అలా చేసినవాళ్లకు ఇక గ్రీన్‌కార్డ్ ఉండదు

విదేశాల నుంచి అమెరికాకు వచ్చి ప్రభుత్వ ప్రయోజనాలు పొందేవారికి గ్రీన్‌కార్డు రిజెక్ట్ చేసే రూల్‌ని ట్రంప్ ప్రభుత్వం పునరుద్ధరించింది. 'పబ్లిక్ ఛార్జ్' అనే ఈ నియమం ఫెడరల్ రిజిస్టర్లో పబ్లిష్ కాగా, జూలై 20న ఇది అధికారికంగా పబ్లిష్ అవుతుంది. దీని ప్రకారం..ప్రభుత్వ సాయం పొందిన విదేశీయులకు గ్రీన్ కార్డు నిరాకరిస్తారు. ఈ రూల్ తిరిగి అమల్లోకి రావడంతో లక్షలాది మంది విదేశీయులు ఇబ్బంది పడే అవకాశం ఉంది.


