంతంగా హాస్పిటల్‌కు తరలించడంపై ఆయన మాట్లాడారు. 20 రోజులుగా శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్న లీడర్ల విషయంలో ప్రభుత్వం ఇలాంటి చర్యలు ఆపాలని, ప్రభుత్వం ఇప్పటికైనా అహంకారం వీడి, నిరసనకారులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని అన్నా హజారే ఒక వీడియో స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు.
అభిజిత్ దీప్కే పై ఇంక్ ఎటాక్.. మహిళ అరెస్ట్! 🚨
ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రొటెస్ట్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. స్టూడెంట్స్ తరపున ఫైట్ చేస్తున్న అభిజిత్ దీప్కే పై ఒక మహిళ సిరా (ఇంక్) చల్లింది. రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు ఆ మహిళను వెంటనే కస్టడీలోకి తీసుకున్నారు. కాగా, ఈరోజు ఉదయమే మరో లీడర్ సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు జంతర్ మంతర్ నుండి సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు. ఈ వరుస ఇన్సిడెంట్స్ తో జంతర్ మంతర్ దగ్గర హై టెన్షన్ నెలకొంది.
చలో జంతర్ మంతర్ కేజ్రీవాల్ పిలుపు?
రీసెంట్‌గా నీట్ పేపర్ లీకేజ్, CBSE ఎగ్జామ్ సిస్టమ్‌లో జరుగుతున్న స్కామ్స్ వల్ల లక్షలాది మంది స్టూడెంట్స్ ఫ్యూచర్ నాశనమవుతోందని అరవింద్ కేజ్రీవాల్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ దారుణమైన సిస్టమ్‌ని మార్చడానికి సోనమ్ వాంగ్‌చుక్, అభిజీత్ దిప్కే జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేస్తున్నారని, ఇప్పుడు మనం వాయిస్ రైజ్ చేయకపోతే, రేపు స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఇకనైనా ఇంట్లో కూర్చోకుండా, అందరూ యునైట్ అయి జంతర్ మంతర్ రావాలని పిలుపునిచ్చారు.

ప్రజాకవి అందెశ్రీ జయంతి
తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ రచయిత, ప్రజాకవి అందెశ్రీ జయంతి నేడు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఆత్మగౌరవాన్ని తన పాటలు, కవితల ద్వారా ప్రజలకు చేరువ చేసిన గొప్ప కవి ఆయన. ప్రకృతి, మానవత్వం, సామాజిక విలువలను తన రచనల్లో ప్రతిబింబించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన రచనలు ప్రజల్లో చైతన్యాన్ని నింపాయి. అందెశ్రీ సాహిత్యం నేటికీ అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
శ్రీశైలం వెళ్లే దారిలో పులి కలకలం
TG: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి ప్రత్యక్షమైంది. మున్ననూర్ నుంచి శ్రీశైలం, హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనదారులకు రోడ్డుపై తిరుగుతూ పులి కనిపించింది. నేషనల్ హైవేపై దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్న పెద్దపులిని చూసి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.
ప్రతి భారతీయుడు గర్వపడే విషయం: చిరంజీవి
భారత్ అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన విక్రమ్-1 ప్రయోగంపై మెగాస్టార్ చిరంజీవి X వేదికగా స్పందించారు. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం కావడం ప్రతి భారతీయుడు గర్వపడే విషయమన్నారు. ఈ విజయానికి కృషి చేసిన స్కైరూట్ ఏరోస్పేస్ బృందం, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు అభినందనలు తెలిపారు. భారత యువత ప్రతిభకు ఇది నిదర్శనమని, దేశం అంతరిక్ష రంగంలో మరిన్ని విజయాలను అందుకోవాలని కోరారు.
రూ.500 కోసం విద్యార్థినులపై టీచర్ దారుణం
రాజస్థాన్‌లోని ఓ ప్రభుత్వ స్కూల్‌లో టీచర్ దారుణంగా ప్రవర్తించింది. రూ.500 మిస్సయ్యాయనే అనుమానంతో 9, 11వ తరగతి విద్యార్థినుల బట్టలు విప్పించి చెక్ చేయించింది. ఈ విషయం ఇంట్లో చెప్పడంతో తల్లిదండ్రులు స్కూల్‌కు వచ్చి నిరసన తెలిపారు. అధికారులు విద్యార్థినుల వాంగ్మూలాలు రికార్డు చేసి సంబంధిత టీచర్‌ను సస్పెండ్ చేశారు. మరో ఇన్‌స్ట్రక్టర్‌ను కూడా విధుల నుంచి తొలగించారు.
బుల్లెట్ రైలుకు భూములివ్వం అంటూ రైతుల ఆందోళన
TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహుద్దుర్‌గూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు టెర్మినల్ కోసం భూములను సేకరించేందుకు హైడ్రా అధికారులు అక్కడికి వచ్చారు. రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు, సరైన పరిహారం ప్రకటించిన తర్వాతే భూములు ఇస్తామంటూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
వాంగ్‌చుక్ దీక్ష భగ్నం! మోదీ ప్రభుత్వంపై 'AAP' MP ఫైర్!
21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు బలవంతంగా హాస్పిటల్‌కు తీసుకెళ్లారని AAP MP సంజయ్ సింగ్ ఆరోపించారు. దేశంలో జరిగిన 93 పేపర్ లీకేజీల వల్ల నష్టపోయిన యువత తరపున పోరాడుతున్న వాంగ్‌చుక్‌కు సపోర్ట్‌గా, జూలై 20న 'పార్లమెంట్ మార్చ్' నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రొటెస్ట్‌కు భయపడే కేంద్ర ప్రభుత్వం పోలీస్ లతో స్టూడెంట్స్‌పై లాఠీఛార్జ్ చేయించిందని విమర్శించారు. కేంద్ర ఈ రకమైన అణచివేత చర్యలను ఆపాలని, దేశ యువత అంతా వాంగ్‌చుక్‌కు మద్దతుగా నిలవాలని కోరారు.
ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
TG: హైదరాబాద్ నగరం సరూర్‌నగర్‌లో జరుగుతున్న బీఆర్ఎస్ యువసంగ్రామ సదస్సుకు వెళ్తున్న ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. షాద్‌నగర్ నుండి దాదాపు 400 వాహనాలతో బయలుదేరిన ఆయన బృందాన్ని ఔటర్ గోల్కొండ సమీపంలో పోలీసులు ఆపేశారు. హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ తమను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులపై ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.

నకిలీ DAP గుట్టు రట్టు
TG: సూర్యాపేట జిల్లా మఠంపల్లి, మేళచెరువు మండలాల్లో రైతులకి కొందరు నకిలీ ఎరువులు DAP అమ్మారు. అనుమానం వచ్చిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అసలు విషయం బయటపడింది. రాత్రి వేళల్లో DCM ద్వారా సరఫరా చేస్తున్న డ్రైవర్‌ను విచారణ చెయ్యగా రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేట్‌లో తయారీ కేంద్రాన్ని చూపించడంతో ఇక్కడకి చేరుకున్న అధికారులకి నివ్వెరపోయే విషయాలు బయటపడ్డాయి. సొంతంగా గ్రోమోర్ పేరుతో బ్యాగ్‌లు ప్రింట్ చేసి ఉప్పు, పౌడర్, కలర్‌తో తయారు చేసిన మందుని బ్యాగుల్లో నింపి సరఫరా చేస్తున్నారు. సుమారు 1000 బ్యాగులను అధికారులు సీజ్ చేశారు.
PM మోదీ, అమిత్ షా దొరికిపోతారు- సుప్రీంకోర్టు లాయర్ సంచలన కామెంట్స్!
సుప్రీంకోర్టు లాయర్ బాల్‌రాజ్ సింగ్ PM మోదీపై సీరియస్ అయ్యారు. మోదీ వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్‌ను తీసేయకపోతే పబ్లిక్ ఊరుకోరని వార్నింగ్ ఇచ్చారు. స్పీకర్ సపోర్ట్‌తో వేరే పార్టీలను ఇల్లీగల్‌గా కలిపేస్తూ పార్లమెంట్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారని ఆరోపించారు. సోనమ్ వాంగ్‌చుక్‌పై ఫేక్ కేసు పెట్టి సుప్రీంకోర్టు టైమ్ వేస్ట్ చేసిందని మండిపడ్డారు. ఈ కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరిగితే మోదీ, అమిత్ షా దొరికిపోతారని, కాన్స్టిట్యూషన్‌ను సేవ్ చేయడానికి లాయర్స్ అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.

అలా చేసినవాళ్లకు ఇక గ్రీన్‌కార్డ్ ఉండదు
విదేశాల నుంచి అమెరికాకు వచ్చి ప్రభుత్వ ప్రయోజనాలు పొందేవారికి గ్రీన్‌కార్డు రిజెక్ట్ చేసే రూల్‌ని ట్రంప్ ప్రభుత్వం పునరుద్ధరించింది. 'పబ్లిక్ ఛార్జ్' అనే ఈ నియమం ఫెడరల్ రిజిస్టర్లో పబ్లిష్ కాగా, జూలై 20న ఇది అధికారికంగా పబ్లిష్ అవుతుంది. దీని ప్రకారం..ప్రభుత్వ సాయం పొందిన విదేశీయులకు గ్రీన్ కార్డు నిరాకరిస్తారు. ఈ రూల్ తిరిగి అమల్లోకి రావడంతో లక్షలాది మంది విదేశీయులు ఇబ్బంది పడే అవకాశం ఉంది.