వాంగ్‌చుక్ దీక్ష భగ్నం! మోదీ ప్రభుత్వంపై 'AAP' MP ఫైర్!
21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు బలవంతంగా హాస్పిటల్‌కు తీసుకెళ్లారని AAP MP సంజయ్ సింగ్ ఆరోపించారు. దేశంలో జరిగిన 93 పేపర్ లీకేజీల వల్ల నష్టపోయిన యువత తరపున పోరాడుతున్న వాంగ్‌చుక్‌కు సపోర్ట్‌గా, జూలై 20న 'పార్లమెంట్ మార్చ్' నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రొటెస్ట్‌కు భయపడే కేంద్ర ప్రభుత్వం పోలీస్ లతో స్టూడెంట్స్‌పై లాఠీఛార్జ్ చేయించిందని విమర్శించారు. కేంద్ర ఈ రకమైన అణచివేత చర్యలను ఆపాలని, దేశ యువత అంతా వాంగ్‌చుక్‌కు మద్దతుగా నిలవాలని కోరారు.


