Latest

బొటానికల్ గార్డెన్ – మసీదు బండ రోడ్డు 🛣️
TG : బొటానికల్ గార్డెన్ నుంచి మసీదు బండ రూట్‌లో డైలీ ఉండే ట్రాఫిక్ జామ్‌కి చెక్ పెట్టేందుకు రూ.1 కోటితో రోడ్డు విస్తరణ పనులు స్టార్ట్ చేశారు. ఈ వర్క్స్‌ని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ స్పాట్‌కి వెళ్లి దగ్గరుండి పరిశీలించారు. స్టూడెంట్స్, ఐటీ ఎంప్లాయీస్ జర్నీ ఈజీ అవ్వడానికే ఈ ఆల్టర్నేటివ్ రోడ్డును వెడల్పు చేస్తున్నట్లు చెప్పారు. పనులన్నీ స్పీడప్ చేసి వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని అధికారులకి ఆర్డర్స్ వేశారు.

పిల్లల హెల్త్‌పై ఏపీ గవర్నమెంట్ ఫోకస్
AP : పిల్లల హెల్త్ ప్రాబ్లమ్స్‌ని ముందుగానే డెటెక్ట్ చేసి ఫ్రీ ట్రీట్‌మెంట్ ఇవ్వడంలో AP గవర్నమెంట్ కేర్ తీసుకుంటోంది. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (RBSK) ద్వారా ఏప్రిల్ నుంచి ఆగస్టు 19 వరకు 18 ఏళ్లలోపు ఉన్న 441 మంది కిడ్స్‌కి ఫ్రీగా సర్జరీలు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. అంగన్‌వాడీలు, స్కూల్స్‌లో హెల్త్ చెకప్స్ చేసి ప్రాబ్లమ్స్‌ని ఐడెంటిఫై చేశారు. దీనికోసం గవర్నమెంట్ ₹2.42 కోట్లకు పైగా బడ్జెట్ స్పెండ్ చేయగా, అందులో 238 సర్జరీలు డైరెక్ట్‌గా గవర్నమెంట్ హాస్పిటల్స్‌లోనే జరిగాయి.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల డేట్ ఫిక్స్!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్ అయింది. మూడో శాసనసభ 8వ సెషన్‌లో భాగంగా రెండో మీటింగ్ సెప్టెంబర్ 7, 2026న ఉదయం 10AMకు జరగనుంది. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని అసెంబ్లీ హాల్‌లో ఈ సెషన్ నిర్వహిస్తున్నట్లు లెజిస్లేచర్ సెక్రటరీ రెండ్ల తిరుపతి అధికారికంగా MLAలందరికీ సమాచారం అందించారు. స్పీకర్ ఆర్డర్ మేరకు MLAలందరూ ఈ మీటింగ్‌కు కచ్చితంగా అటెండ్ కావాలని నోటీస్‌లో స్పష్టం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీ మళ్లీ రీఓపెన్ కాబోతోంది.
గోకవరంలో ట్రాఫిక్‌కి చెక్ 🚨🚗
AP : తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో డైలీ అయ్యే ట్రాఫిక్ జామ్‌కి పోలీసులు ఫైనల్‌గా చెక్ పెట్టేశారు. మెయిన్ రోడ్డుపై ఇష్టమొచ్చినట్లు పార్క్ చేసిన వెహికల్స్‌ని క్లియర్ చేశారు. రోడ్డు పక్కన బండ్లు పెట్టి ట్రాఫిక్‌కి డిస్టర్బెన్స్ కలిగిస్తే డైరెక్ట్‌గా కేసులు బుక్ చేస్తామని కోరుకొండ CI సత్యనారాయణమూర్తి వార్నింగ్ ఇచ్చారు. రూల్స్ బ్రేక్ చేసి పార్కింగ్ చేస్తే యాక్షన్ గ్యారెంటీ అని తెలిపారు.

పల్నాడు ప్రజలకు గుడ్ న్యూస్
పల్నాడు ప్రజలకు రైల్వే శాఖ మంచి తీపి కబురు చెప్పింది. లింగంపల్లి–విజయవాడ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (12796/12795) సెప్టెంబర్ 4 నుంచి పిడుగురాళ్లలో కూడా ఆగనుంది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన రిక్వెస్ట్‌కి రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పిడుగురాళ్లలో రైలు ఆగడం వల్ల ట్రావెల్ చేసే ఎంప్లాయీస్, స్టూడెంట్స్, బిజినెస్ పీపుల్స్‌కి ఇది హెల్ప్ కానుంది.

అప్పుడే OTTలోకి ఇరుముడి
రీసెంట్ గా విడుదలై టాలీవుడ్ బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది ఇరుముడి. ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని అందరూ అనుకుంటున్న టైంలో ఒక బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సెప్టెంబర్ 18 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందట. భారీ ఆఫర్ ఇచ్చి ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ థియేటర్ రిలీజ్ డేట్ నుంచి నాలుగు వారాలు దాటగానే ఓటీటీలో పెట్టనుంది. వెండితెరపై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఇరుముడి ఓటీటీలో కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

మంచిర్యాలలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రొటెస్ట్
TG : గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ వెంటనే సాల్వ్ చేయాలంటూ టీజీఈ జేఏసీ లీడర్‌షిప్‌లో మంచిర్యాల RDO ఆఫీస్ స్టాఫ్ బ్లాక్ బ్యాడ్జెస్ వేసుకుని ప్రొటెస్ట్ చేశారు. JAC జిల్లా ఛైర్మన్ గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. కొత్త పీఆర్సీతో పాటు పాత పెన్షన్ స్కీమ్‌ను వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. దాంతో పాటు గవర్నమెంట్ నుంచి ఇంకా రావలసిన పెండింగ్ డీఏలను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు.

నాగర్‌కర్నూల్‌లో నేషనల్ స్పోర్ట్స్ డే
TG : మేజర్ ధ్యాన్ చంద్ బర్త్‌డే సందర్బంగా నాగర్‌కర్నూల్‌లో ‘National Sports Day’ జరిగింది. ZP బాయ్స్ హైస్కూల్ నుంచి స్పోర్ట్స్ అవేర్‌నెస్ ర్యాలీ నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ చెన్నయ్య ర్యాలీని స్టార్ట్ చేశారు. ఒలింపిక్స్ సాధించిన ధ్యాన్‌చంద్ సక్సెస్ యూత్‌కి రియల్ మోటివేషన్ అని ఆఫీసర్స్ చెప్పారు. ప్రతిరోజూ కనీసం ఒన్ అవర్ గ్రౌండ్‌లో స్పెండ్ చేస్తే మైండ్, బాడీ ఫిట్‌గా ఉంటాయని.. గంజాయి, డ్రగ్స్ లాంటి బ్యాడ్ హాబిట్స్‌కి కంప్లీట్‌గా దూరంగా ఉండాలని గైడెన్స్ ఇచ్చారు.

హరిత ఆంధ్రప్రదేశ్ కోసం నాగబాబు పిలుపు.. 🌱
AP : ‘హరిత ఆంధ్రప్రదేశ్’ సాధించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని AP గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదెల నాగబాబు పిలుపునిచ్చారు. మంగళగిరి నందవనంలో తన వైఫ్ పద్మజతో కలిసి ఆయన రావి, వేప మొక్కలను నాటారు. భూమాతను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పారు. మొక్కలు నాటడమే కాదు, వాటిని కాపాడే బాధ్యత కూడా తీసుకోవాలని, నెక్స్ట్ జెనరేషన్‌కి మంచి ఎన్విరాన్‌మెంట్ అందించేందుకు అందరూ మొక్కలు నాటాలని కోరారు.

ఈ వీకెండ్ ఓటీటీలో కొత్తగా వచ్చినవి ఇవే!
ఈ వీకెండ్ ఇంట్లోనే మంచి సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే ఓటీటీల్లో కొత్తగా 9 సినిమాలు, సిరీస్‌లు వచ్చేశాయి. అలియా భట్ నటించిన Alpha, బాబీ డియోల్ నటించిన Bandar, మైఖేల్ జాక్సన్ జీవితంపై వచ్చిన Michaelతో పాటు The Whisper Man, Babita Singh Reporting, Anbe Diana లాంటి కంటెంట్ కూడా అందుబాటులోకి వచ్చింది. క్రైమ్, యాక్షన్, రొమాన్స్, మిస్టరీ.. ఇలా వేర్వేరు జానర్లలో ఈ వీకెండ్‌కి మంచి ఆప్షన్స్ ఉన్నాయి.

ఈ 3 సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష!
UGC-NET ఫలితాలు వచ్చేశాయి.. కానీ English, Commerce, Sociology చదివిన అభ్యర్థులకు మాత్రం ఇంకా టెన్షన్ తప్పలేదు. ఈ మూడు సబ్జెక్టుల ప్రశ్నపత్రాల్లో తప్పులు, అనువాద సమస్యలు, వ్యాకరణ లోపాలతో పాటు గతంలో అడిగిన ప్రశ్నలు మళ్లీ వచ్చినట్టు నిపుణుల కమిటీ గుర్తించింది. అందుకే NTA ఈ మూడు సబ్జెక్టుల పరీక్షలను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. English, Commerce పరీక్షలు సెప్టెంబర్ 9న, Sociology పరీక్ష సెప్టెంబర్ 10న జరగనున్నాయి. అదనంగా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా 84 సబ్జెక్టుల ఫలితాలు విడుదలయ్యాయి.

ప్రతి పదం అచ్చుతోనే ఎందుకు ముగుస్తుంది?
తెలుగు మాట్లాడేటప్పుడు మనం పెద్దగా గమనించని ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. తెలుగులో చాలా పదాలు అచ్చుశబ్దంతోనే ముగుస్తాయి. అందుకే ఇతర భాషల పదాలను తెలుగులో పలికేటప్పుడు కూడా చివర్లో అచ్చు శబ్దం చేరడం మనకు సహజంగా అనిపిస్తుంది. ఉదాహరణకు ‘Bus’ అనే పదాన్ని మనం ‘బస్సు’గా, ‘School’ను ‘స్కూలు’గా పలుకుతాం. తెలుగు భాషలోని ఈ ప్రత్యేక శబ్ద నిర్మాణం వల్లే, మన మాటలకు ఒక ప్రత్యేకమైన ధ్వని, ప్రవాహం వస్తుందని భాషా పరిశోధకులు చెబుతున్నారు. మనం రోజూ మాట్లాడే తెలుగులోనే ఇలాంటి ఆసక్తికరమైన భాషా రహస్యాలు దాగి ఉన్నాయన్నమాట!

ఈ-బుక్స్ చదవడం ఇక చాలా ఈజీ!
గూగుల్ ప్లే బుక్స్ యూజర్ల కోసం 'ఎక్స్‌పర్ట్ ఇంటెలిజెన్స్' అనే కొత్త ఏఐ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఇకపై మీరు కొన్న ఈ-బుక్స్‌ను డైరెక్ట్‌గా జెమిని నోట్‌బుక్‌లోకి యాడ్ చేసుకోవచ్చు. బుక్ చదివేటప్పుడు ఎలాంటి డౌట్స్ వచ్చినా ఏఐని క్వశ్చన్స్ అడిగి క్లారిటీ పొందవచ్చు. అలాగే మీ నోట్స్ అప్‌లోడ్ చేసి బుక్ కంటెంట్ ఆధారంగా ఇన్ఫోగ్రాఫిక్స్, ఆడియో ఓవర్‌వ్యూస్, డిఫరెంట్ క్విజెస్ మరియు డైలీ యాక్షన్ ప్లాన్స్ కూడా చాలా ఈజీగా విత్ ఇన్ సెకండ్స్‌లో క్రియేట్ చేసుకోవచ్చు.
మంచు కొండల్లో జలప్రళయం.. షాకింగ్ వీడియో వైరల్! 😱🏔️
నేపాల్-టిబెట్ బార్డర్‌లో గ్లేసియర్ (మంచు కొండ) కరిగిపోవడంతో ఒక్కసారిగా భారీ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. రాళ్లు, మంచుతో కూడిన బురద ప్రవాహం సెకెన్లలోనే ఊళ్లను, బ్రిడ్జీలను ఊడ్చేసింది. ఈ దెబ్బకి వందలాది మంది బురద దిబ్బల కింద ఇరుక్కుపోయారు. హిమాలయ లోయల నుంచి అత్యంత స్పీడ్‌గా దూసుకొచ్చిన, భయంకరమైన వరద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"యెష నాగుల కట్ట మీద" లిరికల్ వీడియో వచ్చేసింది
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ నుంచి “యెష నాగుల కట్ట మీద” సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ అయింది. తెలంగాణ ఫోక్ స్టైల్ లో ఉన్న ఈ పాటలో కీర్తి సురేష్ స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చి నానితో కలిసి స్టెప్పులు వేశారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా, జంగి రెడ్డి, ప్రభా పాడారు. సుధాకర్ చెరుకూరి ₹200 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానుంది.

దేగామ గ్రామం లో పంటల డిజిటల్ సర్వే
బజార్హీత్నూర్ మండలం దేగామ గ్రామంలో డీసీఎస్ టీఎల్ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. AEO ప్రవీణ్ ఆధ్వర్యంలో సర్వే వాలంటీర్ సతీష్ పంట పొలాలను సందర్శించి సాగు పరిస్థితులను పరిశీలించారు. అందరూ రైతులు తమ తమ పంట వివరాలను తప్పకుండా నమోదు చేసుకోవాలని తెలిపారు

మానధనులు – నవల
రచయిత హోవర్డ్ ఫాస్ట్ తన 27 ఏళ్ల వయసులో రాసిన ‘The Last Frontier’ నవలను కె.వి.ఆర్ 1979లో తెలుగులోకి ‘మానధనులు’గా అనువదించారు. ‘మానధనులు’ అంటే ఆత్మగౌరవం ఉన్నవారు అని అర్థం. కొలంబస్ అమెరికాను ఇండియాగా పొరబడ్డాడు. దీంతో అక్కడి ఆదివాసులను ‘ఇండియన్స్’ అని పిలిచారు. బ్రిటిషర్స్ ఉత్తర ప్రాంతాలను ఆక్రమించిన తర్వాత, ఆదివాసులను బలవంతంగా దక్షిణ ప్రాంతాలకు తరలించారు. ఆ ప్రాంతమే ఇప్పటి ఓక్లహామా. అక్కడి చెయిన్నీ తెగవారు తమ సొంత భూమికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకోవడమే ఈ నవల కథ. ధర రూ.150. కొనే <a href="https://logilitelugubooks.com/book/maanadhanulu-howard-fast-kvr">లింక్ </a>ఇది.

నేపాల్ వరదల్లో 97 ఏళ్ల బామ్మ మిరాకిల్
రీసెంట్‌గా నేపాల్ వరదల్లో బురదలో ఇరుక్కుపోయిన ఓ బామ్మను JCB ద్వారా రెస్క్యూ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ బామ్మ పేరు 'గునా మాయా బోహరా', వయసు 97 ఏళ్లు. అంతటి భయంకరమైన జలప్రళయంలో చుట్టూ ఉన్నవాళ్లు ప్రాణాలు కోల్పోయినా, ఈ బామ్మ చావును గెలిచి ప్రాణాలతో బయటపడింది. ఆమెను కాపాడుకోవడానికి మనవడు దీపక్ కాట్మాండు నుంచి వచ్చి, 4 గంటల పాటు రెస్క్యూ టీమ్‌తో కలిసి బామ్మను సేఫ్‌గా బయటకు తీశారు. మనవడు మీడియాతో మాట్లాడుతూ "యుద్ధం గెలిచొచ్చిన రియల్ వారియర్ లా ఉంది మా బామ్మ" అని చెప్పాడు.

ఉగాండా రాజు ఓయో న్యింబా కన్నుమూత
ఉగాండాలోని టూరో రాజ్యానికి చెందిన రాజు ఓయో న్యింబా కబంబా ఇగురు రుకిడి IV 34 ఏళ్ల వయసులో మరణించారు. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో రాజు అయిన ఆయన మరణం ఉగాండా ప్రజలను తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. టూరో ప్రధానమంత్రి కాల్విన్ ర్వోమీర్ అకీకి తెల్లవారుజామున ఈ విషయాన్ని ప్రకటించారు. 1995లో తండ్రి రాజు ప్యాట్రిక్ కబోయో ఒలిమి III మరణం తర్వాత మూడేళ్ల వయసులోనే ఓయోను రాజుగా పట్టాభిషేకం చేశారు. ఆ సమయంలో ఆయన ప్రపంచంలోనే అతి చిన్న పాలక రాజుగా పేరుపొందారు.

గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు: సీఎం
AP: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం గన్నెల పంచాయతీ ఆర్కే నగర్‌లో ‘సంజీవని’ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఆరోగ్య రథాల ద్వారా గిరిజనులకు ఇంటి వద్దే వైద్య పరీక్షలు, మందులు, ఫాలోఅప్ సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. గన్నెల పీహెచ్‌సీలో సేకరించిన రక్త నమూనాలను డ్రోన్లతో విశాఖ జీజీహెచ్‌కు తరలించే ప్రక్రియను పరిశీలించారు. మారుమూల ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

మీ పిల్లలకు ఇలాంటి ఫుడ్ పెడతారా?.. అభిజీత్ దీప్కే
గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లలకు Expired ఫుడ్ అందిస్తున్నారంటూ CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ‘X’ లో పోస్ట్ చేశారు. 'ఇలాంటి ఫుడ్‌ను అధికారంలో ఉన్నవాళ్లు తమ పిల్లలకు పెడతారా? నిజాన్ని బయటపెడితే FIRలు పెట్టినా పర్లేదు.. నిజాన్ని ఎక్స్‌పోజ్ చేయడం ఆపము' అంటూ వీడియోలో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం <a href="https://x.com/abhijeet_dipke/status/2093584722295394416">సోషల్ మీడియాలో</a> చర్చకు దారితీస్తోంది.