Latest

స్టీరింగ్‌పైనే కుప్పకూలిన బస్సు డ్రైవర్
Local· 29 Aug 2026

స్టీరింగ్‌పైనే కుప్పకూలిన బస్సు డ్రైవర్

TG: జగిత్యాల జిల్లా మద్దునూరు నుంచి జగిత్యాలకు ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్ లక్ష్మణ్‌కు మార్గమధ్యంలో గుండెపోటు రావడంతో స్టీరింగ్‌పైనే కుప్పకూలారు. అయితే చివరి వరకు అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సు అదుపు తప్పకుండా పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. ఘటన అనంతరం 108కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఆటోలో లక్ష్మణ్‌ను జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. వచ్చే సోమవారం పదవీ విరమణ చేయాల్సి ఉన్న లక్ష్మణ్‌ ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పినా డ్రైవింగ్ డ్యూటీ వేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు.

‘టాక్సిక్’ పోటీ ఉన్నా తగ్గేదేలే అంటున్న ‘ఇరుముడి’
Entertainment· 29 Aug 2026

‘టాక్సిక్’ పోటీ ఉన్నా తగ్గేదేలే అంటున్న ‘ఇరుముడి’

రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ వారమే యష్ నటించిన పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' విడుదలైనప్పటికీ, 'ఇరుముడి' క్రేజ్ మాత్రం తగ్గలేదు. బుక్ మై షోలో ఈ వీకెండ్ 'టాక్సిక్' కి 15 వేల టికెట్లు అమ్ముడవగా, 'ఇరుముడి' 23 వేలకు పైగా టికెట్లతో ముందంజలో ఉంది. తక్కువ థియేటర్లలో ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వస్తుండటంతో ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తోంది.

BRS 3.0లో తప్పు చేసినోళ్లను వదలం : RS  ప్రవీణ్ కుమార్
TG· 29 Aug 2026

BRS 3.0లో తప్పు చేసినోళ్లను వదలం : RS ప్రవీణ్ కుమార్

తెలంగాణ భవన్‌లో జరిగిన మీటింగ్‌లో BRS జనరల్ సెక్రటరీ RS ప్రవీణ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే రోజుల్లో KCR నాయకత్వంలో 'BRS 3.0' ప్రభుత్వం చాలా డిఫరెంట్‌గా ఉంటుందని అన్నారు. మంచి చేసిన వాళ్లను గుండెల్లో పెట్టి కాపాడుకుంటాం కానీ, రేవంత్ రెడ్డి మాటలు విని అక్రమ కేసులు పెట్టి, ప్రజలను వేధించిన వాళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడిన వారిని విచారించడానికి ప్రత్యేకంగా ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

BC, EBC స్టూడెంట్స్‌కు విదేశీ చదువులకు గోల్డెన్ ఛాన్స్!
TG· 29 Aug 2026

BC, EBC స్టూడెంట్స్‌కు విదేశీ చదువులకు గోల్డెన్ ఛాన్స్!

TG: విదేశాల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే BC, EBC స్టూడెంట్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యా నిధి ద్వారా అవకాశమిస్తోంది. 2026–27కు మొత్తం 350 మందిని సెలెక్ట్ చేయనున్నారు. ఇందులో 250 మంది BC, 100 మంది EBC స్టూడెంట్స్ ఉంటారు. <a href="https://telanganaepass.cgg.gov.in/#">అప్లికేషన్స్</a> సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు ఉంటాయి. ఫామిలీ Annual Income రూ. 5 లక్షల్లోపు, ఏజ్ 35 ఏళ్లలోపు, గ్రాడ్యుయేషన్‌లో 60% మార్కులు ఉండాలి. GRE/GMAT, TOEFL/IELTS/PTE స్కోర్ కూడా అవసరం. PG, PhD వంటి కోర్సులకు ఆర్థిక సాయం పొందొచ్చు. <a href="https://telanganaepass.cgg.gov.in/#">Information</a>

కూటమి ప్రభుత్వంతో వ్యవసాయ సంక్షోభం: శిల్పా రవిచంద్ర
Local· 29 Aug 2026

కూటమి ప్రభుత్వంతో వ్యవసాయ సంక్షోభం: శిల్పా రవిచంద్ర

AP: నంద్యాల జిల్లా రైతుల సాగునీటి సమస్యలపై వైసీపీ పోరాటానికి సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్లిందని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి విమర్శించారు. నంద్యాలలోని తన నివాసంలో రైతులతో సమీక్ష నిర్వహించి సమస్యలు, సూచనలు తెలుసుకున్నారు. సెప్టెంబర్‌ 1న వెలుగోడు రిజర్వాయర్‌ వద్ద సాగునీటి సాధన కోసం వైసీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. రైతులకు గిట్టుబాటు ధరలు, సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిర్వీర్యం చేసే కుట్రలు ఆపాలి
Local· 29 Aug 2026

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిర్వీర్యం చేసే కుట్రలు ఆపాలి

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న దీక్షా శిబిరం 1978వ రోజున ఐద్వా విశాఖ జిల్లా కమిటీ పాల్గొని సంఘీభావం తెలిపింది. ఐద్వా నాయకులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్‌ను బలోపేతం చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. ప్రైవేటు స్టీల్ పరిశ్రమలకు భూములు, విద్యుత్, నీరు, పన్ను రాయితీలు కల్పించడం ప్రభుత్వ విధానాల్లోని ద్వంద్వ వైఖరిని చూపుతోందన్నారు. ప్రైవేటీకరణ చర్యలను తక్షణమే నిలిపేయాలని డిమాండ్ చేశారు.

పేపర్‌ కప్పుల్లో టీ, కాఫీ తాగుతున్నారా?☕️ అయితే ఇది మీకోసమే!
Health· 29 Aug 2026

పేపర్‌ కప్పుల్లో టీ, కాఫీ తాగుతున్నారా?☕️ అయితే ఇది మీకోసమే!

మనం రోజూ ఎకో-ఫ్రెండ్లీ అని పేపర్ కప్పుల్లో వేడి వేడి టీ, కాఫీలు తాగేస్తుంటాం. ఈ పేపర్ కప్పులు లీక్ అవ్వకుండా ఉండటానికి లోపల సన్నని ప్లాస్టిక్ లేదా బయోడిగ్రేడబుల్ కోటింగ్ వేస్తారని ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ రీసెర్చర్లు తెలిపారు. మనం వేడి డ్రింక్స్ పోయగానే ఆ వేడికి లక్షలాది 'మైక్రోప్లాస్టిక్ కణాలు' కరిగి డ్రింక్‌లో కలిసిపోతున్నాయని, నార్మల్ ప్లాస్టిక్ కోటింగ్ కంటే బయోడిగ్రేడబుల్ కప్పుల నుంచే '12 రెట్లు ఎక్కువ' ప్లాస్టిక్ కణాలు విడుదలవుతున్నట్లు తేలింది.

అమ్మమ్మ కళ..మనవరాలు కొనసాగించిందిలా!
Arts/Literature· 29 Aug 2026

అమ్మమ్మ కళ..మనవరాలు కొనసాగించిందిలా!

కేరళంకు చెందిన మూఱిక్కల్ పంకజాక్షి ‘నోక్కువిద్య పావకళి’ కళతో ప్రసిద్ధులు. ప్రపంచంలోనే ఇది చాలా అరుదైన బొమ్మలాట కళ. కళాకారులు చిన్న కర్రను ముక్కు, పై పెదవి మధ్య నిలబెట్టి, దాని మీద బొమ్మలను ఉంచి, దారాలతో ఆడిస్తారు. దీని సాయంతో రామాయణం, మహాభారతం కథలు చెప్తారు. పంకజాక్షి చనిపోయే ముందు ఆమె మనవరాలు కే.ఎస్.రంజని ఈ కళ నేర్చుకుంది. ఐదేళ్లపాటు కష్టపడి ప్రాక్టీస్ చేసి నేర్పు సంపాదించింది. ఇప్పుడు ప్రదర్శనలు ఇస్తూ కుటుంబ వారసత్వాన్ని కాపాడుతోంది.

భారత్ Forex Reserves రికార్డ్.. $729.33B!
Personal Finance· 29 Aug 2026

భారత్ Forex Reserves రికార్డ్.. $729.33B!

భారత్ Forex Reserves మరోసారి కొత్త రికార్డ్‌ సృష్టించాయి. ఆగస్టు 21తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారక నిల్వలు ఏకంగా $729.33Bకు చేరాయి. ఒక్క వారంలోనే $12.42B పెరిగాయి. ప్రధానంగా విదేశీ కరెన్సీ ఆస్తులు, గోల్డ్ నిల్వలు పెరగడం దీనికి కారణం. RBI తీసుకున్న కొన్ని చర్యలతో విదేశాల నుంచి భారీగా డాలర్లు భారత్‌లోకి వచ్చాయి. ఇలా నిల్వలు పెరగడం వల్ల ప్రపంచంలో ఏదైనా ఆర్థిక సమస్య వచ్చినా, దేశానికి కొంత బలమైన రక్షణ ఉంటుంది. రూపాయిపై ఒత్తిడి వచ్చినప్పుడు RBIకి మార్కెట్‌లో జోక్యం చేసుకునే అవకాశం కూడా పెరుగుతుంది.

కరెంట్ బిల్లులు చెల్లించినా అదనంగా డబ్బులు డిమాండ్
Local· 29 Aug 2026

కరెంట్ బిల్లులు చెల్లించినా అదనంగా డబ్బులు డిమాండ్

TG: వరంగల్ జిల్లా శంభునిపేటలో విద్యుత్‌ వినియోగదారులకు ఫోన్‌ చేసి రూ.3 వేలు డిమాండ్‌ చేసినట్లు ఓ అసిస్టెంట్‌ లైన్‌మ్యాన్‌పై ఆరోపణలు వచ్చాయి. విద్యుత్‌ బిల్లులు పూర్తిగా చెల్లిస్తున్నప్పటికీ అదనంగా డబ్బులు ఇవ్వాలని కోరినట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. డబ్బులు చెల్లించకపోతే విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తానని బెదిరించినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని వినియోగదారులు కోరారు.

Gen Zకి ఉద్యోగాలు, చదువే పెద్ద టెన్షనా?
Gen Z· 29 Aug 2026

Gen Zకి ఉద్యోగాలు, చదువే పెద్ద టెన్షనా?

దేశంలోని Gen Z యువతను ప్రస్తుతం ఎక్కువగా ఏ విషయం టెన్షన్ పెడుతోంది? తాజాగా వచ్చిన ఓ పోల్‌లో దీనికి ఆసక్తికరమైన సమాధానం కనిపించింది. Gen Zలో 53% మందికి ఉద్యోగాలు, ఉపాధి ప్రధాన సమస్యగా అనిపిస్తే.. మరో 22% మంది చదువు, పరీక్షల గురించే ఎక్కువగా ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. అంటే మొత్తం 75% మందికి ఈ రెండు విషయాలే పెద్ద సమస్యలుగా కనిపిస్తున్నాయి. కష్టపడి చదివినా, పనిచేసినా అందరికీ సమానంగా అవకాశాలు దొరకడం లేదనే భావన కూడా యువతలో ఉంది. ఈ అసంతృప్తి CJP వైపు యువతను ఆకర్షిస్తోందా అనే చర్చ మొదలైంది.

ముహమ్మద్‌ ప్రవక్తను ‘గొప్ప ఫెమినిస్ట్’ అన్న జర్నలిస్ట్
Current Affairs· 29 Aug 2026

ముహమ్మద్‌ ప్రవక్తను ‘గొప్ప ఫెమినిస్ట్’ అన్న జర్నలిస్ట్

‘The Wire’ న్యూస్ సంస్థ జర్నలిస్ట్ అర్ఫా ఖానుమ్ షేర్వానీ ఈద్-ఎ-మిలాద్ సందర్భంగా ముహమ్మద్‌ ప్రవక్తను ‘ఆ కాలపు అత్యంత గొప్ప ఫెమినిస్ట్’ అని పోస్ట్ చేయడం వైరల్‌గా మారింది. ప్రవక్త మహిళలకు వారసత్వం, సమ్మతి, విడాకులు వంటి హక్కులు ఇచ్చారని, 1400 సంవత్సరాల క్రితం పురుషాధిపత్య వ్యవస్థను సవాలు చేశారని ఆమె అందులో రాశారు. ఈ పోస్ట్‌కు కొందరు సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు ఖండిస్తున్నారు.

అనంతగిరిలో తెలుగు భాషా, క్రీడా దినోత్సవాలు
Local· 29 Aug 2026

అనంతగిరిలో తెలుగు భాషా, క్రీడా దినోత్సవాలు

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి గిరిజన బాలికల పాఠశాల–2లో తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హెచ్‌ఎం బి. మంగమ్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలుగు భాషా వికాసానికి విశేష కృషి చేసిన గిడుగు వెంకట రామమూర్తి, భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతులను స్మరించుకున్నారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు భాష ప్రాధాన్యత, మాతృభాష పరిరక్షణ, క్రీడల ఆవశ్యకతపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.

రక్తదాతలకు సర్టిఫికెట్ల పంపిణీ
Local· 29 Aug 2026

రక్తదాతలకు సర్టిఫికెట్ల పంపిణీ

TG: జగిత్యాల జిల్లా ధర్మపురిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మెరుగు నరేష్ గౌడ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. రక్తదానం చేసిన దాతలకు నిర్వాహకులు సర్టిఫికెట్లు అందజేశారు. మండల వైద్యాధికారి తేజశ్రీ, గ్రామ సర్పంచ్ బండమీది కవిత గోపి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రక్తదానం ఎంతో మంది రోగుల ప్రాణాలను కాపాడటంలో కీలకంగా నిలుస్తుందని తెలిపారు. జన్మదిన వేడుకలను ఆర్భాటాలకు దూరంగా సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

నోటీసుల ప్రక్రియ పకడ్బందీగా చేయాలి
Local· 29 Aug 2026

నోటీసుల ప్రక్రియ పకడ్బందీగా చేయాలి

TG: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో భూముల రీసర్వే ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. కోటపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, తహసీల్దార్ రాఘవేంద్ర, ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డితో కలిసి ఎస్ఐఆర్, భూముల రీసర్వేపై సమీక్ష నిర్వహించారు. రీసర్వే పనుల్లో నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసుల జారీ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

దొంగ బంగారం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు
Local· 29 Aug 2026

దొంగ బంగారం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు

TG: దొంగతనాల ద్వారా వచ్చిన బంగారాన్ని కొనుగోలు చేస్తే వ్యాపారులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ హెచ్చరించారు. చోరీలకు పాల్పడే వ్యక్తులు దోచుకున్న బంగారాన్ని తక్కువ ధరకు విక్రయించి నగదుగా మార్చుకునే అవకాశం ఉందన్నారు. జ్యుయెలరీ షాపుల యజమానులు తక్కువ ధరకు బంగారం విక్రయించేందుకు ఎవరైనా తీసుకొస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పదంగా ఉన్న బంగారం విషయంలో వెంటనే పోలీసులకు సమాచారం అందించి దర్యాప్తునకు సహకరించాలని డీసీపీ కోరారు.

బిటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
Local· 29 Aug 2026

బిటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

మంగళగిరి-తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు తాడేపల్లి కేఎల్ రావు కాలనీలో రూ.64 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లోని రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

‘ముస్లిం సంస్థల కార్యక్రమాలు ఇస్లాం పరిధిలోనే ఉండాలి’
Current Affairs· 29 Aug 2026

‘ముస్లిం సంస్థల కార్యక్రమాలు ఇస్లాం పరిధిలోనే ఉండాలి’

కేరళంలోని సమస్త కేరళ జమియ్యతుల్ ఉలమా సంస్థ ఎపి(కాంతపురం) వర్గం ముస్లిం సంస్థలకు వార్నింగ్ ఇచ్చింది. మహల్ కమిటీలు, మసీదులు, మద్రసాలు, ఇతర ముస్లిం సంస్థలు తమ పేరుతో జరిపే కార్యక్రమాలు ఇస్లామిక్ నియమాల పరిధిలోనే ఉండాలని చెప్పింది. ఇటీవల మలబార్ ప్రాంతంలో ఓణం పండుగ జరుపుకున్నప్పుడు ముస్లిం అమ్మాయిలు పాల్గొన్న వీడియోలు వైరల్ అయ్యాయి. మిలాద్-ఎ-షరీఫ్ (నబి దినం) కార్యక్రమాల్లో కూడా మహిళలు పాల్గొన్నారు. దీంతో సంస్థ ఈ ప్రకటన చేసింది.

జర్నలిస్టుల అక్రిడిటేషన్‌పై కీలక సమీక్ష
Local· 29 Aug 2026

జర్నలిస్టుల అక్రిడిటేషన్‌పై కీలక సమీక్ష

AP: అక్రిడిటేషన్ ప్రక్రియను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో ఆయన అధ్యక్షతన జిల్లా స్థాయి రెండో జాబితా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అక్రిడిటేషన్ దరఖాస్తులు, ధ్రువపత్రాలు, అభ్యంతరాలు, క్రిమినల్ కేసులకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి దరఖాస్తుదారుడి అర్హతలను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.

వేప చెట్టు వివాదం.. ఘర్షణలో ఇద్దరు మృతి
Crime· 29 Aug 2026

వేప చెట్టు వివాదం.. ఘర్షణలో ఇద్దరు మృతి

TG: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో ఇంటి పక్కన ఉన్న వేప చెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని, గొడ్డళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘటనలో మంద వెంకటేశ్వర్లు యాదవ్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన సైదాను 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకుంది. అడ్డుకునే క్రమంలో మేళ్లచెరువు ఎస్సై నవీన్‌కుమార్‌కు గాయాలయ్యాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

బస్ ఎక్కుతుండగా ప్రమాదం.. క్లీనర్ సేవ్ చేశాడు!
Viral· 29 Aug 2026

బస్ ఎక్కుతుండగా ప్రమాదం.. క్లీనర్ సేవ్ చేశాడు!

డ్రైవర్ బస్సు స్టార్ట్ చేసే టైమ్‌లో ఓ వృద్ధ ప్రయాణికుడు ఎక్కుతుండగా అదుపుతప్పి పడిపోబోయాడు. అదే సమయంలో పార్వతి బస్సు క్లీనర్ అతుల్ కుకు తన క్విక్ రిఫ్లెక్సెస్‌తో వెంటనే స్పందించి అతడిని కాపాడాడు. కుట్టియట్టూర్–కన్నూర్ రూట్‌లో జరిగిన ఈ ఘటనలో అతుల్ క్విక్ రియాక్షన్ వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. చిన్న యాక్షన్‌ అయినా.. ఒకరి ప్రాణాన్ని కాపాడేంత పెద్ద ఇంపాక్ట్‌ ఇచ్చింది. సరైన టైమ్‌లో రెస్పాండ్ అయిన అతుల్‌కు నెటిజన్స్ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.